Maran brothers
-
మారన్ బ్రదర్స్‌కు భారీ ఎదురుదెబ్బ
చెన్నై : కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో దయానిధి మారన్, కళానిధి మారన్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదును అనుమతించింది. ఈ ఇద్దరు బ్రదర్స్‌కు, ఇతరులకు వ్యతిరేకంగా 12 వారాల్లో అభియోగాలను నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు కోర్టు, సీబీఐను ఆదేశించింది. దయానిధి మారన్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి, సన్ నెట్వర్క్ కోసం అక్రమంగా ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ను తన నివాసంలోనే ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్చేంజ్ ద్వారా 764 హై-స్పీడ్ లైన్లను సన్ నెట్వర్క్ వాడుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ టెలిఫోన్ లైన్లకు ఎలాంటి బిల్లులను చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.78 కోట్ల నష్టం వచ్చింది. మారన్ బ్రదర్స్ కలిగి ఉన్న సన్ నెట్వర్క్, దేశంలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఇది ఒకటి. టెలివిజన్, న్యూస్‌పేపర్, రేడియోలను ఇది కలిగి ఉంది. టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌తో పాటు మరో ఐదుగురిని చెన్నైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు గత మార్చిలోనే నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేవని కేసును కొట్టివేసింది. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై, సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. కింద కోర్టు ఇచ్చిన ఈ తీర్పును జీ జయచంద్రన్ కొట్టివేశారు. 12 వారాల్లోగా వారిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో మారన్ బ్రదర్స్‌ను అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. -
మారన్ బ్రదర్స్‌కు సీబీఐ షాక్
సాక్షి,ముంబై: అక్రమ టెలిఫోన కనెక్షన్ల స్కాం లో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ కనెక్షన్ల స్కాంకు సంబంధించి మారన్ బ్రదర్స్ కళానిధి మారన్, దయానిధి మారన్‌లను స్పెషల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది. మారన్ బ్రదర్స్‌కు విముక్తి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో మారన్ బ్రదర్స్ సహా మరో ఏడుగురిని విడుదల చేసిన మూడు నెలల్లో (మార్చి, 14) సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ జి జయచంద్రన్ జూన్20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లు కేటాయించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి .దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్‌లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. బీఎస్ఎన్ఎల్ మాజీ జీఎం బ్రహ్మనాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలు స్వామి, దయానిధి వ్యక్తిగత కార్యదర్శి గౌతం ఇతర నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించిన సంగతి విదితమే. -
మారన్ బ్రదర్స్‌కు భారీ ఊరట
-
మారన్ బ్రదర్స్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో 2 జీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మారన్ సోదరులకు ఊరట లభించింది. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు నిందితులందరికీ ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అవినీతి , మనీ లాండరింగ కేసులో మారన్ సోదరులపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది. వీరిపై సీబీఐ , ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఈకీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్ సహా, ఆయన సోదరుడు కళానిధి మారన్, కళానిధి భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎఫ్ ఎం లిమిటెడ్ ఎండీ, షణ్ముగం ఇతర రెండు (ఎస్‌ఏఎఫ్‌ఎల్ , సన్ డైరెక్ట్ టివీ ప్రెవేట్ లిమిటెడ్) కంపెనీలకు ఊరట కల్పించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి రెండు వేర్వేరు విషయాలను విన్న జరిగినది. యుపిఎ ప్రభుత్వం మంత్రిగా ఉన్న దయానిధి మారన్ తన పలుకుబడితో మలేషియా వ్యాపారవేత్త టి.ఎ. ఆనంద కృష్ణన్ కు సహాయం చేశారని సీబీఐ ఆరోపించింది. ఎయిర్ సెల్ లో అతిపెద్ద వాటాదారుడు శివశంకరన్ తో బలవంతంగా తన వాటాలను అమ్మించారని ఆరోపిస్తూ సీబీఐ చార్జ్ షీట దాఖలు చేసింది. మాక్సిస్ అనుబంధం సంస్థ అయిన గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది. దీనికిగాను దయానిధికి భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు స్పెషల్ కోర్టు ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. -
సన్ నెట్‌వర్క్‌కు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ : ప్రముఖ టెలివిజన్ సన్ నెట్‌వర్క్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్లపై న్యాయస్థానం శుక్రవారం తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. దీనిపై మారన్ సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
చెన్నై: మారన్ సోదరుల పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మారన్ సోదరులకు ఎదురుదెబ్బ మద్రాస్ హైకోర్టులోతగిలింది. తమ ఆస్తులను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడంపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో మారన్ సోదరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో గత ఏప్రిల్ లో మాజీ టెలికామ్ మంత్రి దయానిధి మారన్, సోదరుడు కళానిధి మారన్ రూ.742 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దయానిధి, మాక్సిస్ కి చెందిన ఎయిర్‌సెల్ సంస్థకు లబ్ధిచేకూర్చడానికి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన షేర్లను అమ్మాలని చెన్నైకి చెందిన టెలికామ్ ప్రమోటర్ శివశంకరన్ పై మాజీ మంత్రి ఒత్తిడి చేశారని సీబీఐ 2006లోనే ఆరోపించింది. ఈ కేసులో మారన్ సోదరులపై ఛార్జ్‌షీటు దాఖలైన విషయం తెలిసిందే. -
దయానిధి మారన్‌కు సమన్లు
-
2జీ కేసులో మారన్ సోదరులకు సమన్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో మారన్ సోదరులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్‌కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. మాక్సిస్ గ్రూపు అధికారి అగస్టస్ మార్షల్ కూడా కోర్టుకు హాజరు కావాలని తెరలిపింది. సన్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో నాలుగు కంపెనీలకు సైతం ఈ సమన్లు జారీ అయ్యాయి. -
మారన్ బ్రదర్స్‌కు చుక్కెదురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: టీవీ ప్రసారాలకు అవసరమైన ఎమ్‌ఎస్‌వో హక్కులను రద్దు చేస్తూ కేంద్ర కమ్యూనికేషన్లు, ప్రసార మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ మారన్ సోదరులు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు చుక్కెదురైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తాము స్టే మంజూరు చేయలేమంటూ మారన్ బ్రదర్స్ గురువారం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సన్ గ్రూపు టీవీలకు సొంతమైన కల్ కేబుల్స్ సంస్థ డిజిటల్ హక్కులను రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆ సంస్థ డెరైక్టర్ సంపత్కుమరన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తర్వులు రద్దుకు సంబంధించి ముందుగా తమకు ఎటువంటి సమాచారం లేదని, అనుమతి రద్దుకు కారణాలు సైతం స్పష్టం చేయలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మారన్ బ్రదర్స్ నేతృత్వంలో నడుసున్న కేబుల్ టీవీ సంస్థకు భద్రత సర్టిఫికెట్‌ను జారీచేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిరాకరించిందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఒక రహస్య పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తికి గోప్యంగా అందజేశారు. మారన్ బ్రదర్స్ స్వాధీనంలో ఉన్న ఎమ్‌ఎస్‌వో హక్కులను రద్దు చేస్తూ ఈనెల 20వ తేదీన సమాచార, మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను అనుసరించి 15 రోజుల్లోగా కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేయాల్సిందిగానూ, ఇందుకు సంబంధించి వినియోగదారులకు ముందుగానే తెలియజేయాలని, వేర్వేరు ఎమ్‌ఎస్‌వోలకు మార్చుకోవాలని హక్కుల రద్దు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మారన్ బ్రదర్స్ తరపున కేబుల్ ఆపరేటర్లు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి వీ రామసుబ్రమణ్యం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్, ఏఆర్ఎల్ సుందరేశన్, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వీ రాజగోపాలన్, ఎన్ రమేష్ వాదించారు. న్యాయమూర్తి అక్షింతలు కలానిధి మార న్ నేతృత్వంలోని కల్ కేబుల్స్ సంస్థ తీరును మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. పిటిషన్‌దారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఁకేబుల్ టీవీ ప్రసారాల్లో మీరు ఏకఛత్రాధిపత్యం వహించేలా వ్యవహరించారు. ఇదే రంగంలో ఉన్న మిగతావారిని ఇబ్బందులకు గురిచేశారు, అరసు టీవీకి హక్కులు రాకుండా చేశారు. గతంలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉండగా, ఇపుడు కేంద్రంలో అధికారం మారింది, మీరు చేసిన ఖర్మ ఇంత త్వరగా మీకు చుట్టుకుంటుందని ఊహించారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. -
మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: ఎయిర్‌సెల్ - మాక్సిస్ వ్యవహారంలో మారన్ సోదరులపై వచ్చేవారంలో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీబీఐ డెరైక్టర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. అందులో 2004 - 2007 మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా దయానిధిమారన్ పని చేశారు. ఆ సమయంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త శివశంకరన్ చెన్నైలో నడుపుతున్న ఎయిర్‌సెల్ సమాచార సంస్థకు బ్రాడ్‌బ్యాండ్ కేటాయింపు కోరుతూ 2006లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి ఒప్పందం కుదరలేదు. ఇలా ఉండగా ఎయిర్‌సెల్ సంస్థ షేర్లు హఠాత్తుగా మలేషియా మాక్సిస్ సంస్థకు చేతులు మారాయి. ఆ తరువాత అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సెల్ సర్వీసును ప్రారంభించేందుకు 14 లెసైన్స్‌లు ఇచ్చారు. దీనికి ప్రతి ఫలంగా మాక్సిస్ సంస్థ తమ అనుబంధ సంస్థల ద్వారా దయానిధిమారన్ సోదరుడు కళానిధిమారన్ నిర్వహించే సన్ డెరైక్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత శివశంకరన్ విదేశాల్లో స్థిరపడ్డారు. 2008లో కరుణానిధి, మారన్ సోదరుల మధ్య అభిప్రాయాల భేదాలు ఏర్పడగా శివశంకరన్ ఢిల్లీ చేరుకున్నారు. సీబీఐతో మారన్ సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 2011లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మారన్ సోదరులపై చార్జ్‌షీటు రూపొందించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది.