‘సుజనా’తో బ్యాంకుల కుమ్మక్కు | Mauritius Commercial Bank complaint to CID DIG | Sakshi
Sakshi News home page

‘సుజనా’తో బ్యాంకుల కుమ్మక్కు

Published Fri, Jun 2 2017 1:19 AM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM

Mauritius Commercial Bank complaint to CID DIG

సీఐడీ డీఐజీకి మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు ఫిర్యాదు
 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ, కొన్ని బ్యాంకులు కుమ్మక్కై తమను మోసం చేశాయని సీఐడీ డీఐజీకి మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎంసీబీ) ఫిర్యాదు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించిన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంసీబీ అధీకృత ప్రతినిధి అన్షుల్‌ సెహగల్‌ సీఐడీ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ‘‘సుజనా చౌదరి రుణ సాయం కోరుతూ మా వద్దకు వచ్చారు. మాయమాటలు చెప్పి, తప్పుడు అంశాలు చూపి మా నుంచి రూ.106 కోట్ల మేర రుణం తీసుకున్నారు. దానిని తిరిగి చెల్లించడం లేదు.

సొమ్ము రాబట్టుకునేందుకు న్యాయ పరంగా చర్యలు కూడా చేపట్టాం. ఈ విషయంలో పలు కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధికారులు, ఆ కంపెనీకి ఖాతా లున్న బ్యాంకుల అధికారులతో కుమ్మక్కై మమ్మల్ని మోసం చేశారు. సదరు బ్యాం కుల నుంచి నగదు ఉపసంహరించకుండా సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ను నియంత్రిస్తూ కోర్టు నుంచి మేం ఉత్తర్వులు తెచ్చుకున్నాం. అంతేగాకుండా సుజనా ఇండస్ట్రీస్‌కు సంబం ధించిన వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకు లను హైకోర్టు ఆదేశించింది కూడా. కానీ దీనిపై కొన్ని బ్యాంకులు మాత్రమే స్పందిం చాయి. మరికొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వకం గా వివరాలను వెల్లడించకపోవడమేగాకుం డా.. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నగదు ఉపసంహరణకు సహకరించాయి.

పైగా నగదు ఉపసంహరణ వివరాలను దాచిపెట్టా యి. సుజనా ఇండస్ట్రీస్‌ దాదాపు 9,800 కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీల పేరిట పెట్టింది. కోర్టు ఆదేశాలను సదరు బ్యాంకుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపో యింది..’’అని అందులో పేర్కొన్నారు. ప్రభు త్వ బ్యాంకులకు చెందిన అధికారులు ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి ఓ ప్రైవేటు కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement