మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
చెన్నై: మారన్ సోదరుల పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మారన్ సోదరులకు ఎదురుదెబ్బ మద్రాస్ హైకోర్టులోతగిలింది. తమ ఆస్తులను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడంపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో మారన్ సోదరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో గత ఏప్రిల్ లో మాజీ టెలికామ్ మంత్రి దయానిధి మారన్, సోదరుడు కళానిధి మారన్ రూ.742 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దయానిధి, మాక్సిస్ కి చెందిన ఎయిర్సెల్ సంస్థకు లబ్ధిచేకూర్చడానికి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన షేర్లను అమ్మాలని చెన్నైకి చెందిన టెలికామ్ ప్రమోటర్ శివశంకరన్ పై మాజీ మంత్రి ఒత్తిడి చేశారని సీబీఐ 2006లోనే ఆరోపించింది. ఈ కేసులో మారన్ సోదరులపై ఛార్జ్షీటు దాఖలైన విషయం తెలిసిందే.