
సాక్షి, ఢిల్లీ: ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో.. నర్సాపురం(ఆంధ్రప్రదేశ్) పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ రుణాలు కేసులో గతంలో ఆయనకు ప్రతికూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పైగా కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడం సవాల్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అప్పట్లోనే ఆయనకు చివాట్లు పెట్టింది కూడా. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే.. తీర్పు వెలువడి ఎనిమిది నెలలు పూర్తి కావడంతో.. ఆలస్యం కారణంగా జోక్యం చేసుకోదల్చుకోలేమని పేర్కొంటూ ఆయన వేసిన పిటిషన్‌ను ఇప్పుడు డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు.
ఇదీ చదవండి: సంక్షేమ పథంలో సాహసోపేతమైన అడుగులు
Comments
Please login to add a commentAdd a comment