సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్‌బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్‌లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!)
భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్‌లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్‌డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్‌డేట్ తర్వాత ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు)
ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్‌బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
(ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు)
Comments
Please login to add a commentAdd a comment