kyc documents
-
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
అరెరె.. ఆరు కంగారే!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తులు సిటీజనులను కంగారు పెట్టిస్తున్నాయి. ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చేందుకు మిగిలింది మూడు రోజుల గడువే ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రజాపాలన కేంద్రాలతో పాటు మీ సేవ, ఆధార్ కేంద్రాలకు జనాలు క్యూ కడుతున్నారు. ఆరు గ్యారంటీల వర్తింపునకు రేషన్ కార్డుతోపాటు ఆధార్ కీలకం. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు కావడం, ఆ తర్వాత వాటిని అప్డేట్ చేయకపోవడంతో మార్పులు, చేర్పులు అత్యవసరమయ్యాయి. మరోవైపు రేషన్ కార్డు కోసం బీపీఎల్ గుర్తింపునకు వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అయింది. ఫలితంగా మీ సేవ కేంద్రాలకు తాకిడి పెరిగింది. ప్రజాపాలన కేంద్రాల దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద కంటే ఆధార్, మీ సేవ కేంద్రాలకు జనం రద్దీ పెరిగింది. అన్నింటికీ కీలకం.. ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి నెలా రూ. 2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల వర్తింపునకు దరఖాస్తులో కచి్చతంగా ఆధార్ కార్డు నంబరు కీలకమైంది. నగరంలో అద్దె ఇళ్లలో ఉండే వారితో పాటు వలస వచ్చినవారు ఆధార్‌లో ప్రస్తుత (కొత్త) చిరునామాలు అప్డేట్ చేసుకోలేదు. ఇప్పటికీ చాలామంది ఆధార్ కార్డులపై పాత అడ్రస్‌లు ఉన్నాయి. కొత్త అడ్రస్‌ల మారి్పడి ఆరు గ్యారంటీల పథకాల వర్తింపు అడ్డంకి కాకపోయినా క్షేత్ర స్థాయి పరిశీలనలో కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చేర్పులు మార్పులు చేసుకునేందుకు జనం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చి ఏళ్లు గడిచినా, అడ్రస్ మార్చుకోకపోవడం ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో ఆధార్‌లో అడ్రస్ మార్చుకొని ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధార్ సెంటర్ల వద్ద కొత్త దంపతులే అధికంగా కనిపిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలకు సైతం.. రేషన్ కార్డుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో మీ సేవ కేంద్రాలకు రద్దీ పెరిగింది. మరోవైపు ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త పథకాలకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుందనే భావనతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే మహానగర పరిధిలో ప్రజాపాలన కౌంటర్లకు సుమారు మూడు లక్షల వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచి్చనట్లు సమాచారం. ఈ కేవైసీ కోసం.. ఆరు గ్యారంటీల్లోని గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఈ కేవైసీ అప్డేట్ తప్పనిసరి అని ప్రచారం కావడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. రూ.500కే సిలిండర్ పథకానికి, ఈ కేవైసీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ఏజెన్సీల వద్ద క్యూ తగ్గడం లేదు. ఈ కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధి చేకూరదేమోననే ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. గత పదిహేను రోజులుగా రద్దీ కొనసాగుతోంది. మరోవైపు కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఈ కేవైసీ పూర్తి చేసి కొంత నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఇప్పటికే మహానగర పరిధిలోని 78 శాతం లబి్ధదారులు బయోమెట్రిక్ ద్వారా కేవైసీని పునరుద్ధరించుకున్నారు. అవే కావాలి! సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన సభలకు దరఖాస్తుదారులు బారులు తీరుతున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి కోసం గ్రేటర్ శివార్ల నుంచి విరివిగా అర్జీలు వస్తున్నాయి. నగరానికి సంబంధించిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కోసం అందుతున్నాయి. అలాగే రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పంచకున్నా.. చాలా మంది ఆశావహులు తరలివస్తున్నారు. దీంతో ప్రజాపాలన సభల్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. చాలా మంది రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంతో పాటు జిరాక్స్ సెంటర్లలో లభించే దరఖాస్తు పత్రాలతో అర్జీలు పెట్టుకుంటున్నారు. నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బుధవారం నాటికి మొత్తం 5,37,788 దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్పారు. -
ఎస్బీఎం కస్టమర్లకు అలర్ట్: ఆ క్రెడిట్ కార్డులపై బ్యాన్
సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!) భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్డేట్ తర్వాత ఎస్బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు) ఎస్బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
పేటీఎం అప్డేట్.. డబ్బులు హాంఫట్!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రూటుమార్చారు. ఇన్నాళ్లూ మీ బ్యాంక్ ఏటీఎం, క్రెడిట్ కార్డులు అప్డేట్ చేస్తామంటూ కాసులు కొల్లగొట్టిన క్రిమినల్స్.. ఇప్పుడూ సామాన్యుల అరచేతిలో పైసలు చెల్లింపు వేదికగా మారిన పేటీఎం నుంచి నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్డేట్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్ఫోన్లకు కాల్ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. రూపాయి బదిలీ చేయమంటారు.. సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్డేట్ చేసే సమయంలో యాప్‌లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకొమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇవి చేయకండి.. ‘పేటీఎం అకౌంట్లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్‌కాల్ చేసి కేవైసీ వివరాలు అప్డేట్ చేయమని అడగరు. ఎస్ఎంఎస్లు కూడా పంపరు. అకౌంట్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్లను అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్లోడ్ చేయించిన అప్లికేషన్ల ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యక్ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాల’ని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. కేసులిలా.. ♦ గత నెల 23న కూకట్పల్లి వాసి రవిశంకర్ సెల్‌ఫోన్‌కు మీ పేటీఎం కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఓ అపరిచిత ఫోన్ నంబర్ నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది. వెంటనే రవిశంకర్ సదరు నంబర్‌కు ఫోన్‌కాల్ చేశారు. ఆయన అకౌంట్‌ను అప్డేట్ చేసేందుకు పేటీఎం వివరాలు కావాలనడంతో పాటు ఏనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.100లు నామినీ డబ్బుగా పంపితే అప్డేట్ అవుతుందని నమ్మించాడు. ఇది నమ్మిన రవిశంకర్ ఆ యాప్ డౌన్లోడ్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారు. పేటీఎం నుంచి దశలవారీగా రూ.62,345లు డెబిట్ అయ్యాయని సెల్‌కు ఎస్ఎంఎస్లు వచ్చాయి. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ జనవరి 23న సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వాసి ఫక్రుద్దీన్ మహమ్మద్‌కు కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలంటూ పేటీఎం ప్రతినిధిగా ఫోన్‌కాల్ వచ్చింది. మీ పేటీఎం అప్డేషన్ కోసం క్విక్ సపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ చేయమనడంతో చేశాడు. ఆ వెంటనే దశలవారీగా రూ.78.399 పేటీఎం నుంచి డెబిట్ అయినట్టుగా ఎస్ఎంఎస్లు వచ్చాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వారికి షాకే : ఆధార్ సంస్థ కొత్త నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రయివేటు వ్యాపార సంస్థలకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది. అంతేకాదు ప్రతి లావాదేవీ ఆధార్ అధెంటిఫికేషన్ కోసం 50 పైసలు చెల్లించాల్సిన అవసరం ఉందని గురువారం తెలిపింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ .20 (పన్నులతో సహా) ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) యుఐడిఎఐ నోటిఫికేషన్ తెలిపింది. ఆధార్ (ఆధార్ ఆథరైజేషన్ సర్వీసెస్) రెగ్యులేషన్స్ 2019 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు మినహాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అలాగే నోటిఫికేషన్ ప్రకారం,సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది 15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతోపాటు, ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. -
బుట్టలో పడతారు... జాగ్రత్త..!
ఇపుడు నడుస్తున్నది అతి తెలివైన వాళ్ల ప్రపంచం. ఎదుటి వాళ్లను బురిడీ కొట్టించడానికి కొత్తకొత్త ఎత్తులతో ముందుకొస్తున్న వాళ్ల ప్రపంచం. అమాయకంగా ఉంటే బుక్కయిపోవటం ఖాయం. అయితే... ‘నేను చాలా ఇంటలిజెంట్. ఎవరి ఆటలూ నా దగ్గర సాగవు’ అన్న అతి ధీమా కూడా పనికిరాదు. తెలివిగా ఉండటంతో పాటు... ప్రతిక్షణం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం అవసరం. లేకుంటే మనకు తెలియకుండానే మోసగాళ్లు మనల్ని బుక్ చేసేస్తారు. నేరంలో పాత్రధారులను చేస్తారు. మన పేరిట నిధులు కొల్లగొడతారు. ఇలా మోసపోయిన పలువురి వ్యవహారాలు అధ్యయనం చేసిన అనంతరం వాటిని ‘సాక్షి’కి వెల్లడించారు కోటక్ ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న గణేష్ అయ్యర్. ఇతరులు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఆ కేస్ స్టడీల వివరాలు చెబుతూ... తగిన జాగ్రత్తలు కూడా సూచించారాయన. అదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... కేవైసీ పత్రాలతో అజాగ్రత్త పనికిరాదు.. ≈ ఎవరికిస్తున్నామో వాటిపై రాయటం అవసరం ≈ ఎందుకిస్తున్నామో కూడా రాసి సంతకం చేయాలి ≈ అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరాల్లో ఇరుక్కోవచ్చు ≈ ‘సాక్షి’తో కోటక్ లైఫ్ అధికారి గణేష్ అయ్యర్ నేరం చేయకపోయినా ఇరుక్కున్నాడు.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం రాజేష్ దరఖాస్తు చేసుకున్నాడు. నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలుగా తన డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు కాపీలను రిప్రజెంటేటివ్‌కు అందించాడు. అలాగే కొన్ని పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా ఇచ్చాడు. సాధారణంగా ఎక్కువ మంది ఇదే విధంగా చేస్తుం టారు. కానీ, అవగాహనలేమి కారణంగా రాజీవ్ ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు. ఆ నక్కజిత్తుల రిప్రజెంటేటివ్ ఏం చేశాడంటే... ఒక ఫొటో కాపీని కంపెనీకి పంపించి మిగిఫొటో కాపీల ఆధారంగా ఓ సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ కార్డును సంఘ వ్యతిరేక చర్యలకు వినియోగించాడు. దర్యాప్తులో భాగంగా ఆ విషయాలను గుర్తించిన పోలీసులు... ఓ రోజు ఉన్నట్టుండి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు. సొమ్మొకడిది.. సోకొకడిది మహమ్మద్ ఖాన్ వీసా కోసం ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్ బిల్లు, పాన్ కార్డు కాపీలను ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఖాన్‌కు డబ్బులతో పని పడింది. రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, రుణం ఇవ్వలేమంటూ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. ఎందుకని ప్రశ్నిస్తే... ‘తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విఫలమయ్యారు’ అని బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అసలు తాను రూపాయి కూడా రుణమే తీసుకోనప్పుడు చెల్లించలేదన్న సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నించాడు ఖాన్. అదంతా తమకు తెలియదని, సిబిల్ రికార్డుల్లో అలాగే ఉందని బ్యాంకు చెప్పటంతో నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే... వీసా కోసం ఇచ్చిన కాపీలు దుర్వినియోగమయ్యాయి. ఖాన్ పేరుతో వేరొకరు క్రెడిట్ కార్డు తీసుకుని లిమిట్ మేరకు అంతా డ్రా చేసుకున్నారు. ఆ భారం ఇప్పుడు ఖాన్‌పై పడింది. ఊహకైనా అందుతుందా..? రణవీర్‌సింగ్ ఓ రోజు డీమ్యాట్ ఖాతా తెరవటానికని ఏజెంటుకు పాన్ కార్డు, విద్యుత్ బిల్లుల కాపీలను ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత రణవీర్‌సింగ్ ఇంటికి ఓ బ్యాంకు నుంచి కలెక్షన్ ఏజెంట్లు వచ్చారు. ‘రుణం తీరుస్తావా, లేదా?’ అంటూ ప్రశ్నించేసరికి అతడు తెల్లబోయాడు. ‘ఎవరని పొరబడుతున్నారు...? నా పేరు రణవీర్‌సింగ్’ అని చెప్పాడు. అవును... రణవీర్‌సింగ్ దగ్గరకే వచ్చాము. ఓ రుణాన్ని మరొకరితో కలసి (కో బారోవర్) తీసుకున్నారుగా? అంటూ ఏజెంట్లు చెప్పడంతో అతడిలో కంగారు మొదలైంది. వారి దగ్గరున్న పత్రాలను చూసి బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. నిజానికి అతడు ఎలాంటి రుణం తీసుకోలేదు. ఏజెంటుకు ఇచ్చిన పత్రాలను మోసగాళ్లు వాడేసుకున్నారు. రణవీర్‌సింగ్‌ను సహ దరఖాస్తుదారుడిగా పేర్కొంటూ బ్యాంకు నుంచి రుణం కాజేశారు. ట్రావెల్ టికెట్ కొంటే... ఐటీ నోటీసొచ్చింది! గౌరవ్‌షా ఓ రోజు ట్రావెల్ టికెట్ కోసం పాన్ కార్డు కాపీనిచ్చాడు. అందులో షా పాన్ నంబరుతో పాటు అతని పూర్తి వివరాలున్నాయి. అదే మోసగాళ్లకు వరమైంది. ఓ ఏడాదిన్నర తర్వాత ఆదాయపన్ను (ఐటీ) శాఖ నుంచి అతడికి నోటీసు వచ్చింది. ‘మీ ఆదాయం, ఆస్తుల వివరాలను పూర్తిగా అందజేయండి’ అన్నది అందులోని సారాంశం. ఎందుకయ్యా...? అంటే గౌరవ్‌షా పాన్ కార్డు కాపీని ఉపయోగించి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వేరొకరు నగదు రూపంలో కొనుగోలు చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు గౌరవ్ పాన్ కార్డు కాపీని వాడుకున్నారు. ‘నేను కాదు బాబోయ్’ అని గౌరవ్ మొరపెట్టుకున్నా... నగదు రూపంలో జరిగిన కొనుగోళ్లలో అసలు వ్యక్తిని కనిపెట్టడం కష్టమని తేల్చేశారు. చివరకు గౌరవ్ బాధితుడిగా మిగిలిపోయాడు. ఇలా కూడా జరుగుతుందా! రవి ఓ చిన్న కూరగాయల విక్రేత. కొన్నాళ్ల కిందట అతడు ఏదో పని నిమిత్తం రిప్రజెంటేటివ్‌కు ఆధార్ కార్డు కాపీని అందజేశాడు. దురదృష్టవశాత్తూ 11 నెలల తర్వాత ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో వెల్లడైన విషయాలతో పోలీసులే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. రవి షిండే ఇచ్చిన ఆధార్ కాపీతో అతడి పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 లక్షల జీవిత బీమా పాలసీ చొప్పున మొత్తం 14 కంపెనీల నుంచి రూ.1.40 కోట్ల మేర బీమా కవరేజీ తీసుకున్నారు. నామినీగా రవి భార్యను పేర్కొని ఆమె ఓటర్ ఐడీని ఫోర్జరీ చేసి వాడుకున్నారు. రూ.1.40 కోట్ల బీమాను కొట్టేయడానికి పథకం ప్రకారం రవిని ట్రక్‌తో ఢీకొట్టి చంపేశారు. తెలియకుండానే బాధితులయ్యారు..! పైన చెప్పిన వాళ్లెవరికీ తాము ఒక నేరంలో భాగస్వాములమవుతున్నామని తెలీదు. అంతా అవసరం కోసం ధ్రువపత్రాలను సమర్పించిన వారే. తెలియకుండా ఇరుక్కున్న వారే. వీటిని వినియోగించే విషయంలో కొంచెం అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించి ఉంటే కొందరైనా తప్పించుకుని ఉండేవారు. మరి ఈ మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సూచనలివిగో... * అవసరం లేకుండా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు, బ్యాంకు స్టేట్మెంట్ వంటి కేవైసీ పత్రాలను ఎవరికీ ఇవ్వకూడదు. * తగిన అవసరం కోసం నిబంధనల మేరకు ఇవ్వాల్సి వస్తే... ఒరిజినల్స్ కాకుండా జిరాక్స్ కాపీ మాత్రమే ఇవ్వాలి. ఆ జిరాక్స్ కాపీపై ఎవరికిస్తున్నామో? ఎందుకిస్తున్నామో? సదరు ధ్రువపత్రంపై రాయాలి. * ఇది ఈ ఒక్కసారి వినియోగానికి ఉద్దేశించినది మాత్రమే... అని సదరు జిరాక్స్ కాపీలపై స్పష్టంగా రాయాలి. ఎలా అంటే... ఉదాహరణకు బీమా పాలసీ కోసం కంపెనీకి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారనుకోండి. జిరాక్స్ కాపీపై ‘ఈ కాపీని బీమా కోసం గాను ఏబీసీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాను. ఇది ఈ ఒక్కసారి వినియోగానికి మాత్రమే’ అని రాయాలి. అక్కడే సంతకం కూడా చేయాలి. * మీకు సంబంధం లేకపోయినా ఏదో ఒక విషయమై తరచుగా కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరు పంపిస్తున్నారు..? ఎందుకు..? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ పత్రాలను ఆధారంగా చేసుకుని వేరెవరైనా లావాదేవీలు నిర్వహించి ఉండవచ్చు. * పాన్ నంబర్, క్రెడిట్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, బీమా పాలసీ నంబర్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దు. ఈ వివరాలు కోరుతూ వచ్చే మెయిల్స్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను నమ్మవద్దు. * మీ బీమా పాలసీపై ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామంటూ వేసే వలలో చిక్కుకోవద్దు. ఈ విధమైన సమాచారంతో వచ్చే కాల్స్, మెయిల్స్, ఎస్ఎంఎస్లను పట్టించుకోవద్దు. - గణేష్ అయ్యర్