petition dismissed
-
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
కుమార్తె అంటే.. సొంత ఆస్తి కాదు!
న్యూఢిల్లీ: మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున, వివాహమాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైలులో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె ఓ వస్తువు కాదు. ఆ పెళ్లికి ఆమోదం తెలపండి’అని సూచించింది. పెళ్లయిన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి, లైంగిక దాడి చేశాడంటూ మహిద్‌పూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేననీ, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది. -
రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంలో భంగపాటు
సాక్షి, ఢిల్లీ: ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో.. నర్సాపురం(ఆంధ్రప్రదేశ్) పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో గతంలో ఆయనకు ప్రతికూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పైగా కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడం సవాల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అప్పట్లోనే ఆయనకు చివాట్లు పెట్టింది కూడా. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. తీర్పు వెలువడి ఎనిమిది నెలలు పూర్తి కావడంతో.. ఆలస్యం కారణంగా జోక్యం చేసుకోదల్చుకోలేమని పేర్కొంటూ ఆయన వేసిన పిటిషన్‌ను ఇప్పుడు డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు. ఇదీ చదవండి: సంక్షేమ పథంలో సాహసోపేతమైన అడుగులు -
ప్రతిదానికి పిల్ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు అభ్యంతరం
సాక్షి అమరావతి: విశాఖపట్నం మధురవాడలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్ లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ విశాఖ మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) గురువారం హైకోర్టు కొట్టేసింది. బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి పిల్ వేయడం ఏమిటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటే దానిపై పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అది ఫిల్మ్ స్టూడియోకి ఇచ్చిన భూమి అని, ప్రైవేట్ భూ వివాదంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అడిగింది. ఇది ధనికుల మధ్య వివాదమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’ ప్రతి దాంట్లో ఉల్లంఘన ఉందంటూ పిల్ దాఖలు చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలు ఎంతమాత్రం లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
సుప్రీంకోర్టులో టీడీపీ నేత నారాయణకు చుక్కెదురు
-
బిల్కిస్ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదీ కేసు.. 2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ -
అందరిలానే.. వారూనూ..
సాక్షి, అమరావతి: ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్లను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంత మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత మేర ఉంది? వివక్ష చూపకుండా వారికి ఏ రకమైన ప్రయోజనాలను కల్పిస్తున్నారు? వారికి ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆడ, మగతో సమానంగా ట్రాన్స్జండర్లను కూడా చూడాల్సిన అవసరం ఉందంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో ట్రాన్స్జెండర్ల కాలమ్ పెట్టకపోవడం అనాలోచిత చర్య అని హైకోర్టు ఆక్షేపించింది. అయితే ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్‌జెండర్ అయిన పిటిషనర్‌కు ఎస్ఐ పోస్టు ఇవ్వాలని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదన్న కారణంతో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక బోర్డు 2018లో జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం సాధ్యంకాదని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.సొలొమన్రాజు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధం.. ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు.. ‘సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ట్రాన్స్జెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్జెండర్లు శాపానికి గురైన వారిగా బతుకు వెళ్లదీస్తున్నారు. చాలా దీన, దయనీయ పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. కొందరు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా, లైంగికంగా వారు పలువురి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా వారికి ఉద్యోగ అవకాశాల్లో వారి దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించడం లేదు. రాష్ట్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో తమ లింగం గురించి రాసే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం కిందకే వస్తాయి. 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల పాలసీ తీసుకొచ్చింది. 2019లో ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. అయినా కూడా ఇవేవీ కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదు. ట్రాన్స్జెండర్లను మన రాజ్యాంగం గుర్తించలేదు. అయితే మన పురాణాలు గుర్తించాయి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల మరణంలో శిఖండి కీలకపాత్ర పోషించిన సంగతి పురాణాల్లో ఉంది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప, ఫలానా శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని చెప్పలేదు. పిటిషనర్ ఏ నోటిఫికేషన్‌ను సవాలు చేశారో ఆ నోటిఫికేషన్ అప్పటికి అమల్లో ఉన్న సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే ఇచ్చారు. అందువల్ల ఆ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించడం సాధ్యం కాదు.’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
విశ్వరూప్ దంపతులపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మోసపూరితంగా మార్పు చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఆయన సతీమణి పినిపే బేబీ తదితరులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చినంత మాత్రాన ఆ ఆస్తిపై యాజమాన్యపు హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మం డలం భట్నవిల్లి గ్రామంలోని 7.75 ఎకరాల భూమిని పినిపే బేబీ పేరిట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఎంతమాత్రం తప్పుకాదని, సబ్ రిజిస్ట్రార్ తన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించారని హైకోర్టు తెలిపింది. అలా రిజిస్టర్ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమంది. ఆ భూమికి సంబంధించిన వివాదం అమలాపురం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యం లో.. సంబంధిత సివిల్ కోర్టు ముందు పిటిషనర్ మౌఖిక, లిఖితపూర్వక ఆధారాలను ఉంచి, ఆ భూమి యాజమాన్య హక్కులను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమ్మకపు ఒప్పందం మేరకే పినిపే బేబీ పేరిట డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారని, దీనిని ఎంతమాత్రం మోసపూరితమని చెప్పజాలమంది. ఏపీ భూ హక్కులు, పాసు పుస్తకాల చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు తప్పని నిరూపితమయ్యేంత వరకు ఆ పేర్లు సరైనవేనని భావించాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ.. సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. -
కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసు విచారణను ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన చట్టం కింద ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచేప్పింది. దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015లో కేరళ అసెంబ్లీలో సీపీఎంకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. -
ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం -
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు నో
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి వచ్చేవరకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకూ నోటిఫికేషన్ జారీ చేయనందున ఈ దశలో స్పందించడం తొందరపాటు అవుతుందని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. క్షేత్రస్ధాయిలో కోవిడ్-19 పరిస్థితి తీవ్రంగా ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలను వాయిదా వేయవచ్చని ప్రజా ప్రాతినిథ్యం చట్టంలో పొందుపరిచిన క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని పిటిషనర్ అవినాష్ ఠాకూర్ కోరారు. ఎన్నికలు నిర్వహించరాదని తాము ఎన్నికల సంఘాన్ని ఎలా కోరతామని, ఎన్నికల వాయిదాకు కోవిడ్-19 సరైన ప్రాతిపదిక కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేసి ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకోవాలని, ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించజాలదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. చదవండి : ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే: సుప్రీం -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
‘నిర్భయ’ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘క్షమాభిక్ష కోరుతూ సమర్పించిన అన్ని సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని భావించేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ వాదనను కూడా కొట్టివేసింది. వినయ్ శర్మ ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో స్పష్టంగా ఉందన్నారు. తిహార్ జైళ్లో తనను చిత్రహింసలు పెట్టారని, దాంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఈ విషయాన్ని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్లో వినయ్ శర్మ పేర్కొన్నారు. జైళ్లో చిత్రహింసల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యా నని స్పష్టం చేసే అన్ని పత్రాలను రాష్ట్రపతి దృష్టికి కేంద్రం తీసుకువెళ్లలేదని ఆ పిటిషన్లో శర్మ ఆరోపించారు. అయితే, వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. డెత్ వారెంట్ జారీ చేయొచ్చు: నిర్భయ దోషులకు వేర్వేరు రోజుల్లో ఉరిశిక్ష విధించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్లను ట్రయల్ కోర్టు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, నలుగురు దోషుల్లో పవన్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 17న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించే సమయానికి, పవన్ క్యూరేటివ్ పిటిషన్ వేస్తాడన్నారు. ఇక పవన్ వంతు.. నలుగురు దోషుల్లో.. పవన్ గుప్తా ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. పవన్‌కు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా ఉంది. కాగా, తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి కొట్టేశారు. స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి నిర్భయ’ దోషులను వేర్వేరు రోజుల్లో ఉరి తీసేందుకు అనుమతించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ భానుమతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కాసేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చారు. వెంటనే ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆమెను తన చాంబర్లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
ముఖేశ్ పిటీషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ : సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్న ముఖేశ్ కుమార్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ముఖేశ్ తన క్షమాబిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో చివరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ దగ్గరకు వచ్చిన క్యురేటివ్ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో నిర్భయ నిందితులను ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6గంటలకు ఉరి తీసేందుకు అన్ని మార్గాలు సుగమమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన అన్ని అనుమతుల ప్రతులను రాష్ట్రపతికి ప్రభుత్వం పంపించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ముఖేశ్ దరఖాస్తు చేసుకున్న క్షమాబిక్ష పిటీషన్‌ను జనవరి 17న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. (జైల్లో లైంగికంగా వేధించారు) ముఖేశ్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఉరి తేది దగ్గర పడుతున్న కొద్ది దోషులు ఎలా తప్పించుకోవాలో తెలియక పిటీషన్ల పేరుతో కాలాయాపన చేస్తున్నారని ఆరోపించారు. -
ఆ ఇద్దరికి హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్ : అనర్హతకు గురైన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై అనర్హత వేటు వేయడంపై రాములు నాయక్, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. రాములు నాయక్, యాదవరెడ్డిలను అనర్హులుగా పేర్కొంటూ శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని కోర్టు తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది.. తాము సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల సంఘానికి తెలపాలని ఈసీ తరఫు న్యాయవాదికి సూచించింది. -
రాఫెల్ కేసులో మోదీ సర్కార్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌కు భారీ ఊరట లభించింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ విచారణ కోసం దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విమానాల ధరల విషయం కొనుగోలు కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీలేవని జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. రాఫెల్ ప్రకంపనలు రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌కు సుప్రీం కోర్టు తీర్పుతో నిరాశ ఎదురైంది. రూ 56వేల కోట్లతో 36 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్సెట్ పార్టనర్‌గా భారత్ సూచనతోనే దసాల్ట్ ఏవియేషన్ ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించడం కలకలం రేపింది. ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. -
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంలో ఎదురుదెబ్బ
-
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చుక్కెదురు
-
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంలో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. సంస్ధ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారని మార్గదర్శిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ 2300 కోట్లు డిపాజిట్లు సేకరించిందన్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. ఈ జీవోలకు అనుగుణంగా విచారణ అనంతరం అధీకృత అధికారి కృష్ణంరాజు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. 2008 జనవరి 23న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నంబరు 540 దాఖలు చేశారు. ఉత్తర్వులను పక్కన పెట్టాలని, ప్రొసీడిం గ్స్‌ను పూర్తిగా కొట్టివేయాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయిం చింది. 2011 జూలై 20న మరో క్రిమినల్ పిటిషన్లో హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల ఏషియన్ రీ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రయివేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వుకు కాలం చెల్లింది. -
కాళేశ్వరంపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘భారీ రిజర్వాయర్లతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున నిర్వాసితులవుతారు. అవసరానికి మించి రిజర్వాయర్లు నిర్మించారు. ప్రవేట్ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తెస్తున్నారు. కాళేశ్వరాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చుకున్నార’ని లక్ష్మీనారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంపై స్వతంత్ర న్యాయ విచారణ కమిటీని నియమించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మదన్ లోకూర్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తు సోమవారం తీర్పు వెలువరించింది. -
యూపీ సీఎం యోగికి ఊరట
సాక్షి, లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఊరట లభించింది. 2007 గోరఖ్‌పూర్ అల్లర్లలో యోగి పాత్రపై తిరిగి విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని పర్వేజ్ పర్వాజ్, అసద్ హయత్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 జనవరిలో జరిగిన ఈ ఘర్షణల్లో పది మంది మరణించారు. దాదాపు పదేళ్ల కిందట చోటుచేసుకున్న మతఘర్షణలకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించిన కొద్ది మాసాల అనంతరం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ తుది నివేదికను ప్రత్యేక కోర్టుకు త్వరలో సమర్పిస్తుందని, ఈ దశలో సీఎం ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో యూపీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ పేర్కొన్నారు. -
‘మహాత్మ’ వద్దన్నందుకు జరిమానా
సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మ పదాన్ని వాడటం నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌ను కోర్టు తీవ్రంగా మందలించింది. న్యాయస్ధానం విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీ రీసెర్చి స్కాలర్ మురుగనాథమ్కు రూ పదివేలు జరిమానా విధించింది. ఇలాంటి పిటిసన్లతో న్యాయవ్యవస్థ విలువైన సమయం వృధా అవుతుందని పిటిషన్‌ను తోసిపుచ్చుతూ జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం సుందర్‌తో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. భారత కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మా అని వాడటం రాజ్యాంగ చెల్లుబాటును పిటిషన్లో మురుగనాధమ్ సవాల్ చేశారు. ఆర్బీఐ మహాత్మా అనే పదం వాడటం రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.అయితే ఈ పిటిషన్ ఏమాత్రం విచారణార్హమైనది కాదని మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. -
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
-
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంకు పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుజన యూనివర్శల్ ఇండస్ట్రిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరీకి సంబంధించిన సుజన ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ సంస్ధ హైస్టియా కంపెనీకి మారిషస్ బ్యాంక్ అప్పు ఇచ్చింది. ఐతే తాము ఇచ్చిన వంద కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో హైస్టియా కంపెనీ విఫలమైందని, అందువల్ల గ్యారంటర్‌గా ఉన్న సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌లో వాదనలు విన్న సింగిల్ జడ్జి కోర్టు సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుజనా ఇండస్ట్రీస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... అప్పు ఇచ్చిన సంస్ధ సివిల్ కోర్టుల్లో దావా వేయడం ద్వారా సొమ్మును రాబట్టుకునే హక్కు ఉందని పేర్కొంది. గతంలో గ్యారంటర్ సంస్ధ సొమ్ము విషయమై హామీ ఇచ్చినా చెల్లించలేదన్న కోర్టు... మారిషస్ బ్యాంకును నిరుత్సాహపరిస్తే అనేక ఇండియా కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు కట్టుబడి ఉండకపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. సుజనా చౌదరికి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుజనా చౌదరి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. -
మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
చెన్నై: మారన్ సోదరుల పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మారన్ సోదరులకు ఎదురుదెబ్బ మద్రాస్ హైకోర్టులోతగిలింది. తమ ఆస్తులను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడంపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో మారన్ సోదరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం విషయంలో గత ఏప్రిల్ లో మాజీ టెలికామ్ మంత్రి దయానిధి మారన్, సోదరుడు కళానిధి మారన్ రూ.742 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దయానిధి, మాక్సిస్ కి చెందిన ఎయిర్‌సెల్ సంస్థకు లబ్ధిచేకూర్చడానికి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన షేర్లను అమ్మాలని చెన్నైకి చెందిన టెలికామ్ ప్రమోటర్ శివశంకరన్ పై మాజీ మంత్రి ఒత్తిడి చేశారని సీబీఐ 2006లోనే ఆరోపించింది. ఈ కేసులో మారన్ సోదరులపై ఛార్జ్‌షీటు దాఖలైన విషయం తెలిసిందే.