సుజనా చౌదరి కోర్టుకు హాజరు కావాల్సిందే
హైదరాబాద్ : కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 26న నాంపల్లి కోర్టుకు సుజనా చౌదరి హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ పై హైకోర్టు సడలింపు ఇస్తూ ...మే 5న ఆయన వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. కాగా మారిషస్ బ్యాంక్ కు రుణం ఎగవేత కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని, రుణం చెల్లించాలని కోర్టు మూడు సార్లు సమన్లు ఇచ్చినా సుజనా చౌదరి పట్టించుకోకపోవటంతో నాంపల్లి కోర్టు గురువారం సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.