సుప్రీంలో సుజనాకు చుక్కెదురు | supreme court dismiss sujana chowdary petition | Sakshi
Sakshi News home page

సుప్రీంలో సుజనాకు చుక్కెదురు

Published Tue, Sep 1 2015 2:48 PM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM

సుప్రీంలో సుజనాకు చుక్కెదురు - Sakshi

సుప్రీంలో సుజనాకు చుక్కెదురు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.  సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంకు పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుజన యూనివర్శల్ ఇండస్ట్రిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను  ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరీకి సంబంధించిన సుజన ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ సంస్ధ హైస్టియా కంపెనీకి మారిషస్ బ్యాంక్‌ అప్పు ఇచ్చింది. ఐతే తాము ఇచ్చిన వంద కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో హైస్టియా కంపెనీ విఫలమైందని, అందువల్ల గ్యారంటర్‌గా ఉన్న సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.

 

ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌లో వాదనలు విన్న సింగిల్ జడ్జి కోర్టు సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుజనా ఇండస్ట్రీస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... అప్పు ఇచ్చిన సంస్ధ సివిల్ కోర్టుల్లో దావా వేయడం ద్వారా సొమ్మును రాబట్టుకునే హక్కు ఉందని  పేర్కొంది. గతంలో గ్యారంటర్ సంస్ధ సొమ్ము విషయమై హామీ ఇచ్చినా చెల్లించలేదన్న కోర్టు... మారిషస్ బ్యాంకును నిరుత్సాహపరిస్తే అనేక ఇండియా కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు కట్టుబడి ఉండకపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. సుజనా చౌదరికి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుజనా చౌదరి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement