
2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి.
మాక్సిస్ గ్రూపు అధికారి అగస్టస్ మార్షల్ కూడా కోర్టుకు హాజరు కావాలని తెరలిపింది. సన్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో నాలుగు కంపెనీలకు సైతం ఈ సమన్లు జారీ అయ్యాయి.