దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే | Madras High Court cancelled the anticipatory bail to Dayanidhi Maran | Sakshi
Sakshi News home page

దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే

Published Mon, Aug 10 2015 5:26 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే - Sakshi

దయానిధి మారన్ లొంగిపోవాల్సిందే

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. మారన్ ముందస్తు బెయిల్ను కోర్టు సోమవారం రద్దు చేసింది.  అంతే కాకుండా మారన్ మూడు రోజుల్లోపు లొంగిపోవాలని పేర్కొంది. దయానిధి మారన్ టెలిఫోన్ ఎక్స్ఛేంజి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మారన్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ జూలై నెలలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి కేంద్రమంత్రిగా 2004 - 2007 కాలంలో పని చేశారు. ఆ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్కు 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్లు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement