Mauritius
-
Intercontinental Cup football 2024: టీమిండియాకు ‘సున్నా’
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు. సమష్టి వైఫల్యం... ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది. తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది. -
ఇంటర్కాంటినెంటల్ కప్: సిరియా ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో సిరియా 2–0తో మారిషస్‌పై ఘన విజయం సాధించింది. ఈ పరాజయంతో మారిషస్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కాగా... సోమవారం జరిగే ఆఖరి పోరులో ఆతిథ్య భారత్‌తో సిరియా తలపడుతుంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిరియా ఫుట్‌బాలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టు సంపాదించారు. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా దాడులకు పదునుపెట్టారు. కానీ ప్రత్యర్థి డిఫెండర్ బ్రెండన్ సిటొరా చేసిన తప్పిదంతో సిరియా ఖాతా తెరిచింది. ఆట 32వ నిమిషంలో సిటోరా సెల్ఫ్‌గోల్‌తో సిరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత రెండో అర్ధభాగంలో అల్ మవాస్ (70వ నిమిషంలో) సాధించిన గోల్‌తో సిరియా ఆధిక్యం (2–0) రెట్టింపైంది. మరోవైపు మారిషస్ కూడా రెండో సగంలో గోల్ కోసం చేసిన ప్రయత్నాల్ని సిరియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. -
భారత్ 0 మారిషస్ 0
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ వేదికపై ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం ఉందని మరోసారి రుజువైంది. కొత్త కోచ్ మార్క్వెజ్ నేతృత్వంలో కొత్తగా జట్టు విజయాల బాట పడుతుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 179వ స్థానంలో ఉన్న మారిషస్ జట్టు కూడా భారత్‌ను నిలువరించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం మొదలైన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో భాగంగా జరిగిన భారత్, మారిషస్ తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నీని ప్రారంభించారు. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు... నిరాధారం
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్ అక్రమాల్లో సెబీ చీఫ్ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్ పెద్ద బాంబ్ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్ ఆరోపణ. స్వయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది. బిజినెస్ మోడల్ ఇదీ.. అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్ చెప్పడం విశేషం! బ్లాక్‌స్టోన్‌లో ధవళ్ పదవిపై...బ్లాక్‌స్టోన్ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్ నియామాకానికి ముందే 2019లో ధవళ్ బచ్ను బ్లాక్‌స్టోన్ తమ సీనియర్ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్ మేనేజ్మెంట్లో ధవళ్ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్పర్సన్ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు. బచ్‌పై ఆరోపణలు ఇవీ... ‘2017లో సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా బచ్ నియమాకానికి ముందే 2015లో బచ్ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో (ఇది మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ట్రేడింగ్ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్ఎల్) మేనేజ్ చేసిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఫండ్స్‌లో వినోద్ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్ కూడా. 2022లో బచ్ సెబీ చైర్పర్సన్ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. అదానీ గ్రూప్‌నకు పవర్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఇన్వాయిస్లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ భారత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్–2019 అక్టోబర్ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.దురుద్దేశపూరితం: అదానీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.జరిగింది ఇదీ... అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్ విలువను అదానీ గ్రూప్ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. గత నెలలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్ బ్యాంక్ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్ హెడ్జ్ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్. -
మారిషస్ : 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం (ఫొటోలు)
-
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
మారిషస్‌ను మాల్దీవుల అనుకున్న నెటిజన్లు.. ‘ఎక్స్’ పోస్టులు వైరల్
భారత్-మాల్లీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్యదీప్‌ను పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి అందాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. మాల్దీవుల మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు భారత దేశంలోని ప్రముఖులంతా మాల్దీవుల కంటే.. స్వదేశానికి చెందిన లక్ష్యదీప్, అండమాన్ ద్వీపాలకు పర్యటనకు వెళ్లాలని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి విదితమే. భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మారిషస్ ద్వీప దేశం భారతీయ పర్యటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘మరిషస్ టూరిజం(ఇండియా)’ ‘ఎక్స్’ (ట్విటర్)లో భారతీయ పర్యటకులు తమ దేశంలోకి రావాల్సిందిగా స్వాగంతం పలికింది. ‘మారిషస్‌లోని అందాలను అన్వేషించటం కోసం భారతీయులకు స్వాగతం. 2024 ఏడాదిలో మారిషస్ ద్వీపాన్ని సందర్శించండి. అక్కడి అందాలను చూసి కొత్త శక్తి, అనుభూతిని ఆస్వాధించండి. టన్నుల కొద్ది సాహసాలు, అనుభవాలు మీ కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ రోజు మీ హాలీ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, భారతీయ నెటజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. మారిషస్ ద్వీపాన్ని పలువురు భారతీయ నేటిజన్లు మాల్దీవులగా పొరపాటు పడ్డారు. ‘మాల్దీవులపై మాకు ఆసక్తి లేదు. మాకు లక్ష్యదీప్ ఉంది’, ‘ మీరు మా ప్రధానమంత్రిని అవమానించారు. అందుకే మేము మీ దేశాన్ని పర్యటించము’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన మారిషస్ టూరిజం.. ‘హాయ్, ఇది మారిషస్ దేశం. మాల్దీవుల ద్వీపం కాదు. రెండు వేర్వేరు ద్వీపాలు’ అని స్పష్టత ఇచ్చింది. వెంటనే నెటిజన్లలో నవ్వులు పూచాయి. మరికొంత మంది నెటిజన్ల స్పందిస్తూ.. మాల్దీవుల కంటే మారిషస్ పర్యటన బాగుటుందని కామెంట్లు చేశారు. ‘ మాల్దీవుల కంటే స్నేపూర్వకంగా ఉండే మారిషస్ పర్యటనకు వెళ్లటం ఉత్తమం’, మాల్దీవుల కంటే మారిషస్ చాలా చాలా మంచి పర్యటక ప్రాంతం’ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు ‘ఎక్స్’ వైరల్ అవుతున్నాయి. -
మరో రెండు దేశాల్లో యూపీఐ సేవలు..
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టం.. ఈ రోజు శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వర్చువల్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ పాల్గొన్నారు. శ్రీలంక, మారిషస్ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలోనే ఇండియాకు చెందిన సేవలు ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ రోజే శ్రీలంకలోని భారతీయుడు తొలి యూపీఐ లావాదేవీలను నిర్వహించారు. యూపీఐ లావాదేవీలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలనే 'నరేంద్ర మోదీ' కల మెల్ల మెల్లగా నెరవేరుతోంది. ప్రస్తుతం శ్రీలంక, మారిషస్‌లలో UPI సిస్టం అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మారిషస్‌లో యూపీఐతో పాటు రూపే కార్డ్ సేవలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు శ్రీలంక, మారిషస్‌లలో యూపీఐ లావాదేవీలు ప్రారంభం కావడం వల్ల.. ఇండియా నుంచి వెళ్లే భారతీయులు యూపీఐ లావాదేవాలను జరుపవచ్చు. మారిషస్‌లో రూపే కార్డ్ సేవల పొడిగింపు మారిషస్‌లోని రూపే విధానం ఆధారంగా కార్డులను జారీ చేయడానికి మారిషస్ బ్యాంకులను అనుమతిస్తుంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గత కొన్ని రోజులకు ముందు ఫ్రాన్స్ దేశంలో కూడా యూపీఐ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్ టవర్ సందర్శించాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో యూపీఐ సిస్టం మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉండనున్నట్లు జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. -
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
అదానీ గ్రూప్‌పై అవే ఆరోపణలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై మరోసారి అక్రమ పెట్టుబడుల ఆరోపణలు తలెత్తాయి. అదానీ ప్రమోటర్ కుటుంబం వెలుగులోలేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) తాజాగా ఆరోపించింది. యూఏఈకి చెందిన నాసెర్ అలీ షాబాన్ అలీ, తైవాన్‌కు చెందిన చాంగ్ చుంగ్–లింగ్ ఏళ్లపాటు మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్పీ తాజా ఆరోపణలకు తెరతీసింది. వినోద్ అదానీకి చెందిన వ్యక్తి నిర్వహణలోని దుబాయ్ సంస్థ ఈ ఫండ్స్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్ కంపెనీలలో అకౌంటింగ్ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు వెల్లువెత్తి గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. అయితే ఆపై గ్రూప్ వీటిని ఖండించింది. ఆపై షేర్ల ధరల్లో అవకతవకలకు ఆధారాలు లేవంటూ సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆరోపణలను కొట్టివేసింది. తాజాగా ఓసీసీఆర్పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ఇప్పటికే సుప్రీం కోర్టు నియామక కమిటీ దర్యాప్తులోనూ పరిగణించిన విషయాన్ని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రస్తావించింది. ఇవన్నీ రీసైకిల్ చేసిన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ పెట్టుబడులున్న సంస్థల లబ్ది కోసం ఆరోపణలను తిరగతోడుతున్నట్లు వ్యాఖ్యానించింది. కొన్ని విదేశీ మీడియా వర్గాలు పసలేని హిండెన్‌బర్గ్ నివేదికను మరోసారి హైలైట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా వీటిని తోసిపుచి్చంది. తాజా ఆరోపణలు ఇలా.. 2013–2018 మధ్య కాలంలో ప్రమోటర్ కుటుంబం తమ నిర్వహణలోని మారిషస్ ఫండ్స్ ద్వారా గ్రూప్ కంపెనీలలో కోట్లాది డాలర్ల నిధులను రహస్యంగా ఇన్వెస్ట్ చేశాయని ఓసీసీఆర్పీ పేర్కొంది. తద్వారా గ్రూప్ షేర్ల ధరలలో భారీ ర్యాలీకి కారణమైనట్లు ఆరోపించింది. ఈ కాలంలో షేర్ల ధరల్లో భారీ ర్యాలీ ఫలితంగా అదానీ గ్రూప్ దేశంలోనే అ త్యంత శక్తివంతమైన బిజినెస్ గ్రూప్‌లలో ఒకటిగా ఆవిర్భవించినట్టు పేర్కొంది. ఓసీసీఆర్పీ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ అదానీ గ్రూప్ లోని పలు షేర్లు 4.4–2.2% మధ్య క్షీణించాయి. అదానీపై విచారణకు జేపీసీ వేయాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణల విషయంలో ప్రధాని మోదీ తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ దేశం ప్రతిష్ట మసకబారకుండా ఉండాలంటే అదానీ గ్రూప్‌పై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పారీ్టలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదానీ విషయంలో ఇండియా కూటమిలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. ‘భారత్‌లో అందరికీ సమానావకాశాలుంటాయి. పారదర్శకత ఉంటుంది, అవినీతికి తావులేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ, అదానీపై వస్తున్న ఆరోపణలు దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రధానికి సన్నిహితుడైన ఈ పెద్ద మనిషి బిలియన్ డాలర్లతో షేర్ ధరలను పెంచేలా ఎలా చేయగలిగారు? ఆ సొమ్ము ఎవరిది? దీని వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ హస్తం ఉందా?. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. వారు నాసిర్ అలీ షాబాన్, చైనా వాసి చాంగ్‌చుంగ్ లింగ్. ఈ విదేశీయులను ఈ వ్యవహారంలోకి ఎలా అనుమతించారు? వీటిపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటిపైనా ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి’అని రాహుల్ డిమాండ్ చేశారు. ‘రుజువులు ఇచ్చినా సెబీ అదానీకి క్లీన్చిట్ ఇచ్చింది. క్లీన్చిట్ ఇచ్చిన సెబీలోని ఆ పెద్దమనిషి ఇప్పుడు అదానీ ఎన్డీ టీవీలో డైరెక్టర్. ఎలాంటి విచారణ జరిగిందో దీన్నిబట్టి అర్థమవుతోంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
హిండెన్‌బర్గ్ 2.0: అదానీ గ్రూప్‌పై మరో పిడుగు.. ఓసీసీఆర్పీ సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ.. ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్‌లు రెడ్ జోన్లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి. -
ఎస్బీఎం కస్టమర్లకు అలర్ట్: ఆ క్రెడిట్ కార్డులపై బ్యాన్
సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!) భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్డేట్ తర్వాత ఎస్బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు) ఎస్బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
మారిషస్‌కు విస్తారా సర్వీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్‌కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. -
మారిషస్ పద్మం
మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘మారిషస్ స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది మారిషస్ ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది అక్కడి ప్రభుత్వం. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకుంటున్నారు. ‘ఒక్క ఆంగ్ల పదం మాట్లాడకుండా తెలుగు మాట్లాడతాను, మీరు మాట్లాడగలరా’ అంటూ సవాలు చేస్తూ ఉంటారాయన. ‘జై జై జై తెలుగు తల్లీ’ అని అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ ఉంటారు. ప్రపంచ తెలుగు మహాసభలకు తప్పనిసరిగా హాజరవుతారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. – చల్లా రామఫణి, మొబైల్: 9247431892 -
ఎఫ్‌డీఐ... రికార్డులు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తాయి. తాజాగా కొత్త మైలురాయి అధిగమించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 29 శాతం మారిషస్ నుంచి ఉన్నాయి. మిగతావి సింగపూర్ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ (తలో 7 శాతం), బ్రిటన్ (6 శాతం) నుంచి వచ్చాయి. మారిషస్ నుంచి అత్యధికంగా 144.71 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 106 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమ్యాన్ ఐల్యాండ్స్ తదితర దేశాల ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేశారు. 2015–16 నుంచి ఎఫ్‌డీఐల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి. సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా.. సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ ఎఫ్‌డీఐల ప్రవాహం మొదలైందని నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ నిశ్చల్ అరోరా తెలిపారు. అప్పట్నుంచీ 500 బిలియన్ డాలర్లు రావడమనేది పటిష్టమైన భారత ఆర్థిక మూలాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, 2007–08 నాటి మాంద్యంలోనూ మదుపుదారులకు మెరుగైన రాబడులిచ్చిన ఆర్థిక వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోకైనా ఎఫ్‌డీఐలు రావాలంటే వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండటం, స్థల .. కార్మిక చట్టాలు.. పన్ను రేట్లును సరళతరంగా ఉండటం, నిపు ణుల లభ్యత, లాజిస్టిక్స్, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని డెలాయిట్ ఇం డియా పార్ట్నర్ రజత్ తెలిపారు. భారత్ ఇప్పటికే ఈ విషయాల్లో చాలా మెరుగుపడిందన్నారు. -
విశ్వ శ్రేయస్సు భారత్ ధ్యేయం
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవి ఎలాంటి షరతులకు, వాణిజ్య, రాజకీయ పరిమితులకు లోబడి ఉండేవి కావని తేల్చి చెప్పారు. పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని గురువారం ఆయన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భాగస్వామ్య దేశాలను గౌరవించడం భారత్ పాటించే ప్రాథమిక సూత్రమన్నారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. -
మారిషస్‌లో సుప్రీంకోర్టు భవనం ప్రారంభోత్సవం
-
మారిషస్ మహా పండుగ శివరాత్రి...
పచ్చని చెరుకు పొలాలు, వెండి జలపాతాలు, పగడపు దిబ్బలు, కట్టిపడేసే సూర్యోదయాలు, ఎగిరే డాల్ఫిన్లు, గోల్ఫ్ కోర్సులు, బీచ్‌లు, దూరంగా కనిపించే సముద్రపు సొర చేపలు, దీవిని చుట్టిన తెల్లని ఇసుక తీరం, స్కూబా డైవింగ్, హనీమూన్ జంటలు, సినిమా షూటింగ్‌లు, భోజన ప్రియుల కోసం దీవి చుట్టూ స్వాగతం పలికే ఇండియన్ రెస్టారెంట్లు... మారిషస్ అంటే ఎన్నో ఎన్నో.. ప్రపంచంలో 27 వ అతి చిన్న దేశం అయినా బహు భాషల, బహు సంస్కృతులకు నిలయం మారిషస్. తొమ్మిది జిల్లాలు, ఐదు భాషలు (ఇంగ్లిష్ , క్రియోల్, ఫ్రెంచ్, హిందీ, తమిళం) ఇక్కడ వారి సొంతం. ఇవన్నీ అలా ఉంచితే దేశమంతా పవిత్రంగా భావించే రోజు మహాశివరాత్రి. ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో ఉన్న ఈ చిన్న ద్వీపంలో మహాశివుడు ఎలా వెలిశాడు.. మహాశివరాత్రి ఎందుకు ఇక్కడ అంత ప్రాచుర్యం సంతరించుకుంది అంటే..మహా శివుడంటే ఎనలేని భక్తి.. శివరాత్రికి ఇక్కడ జాతీయ సెలవుదినం. మారిషస్ హిందువులకు చాలా పవిత్రమైన రోజు. మహాశివరాత్రిని గ్రాండ్ బాసి¯Œ లోని సరస్సు వద్ద విశేషంగా జరుపుకుంటారు. ఈ సరస్సునే గంగా తలావ్ అని కూడా పిలుస్తారు. శివరాత్రి సమయంలో దాదాపు 6 లక్షల మంది ఈ సరస్సుకు యాత్రగా వెళతారు. ఢోలక్ లాంటి వాయిద్యాలను వాయిస్తూ, కాలినడక, వాహనాల ద్వారా సరస్సుకి చేరుకుంటారు. అక్కడ శివుడిని అర్చించి, సరస్సులోని నీటిని ఇంటికి తీసుకుని వెళతారు. శివరాత్రికి ఉపవాసం ఉండి మరుసటి ఉదయం ఖర్జూరం, వాల్నట్స్, స్వీట్ పోటాటోస్తో ఉపవాస దీక్షను వదులుతారు. భక్తులకు దారి పొడుగునా అల్పాహారం, పానీయాలను స్వచ్ఛందంగా అందిస్తారు. గంగా తలావ్ గంగా తలావ్ అంటే ’గంగా సరస్సు’ అని అర్ధం. మన గంగానది సూచకంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. మారిషస్ నడిబొడ్డున లోతైన సావన్నే జిల్లాలో ఏకాంత పర్వత ప్రాంతంలో ఉన్న సరస్సు. ఇది సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉంది. మారిషస్‌లో ఇది అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా పరిగణిస్తారు. సరస్సు ఒడ్డున శివ మందిరం ఉంది. గ్రాండ్ బాసిన్ వెంట హనుమంతుడు, గంగాదేవి, గణేష్‌లతో సహా ఇతర దేవాలయాలు ఉన్నాయి. అనేక కథలు ఈ సరస్సు గురించి స్థానికంగా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడి ఝట నుంచి రాలిన ఒక నీటి బిందువు ఈ సరస్సుగా మారిందని ఒక కథ. ఇక్కడ సరస్సు ఉందని ట్రియోలెట్ గ్రామానికి చెందిన పూజారికి కల రావటం, అక్కడ నిజంగానే సరస్సు ఉండటంతో ప్రజల్లో విపరీతమైన భక్తి, విశ్వాసాలు ఏర్పడ్డాయి. గంగా తలావోకు వెళ్ళిన మొదటి యాత్రికుల బృందం ట్రయోలెట్ గ్రామానికి చెందినది. దీనికి 1898 లో టెర్రె రూజ్ నుండి పండిట్ గిరి గోస్సేన్ నాయకత్వం వహించారు. 1866 లో పాండి సంజిబోన్లాల్ రీయూనియన్ ద్వీపం ద్వారా వ్యాపారిగా వచ్చారు. ట్రియోలెట్ వద్ద మిస్టర్ లాంగ్లోయిస్ భవనాన్ని కొనుగోలు చేసి, గ్రాండ్ బాసి¯Œ ను తీర్థయాత్రగా మార్చటానికి కృషి చేశారు. ఆయన కొన్నభవనాన్ని ఆలయంగా మార్చాడు. పోర్ట్ లూయిస్‌లోని సోకలింగం మీనాట్చీ అమ్మెన్ కోవిల్ నిర్మిస్తున్న కొందరు ఆలయానికి ప్రస్తుత ఆకృతిని ఇవ్వడంలో సహాయపడ్డారు. తర్వాత ఆయన భారతదేశానికి వెళ్లి, భారీ శివలింగాన్ని తీసుకువచ్చి గుడిలో ప్రతిష్టించారు. ముందు ఈ సరస్సును ‘పరి తలావ్’ అని పిలిచేవారు. 1998 లో దీనిని ‘పవిత్ర సరస్సు’గా ప్రకటించారు. 1972లో ప్రధాని రామ్గూలం గోముఖ్ భారతదేశంలోని గంగానది నుంచి నీటిని తీసుకువచ్చి, గ్రాండ్ బాసిన్ నీటితో కలిపి గంగా తలావ్ అని పేరు పెట్టారు. సరస్సు, ఆలయ ప్రాంగణం గంగా తలావ్ ప్రవేశద్వారం వద్ద త్రిశూలంతో నిలబడి ఉన్న శివుడి విగ్రహం ఉంటుంది. మంగల్ మహాదేవ్గా పిలిచే ఈ విగ్రహం 33 మీ (108 అడుగులు) ఎత్తు ఉంటుంది. 2007 లో ప్రతిష్టించిన ఈ విగ్రహం గుజరాత్ వడోదరలోని సుర్సాగర్ సరస్సులో ఉన్న శివవిగ్రహం నమూనా. శివుడితో పాటు ఇక్కడ అనేక దేవీదేవతల విగ్రహాలున్నాయి.శివరాత్రి రోజున దేశమంతా ఒక్కచోటికి వచ్చి, ఏకాగ్రతతో శివుడి భక్తిలో లయం అయినట్లు అనిపిస్తుంది. యువత ఈ పండుగ సమయంలో అందించే సేవల గురించి విశేషమైనవి. – మహేశ్ విశ్వనాథ, ట్రావెలర్ -
మెరుగైన భవిష్యత్తుకే!
న్యూఢిల్లీ: మెరుగైన భవిష్యత్తును కల్పించే ఉద్దేశంతోనే విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, హింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత తొలిసారి ప్రధాని ఈ విధంగా స్పందించారు. భరతమాతపై విశ్వాసమున్న, విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి మెరుగైన భవిష్యత్తును హామీ ఇస్తూ భారత్‌కు స్వాగతం పలుకుతున్నాం’ అని హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో శుక్రవారం మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుపై స్పందిస్తూ.. ‘తీర్పు వల్ల సమాజంలో అశాంతి నెలకొనే అవకాశముందని తీర్పునకు ముందు చాలామంది అనుమానించారు. కానీ వారి అనుమానాలు తప్పని ప్రజలు నిరూపించారు’ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై.. ‘అది రాజకీయంగా కష్టమైన చర్యగా కనిపించవచ్చు, కానీ ఆ నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ ప్రజల అభివృద్ధికి ఒక ఆశాకిరణంగా మారింది’ అని స్పందించారు. మారిషస్ ప్రధానితో భేటీ భద్రమైన, స్థిరమైన, ప్రగతిశీల మారిషస్ నిర్మాణానికి తమ సహకారం ఎల్ల వేళలా ఉంటుందని భారత్ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శుక్రవారం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగనాధ్తో భేటీ అయ్యారు. మారిషస్ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవింద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, మారిషస్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. తమ దేశంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉందని మారిషస్ ప్రధాని గుర్తు చేశారు. మోదీకి ఉద్ధవ్ స్వాగతం పుణె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)ల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి ఉద్ధవ్ ఠాక్రే పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గవర్నర్ కోశ్యారీ, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా ఉన్నారు. -
ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఆ దేశంలో జాతీయ సెలవు దినం.. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమానికి స్వయంగా ఆ దేశ ప్రధాని హాజరై తెలుగువారితో ఆనందం పంచుకుంటారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాష బోధన ఉంటుంది. నిత్యం అక్కడి తెలుగు లోగిళ్లలో తెలుగు వెలుగొందుతుంది. తెలుగువారి నోళ్లలో తెలుగు నానుతుంది. తెలుగు నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. వారు తెలుగునే శ్వాసిస్తున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న ద్వీపపు దేశం మారిషస్ ప్రత్యేకత. వచ్చే ఆగస్టులో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మారిషస్‌లో నిర్వహించే తెలుగు మహాసభలకు తెలుగు కళాకారులను పంపాలని తెలంగాణ సాంస్కృతిక శాఖను కోరేందుకు ‘మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం’ అధ్యక్షులు నారాయణ స్వామి సన్యాసి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. తెలుగు మాట్లాటడం ప్రత్యేకత.. మారిషస్ జనాభా 12 లక్షలు.. అందులో లక్ష మందికిపైగా తెలుగువారే. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 5 తరాల కింద ఉపాధి కోసం వలస వెళ్లిన వారి వారసులు ఇప్పుడు కీలకంగా మారారు. అక్కడి ప్రభుత్వంలో ఇద్దరు తెలుగు వారు మంత్రులుగా ఉన్నారు(ఒకరు కొద్దిరోజుల క్రితమే తప్పుకొన్నారు). దాదాపు 150 పాఠశాలల్లో తెలుగును బోధిస్తున్నారు. తమ ఆరోతరం పిల్లలు స్పష్టంగా తెలుగులో మాట్లాడేలా చూస్తున్నామని చెప్పారు. వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మారిషస్ తెలుగు మహాసభకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా వంద తెలుగు సంఘాలున్నాయి. ఆధ్యాత్మికంగా, మాతృభాషాపరంగా ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా మారిషస్ ప్రభుత్వం తెలుగు భాష వ్యాప్తికి రూ.10 లక్షలు తమకు కేటాయిస్తుందని తెలిపారు. ప్రపంచ మహా సభల్లో చేసిన తీర్మానాల అమలు ఎక్కడ వేసిన గొంగళి తరహాలో వదిలేస్తున్నారు. తెలుగు సిలబస్‌ను తాము ఎప్పటికప్పుడు మార్చుకుంటామని, సొంతంగానే పాఠ్యాంశాలు రూపొందించుకుంటామని చెప్పారు. ఐదేళ్లకోసారి.. సభలు..! ప్రతి 5 ఏళ్లకోసారి తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నామని, వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సహా ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తామని చెప్పారు. మాకు తెలుగు విద్య బోధకులు, సంగీత, నృత్య, వివిధ వాయిద్యాల నిపుణులు కావాల్సిందిగా కోరారు. ప్రతి సంవత్సరం తెలుగులో నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొని అద్భుతంగా రాస్తున్నారని, కొందరు విద్యార్థులు సొంతంగా కథలు రాస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రభుత్వాలు సహకరిస్తే వారు మరింతగా రానిస్తారని వెల్లడించారు. -
ఎఫ్‌డీఐల్లో మారిషస్ మళ్లీ టాప్!!
న్యూఢిల్లీ: భారత్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు కేంద్రంగా మారిషస్ మళ్లీ అగ్రస్థానంలో నిల్చింది. 2017–18లో మొత్తం ఎఫ్‌డీఐలు స్వల్పంగా 36.31 బిలియన్ డాలర్ల నుంచి 37.36 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో మారిషస్ నుంచి 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇవి 13.38 బిలియన్ డాలర్లు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ నుంచి పెట్టుబడులు 6.52 బిలియన్ డాలర్ల నుంచి 9.27 డాలర్లకు పెరగ్గా, నెదర్లాండ్స్ నుంచి ఎఫ్‌డీఐలు 3.23 బిలియన్ డాలర్ల నుంచి 2.67 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది ఎఫ్‌డీఐలకు సంబంధించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం తయారీ రంగంలోకి 7.06 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇవి 11.97 బిలియన్ డాలర్లు. అయితే, కమ్యూనికేషన్స్ సర్వీసుల్లోకి మాత్రం పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్ల నుంచి 8.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అటు రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాల విభాగంలోకి విదేశీ పెట్టుబడులు కూడా 2.77 బిలియన్ డాలర్ల నుంచి 4.47 బిలియన్ డాలర్లకు ఎగియగా, ఆర్థిక సేవల రంగంలోకి ఎఫ్‌డీఐలు 3.73 బిలియన్ డాలర్ల నుంచి 4.07 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కార్పొరేట్ల ఆదాయాలు, వినియోగదారుల డిమాండ్ మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని అసోచాం తెలిపింది. -
మారిషస్ గడ్డపై ‘తెలుగు’ పంట
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు ఇప్పుడు ఇంగ్లిష్ ఒక వెర్రి, ఓ వ్యామోహం. కానీ బతుకుతెరువు కోసం దేశాంతరాలు పట్టిన మన పూర్వీకులు, వారి వారసులు విదేశాల్లో తెలుగుకు పట్టాభిషేకం చేస్తున్నారు. మన భాషకు బ్రహ్మోత్సవం జరుపు తున్నారు. తమ కలల పంటగా వారు నిర్మించుకున్న తెలుగు మహాసభ వారి దృష్టిలో తెలుగు భాషా దేవాలయం. తమ పూర్వీకుల సంస్కృతిని నిలబెట్టుకోవడానికి వారికి మిగిలిన సాధనాలు భక్తి, భాష మాత్రమే. ఒకప్పుడు దేశంలో తెలుగు మాట్లాడే జనాభా రెండో స్థానంలో ఉంటే అది ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. మాతృభాషకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చి బోధన అందులో సాగిస్తేనే భాషను మనం పరిరక్షించుకోగలం అనేది భాషా పరిశోధకుడు గణేష్.డివె. తాజాగా వెల్లడించిన అభిప్రాయం. మన దేశంలో ముఖ్యంగా తెలుగు నేలలో మాతృభాషకు ఇక్కట్లు ఎదురవుతున్న స్థితిగతులు నెలకొంటే 1834లో మనల్ని వీడి చెరకు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా మారిషస్ వెళ్లిన తెలుగు వారు మాత్రం తమ తరువాతి తరం వారు కూడా తెలుగు భాషను ప్రేమించి, మాట్లాడేలా పునాది వేశారు. మన భాషకు బ్రహ్మో త్సవం జరుపుతున్నారు. తెలుగుకు పట్టాభిషేకం చేస్తున్నారు. వారు తమతో తీసుకెళ్లిన వ్యవసాయ పరికరాలైన పలుగు, పారతో పాటు పెద్ద బాలశిక్ష, రామాయణ, మహాభారతం వంటి ఇతిహాస గ్రంథాలు అక్కడి వారిని తెలుగు వారసులుగా తీర్చిదిద్దే ప్రయత్నానికి దోహదపడుతు న్నాయి. అవే ఇప్పటి ఆరోతరం తెలుగువారూ భాషాయజ్ఞంలో మమేకం కావడానికి కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. మారిషస్‌లో ఓ ఆరాధ్యభావంతో తెలుగుకు బ్రహ్మోత్సవాలు జరపడం విశేషం.ఈ ఏడాది(2018) జరిగే బ్రహ్మోత్సవాలకు సన్నాహక చర్యలు ఏడునెలలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20న ప్రారంభమైన ఈ వేడుకల్లో పద్యపఠన పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతి ప్రదానంతో పాటు ఒక్కోరోజు ఒక్కో తెలుగు సాంప్రదా యంపై అవగాహన కల్పించేందుకు వీలుగా సదస్సుల నిర్వహణ ఉంటుంది. చివరి రోజు కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని, మంత్రులు పాల్గొనడంతో పాటు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మారిషస్ దేశానికి వెళ్లిన తెలుగువారు తొలుత తమ భాషా, సాంప్రదాయాలను నిలుపుకోవడానికి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అక్కడికి వెళ్లిన వారిలో మేబర్ ప్రాంతానికి చెందిన పండిట్ గుణ్ణయ్య 1930లో తెలుగు భాషా వికాసానికి నడుం కట్టారు. ఇలా 1947లో మారిషస్ తెలుగు సంఘం ఆవిర్భవించింది. అది వారి కలల పంటైన తెలుగు మహాసభగా 1974లో అవతరించింది. దాన్ని వారు తెలుగు భాషా దేవాలయంగా భావిస్తారు. ప్రస్తుతం మారిషస్ దేశంలో తెలుగు కుటుంబాల్లో ఆరోతరం వారూ తమ పెద్దలు వేసిన బాటలో నడుస్తుం డటం ఇక్కడి తెలుగు బిడ్డలకు స్ఫూర్తిదాయక అంశం. ఆ దీవిలోని మొత్తం జనాభా 12 లక్షలైతే తెలుగువారు లక్షమంది వరకూ ఉన్నారు. వీరికోసం సుమారు 300 తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. ఉన్నత విద్యకోసం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పనిచేస్తుంటే దీనితో చేతులు కలిపి తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక మండలి, తెలుగు యువ సంఘం, అనేక ఉప సంఘాలు పనిచేస్తున్నాయి. వీటికి మారిషస్ రిపబ్లిక్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆర్థికంగా చేయూత నిస్తోంది. ఫ్రెంచికి దగ్గరగా ఉండే క్రియోల్ వారి మాతృభాష అయినా తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకొని దాని మధురిమలను వారు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా వేమన పద్యాలకు వారు పెద్దపీట వేయ డం, అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు నేర్చు కోవడంతో పాటు తెలుగు సంప్రదాయాలనూ పూర్తిస్థాయిలో పాటిం చడం విశేషం. ఇటీవల అక్కడి విద్యార్థులే ఓ కథా సంకలనం వెలువరిం చడం వారి తెలుగు ప్రేమకు తార్కాణం. తెలుగు‘ధనా’న్ని నిలుపుకొనేం దుకు మారిషస్ మహాసభ, అక్కడి ప్రభుత్వం గట్టి సంకల్పంతో పని చేస్తున్నాయి. తెలుగువారికి ప్రీతిపాత్రమైన ఉగాదిని వారు జాతీయ సెల వుదినంగా పాటించడం గమనార్హం. ప్రస్తుతం తెలుగువారు నిర్మించు కున్న 350 దేవాలయాలూ తెలుగు భాషా వికాసానికి పనిచేస్తున్నాయి. ఇక తెలుగు పాఠశాలల్లో 190 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. మారిషస్ దీవిలో తెలుగు భాషోన్నతికి సర్వస్వాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నవారు సంజీవ నరసింహ అప్పడు. ఆయన ఆ దేశ తెలుగు విద్యాధికారి, రేడియో వ్యాఖ్యాత, మారిషస్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు విభాగ అధికారి. తెలుగు ప్రాంతాలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి తెలుగు వికాసానికి కృషిచేస్తున్నారు. మారిషస్ తెలుగువారిలో అయిదో తరానికి చెందిన ఆయన తెలుగునేలను పుణ్య భూమిగా అభివర్ణించి పులకరించి పోతారు. ఇప్పటికి 49సార్లు ఆయన తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడి భాషా ప్రముఖులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. టోరీ తెలుగు రేడియో వ్యాఖ్యాతగా ఇక్కడి వారితో మాట్లాడుతూ... ఇరుదేశాల తెలుగువారిమధ్య సంధానకర్తగా పనిచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయనను ఫోన్ ద్వారా ‘సాక్షి’ పలకరించగా అక్కడి విశేషాలను వెల్లడించారు. మారిషస్ తెలుగు వారిపై పరిశోధనలు కూడా జరిగాయని ఇందుకు తాము సహకరించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. భక్తిని, భాషను జోడించి తమ పూర్వీ కుల సంస్కృతిని నిలబెడుతున్నామని తెలిపారు. -పట్నాయకుని వెంకటేశ్వరరావు, సాక్షి ప్రతినిధి -
సుష్మా విమానం సేఫ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం ఆదివారం కాసేపు ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది. 14 నిమిషాల తర్వాత మళ్లీ విమానం జాడ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) సదస్సుల్లో పాల్గొనేందుకు సుష్మ శనివారం ఢిల్లీ నుంచి వాయుసేనకు చెందిన ఐఎఫ్‌సీ 31 ఎంబ్రాయర్ (మేఘదూత్) విమానంలో బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లారు. ఏకధాటిగా దక్షిణాఫ్రికా వరకు ప్రయాణించడానికి సరిపోయేంత ఇంధనాన్ని నింపుకునే సదుపాయం మేఘదూత్‌కు లేదు. దీంతో తిరువనంతపురం, మారిషస్‌లో విమానం ఆగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంది. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2.08 గంటలకు బయల్దేరి మాల్దీవుల గగనతలంలో ప్రయాణిస్తున్నంత వరకు కూడా అంతా సవ్యంగా ఉంది. అయితే మేఘదూత్ మారిషస్ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా ఏటీసీతో విమానాలకు సంబంధాల విషయంలో తొలి 10, 20, 30 నిమిషాల్లోపు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తారు. 30 నిమిషాల తర్వాత కూడా ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే విమానం జాడ తెలియడం లేదని ప్రకటిస్తారు. 4.44 గంటలకు సుష్మ ప్రయాణిస్తున్న విమానం జాడ మిస్సయింది. దీంతో 12 నిమిషాల తర్వాత కూడా జాడ దొరకకపోవడంతో తొలి హెచ్చరిక జారీ అయింది. దీంతో ఆందోళన మొదలైంది. అయితే 4.58 గంటలకు విమానం రాడార్ పరిధిలోకి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాడార్లలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని భారత వినాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు. మారిషస్ ప్రధానితో భేటీ మారిషస్‌లో ఇంధనం నింపుకోవడానికి ఆగినసమయంలో ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగన్నాథంతో సుష్మ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపిన అనంతరం ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు. -
'మారిషస్‌లో అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహం'
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలకు చేరుకున్నఆయనకు టీటీడీ ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పరమశివం మాట్లాడుతూ.. భారత్,మారిషస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మారిషస్ 50వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 108 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీవారి విగ్రహాన్ని జూలై 1న మారిషస్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. మారిషస్‌లో భారతదేశ వాతావరణమే ఉంటుందని.. హిందువుల పండుగలుకు ప్రభుత్వ సెలవులుతో ఉంటాయని తెలిపారు. -
మారిషస్‌లో తెలుగు వెలుగులు
-
ఎల్ అండ్ టీకి భారీ ఆర్డర్
ముంబై: ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టర్బో భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. విదేశీ ప్రభుత్వంనుంచి వేలకోట్ల విలువైన ప్రాజెక్టును సాధించింది. మారిషస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెట్రోఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నుంచి ఈ భారీ ఆఫర్ కొట్టేసింది. రైలు ఆధారిత పట్టణ రవాణా వ్యవస్థ రూపకల్పన,మరియు నిర్మాణానికిగాను రూ. 3,375 కోట్ల రూపాయల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తమకు చాలా కీలకమైన ఆర్డర్‌ని ఎల్ అండ్ టీ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. ఆఫ్రికన్ ద్వీప దేశంలో సమీకృత లైట్ రైలు ఆధారిత రవాణా వ్యవస్థకు ప్రధాన పురోగతి ఈ ఒప్పందమని పేర్కొంది. 26 కిలోమీటర్ల మార్గం క్యూరీపైప్ తో పోర్ట్ లూయిస్‌లోని ఇమ్మిగ్రేషన్ స్క్వేర్ కు అనుసంధానిస్తుందని, 19 స్టేషన్లను కలిగి ఉంటుందని తెలిపింది. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ సమక్షంలో జూలై 31 న ఒప్పందంపై సంతకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. తమ నైపుణ్యంపై విశ్వాసం ఉంచిన మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ కొత్త లైట్సిస్టం ద్వారా రూటు అభివృద్ధితోపాటు పరిపుష్టమైన ఆర్థిక లాభాలను గణనీయంగా ఆర్జించనుందని ఎల్ అండ్ ఎండీ, సీఈవో ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలిపారు. -
షూటింగ్‌లకు రండి.. రాయితీలు ఇస్తాం
చెన్నై: మారిషస్ వచ్చి మూవీ షూటింగ్స్ జరిపితే భారతీయ సినిమాలకు భారీ రాయితీలు కల్పిస్తామని మారిషస్ ఫిలిం డెవలప్ మెంట్ అధికారులు ఆహ్వానించారు. మారిషస్ దేశం ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెన్నైకి వచ్చి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలి కోశాధికారి ఎస్ఆర్ ప్రభు, ప్రధాన కార్యదర్శి జ్ఞానవేల్‌రాజా మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. తమ దేశంలో షూటింగ్‌లు చేసుకోవడానికి రావాలని, ఆ మూవీలకు 45 శాతం రాయితీ కల్పిస్తామని మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెప్పారు. సానుకూలంగా స్పందించిన తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు తమ నిర్మాతల అందరితో సంప్రదించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రాయితీల విషయాన్ని నిర్మాతలకు వివరిస్తామని పేర్కొన్నారు. మారిషస్ లోని గ్రాండ్ బే బీచ్ (ఫైల్) -
‘సుజనా’తో బ్యాంకుల కుమ్మక్కు
సీఐడీ డీఐజీకి మారిషస్ కమర్షియల్ బ్యాంకు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ, కొన్ని బ్యాంకులు కుమ్మక్కై తమను మోసం చేశాయని సీఐడీ డీఐజీకి మారిషస్ కమర్షియల్ బ్యాంకు (ఎంసీబీ) ఫిర్యాదు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించిన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంసీబీ అధీకృత ప్రతినిధి అన్షుల్ సెహగల్ సీఐడీ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ‘‘సుజనా చౌదరి రుణ సాయం కోరుతూ మా వద్దకు వచ్చారు. మాయమాటలు చెప్పి, తప్పుడు అంశాలు చూపి మా నుంచి రూ.106 కోట్ల మేర రుణం తీసుకున్నారు. దానిని తిరిగి చెల్లించడం లేదు. సొమ్ము రాబట్టుకునేందుకు న్యాయ పరంగా చర్యలు కూడా చేపట్టాం. ఈ విషయంలో పలు కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధికారులు, ఆ కంపెనీకి ఖాతా లున్న బ్యాంకుల అధికారులతో కుమ్మక్కై మమ్మల్ని మోసం చేశారు. సదరు బ్యాం కుల నుంచి నగదు ఉపసంహరించకుండా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ను నియంత్రిస్తూ కోర్టు నుంచి మేం ఉత్తర్వులు తెచ్చుకున్నాం. అంతేగాకుండా సుజనా ఇండస్ట్రీస్‌కు సంబం ధించిన వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకు లను హైకోర్టు ఆదేశించింది కూడా. కానీ దీనిపై కొన్ని బ్యాంకులు మాత్రమే స్పందిం చాయి. మరికొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వకం గా వివరాలను వెల్లడించకపోవడమేగాకుం డా.. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నగదు ఉపసంహరణకు సహకరించాయి. పైగా నగదు ఉపసంహరణ వివరాలను దాచిపెట్టా యి. సుజనా ఇండస్ట్రీస్ దాదాపు 9,800 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల పేరిట పెట్టింది. కోర్టు ఆదేశాలను సదరు బ్యాంకుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపో యింది..’’అని అందులో పేర్కొన్నారు. ప్రభు త్వ బ్యాంకులకు చెందిన అధికారులు ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి ఓ ప్రైవేటు కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వివరించారు. -
మారిషస్‌కు 3,227 కోట్ల సాయం
-
మారిషస్‌కు 3,227 కోట్ల సాయం
న్యూఢిల్లీ: మారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. సముద్ర తీర భద్రత విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, మారిషస్ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ రుణ సాయం చేసింది. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీ చేరుకున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సముద్ర తీర భద్రతా ఒప్పందంపై సంతకాలు అనంతరం హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్స్ రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే తాను, జగన్నాథ్ సముద్ర తీర భద్రతపై ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఈ ఒప్పందంతో పాటు ఇరుదేశాల మధ్య మరో మూడు ఒప్పందాలు కూడా జరిగాయి. మారిషస్‌లో సివిల్ సర్వీసెస్ కాలేజీ ఏర్పాటు, సముద్ర పరిశోధనలో సహకారం, ఎస్బీఎం మారిషస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య యూఎస్ డాలర్ క్రెడిట్ లైన్ అంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సుష్మాతోనూ భేటీ తొలుత మారిషస్ ప్రధాని జగన్నాథ్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు అంశాలపై ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీటర్ ద్వారా తెలిపారు.పర్యటనలో భాగంగా జగన్నాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఈ ఏడాది మొదట్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జగన్నాథ్ చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే. -
పది రోజుల గడువివ్వండి
మారిషస్ కమర్షియల్ బ్యాంక్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం కోర్టుకు నివేదించిన ‘సుజనా’ ఎండీ l చివరి అవకాశమిచ్చిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ)కి చెల్లించాల్సిన రుణ వ్యవహా రంలో పది రోజుల గడువివ్వాలని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఎండీ గురువారం కోర్టును అభ్యర్థించారు. ఈలోపు ఆ బ్యాంకుతో ఉన్న రుణ సమస్యలను పరిష్కరించుకుం టామన్నారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. మారిషస్‌లో హేస్టియా పేరుతో ఓ డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా బకాయి చెల్లించడం మానేసింది. బకాయిలపై స్పందిం చాలంటూ హేస్టియాకు ఎంసీబీ ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మారిషస్ కమర్షియల్ బ్యాంక్.. సుజనా, దాని ప్రతినిధులు తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించింది. ‘సుజ నా’పై కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సుజనా యూనివర్సల్ అధినేత, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు ఆ కంపెనీ ఎండీ తదితరులను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై సుజనాచౌదరి హైకోర్టును ఆశ్రయిం చి.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు. గురువారం సుజనా యూనివ ర్సల్ ఎండీ శ్రీనివాసరాజు కోర్టు ముందు హాజరయ్యారు. తమకు 10 రోజుల గడువు ఇవ్వాలని, ఆ లోపు ఎంసీబీతో రుణ సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. -
తండ్రి రాజీనామా.. కుమారుడికి పదవి
పోర్ట్లూయిస్: భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ (86) తన పదవికి రాజీనామా చేసి.. కొడుకు, ఆర్థిక మంత్రి ప్రవింద్ జగన్నాథ్ (50)కు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ప్రవింద్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు అమీనా గురిబ్-ఫకీమ్ నియామక లేఖ పంపారు. అనంతరం ప్రవింద్ కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అనిరుధ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. యంగ్, డైనమిక్ నాయకుడిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు వీలుగా తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మారిషస్ జాతీయ అసెంబ్లీలో అధికార మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్మెంట్ పార్టీకి మెజార్టీ ఉంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల మద్దతు గల సభ్యుడిని ప్రధానిగా అధ్యక్షుడు నియమిస్తారు. కాగా అధికార మార్పిడిని ప్రతిపక్ష లేబర్ పార్టీ తప్పుపట్టింది. దేశానికి చీకటి దినమని, ఇది తండ్రీకొడుకుల ఒప్పందం అని విమర్శించింది. -
మారిషస్‌లో ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు
తెలుగు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ రాజీవ్ రాజా గౌరిస్సు వెల్లడి హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చే ఏడాది డిసెంబర్లో మారిషస్‌లోని పోర్టు లూరుుస్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుగు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ రాజీవ్ రాజా గౌరిస్సు తెలిపారు. ట్రస్టు ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షులు రాజాగౌరిస్సు మాట్లాడుతూ... మారిషస్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న మారిషస్ తెలుగు కల్చరల్ ట్రస్ట్ పోర్టులూయిస్‌లో 5వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించ తలపెట్టామని, అందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల సహాయ సహకారాలు కోరేందుకు వచ్చామని తెలిపారు. ప్రపంచ తెలుగు మహా సభలకు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను అతిథులుగా ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ... మహాసభల నిర్వహణకు తెలుగు వర్సిటీ పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రతినిధి బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ ఆచార్య బృందావనం పార్థసారథి, ట్రస్టు బోర్డు సభ్యులు కృష్ణా రామస్వామి, రవి వెంకటస్వామి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి పాల్గొన్నారు. -
ఇండియన్ ఫిలిం మేకర్స్‌కు బంపర్ ఆఫర్
ముంబై: భారతీయ సినీ పరిశ్రమకు మారిషస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో సినిమా షూటింగ్ లకోసం వచ్చే భారతీయ సినీ నిర్మాతలకు భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మారిషస్ ద్వీపంలో షూటింగ్ నిమిత్తం వచ్చే ఇండియన్ ఫిలిం మేకర్స్ కి 40 శాతం పన్ను వదులుకునేందుకు అంగీకారం కుదిరినట్టు మహారాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగతివార్ వెల్లడించారు. రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధానమంత్రి అనిరుధ్ జగన్నాథ్ తో జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని తెలిపారు. టూరిజం, లాజిస్టిక్స్, విద్య, చక్కర పరిశ్రమ రంగంలాంటి వివిధఅంశాలతోపాటు సినీపరిశ్రమపై కూడా చర్చించినట్టు పీటీఐకి చెప్పారు. 60 మంది పారిశ్రామికవేత్తలు, 20మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య చర్చలతో పాటు సులభమైన వ్యాపార నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినట్టు తెలిపారు. అలాగే పర్యాటక అభివృద్ధికి, ముఖ్యంగా అందమైన బీచ్ లను అందంగా తీర్చిదిద్దడంలో మారిషస్ అనుసరిస్తున్న పద్ధతులను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. కాగా థాయ్‌లాండ్ లాంటి ప్రముఖ పర్యాటక దేశాలు భారతీయ సినీ నిర్మాతలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. -
మారిషస్ తో సమానంగా సింగపూర్ ను చూడొద్దు
ముంబై : సింగపూర్ తో పన్ను ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ పునః సంప్రదింపులకై చూస్తోంది. అయితే పన్ను పద్ధతిలో మారిషస్ తో సమానంగా సింగపూర్ ను చూడొద్దని విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్ పీఐ) అంటున్నారు. ఇటీవలే మారిషస్ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన లాభ పన్నును విధించాలని ఆ ప్రభుత్వంతో కేంద్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పన్నునే సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులకు విధిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే మారిషస్ ఒప్పందమే సింగపూర్ ప్రభుత్వంతో కూడా కుదుర్చుకుంటే, సింగపూర్ నుంచి భారత్ లోకి వచ్చే పన్నులు చాలా కఠినతరం అవుతాయని ఎఫ్ పీఐలు పేర్కొంటున్నారు. ఈ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై కొంత వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మారిషస్ తో పోల్చుకుంటే సింగపూర్ లో చాలా కఠినతరమైన నిబంధనలుంటాయని, అక్రమాలకు పాల్పడే అవకాశం తక్కువ ఉంటాయని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి వరకల్లా సింగపూర్ తో పన్ను ఒప్పందం కుదుర్చుకుంటామని ఆర్థిక సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఎఫ్ పీఐలతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. ఒకవేళ పన్ను ఒప్పందం కుదరకపోయినా, మూలధన లాభాలపై పన్ను విధించే అధికారం భారత్ కు ఉంటుందని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నుంచి ఫుల్ రేటుతో పన్ను విధిస్తామని చెప్పారు. మారిషస్ లో ఒక్కసారి టాక్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ పొందాకా, వారు ఎలాగైనా పెట్టుబడులను ఇతర దేశాలకు మళ్లించవచ్చని, కానీ సింగపూర్ లో అలా కాదని, పెట్టుబడులపై కఠినతరమైన నిబంధనలు, చెల్లింపులు ఉంటాయని టాక్స్ అడ్వైజర్ ఒకరు తెలిపారు. సింగపూర్ ప్రతినిధులతో భారత ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రతినిధులు వచ్చే వారంలో భేటీ కానున్నారు. ఈ విషయంపై సింగపూర్ ప్రతినిధులతో చర్చించనున్నారు. అయితే సింగపూర్ నుంచి భారత్ కు వచ్చే పెట్టుబడులు 16శాతం వరకూ ఉన్నాయి. మారిషస్, సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ దేశాలతో పన్ను ఒప్పందాలు లేకపోవడంతో, అక్రమ మార్గాల ద్వారా నగదును ఆ దేశాలకు తరలించి, మళ్లీ పెట్టుబడుల రూపంలో భారత్ కు తెస్తున్నారని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఇలా భారీగా నల్లధనం పెరిగిపోతుందని భావించిన ప్రభుత్వం ఆ దేశ పెట్టుబడులపై మూలధన లాభ పన్ను విధించాలని నిర్ణయించింది. -
ఇక్కడ సంపాదించే ఇన్వెస్టర్లు... ఇక్కడే పన్నులు చెల్లించాలి..
* మారిషస్‌తో తాజా డీల్‌తో ఎఫ్‌డీఐలు తగ్గవు... * ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులపై సంపాదించే ఇన్వెస్టర్లు ఎవరైనాసరే ఇక్కడ పన్నులు చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను ఎగవేతల నిరోధానికిగాను మారిషస్‌తో తాజాగా సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీని ప్రకారం మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందం కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గుతాయన్న ఆందోళనలను జైట్లీ కొట్టిపారేశారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తగినంత పటిష్టంగా ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పన్ను ప్రోత్సాహకాలు ఇతరత్రా రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. మారిషస్‌తో తాజా డీల్ కారణంగా ఇన్వెస్టర్లు తమ బేస్(పెట్టుబడులకు మూల కేంద్రం)ను ఇతర పన్ను స్వర్గధామ దేశాలకు తరలిస్తాయని భావించడం లేదు’ అని జైట్లీ తెలిపారు. దేశీయ వినిమయానికి బూస్ట్... కాగా, మారిషస్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం(డీటీఏఏ)లో సవరణల కారణంగా రౌండ్ట్రిప్పింగ్(నిధులను ఇతర దేశాల ద్వారా తీసుకురావడం)కు అడ్డుకట్టపడుతుందని జైట్లీ చెప్పారు. తద్వారా దేశీయంగా వినిమయానికి(కన ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని జైట్లీ వివరించారు. ‘పన్ను స్వర్గధామ దేశాలను పన్ను ఎగవేతలకు ఆవాసంగా మార్చుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలను సవరించడం ద్వారా చెక్ చెప్పనున్నాం. ఈ చర్య కారణంగా స్టాక్ మార్కెట్లలో కొంత కుదుపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో మార్కెట్ల గమనం భారత్ ఆర్థిక వ్యవస్థకు స్వతహాగా ఉన్న బలం ఆధారంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్నుల విధింపు అనేది దశలవారీగా ఉంటుందని.. అందువల్ల విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయన్న ఆందోళలు అనవసరమని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, మారిషస్‌లోని తమ సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల విషయంలో ఈ తాజా సవరించిన ఒప్పందం వల్ల మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. మూడో వంతు ఎఫ్‌డీఐలు మారిషస్ నుంచే... ప్రస్తుతం భారత్‌కు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా మారిషస్ రూట్ ద్వారానే వస్తున్నాయి. 1991లో భారత్ ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు దశాబ్దం ముందే మారిషస్‌తో డీటీఏఏ కుదిరింది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే ఈ డీల్ ముఖ్యోద్దేశం. గడిచిన 15 ఏళ్లలో భారత్‌కు వచ్చిన 278 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.19 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐల్లో మూడోవంతు మారిషస్ రూట్లోనే రావడం గమనార్హం. మారిషస్ డీటీఏఏ సవరణ నేపథ్యంలో సింగపూర్‌తో ఉన్న ఇదేవిధమైన ఒప్పందాన్ని కూడా సవరించే అవకాశం ఉంది. 2015 ఏడాది ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్‌కు వచ్చిన 29.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలలో ఈ రెండు దేశాల ద్వారా మొత్తం 17 బిలియన్ డాలర్లు లభించడం విశేషం. -
మార్కెట్ కు దివాలా బిల్లు జోష్
♦ 7,900కు నిఫ్టీ...52 పాయింట్లు లాభం ♦ 193 పాయింట్ల లాభంతో 25,790కు సెన్సెక్స్ మారిషస్ పన్ను భయాలను దివాలా బిల్లు ఆమోదం పొందడం కొంత వరకు తగ్గించడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి బ్యాంక్ షేర్ల జోరుతో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు పెరిగి 25,790 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 7,900 పాయింట్ల వద్ద ముగిశాయి. సంస్కరణల్లో జాప్యం జరుగుతున్నా భారత్ 7.3% వృద్ధిని సాధించగలదన్న ఐక్యరాజ్యసమితి నివేదిక సానుకూల ప్రభావం చూపించింది. మార్చి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) సెంటిమెంట్ మెరుగపడింది. క్యాపిటల్ గూడ్స్ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. దివాలా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో బ్యాంక్ షేర్లు ఒక వెలుగు వెలిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 3.4% పెరిగి రూ.232 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా పెరిగిన షేర్ ఇదే. ఎస్బీఐ 1.87% పెరిగి రూ.188 వద్ద, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 % పెరిగి రూ.1,150 వద్ద ముగిశాయి. దివాలా కేసులను త్వరితంగా పరిష్కారమయ్యేలా చూసే దివాలా బిల్లు ఆమోదంతో బ్యాంక్‌ల వంటి రుణ సంస్థలు తమ మొండి బకాయిలను త్వరితంగా రికవరీ చేసుకోగలవని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) శ్రేయాశ్ దేవాల్కర్ చెప్పారు. మళ్లీ రూ.5 లక్షల కోట్లకు టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఐటీ దిగ్గజం, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్లీ గురువారం రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. 2014 జూలైలో తొలిసారిగా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరింది. -
మారిషస్ పన్నుఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు డౌన్
ముంబై : మారిషస్ పెట్టుబడులపై పన్ను ఎఫెక్ట్ దేశీయ సూచీలపై పడింది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్ను విధించాలని కేంద్రప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 105.37 పాయింట్ల నష్టంలో 25667.75 వద్ద నమోదవుతుండగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 23.23 పాయింట్ల నష్టంతో 7,864.45 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 స్టాక్స్ ఇండెక్స్ లో 35 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా 2శాతం కిందకి జారాయి. అదేవిధంగా మెటల్, రియాల్టీ, ఆటో స్టాక్స్ కూడా పతనమవుతున్నాయి. మరోవైపు జీ ఎంటర్ టైనర్ నిఫ్టీలో లాభాలను పండిస్తోంది. 5శాతం పెరిగి, రూ.437.55 వద్ద నమోదవుతోంది. అదేవిధంగా హిందాల్కో, ఎన్టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంకు, ఆసియన్ పేయింట్లు లాభాల్లో నడుస్తున్నాయి. మరోవైపు వరుసగా రెండు రోజులు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. పసిడి రూ.160 లాభంతో రూ. 29,943గా నమోదవుతుండగా.. వెండి రూ.289 లాభంతో రూ.41,128 గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.74గా ఉంది. -
సుజనా చౌదరి కోర్టుకు హాజరు కావాల్సిందే
హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 26న నాంపల్లి కోర్టుకు సుజనా చౌదరి హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ పై హైకోర్టు సడలింపు ఇస్తూ ...మే 5న ఆయన వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. కాగా మారిషస్ బ్యాంక్ కు రుణం ఎగవేత కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని, రుణం చెల్లించాలని కోర్టు మూడు సార్లు సమన్లు ఇచ్చినా సుజనా చౌదరి పట్టించుకోకపోవటంతో నాంపల్లి కోర్టు గురువారం సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కోర్టుకు హాజరైన సుజనా ఎండీ
హైదరాబాద్: మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకొని మోసం చేసిన కేసులో సుజనా యూనివర్శిల్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీనివాసరాజు, డైరెక్టర్ హనుమంతరావులు మంగళవారం నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా సుజనా చౌదరి హాజరు కాలేకపోయారని, ఆయన హాజరునకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినా హాజరుకానందున బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను మారిషస్ బ్యాంకు తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా నిందితుల తరఫున ప్రతినిధులు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ ఈ సందర్భంగా వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే నిందితులు రూ.50 వేల చొప్పున పూచీకత్తు బాండ్లను సమర్పించాలని ఆదేశించింది. -
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
యూకే కోర్టు తీర్పు అమలుచేయరాదని కోర్టును ఆశ్రయించిన సుజనా పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం ఇక మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాల్సిందే సాక్షి, న్యూఢిల్లీ: మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాలని యూకే కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయరాదని కోరుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. తమకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సూనేతె మారిషస్ దేశంలో ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. 2010లో మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) నుంచి హేస్టియా రూ. 100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. ఇంగ్లాండ్ చట్టాలకు లోబడి ఈ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసింది. బకాయిల విషయంలో స్పందించాలంటూ హేస్టియాకు ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం దక్కలేదు. గతంలో చేసుకున్న ఒప్పందానికి సవరణలు చేయాలంటూ హేస్టియా కోరడంతో ఎంసీబీ అందుకు అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా ఒప్పందానికి మరోసారి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపారు. అయినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. ఈమొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయపరిధిని సవాలు చేస్తూ హేస్టియా, సుజనా యూనివర్శల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకున్న అధికారం ఇంగ్లాండ్ కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. అంతేకాక వడ్డీ సహా బకాయి ఉన్న రూ. 105 కోట్లతో పాటు మరో రూ. 72 లక్షలను ఖర్చుల కింద ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులోఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడింది. తాజాగా శుక్రవారం సుప్రీం కోర్టులో హేస్టియా సంస్థ హైకోర్టు తీర్పు అమలుచేయరాదని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుజనా సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విచారణకు సుజనా గ్రూపు తరపున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు, ఎంసీబీ తరపున సీనియర్ న్యాయవాదులు ధ్రువ్ మెహతా, వసీం బేగ్ హాజరయ్యారు. -
పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూపు కంపెనీల పేర్లు మారాయి. వీటితో పాటు కంపెనీ నమోదిత కార్యాలయాలను కూడా మారుస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా కంపెనీల బోర్డులు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం సుజన మెటల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ఎస్ఎంపీఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మారిషస్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టి, వివాదంలో చిక్కుకున్న సుుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ పేరును ఎస్యూఐఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మారుస్తున్నారు. సుజన టవర్స్ లిమిటెడ్‌ను ఎస్టీఎల్గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో చోటకి మార్చడానికి బోర్డు ఆమోదం తెలిపింది. -
కొయ్యలగూడెంలో మారిషస్ మంత్రి పర్యటన
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామాన్ని మారిషస్ దేశ ఆర్థిక, సామాజిక మంత్రి పృథ్వీరాజ్‌సింగ్ రూపేన్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతున్న వస్త్రాలను పరిశీలించారు. కార్మికుల సమస్యల గురించి తెలుసుకున్నారు. మారిషస్‌లో చేనేత వస్త్రాల అమ్మాకానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ సుధాకర్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. -
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
-
సుప్రీంలో సుజనాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంకు పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుజన యూనివర్శల్ ఇండస్ట్రిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరీకి సంబంధించిన సుజన ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ సంస్ధ హైస్టియా కంపెనీకి మారిషస్ బ్యాంక్ అప్పు ఇచ్చింది. ఐతే తాము ఇచ్చిన వంద కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో హైస్టియా కంపెనీ విఫలమైందని, అందువల్ల గ్యారంటర్‌గా ఉన్న సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌లో వాదనలు విన్న సింగిల్ జడ్జి కోర్టు సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుజనా ఇండస్ట్రీస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... అప్పు ఇచ్చిన సంస్ధ సివిల్ కోర్టుల్లో దావా వేయడం ద్వారా సొమ్మును రాబట్టుకునే హక్కు ఉందని పేర్కొంది. గతంలో గ్యారంటర్ సంస్ధ సొమ్ము విషయమై హామీ ఇచ్చినా చెల్లించలేదన్న కోర్టు... మారిషస్ బ్యాంకును నిరుత్సాహపరిస్తే అనేక ఇండియా కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు కట్టుబడి ఉండకపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. సుజనా చౌదరికి వ్యతిరేకంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుజనా చౌదరి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. -
కీర్తనలు, భజనలతో సంస్కృతి రక్షణ
మారిషస్ తెలుగువారికి వక్తల ప్రశంసలు తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు పోర్ట్ లూయిస్: భారతదేశంలో కీర్తనలు, భజనలు మరిచిపోతున్న ఈ రోజుల్లో వాటి ద్వారానే భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్న ఘనత మారిషస్ తెలుగు ప్రజలదేనని వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు. మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ ఈ 27న ప్రారంభించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. మారిషస్ ఒక మినీ ఇండియా అయినా ఇక్కడ కులాల ప్రస్తావన మచ్చుకైనా కనిపించని తెలుగు జాతిని చూశానని అమర్నాథ్ పేర్కొన్నారు. మొదటగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 150కు పైగా పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు రాష్ట్రాల విద్యావేత్త, స్లేట్ స్కూలు వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్నాథ్ రెడ్డిని మారిషస్ కేంద్రమంత్రి శాంతారామ్ సన్మానించారు. మంత్రి శాంతారామ్ మాట్లాడుతూ.. వాసిరెడ్డి అమర్నాథ్ మారిషస్ విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులను సూచించారని, వాటిని మనం తప్పకుండా ఆచరిస్తామని చెప్పారు. స్లేట్ ద స్కూల్ ఆధ్వర్యంలో చేపట్టిన స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమానికి విధివిధానాలను రూపొందిస్తామన్నారు. తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీరామస్వామి, మహాత్మాగాంధీ సంస్థ, రవీంద్రనాథ్ ఠాగూర్ సంస్థల డైరెక్టర్ గయన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
పోర్ట్ లూయిస్: మహాత్మాగాంధీ మూకా వారి ఆధ్వర్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ వారు ఈ 27, 28, 29 తేదీలలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెలుగు భాషా బోధన, పిల్లల్లో తెలుగు భాషాపై ఇష్టాన్ని పెంచడానికి ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, స్లేట్ ద స్కూల్ వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ మట్లాడుతూ.. ఇక్కడి తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతిని ఏళ్ల తరబడి సజీవంగా కాపాడుతూ వస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతిని కాపాడటానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన మారిషస్ తెలుగు మహాసభ వారు 'మారిషస్ తెలుగు మిత్ర' అన్న బిరుదునిచ్చి అమర్నాథ్ గారిని ఈ సందర్భంగా సత్కరించారు. బాలబాలికలు దీన్ని గర్వపడాల్సిన విషయంగా చూడాలని, కానీ వాళ్లు తెలుగులో మాట్లాడటానికి, భాష నేర్చుకోవడాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి 20 రోజుల పాటు వారికి తెలుగు భాషపై అవగాహన పెంచి, అనర్గళంగా మాట్లాడేటట్లు చేస్తామని చెప్పారు. ఇందుకై ప్రయాణ ఖర్చులు విద్యార్థులు భరిస్తే, వసతి, బస తాను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. -
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్: తెలుగు భాషను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగష్టు 27 వ తేదీ నుంచి 29 వరకు ఈ ఉత్సవాలను జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ పాల్గొననున్నారు. ఈ మేరకు మారిషస్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వివిధ దేశాలకు చెందిన వారందరినీ ఒక తాటిపై తెచ్చేందుకు ఏర్పాటు చేసిన 'తెలుగు డయాస్పోరా ఇంటర్నేషనల్ ' అనే సంస్థను ఈ సందర్భంగా అమర్ నాథ్ ప్రారంభిస్తారు. అదేవిధంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మారిషస్ లోని వేంకటేశ్వర ఆలయంలో తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా భజనలు, కోలాటాలు, అన్నమాచార్య కీర్తనలు, సామూహిక పూజలు, తెలుగులో పోటీల వంటి పలు కార్యక్రమాలను దేశమంతటా వైభవంగా నిర్వహించనున్నారు. -
షెల్ కంపెనీలను అనుమతించం
భారత్‌కు మారిషస్ హామీ న్యూఢిల్లీ : ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (డీటీఏసీ) ద్వారా లబ్ధి పొందాలనుకునే షెల్ (మారు) కంపెనీల ఏర్పాటుకు తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబోమని మారిషస్ ఆర్థిక మంత్రి సీతానా లచ్మినరాయుడు భారత్‌కి హామీ ఇచ్చారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే విధమైన కార్యకలాపాలు సాగించేందుకు వచ్చే భారతీయ ఇన్వెస్టర్లనే తాము కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటు భారత్‌కి గానీ, అటు మారిషస్‌కి గానీ షెల్ కంపెనీలు ఉపయోగపడవని, అందుకే వాటిని తాము కోరుకోవడం లేదన్నారు. దశాబ్దాల క్రితం నాటి డీటీఏసీని సవరించేందుకు ఉద్దేశించి తదుపరి విడత చర్చలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డీటీఏసీకి సంబంధించి మారిషస్‌పై దురభిప్రాయం సరికాదని, తమ దేశ ఆర్థిక రంగం పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉందని మంత్రి వివరించారు. డీటీఏసీ మూలంగా తమ దేశం ద్వారా భారత్‌కి కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీని వల్ల ఉపాధి అవకాశాలపరంగా మారిషస్ కూడా లబ్ధి పొందిందని చెప్పారు. డీటీఏసీ సవరణలకు సంబంధించి జూన్ 29-30న ఇరు దేశాల అధికారులు సమావేశం కానున్నట్లు తెలిపారు. తమ దేశ ఫిషరీస్, పోర్టులు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ భారత ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ‘స్వచ్ఛ మారిషస్’..: పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన కార్యక్రమం(స్వచ్ఛ భారత్) తరహాలోనే తాము కూడా తమ దేశంలో వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును బస్తాల కొద్దీ తీసుకొచ్చి దాచుకోవాలనుకువారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయమివ్వబోమని మారిషస్ ఆర్థిక మంత్రి తెలిపారు. -
ఏజెంట్ల మోసం... మారిషస్‌లో 35 మంది యువకులు
సిరిసిల్ల (కరీంనగర్) : మారిషస్‌లో ఉపాధి చూపిస్తామంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన 35 మంది యువకులను ఏజెంట్లు మోసం చేశారు. మారిషస్ నుంచి బాధితులు సోమవారం సాక్షికి ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన రమణారెడ్డి, రామన్నపేటకు చెందిన నాగిరెడ్డి మారిషస్‌లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి సిరిసిల్ల ప్రాంతంలోని 35 మంది యువకులను 15 రోజుల కిందట మారిషస్ పంపించారు. డ్రైవర్, భవన నిర్మాణం, తోటలో పనులంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. పనిలో చేరాక మరో రూ.1.30 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. హర్యానాకు చెందిన జైదుర్గా ట్రావెల్స్ ద్వారా వీరిని మారిషస్ పంపించారు. అయితే అక్కడికి వెళ్లాక వారికి కంపెనీలు ఉపాధి చూపలేదు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోయారు. ఏజెంట్లకు ఫోన్ చేసి అడిగితే రెండు,మూడు రోజుల్లో పని చూపిస్తామని చెబుతున్నారని కోనరావుపేటకు చెందిన కస్తూరి దశరథరెడ్డి, వూరడి చిన్ననర్సయ్య, బొప్పాపూర్‌కు చెందిన లంబ మహేందర్, దుమాలకు చెందిన రామిండ్ల శ్రీనివాస్, నీరటి భూమరాజు, కొలనూరుకు చెందిన సుదమల్ల లక్ష్మీరాజం ఫోన్లో తెలిపారు. వీసా గడువు తీరితే పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని, సర్కారు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. -
మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్
జలంధర్: మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్ను ప్రతిష్టాత్మక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించిన నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు డాక్టరేట్ అందజేసినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి, సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో పాటు లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేశ్ మిట్టల్, వైస్ చైర్మన్ నరేశ్ మిట్టల్, వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఈ స్నాతకోత్సవంలో 2013, 2014 బ్యాచ్‌లకు చెందిన 306 మంది అకడమిక్ టాపర్లతో పాటు మొత్తంగా 30,878 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశామని తెలిపింది. ఈ సందర్భంగా తనను డాక్టరేట్‌తో సత్కరించిన లవ్లీ వర్సిటీకి మారిషస్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. -
మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ
అనంతపురం: ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అడిగినట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఏప్రిల్ 7న మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ జరుగనున్నట్లు ఆయన చెప్పారు. చాలా మంది నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పకడ్బంధీగా కేసులు విచారణ కోసమే మానిటరింగ్ సెట్ ఉపయోగపడుతుందని డీజీపీ రాముడు చెప్పారు. ఇదిలా ఉండగా, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్‌లో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అతను గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో వున్న గంగిరెడ్డిని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు, ఇంటర్‌పోల్ సహాయం కోరారు. చివరకు అతనిని మారిషస్‌లో ఇంటర్‌పోల్ అధికారులు అరెస్ట్ చేశారు. గంగిరెడ్డి బెయిల్ కోసం మారిషస్ కోర్టులో పిటిషన్ వేశాడు. దానిని కోర్టు కొట్టివేసింది. అయితే న్యాయస్థానం విధించిన షరతులన్నీ పాటిస్తానని, దేశం విడిచి ఎక్కడికి వెళ్ళనని, భారత దేశానికి తనను అప్పగించవద్దని గంగిరెడ్డి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపధ్యంలో స్మగ్లర్ గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ అధికారులు సికింద్రాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. గంగిరెడ్డిని మారిషస్ పోలీసులు అరెస్టు చేశారని, ఆయనపై అనేక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో పాస్‌పోర్టు అధికారులు గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేశారు. ఇదిలా ఉండగా, మారిషస్ నుంచి గంగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి ఏపీ సిఐడీ విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక బృందం మారిషస్ కూడా వెళ్లింది. -
మారిషస్ ఒక మినీ భారత్ - మోదీ
పోర్ట్ లూయీస్: భారత ప్రధాని నరేంద్రమోదీ మారిషస్ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్చి 12 మారిషస్ జాతీయ దినోత్సం సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం వరల్డ్ హిందీ సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హిందీ భాషను ఆదరిస్తున్న మారిషస్ ప్రజలను అభినందించారు మోదీ. మారిషస్ ఒక మినీ భారత్ అని తన బిడ్డకు భారత మాత ప్రణామాలర్పిస్తోందన్నారు. ఇక్కడున్న కోట్లాది భారతీయుల కోరిక మేరకు మారిషస్ వచ్చానన్నారు మోదీ. -
సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు
హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ పిటిషన్ బాకీ ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నారు.. అయినా బకాయిలు చెల్లించడంలేదు... లండన్ కోర్టు చెప్పినా స్పందన లేదు . సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, ఆస్తులు అమ్మి మా అప్పులు తీర్చండి .అందుకు లిక్విడేటర్‌ను నియమించండి.. కంపెనీ ఆస్తులు విక్రయించకుండా, అన్యాక్రాంతం చేయకుండా ఆదేశాలివ్వండి విచారణను 18కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమకు 106 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, సొమ్ము చెల్లించాలని కోరినా సమాధానం చెప్పడంలేదంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయి తిరిగి చెల్లించే పరిస్థితిలో లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎంసీబీ పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మారిషస్‌లో హేస్టియా పేరుతో అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. హేస్టియా 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. రుణానికి సంబంధించి ఇంగ్లిష్ చట్టాలకు లోబడి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి హేస్టియా రుణ చెల్లింపులు నిలిపివేసింది. వీటి పై హేస్టియాకు ఎంసీబీ పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఒప్పందానికి సవరణలు చేయాలని హేస్టియా కోరగా, అందుకు ఎంసీబీ అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా మరోసారి ఒప్పందానికి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరిని ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదించారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని, జరుగుతున్న పరిమాణాలకు క్షమాపణలు కోరుతున్నానని ఎంసీబీ అప్పటి గ్లోబల్ బిజినెస్ హెడ్ ప్రతిక్ ఘోష్‌కు 2012, అక్టోబర్ 16న సుజనా చౌదరి ఎస్ఎంఎస్ పంపారు. వీలైనంత త్వరగా మొత్తం వ్యవహారాన్ని పరిష్కరిరు. తాను అమెరికా వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చాక బ్యాంకర్లతో మాట్లాడతానని ఆ ఎస్ఎంఎస్లో సుజనా చౌదరి పేర్కొన్నారు. మరో డెరైక్టర్ హనుమంతరావు కూడా డిసెంబర్ నెలలో పంపిన మెయిల్లో బకాయి ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయినా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు పంపిన నోటీసులకు కూడా స్పందన లేదు. ఇదిలా ఉండగానే ఈ మొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయ పరిధిని సవాలు చేస్తూ హేస్డియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో ముందస్తుగా ఓ పిటిషన్ వేశాయి. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని ఆ న్యాయస్థానం తేల్చి చెప్పింది. వడ్డీతో సహా బకాయి ఉన్న రూ.105 కోట్లు, ఖర్చుల కింద మరో రూ.72 లక్షలు ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు తీర్పును అమలు చే యాలని కోరింది. సుజనా యూనివర్సల్ ఆస్తిని జప్తు చేసి, దానిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బకాయి కింద చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న అసాధారణ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. సుజనా యూనివర్సల్‌ను మూసివేసి, ఆ కంపెనీ ఆస్తులను విక్రయించి తమ బకాయిలను తీర్చేందుకు ఓ అధికారిక లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. అంతేకాకుండా కంపెనీ ఆస్తులను విక్రయించడం, అన్యాకాంత్రం చేయడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎంసీబీ కోరింది. -
వేడుకలకు వేదిక.. మారిషస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, వార్షికోత్సవం, పుట్టిన రోజు.. సందర్భం ఏదైనా జీవితంలో గుర్తుండిపోయే అనుభూతి కోసం సాధారణంగా ఏం చేస్తాం? ఒక బహుమతి ఇవ్వడమో లేదా వేడుకను అంగరంగ వైభవంగా జరపడమో చేస్తాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. అతిథులకూ తీపి జ్ఞాపకం మిగిల్చేందుకు చలో మారిషస్ అంటున్నారు. భారతీయులకు సైతం మారిషస్ మేనియా పట్టుకుంది. విమానాన్ని మాత్రమే కాదు హోటల్‌ను సైతం పూర్తిగా బుక్ చేసుకుంటున్నారు. వంటవారు మొదలు వినోదం వరకు అంతా అతిథులకు నచ్చినట్టుగానే. అంతేకాదు అక్కడి ప్రకృతి అందాలూ ఆహ్వానితులను కనువిందు చేస్తున్నాయి. పెళ్లంటే పెద్ద వేడుకే.. యూరప్ నుంచి అత్యధికులు తమ పెళ్లి వేడుకలకు మారిషస్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఎంత కాదన్నా ఏటా 10 వేల వివాహాలు జరుగుతున్నాయి. భారత్ నుంచి ఏడాదికి కనీసం 10 జంటలైనా తమ దేశంలో ఒక్కటవుతున్నారని మారిషస్ టూరిజం ప్రమోషన్ అథారిటీ (ఎంటీపీఏ) అంటోంది. ‘భారతీయుల పెళ్లి అంటే అదో వేడుక. భారతీయత ఉట్టిపడుతుంది. కనీసం 50 మంది మొదలు 700 మంది వరకు హాజరవుతారు. అదే యూరప్ జంటల విషయంలో అతిథుల సంఖ్య 30కి మించదు’ అని ఎంటీపీఏ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ హాల్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని గదులనూ పూర్తిగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని హోటళ్లు కల్పిస్తాయి. వంటవారినీ తెచ్చుకోవచ్చని చెప్పారు. బీచ్ ఒడ్డున వేడుక అంటే ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందేనని అన్నారు. 30 శాతం దాకా డిస్కౌంట్.. వివిధ దేశాల నుంచి ఏటా 10 లక్షల మంది పర్యాటకులు మారిషస్‌కు వస్తున్నారు. ఈ సంఖ్యను 13.5 లక్షలకు చేర్చాలన్నది ఎంటీపీఏ లక్ష్యం. అలాగే భారత్ నుంచి 2013లో 59 వేల మంది వచ్చారని, ఈ ఏడాది 60 వేలు అంచనా వేస్తున్నట్టు ఎంటీపీఏ ఇండియా మేనేజర్ వివేక్ ఆనంద్ తెలిపారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 శాతం మంది ఉంటారని చెప్పారు. హనీమూన్ కోసం వచ్చే జంటలకు 30 శాతం దాకా డిస్కౌంట్లను కొన్ని హోటళ్లు అందిస్తున్నాయని వివరించారు. ఏటా భారత్ నుంచి 15 వేల జంటలు హనీమూన్ కోసం మారిషస్ వెళ్తున్నట్టు సమాచారం. కాగా, సింహం, పులి, చిరుతతో కలసి నడవాలంటే కసేలా నేచుర్ పార్క్ వెళ్లాల్సిందే. పోర్ట్ లూయిస్ మార్కెట్, ఎస్ఎస్ఆర్ బొటానికల్ గార్డెన్స్, గ్రాండ్ బేసిన్, చమారెల్ తదితర పర్యాటక ప్రదేశాలు చూడదగ్గవి. మారిషస్ విశేషాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌తోసహా నాలుగు నగరాల్లో ఎంటీపీఏ రోడ్‌షో నిర్వహిస్తోంది. -
మూడు దేశాల ముద్దుబిడ్డ
బాల్యంలో తల్లి చెప్పే రామాయణ భారత గాథలు విన్నారు ఆనందాదేవి.. పెద్దయ్యాక కూడా వాటిని మర్చిపోలేదు...వాటినుంచి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు...ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తన జ్ఞానపరిధిని పెంచుకున్నారు... మనిషికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలను తన కథలకు ప్రధానాంశంగా చేసుకున్నారు... రచనలలో భిన్న సంస్కృతులను చూపారు... భావవ్యక్తీకరణలో కొత్తకోణం ఆవిష్కరించారు...విమర్శకుల ప్రశంసలనందుకుంటూనే అనేక అవార్డులను గెలుచుకున్న ఆనందాదేవిమారిషస్లో పుట్టి, ఫ్రెంచ్‌లో రచనలు చేసిన అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఆశ్చర్యమే! మారిషస్‌లోని ఆనందాదేవి ఇల్లు, చెరుకుతోట మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె ఇంకా ఆహ్లాదకరమైన పుస్తకాలెన్నో చదివారు. ఆడుకోవడానికి చెల్లి తప్ప ఆ రోజుల్లో రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు లేవు. అయితే ఆ ఇంటి లైబ్రరీలో ఆర్థర్ కోనన్డోయ్లే, అగాథా క్రిస్టీ వంటి రచయితల రచనలు, 1001 నైట్స్ అండ్ బౌడేలైర్... వంటి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లితండ్రులకు పుస్తకాలే ప్రాణం! బహుశ పుస్తకాలు చదివే అలవాటు వారి దగ్గర నుంచే అబ్బి ఉంటుంది. మనసుతోనే ప్రయాణం... భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పెరిగిన ఆనందాదేవి, తన ఏడవ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. 15 వ ఏట రచించిన చిన్న కథకు, ‘రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్నారు. ‘‘ప్రపంచంలో ఏయే ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి టైమ్ అట్లాస్ చూసేదానిని. నేను రాసే కథలలో అట్లాస్ చూస్తూ ఆయా ప్రాంతాలకు నా మనసుతో ప్రయాణిస్తుంటాను. నేను ఫ్రెంచ్‌లో రాస్తున్నప్పటికీ నాలో, నా రచనలలో భారతీయత ఉంటుంది. ఇప్పటికే నా రచనలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి... ’’ అంటారు. భాషల మాటకారి... దేవి రచనలు ఫ్రెంచిభాషలో ఉంటాయి కాని, ఆమె పలు భాషలు మాట్లాడగలరు. ‘‘నాకు తెలుగు, క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురి, హిందీ భాషలు వచ్చు. ఎవరైనా నన్ను ‘మీరు ఏ భాషలో ఆలోచిస్తారు?’ అని ప్రశ్నిస్తే, ‘‘ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో ఆలోచిస్తాను. ’’ అంటారు ఆమె. రచనలు... ఆనందాదేవి రచనలలో అనేక సామాజిక అంశాలు ప్రతిబింబిస్తాయి. స్త్రీల గురించి, అనేక సామాజిక రుగ్మతల గురించి, అంగవైకల్యం, వ్యభిచారం, వృద్ధాప్యం, స్వలింగ సంపర్కం... వంటి ఎన్నో అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. ఇంకా... చిన్నకథలు, నవలలు రాస్తూ, అనువాదాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. సాహిత్యం అనేది భాషాభేదం లేకుండా, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువైనదనే విషయాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలకత్తాలో... కలకత్తాలో ఉన్నప్పుడు కొన్నిరోజులపాటు కొందరు వేశ్యలను దగ్గరగా గమనించారు ఆనంద. ఈ విషయం చెబుతూ, ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాల మీద వారికి స్వేచ్ఛ ఉండదనిపించింది. ఈ విషయంలో ఆడపిల్లల కంటె మగపిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలనిపించింది. వారికి స్త్రీలను గౌరవించడం నేర్పాలని నేను చెప్పినప్పుడు, చాలామంది న్యాయమూర్తులు, రాజకీయనాయకులు నన్ను విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు ఆనందాదేవి. ముగింపు పాఠకులకే! ‘‘రచయిత పురుషుడైతే, ఇంటికి వెళ్లగానే, తనను డిస్టర్బ్ చేయవద్దని, తాను రాసుకోవాలని చెప్పగలుగుతాడు. స్త్రీకి అలా కుదరదు. ఇంటికి వెళ్లి అన్ని పనులూ చేసుకుని, పిల్లలకు కావలసినవన్నీ చూసి, ఆ తరువాత సమయం, ఓపిక... ఉంటేనే రాసుకుంటారు. అంతేగాని, ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను రాసుకుంటున్నాను’ అనే అర్హత ఆమెకు ఉండదు కదా!’’ అంటారు ఆనంద. ఇంకా... ‘‘రచనలు చేయడమంటే పాఠకులను చాలెంజ్ చేయడమే. ఒక రచన చేస్తే, అందులోకి పాఠకుడు ప్రవేశించాలి. పాఠకులతో సున్నితంగా ఆడుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే ముగింపు ఒక్కోసారి పాఠకులకే వదిలేస్తుంటాను. నా తాజా నవల ‘లెస్ జోర్స్ వివంత్స్ (ద లివింగ్ డేస్), నవల ముగింపును పాఠకులకే వదిలేశాను’’ అన్నారు, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆనందాదేవి. అయితే సమస్యలను మాత్రం ఆమె అలా గాలికి వదిలేయలేదు. తనకు చేతనైన పరిష్కారాలను సూచిస్తుంటారు. బహుశ ఆ అలవాటే ఆమె పురస్కారాలు అందుకోవడానికి అర్హురాలిని చేసి ఉండవచ్చు! గుర్తింపు లేకపోవడమే మంచిది... నన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది మారిషస్. అయినప్పటికీ నేను నా రచనలు చేసేటప్పుడు నేను మారిషస్ స్త్రీని అనుకోను. నేను కంప్యూటర్ ముందు కూర్చునే ఒక ప్రాణిని. ఒక్కోసారి పెన్ పేపరు పుచ్చుకునే ప్రాణిని. కథలు రాస్తూ, నాకు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాను. రచయితగా నాకొక గుర్తింపు లేకపోవడాన్ని, లేదనుకోవడాన్ని నేను ఇష్టపడతాను. కొత్తకొత్త వ్యక్తుల మస్తిష్కంలో నన్ను నేను ఆవిష్కరించుకోగలను... వారిలాగ ఆలోచిస్తూ, వారిలాగ ఉంటూ... - ఆనందాదేవి -
ఐసీఐసీఐ విదేశీ విస్తరణ
వడోదర: విదేశాల్లో విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మారిషస్ల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో ఉన్న రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి బ్యాంక్ శాఖగా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వీటన్నింటికి తగిన ఆమోదాలు ఆర్బీఐ నుంచి పొందామని వివరించారు. బ్యాంక్ 20వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే విదేశీ నెట్‌వర్క్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు. మూడు అనుబంధ బ్యాంకులతో, ఎనిమిది రిప్రజంటేటివ్ ఆఫీస్లతో విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 653 బ్యాంక్ శాఖలను, 834 ఏటీఎంలను ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 3,753కు, ఏటీఎంలు 11,315కు పెరిగాయని చందా కొచ్చర్ తెలిపారు. వృద్ధి సాధనపై దృష్టి సారించే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ యంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని తెలిపారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను నమోదుచేయగలమన్న విశ్వాసాన్ని కొచర్ వ్యక్తం చేశారు. -
‘పెంటా భారత్ ఫోన్’ ఆవిష్కరణ
బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ యాక్సెస్ రెడీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి మారిషష్‌కు చెందిన పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ ప్రవేశపెట్టింది. మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్, కర్ణాటక గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్, పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్ ప్రశాంత్ తివారీ శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పెంటా భారత్ ఫోన్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తివారీ మాట్లాడుతూ... మూడు అంగుళాల స్క్రీన్, డ్యూయల్ సిమ్, 1.3 మెగా పిక్సెల్ కెమెరా, దామ్‌దార్ లిథియం బ్యాటరీ గల ఈ ఫోన్ ధరను రూ.1,099గా నిర్ణయించినట్లు చెప్పారు. సర్వీస్ ప్రొవైడర్‌గా బీఎస్ఎన్ఎల్ సంస్థ పనిచేస్తుందన్నారు. మొబైల్ బ్యాంకింగ్, టెలి మెడికల్ కేర్ డెలివరీ, ఈ-మెయిల్, ఫేస్బుక్ వంటి అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సేవలతో పాటు జావా గేమ్స్, ఆటో వాయిస్‌కాల్ రికార్డింగ్ తదితర సౌకర్యాలు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సైతం ఈ ఫోన్‌ను చేరువ చేయడంలో భాగంగా దేశంలోని అన్ని బీఎస్ఎన్ఎల్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరపనున్నట్లు స్పష్టం చేశారు. -
బికినీలో మారిషస్ బీచ్‌లో...
బాలీవుడ్లో నిలదొక్కుకోవడం అనేది కథానాయికలకు ఓ లక్ష్యంగా మారిపోయింది. దానికోసం వాళ్లు భారీ త్యాగాలకు కూడా వెనుకాడటం లేదు. దక్షిణాదిలో పద్ధతిగా కనిపించిన కథానాయికలందరూ బాలీవుడ్ కెమెరా ముందుకు రాగానే... హాట్ హాట్‌గా మారిపోతారు. ఈ విషయంపైనే నిన్నటిదాకా ఇలియానా చర్చనీయాంశమైంది. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. దక్షిణాదిలోని కొన్ని సినిమాల్లో ట్రెండీగా కనిపించినా... తమన్నా ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ... ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా కోసం ఏకంగా బికినీ ధరించేసిందట తమన్నా. బికినీ వేయడమే కాదు, ఆ డ్రెస్‌లో మారిషస్ బీచ్‌లో స్టెప్పులు కూడా వేసిందట. ఇంతకీ తమన్నా... ఇలా నర్తించిన సినిమా ఏంటా? అనుకుంటున్నారా! ఆ సినిమా పేరు ‘హమ్ షకల్స్’. సైఫ్ అలీఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ ఇందులో హీరోలు కాగా, బిపాసా బసు, ఇషా గుప్త, తమన్నా హీరోయిన్లు. మిగతా నాయికలను ఎలాగైనా డామినేట్ చేయాలనే తమన్నా ఈ సాహసం చేసిందని బాలీవుడ్ టాక్. బికినీలో పాలరాతి శిల్పంలా అనిపించే తమన్నా అందాలు యువతను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదని ‘హమ్ షకల్స్’ దర్శకుడు సాజిద్ ఖాన్ చెబుతున్నారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మారిషస్‌లో 108 అడుగుల శ్రీవారి విగ్రహం
సాక్షి, తిరుమల: మారిషస్ దేశంలో 108 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అక్కడి హరిహర దేవస్థానం చైర్మన్, కేబినెట్ ఓఎస్డీ పార్థసారథి తెలిపారు. శనివారం ఉదయం ఆయన మారిషస్ ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ సురేష్ చంద్రతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరులో కుంభాభిషేకం చేసి అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని తెలిపారు. అనంతరం తిరుమలలోని వేద పాఠశాలను వారు సందర్శించారు. మారిషస్‌లో కూడా వేదపాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. -
ఎయిర్‌లైన్స్ నుంచి హనీమూన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో హనీమూన్ కి వెళ్లాలనుకునే నూతన దంపతుల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దుబాయ్ ఎమిరేట్స్ టికెట్ చార్జీలో 20% దాకా డిస్కౌంట్ ప్రకటించింది. మారిషస్, కేప్‌టౌన్, లండన్, ప్యారిస్, జ్యూరిక్, న్యూయార్క్ వంటి 20 నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మార్చి 31లోపు ప్రయాణాలకు ఈ నెల 7లోగా బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా .. కౌలాలంపూర్‌కి వెళ్లే జంటలకు.. బాలి, ఫుకెట్ వంటి ప్రాంతాలకు ప్రమోషనల్ చార్జీలు ప్రకటించింది. వీటి ప్రకారం కౌలాలంపూర్‌కి కొచ్చి, కోల్‌కతా, తిరుచ్చిరాపల్లి నుంచి రూ. 5,000.. చెన్నై, బెంగళూరు నుంచి రూ. 6,500 టికెట్ చార్జీ (వన్ వే) ఉంటుంది. అక్కణ్నుంచి బాలి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే రూ. 2,999కే వన్ వే టికెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ఏషియా తెలిపింది. డిసెంబర్ 15 దాకా బుకింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 6 -ఏప్రిల్ 30దాకా చేసే ప్రయాణాలకే ఈ ఆఫర్. -
యూఏఈలో భారత రాయబారిగా టీ పీ సీతారాం
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత రాయబారిగా టీ పీ సీతారం నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. సీతారాం ప్రస్తుతం మారిషస్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1980 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్ అధికారి అయిన సీతారం ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. అయితే సీతారాం త్వరలో యూఏఈలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే.