సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రయివేటు వ్యాపార సంస్థలకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది. అంతేకాదు ప్రతి లావాదేవీ ఆధార్ అధెంటిఫికేషన్ కోసం 50 పైసలు చెల్లించాల్సిన అవసరం ఉందని గురువారం తెలిపింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ .20 (పన్నులతో సహా) ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) యుఐడిఎఐ నోటిఫికేషన్ తెలిపింది. ఆధార్ (ఆధార్ ఆథరైజేషన్ సర్వీసెస్) రెగ్యులేషన్స్ 2019 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు మినహాయింపు ఇచ్చినట్టు తెలిపింది. అలాగే నోటిఫికేషన్ ప్రకారం,సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది 15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతోపాటు, ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment