State Bank
-
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఎస్బీఐ లాభం అప్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది. -
ఎస్బీఎం కస్టమర్లకు అలర్ట్: ఆ క్రెడిట్ కార్డులపై బ్యాన్
సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!) భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్డేట్ తర్వాత ఎస్బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు) ఎస్బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
బాండ్ల జారీపై ఎస్బీఐ కన్ను
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీకి సిద్ధపడుతోంది. టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు బ్యాంకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. అదనపు టైర్–1(ఏటీ–1) బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందవలసి ఉన్నట్లు తెలియజేసింది. బాసెల్–3 నిబంధనలకు అనుగుణమైన రుణ సెక్యూరిటీల జారీ ద్వారా 2024వరకూ నిధుల సమీకరణపై సెంట్రల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఎస్బీఐ వివరించింది. నిధులను లోన్ బుక్ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. అధిక విలువగల గృహ రుణాలు మినహా వ్యక్తిగత బ్యాంకింగ్ అడ్వాన్సులు రూ. 5 లక్షల కోట్లను దాటినట్లు గత వారమే ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. చివరి రూ. లక్ష కోట్ల రుణాల మంజూరీకి ఏడాది కాలంపట్టగా.. అంతకుముందు 15 నెలల్లో ఈ ఫీట్ సాధించినట్లు తెలియజేసింది. దీనికంటే ముందు రూ. లక్ష కోట్ల రుణ విడుదలకు 30 నెలలు పట్టడం గమనార్హం! ఈ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 625 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 627 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది! -
కేఎస్కే మహానది ఖాతా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) మొండిబకాయి(ఎన్పీఏ)గా మారిన కేఎస్కే మహానది పవర్ కంపెనీ రుణ ఖాతాను విక్రయించింది. ఆదిత్య బిర్లా ఏఆర్సీకి రూ. 1,622 కోట్లకు ఖాతాను బదిలీ చేసింది. ఈ(2022) ఏప్రిల్‌కల్లా కేఎస్కే మహానది చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 3,815 కోట్లుకాగా.. 58 శాతం కోత(హెయిర్‌కట్)తో ఖాతాను ఏఆర్సీకి ఎస్బీఐ విక్రయించింది. కేఎస్కే మహానది పవర్ ఎన్పీఏ ఖాతాను ఎస్బీఐ నగదు ప్రాతిపదికగా ఈవేలం నిర్వహించింది. ఇందుకు రూ. 1,544 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. కాగా.. మొత్తం 15 ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ లభించినప్పటికీ ఏబీ ఏఆర్సీ నుంచి రూ. 1,544 కోట్లకు ఒకే బిడ్ దాఖలుకావడం గమనార్హం! స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టిన వేలం విధానంలో పోటీ బిడ్స్ దాఖలుకానప్పటికీ తదుపరి చర్చలతో బిడ్‌ను రూ. 1,622 కోట్లకు ఏబీ ఏఆర్సీ సవరించింది. ఇందుకు తగిన అనుమతులు పొందాక ఈ నెల 12న ఎస్బీఐ విక్రయాన్ని పూర్తి చేసింది. 2009లో ఏర్పాటైన కేఎస్కే మహానది పవర్ రెండేళ్లుగా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
పేద మహిళల పెన్నిధి ‘స్త్రీ నిధి’
ఏజీ వర్సిటీ: ‘దేశానికి స్త్రీ నిధి సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. ఇది లక్షలాది మంది పేద మహిళల పెన్నిధి’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో స్టేట్ బ్యాంకు తర్వాత అత్యధిక రుణాలిచ్చింది ఈ సంస్థేనని చెప్పారు. పదేళ్ల కిందట రూ.32 కోట్లతో మొదలై ఈ రోజు రూ.5,300 కోట్లకు చేరిందని, ఇది తెలంగాణలోని మహిళల ఘనతని అన్నారు. స్త్రీ నిధి ద్వారా ఇప్పటివరకు 3.97 లక్షల మహిళా సంఘాల్లోని 26.92 లక్షల మంది సభ్యులకు రూ.14,339 కోట్ల రుణాలిచ్చారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లు రుణాలుగా అందించారని చెప్పారు. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో ‘స్త్రీ నిధి’9వ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ‘గతంలో మహిళలకు డబ్బులు అవసరమైతే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇçప్పుడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఇందులో స్త్రీనిధి, సీఎం కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది’అని ఎర్రబెల్లి అన్నారు. రుణాలివ్వడానికి బ్యాంకులు షూరిటీలు అడుగుతాయని, స్త్రీ నిధి వచ్చాక డ్వాక్రా సంఘాల మహిళలకు షూరిటీ లేకుండా అప్పులిస్తున్నారని చెప్పారు. అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తామని, స్త్రీనిధి కమిటీ కాలపరిమితిని రెండేళ్లకు పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి స్త్రీ నిధి సంస్థకు ప్రత్యేక భవనాన్ని నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. -
ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే
కొవ్వూరు: ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే అప్పుల ఊబిలో ముంచేసిన వ్యవహారం.. ఇందుకు పలువురు బ్యాంకు అధికారుల సహకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన ఘటన ఇది. ఈ బాగోతంలో రూ.15 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందులో పాత్రధారులుగా అనుమానిస్తున్న ముగ్గురు బ్యాంకు మేనేజర్లు, ఒక ఫీల్డ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాధితుడు గద్దె జయరామకృష్ణ గత డిసెంబర్ 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఇది వెలుగుచూసింది. ఈయన చెప్పిన వివరాల ప్రకారం.. కథ ఇలా మొదలైంది.. 2018లో జయరామకృష్ణ ఢిల్లీలోని తన కుమార్తె వద్దకు వెళ్లే సమయంలో తన వద్దనున్న బంగారు ఆభరణాలు, పలు దస్తావేజులను బ్యాంకు లాకర్లో పెట్టాలని భావించారు. కానీ, స్నేహితుడైన కవల వెంకటనరసింహంతో ఈ విషయమై చర్చించగా ఆయనిచ్చిన భరోసాతో వాటిని వెంకటనరసింహం దగ్గరే భద్రపరిచారు. పదిరోజుల్లో తిరిగొచ్చాక నిందితుడు ఆభరణాలు తిరిగి ఇచ్చేయగా దస్తావేజులను మాత్రం లాకర్లో ఉన్నాయంటూ కాలయాపన చేశారు. ఈలోగా 2018 చివరి నుంచి 2019 వరకు పలుమార్లు ఎస్బీఐకి చెందిన వివిధ బ్రాంచ్‌ల నుంచి జయరామకృష్ణ ప్రమేయం లేకుండా ఆయన దస్తావేజులు పెట్టి ఆయన పేర్లతోను, వివిధ వ్యక్తుల పేరుతోను వెంకటనరసింహం రుణాలు తీసుకున్నారు. కొన్ని రుణాలను జయరామకృష్ణ, ఆయన భార్య శ్రావణిని గ్యారంటీగా పెట్టి కూడా తీసుకున్నారు. మరికొన్ని వారి సంతకాలు ఫోర్జరీచేసి రుణాలు తీసుకున్నారు. ఇదే విధంగా కొవ్వూరు సమీపంలోని ప్రక్కిలంక ఎస్బీఐ శాఖలోనూ రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఆస్తుల విలువను మార్కెట్ ధర కంటే ఎక్కువగా చూపించి రుణాలు పొందారు. ఇలా మొత్తం మీద రూ.15కోట్లకు పైగా పక్కదారి మళ్లించినట్లు సమాచారం. చివరికి ఈ రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. వారు రాజమండ్రిలోని బాధితుడి ఫ్లాటుని సీజ్ చేసి స్థలాల వద్ద నోటీసులు పెట్టారు. కానీ, వెంకటనరసింహానికి, తమకు ఏ వ్యాపార లావాదేవీలు లేవని.. కేవలం స్నేహంతో నమ్మకం మీద దస్తావేజులు ఆయనకిస్తే ఇలా మోసం చేశారని జయరామకృష్ణ అన్నారు. ఈ రుణాలకు, తమకు ఏ విధమైన సంబంధంలేదని ఆయన చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు కొవ్వూరు పట్టణ పోలీసులు 564/2021 అండర్ సెక్షన్–406, 419, 420, 465 ఐపీసీ కింద వెంకటనరసింహంపై కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కవల వెంకటనరసింహం అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు స్వయానా అల్లుడు. కానీ.. ఈ కేసుకు, తన తండ్రి సోము వీర్రాజుకు ఎలాంటి సంబంధంలేదని ఆయన పెద్ద కుమార్తె సూర్యకుమారి స్పష్టంచేశారు. రాజకీయ దురుద్దేశంతో తన తండ్రి పేరును ఈ కేసులో ప్రస్తావిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల నుంచి డాక్యుమెంట్లతో కూడిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ చెప్పారు. అప్పట్లో పనిచేసిన బ్యాంకు అధికారులకు నోటీసులు పంపి విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3.60 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే మొత్తం రుణాల మొత్తం తెలుస్తుందన్నారు. -
స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?
బెంగళూరు: బంగారు ఆభరణాలపై రుణాలందించే స్టార్టప్ రుపీక్ ను చెంతకు చేర్చుకోవాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎస్బీఐ యాప్ లో రుపీక్ కు చోటు కల్పించాలని చూస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా 2015లో ప్రారంభమైన గోల్డ్ లోన్స్ స్టార్టప్ రుపీక్.. కస్టమర్ల ఇంటి వద్ద రుణ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 350- 375 కోట్లవరకూ రుణాలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇవి రూ. 20 కోట్లేకాగా.. ఇప్పటికే కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంక్ లతో జత కట్టింది. ఇటీవల కాథోలిక్ సిరియన్, యాక్సిస్ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోన్స్ కు డిమాండ్ కోవిడ్ -19 నేపథ్యంలో కొద్ది రోజులుగా గోల్డ్ లోన్స్ కు డిమాండ్ పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కావడంతో ఎస్బీఐ నుంచి గోల్డ్ లోన్స్ కు మరింత డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశాయి. నిజానికి బ్యాంకుకున్న నెట్వర్క్ సామర్థ్యం రీత్యా రోజుకి రూ. 150 కోట్లవరకూ రుణాలు విడుదల చేయవచ్చని చెబుతున్నాయి. అయితే డిమాండుకు అనుగుణంగా ప్రస్తుతం సర్వీసులను అందించలేకపోతున్నట్లు వివరించాయి. దీంతో గోల్డ్ లోన్ మార్కెట్లో 30 శాతం వాటాకు బదులు 15 శాతాన్నే కైవసం చేసుకున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే రుపీక్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేశాయి. రూ. 1200 కోట్లు రుపీక్ తో స్టేట్ బ్యాంక్ జట్టు కడితే.. 2021 మార్చికల్లా రూ. 1,200 కోట్లమేర గోల్డ్ లోన్స్ ను పంపిణీ చేసే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల కారణంగా ఎన్బీఎఫ్సీ తదితర ఫిన్ టెక్ సంస్థలు మార్కెట్లో విస్తరించేందుకు వీలు చిక్కడంలేదని ఫైనాన్షియల్ నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గోల్డ్ లోన్స్.. భద్రత కలిగినవి కావడంతో డిఫాల్ట్ సమస్యలు తక్కువేనని చెబుతున్నారు. -
ఎస్బీఐ నికర లాభం జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నికర లాభం 52 శాతం ఎగసింది. రూ. 4,574 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14.6 శాతం వృద్ధితో రూ. 28,182 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 75,342 కోట్లకు చేరింది. జీవిత బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. పన్నుకుముందు లాభం 25 శాతం పుంజుకుని రూ. 6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ. 10,118 కోట్లకు చేరాయి. ఎన్పీఏలు ఓకే క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.44 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 1.59 శాతానికి క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206 వద్ద గరిష్టాన్ని తాకగా.. 201 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. -
ఎస్బీఐ నికర లాభం.. రికార్డ్
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 3581 కోట్ల నికర లాభం ఆర్జించింది. తద్వారా స్టాండెలోన్ ప్రాతిపదికన ఒక క్వార్టర్లో బ్యాంక్ అత్యధిక లాభాలు ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో సాధించిన రూ. 838 కోట్లతో పోలిస్తే ఇది 327 శాతం వృద్ధి. తాజా త్రైమాసికంలో రూ. 2731 కోట్లమేర లభించిన వన్‌టైమ్ లాభం బ్యాంకుకు అండగా నిలిచింది. ఐపీవో ద్వారా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్‌లో ఎస్బీఐ వాటాను విక్రయించడం ద్వారా ఈ నిధులు సమకూరాయి. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ.6910 కోట్లను తాకింది. ఇక క్యూ4లో రూ. 13,495 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,954 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు 6.94 శాతం నుంచి 6.15 శాతానికి నీరసించగా.. నికర ఎన్పీఏలు 2.23 శాతానికి చేరాయి. షేరు జూమ్ ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ షేరు 8 శాతం జంప్‌చేసింది. రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 190 వరకూ ఎగసింది. క్యూ4లో మారటోరియానికి 21.8 శాతం మంది కస్టమర్లు మొగ్గుచూపినట్లు ఎస్బీఐ వెల్లడించింది. కాలావధి రుణాల కస్టమర్లలో 23 శాతం మంది ఇందుకు ఆసక్తి చూపినట్లు తెలియజేసింది. పూర్తిఏడాది(2019-20)కి నికర వడ్డీ మార్జిన్లు 2.95 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 13.06 శాతానికి చేరింది. క్యూ4లో కార్పొరేట్ స్లిప్పేజెస్ రూ. 1561 కోట్లకు చేరగా.. అగ్రి విభాగంలో రూ. 5238 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. -
ట్రాలీ ఆటోలో రూ.40కోట్లు
నల్లగొండ క్రైం: స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఓపెన్ ట్రాలీ ఆటోలో రూ.40 కోట్లను తరలించడానికి సిద్ధపడగా, పోలీసులు అడ్డుకున్నారు. ఘటన గురువారం నల్లగొండలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి ట్రాలీలో రూ.40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు సర్దారు. నోట్లు బయటకు కనిపించకుండా కనీస ఏర్పాట్లు కూడా చేపట్టలేదు. దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు వద్దకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని, సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. అనంతరం పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. కాగా, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే డబ్బు తరలింపు చర్యలు చేపట్టామని బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. -
కొలిక్కిరాని క్యాషియర్ వ్యవహారం
పోరుమామిళ్ల :పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్‌లో బుధవారం కోటిరూపాయలకు పైగా డబ్బు, నగలు తీసుకుని పరారయిన మార్తాల గురుమోహన్‌రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గురువారం బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి చెప్పిన రూ. 91.49 లక్షల నగదు, 24 మంది ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు మాత్రమేనా? ఇంకా అధికంగా పోయిందా? అన్న విషయం స్పష్టం కాలేదు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా బ్యాంకుకు సెలవు అయినా సిబ్బంది రికారŠుడ్స, లాకర్లు, ఇతర అంశాల పరిశీలన చేస్తున్నారు. రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడప నుంచి వచ్చిన సిబ్బంది బ్యాంకులో తనిఖీలు చేపట్టారు. ఖాతాదారుల ఆందోళన బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాము పెట్టిన డబ్బుకు, బంగారుకు భద్రత లేకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయనాయకులు రుణాల రూపంలో కోట్లు తీసుకుని ఎగవేత ద్వారా బ్యాంకులను ముంచుతుండగా, ఇప్పుడు ఏకంగా బ్యాంకు సిబ్బందే దోచుకోవడం అందరినీ కలవరపెడుతోందని ఖాతాదారులు వాపోయారు. ఇద్దరు మైనారిటీ మహిళలు తమ బంగారు ఉందా? లేదా? అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. పోయిన డబ్బు బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెల్లించినా, తమ ఆభరణాల విషయంలో ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఒకరిద్దరు ఖాతాదారులు తమకు ఇచ్చిన రశీదులో బ్యాంక్ సీల్ ఉందని, క్యాషియర్ సంతకం చేయలేదని తెలిపారు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే గురుమోహన్‌రెడ్డి సంతకం చేయలేదని భావిస్తున్నామన్నారు. ఎవ్వరికీ నష్టం జరగదు,భయం వద్దు: ఆర్ఎం బ్యాంకులో క్యాషియర్ చేసిన నిర్వాహకంపై విచారణ జరుగుతోందని, అతను ఎక్కడికీ తప్పించుకుపోలేడని ఆర్ఎం శ్రీనివాసులు చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టం బ్యాంకుకేగానీ, ఖాతాదారులకు జరగదన్నారు. అందరి డబ్బుకు, బంగారుకు బ్యాంకు జవాబుదారీగా ఉంటుందన్నారు. -
ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని..
కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన బాచం వెంకటశివారెడ్డి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయాడు. ఇతను ఈనెల 19న కొలిమిగుండ్ల స్టేట్ బ్యాంక్‌లో డీడీ తీసేందుకువచ్చాడు. ఈక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని శివారెడ్డి సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సూచించాడు. కార్డు బాగానే ఉందని చెప్పినా వరుసగా ఫోన్ చేస్తూ వచ్చాడు. చివరకు బెలుంకు వెళ్లాక మరోసారి ఫోన్ వచ్చింది. దీంతో నిజమే అనుకొని ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఆతర్వాత ఓటీపీ నంబర్ కూడా చెప్పాడు. దీంతో శివారెడ్డి అకౌంట్ నుంచి రెండు విడతల్లో రూ.15,500 డ్రా అయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం బ్యాంకు అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రుణాల పేరుతో ఘరానా మోసం
‘మీరు రూ.5 వేలు కడితే చాలు లక్ష రూపాయల దాకా బ్యాంకులో రుణం ఇప్పిస్తా. మళ్లీ కట్టాల్సిన పనిలేదు. రుణమాఫీ చేయిస్తా’ అని నమ్మబలుకుతూ వృద్ధులు, వితంతువులను నిలువునా మోసం చేసిన ఘరానా మోసగాడి ఉదంతం వెలుగుచూసింది. ఎంతో ఆశతో ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చిన మహిళలు కనీసం చార్జీలకు డబ్బులు లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. అనంతపురం సెంట్రల్: ఉరవకొండ పట్టణానికి చెందిన 14 మంది వృద్ధులు, వితంతువులు ఓ ఘరానా మోసగాని చేతిలో తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్కరు రూ. 5 వేలు కడితే రూ. 50 వేలు నుంచి రూ. లక్ష వరకూ స్టేట్ బ్యాంకులో రుణం మంజూరు చేయిస్తానని వెంకటరమణ అనే వ్యక్తి నమ్మబలికాడు. అదీ వృద్ధులు, వితంతువులకు మాత్రమే బ్యాంకులో రుణం మంజూరు చేస్తారని తెలిపాడు. దీంతో పట్టణంలో వివిధ కాలనీలకు చెందిన మొత్తం 14 మందిని గుంపు చేశాడు. అంకెల గారడీ.. అందరికీ బ్యాంకులో విత్‌డ్రా ఫాంలలో ఒక్కొక్కరికీ రూ. 50వేలు నుంచి రూ. లక్ష మంజూరు చేయిస్తున్నట్లు అంకెలు రాశాడు. రెండు రోజుల క్రితం అందరి ఇళ్ల వద్దకు పోయి ఈ నెల 31వ తేదీన అనంతపురానికి వెళితే డబ్బులు డ్రా చేసుకోవచ్చునని తెలిపాడు. అదేరోజు ఒక్కొక్కరు రూ. 5 వేలు తీసుకురావాలని చెప్పాడు. నమ్మితే నట్టేట ముంచాడు.. లక్ష రూపాయల వరకూ రుణం వస్తుండడంతో మహిళలంతా ఎంతో ఆశతో బుధవారం అనంతపురం వచ్చారు. టవర్‌క్లాక్ వద్ద దిగి అతని సెల్ నంబర్‌కు 9542948475 ఫోన్ చేశారు. వెంటనే ద్విచక్రవాహనంలో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. సాయినగర్ స్టేట్ బ్యాంకు వద్దకు ఆటోలో రండి.. తాను అక్కడికి వస్తానని నమ్మబలికాడు. ఆటో ముందుకు వెళ్లిన వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బ్యాంకు వద్దకు వెళ్లిన బాధిత మహిళలు అతని కోసం కొన్ని గంటల పాటు ఎదురుచూశాడు. సెల్‌కు ఫోన్ చేస్తే పనిచేయలేదు. కేసు నమోదుకు ససేమిరా.. మోసపోయామని గ్రహించిన బాధిత మహిళలు వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ఓ వ్యక్తి అన్యాయం చేశాడని మొరపెట్టుకున్నారు. పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. చివరకు బాధితులు నిరాశతో వెనుదిరిగారు. చలించిన హృదయం నడిరోడ్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళల సమస్యను విన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు చంద్రశేఖర్‌రెడ్డి బాధిత మహిళలను ఉరవకొండ వరకూ ఉచితంగా తీసుకెళతానని ముందుకు వచ్చాడు. కనీసం ఆ మాత్రం కూడా పోలీసులు చేయకపోవడంపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కనికరం చూపలేదు వెంకటరమణ అనే వ్యక్తి మోసం చేశాడని అన్ని పోలీస్స్టేషన్లకూ వెళ్లాం. అయితే ఎవరూ మా సమస్య వినేందుకు కూడా ఇష్టం చూపలేదు. కేసు నమోదు చేయలేదు. సీసీ కెమెరాల్లో చూస్తే నిందితున్ని పట్టుకోవచ్చు. పోలీసులు మాపై కనికరం చూపి నిందితున్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి. – షరీఫా, బాధితురాలు, ఉరవకొండ -
స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం
కడప : కడపలోని ఎర్రముక్కపల్లి స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 60 వేల రూపాయల వరకు ఆస్థి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
బ్యాంకింగ్... ' పైసా వసూల్'
సుధాకర్ కాస్త సంప్రదాయ వాది. బ్యాంకింగ్‌లో కావచ్చు... బీమా రంగంలో కావచ్చు... ఆఖరికి టెలిఫోన్ కనెక్షన్ విషయంలో కావచ్చు!! ఎక్కడైనా ప్రభుత్వ రంగాన్నే నమ్ముతాడు. ప్రయివేటు రంగంలో చక్కని ఆఫర్లున్నా సరే... అదంతా మోసమని కస్టమర్లను ఉచ్చులోకి లాగటానికి ఆ వల విసురుతుంటారని అందరితో చెబుతుంటాడు. ఎవరు విన్నా... వినకపోయినా తను మాత్రం ఎక్కువగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడ్డాడు. కాకపోతే ఈ మధ్య బ్యాంకింగ్‌కు సంబంధించి తను పునరాలోచనలో పడ్డాడు. తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలేమో అనుకుంటున్నాడు కూడా!! ఎందుకంటే ఒకటి రెండు విషయాల్లో ప్రయివేటు బ్యాంకులే బెటరనుకునే అనుభవాలు ఎదురయ్యాయి మరి!! సుధాకర్‌కి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుతున్నాడు. తన మిత్రుడు శ్రీకర్‌కు మాత్రం ఓ అగ్రశ్రేణి ప్రయివేటు బ్యాంకులో ఖాతా ఉంది. కాకపోతే ఇద్దరూ ఈ మధ్య విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. మరి వీసా కోసం దరఖాస్తు చేయాలి కదా? వీసా దరఖాస్తు కోసం 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే నేరుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న స్టేట్మెంట్ కుదరదు. బ్యాంకు సిబ్బంది ప్రింట్ తీసి, దానిపై స్టాంపు వేసి ఇస్తేనే చెల్లుతుంది. దీంతో సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే...! సుధాకర్ తన బ్యాంకు స్టేట్మెంట్ కోసం వెళ్లి అక్కడో ఫారం నింపి ఇచ్చాడు. స్టేట్మెంట్ వచ్చింది. 5 పేజీల స్టేట్మెంట్ను బ్యాంకు సిబ్బంది అప్పటికప్పుడే ఇచ్చేశారు. హమ్మయ్య! అనుకుంటూ బయటికొచ్చాడు సుధాకర్. ఇంతలో తన మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. స్టేట్మెంట్ తీసుకున్నందుకు రూ.600 మినహాయించుకున్నట్లు బ్యాంకు పంపిన మెసేజ్ అది!!. నిజానికి సుధాకర్ ఎప్పుడూ బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోలేదు. అవసరమైనపుడు తన ఇంటర్నెట్ ఖాతా ద్వారా తనే ప్రింట్ తీసుకునేవాడు. అలాంటిది ఒకసారి బ్యాంకుకెళ్లి 5 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నందుకు రూ.600 కోతపడేసరికి దిమ్మదిరిగిపోయింది. బ్యాంకుకెళ్లి అడిగితే... అవి రూల్స్ అని, రూల్స్ ప్రకారమే కోత పడిందని చెప్పారు. అంతే!!. మరి శ్రీకర్ పరిస్థితేంటి? శ్రీకర్ తన బ్యాంకుకెళ్లాడు. స్టేట్మెంట్ అడిగాడు. దాదాపు 6 పేజీల స్టేట్మెంట్ను వాళ్లు కూడా ఇచ్చారు. కాకపోతే శ్రీకర్ ఖాతాలోంచి రూపాయి కూడా కట్ కాలేదు. ఎందుకంటే ప్రతి 6 నెలల్లో ఒకసారి ఉచితంగా స్టేట్మెంట్ తీసుకోవచ్చన్నది ఆ బ్యాంకు నిబంధన. అప్పటిదాకా శ్రీకర్ కూడా బ్యాంకు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు కాబట్టి... శ్రీకర్‌కు దాన్ని ఉచితంగా ఇచ్చారు. ఎలాంటి చార్జీలు ఖాతా నుంచి మినహాయించుకోలేదు. మరో సంఘటన చూద్దాం!!. ఓ అప్లికేషన్‌పై ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు అటెస్టేషన్ అవసరమైంది. ఈ విషయంలో కూడా సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఆ అప్లికేషన్ తీసుకుని, దానిపై సంతకం చేసి, స్టాంపు వేసి ఇచ్చారు. కాకపోతే దీనికి సుధాకర్ ఖాతా నుంచి రూ.175 కోత పడింది. శ్రీకర్ ఖాతాలో మాత్రం రూ.100 మాత్రమే కోత పడింది. అయినా ఇదేకాదు!! శ్రీకర్ ఈ మెయిల్‌కు తన బ్యాంకు నుంచి ప్రతి మూడు నెలలకోసారి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ వస్తుంటుంది. దానికి శ్రీకర్ నుంచి ఎలాంటి చార్జీలూ వసూలు చేయరు. అంటే ఒకవేళ ఏదైనా దరఖాస్తుకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తే దీన్ని కూడా ఇవ్వవచ్చన్న మాట. కాకపోతే సుధాకర్‌కు మాత్రం ఎలాంటి స్టేట్మెంట్లూ రావు. బ్యాంకుకెళితే చార్జీల బాదుడు తప్పదు. అదీ సంగతి!!. మరిప్పుడు సుధాకర్ ఏం చేయాలి? ప్రభుత్వ రంగంలోని తన బ్యాంకే బెటరనుకోవాలా? లేక ప్రయివేటు బ్యాంకులే బెటరనుకోవాలా? నిజానికిప్పుడు చార్జీల విషయంలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు రెండూ దొందుకు దొందేనని చెప్పాలి. కాకపోతే అటు సేవల విషయంలోను, కొన్ని చార్జీల విషయంలోను మాత్రం ప్రయివేటు బ్యాంకులే మెరుగ్గా ఉన్నాయి. మరి చిన్న చిన్న జీతగాళ్లతో పాటు కోట్ల మంది నమ్ముకున్న ప్రభుత్వ బ్యాంకులు ఇలా ఎడాపెడా చార్జీలు బాదేస్తూ ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతుంటే ఏం చేయాలి? ప్రయివేటు బ్యాంకులకన్నా తాము రెండాకులు ఎక్కువే చదివామన్నట్లుగా వ్యవహరిస్తుంటే కర్తవ్యమేంటి? బ్యాంక్ మేనేజర్ సంతకానికి రూ.175.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా ఈఎస్ఐ, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లుల క్లయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆయా అధికారులు దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతున్నారు. ఇందుకోసం సంబంధిత బ్రాంచి మేనేజర్ సంతకం, స్టాంప్ ఉండాల్సిందేనంటున్నారు. గత్యంతరం లేక బ్యాంకును సంప్రదిస్తే–ఎస్బీఐలో అటెస్టేషన్ చార్జీలు రూ.175, మిగతా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. హెచ్డీఎఫ్సీ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో దీనికి రూ.100 వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో బదిలీ చేసినా చార్జీలే! కేంద్రం డిజిటల్ చెల్లింపులంటూ ఊదరగొడుతున్నా బ్యాంకులు మాత్రం చార్జీల మోత మోగిస్తున్నాయి. ఆన్లైన్లో నగదు బదిలీకి ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, యూపీఐ తదితర ఆప్షన్లున్నాయి. ఎస్బీఐలో ఎన్ఐఎఫ్టీ చార్జీలు రూ.10 వేల వరకైతే రూ.2.50, లక్షకైతే రూ.5, రూ.2 లక్షల వరకైతే రూ.15, రూ.2 లక్షల పైనైతే రూ.25 కట్టాల్సిందే. ఆర్టీజీఎస్లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకైతే రూ.25, ఆపైన జరిపే ప్రతి లావాదేవీ మీద రూ.50, ఐఎంపీఎస్‌లో అయితే రూ.1,000 వరకు ఉచితం. ఆపైన రూ.10 వేల వరకు ప్రతి లావాదేవీకి రూ.2, రూ.లక్ష వరకైతే రూ.4, రూ.2 లక్షల వరకైతే ప్రతి లావాదేవీ మీద రూ.12 చార్జీలుంటాయి. కనీస నిల్వల్లో ఎవరికి వారే!! కనీస నగదు నిల్వల పరిస్థితైతే దారుణం. కరెంట్ ఖాతాల్లోనే కాదు.. పొదుపు ఖాతాల్లోనూ మినిమం బ్యాలెన్స్ లేకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని బ్యాంకులూ అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాయి. మెట్రోల్లో ఎస్బీఐ కనీస నగదు నిల్వ రూ.3 వేలు. లేని పక్షంలో రూ.20–40 వరకు చార్జీలున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో పొదుపు ఖాతాల్లో కనీసం రూ.10 వేలు ఉండాలని, కొన్ని అంతర్జాతీయ బ్యాంకులైతే రూ.లక్ష వరకు ఉండాల్సిందేనని షరతులు విధించాయి. లేకపోతే జీఎస్టీతో కలిపి రూ.500– 700 వరకు చార్జీలున్నాయి. బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేసినా మోతే! ఆన్లైన్లోనే కాదండోయ్.. బ్యాంకుకు వెళ్లి నగదును డిపాజిట్ చేసినా చార్జీల మోత తప్పదు. ఎస్బీఐ తొలి 3 డిపాజిట్లు మాత్రమే ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి డిపాజిట్‌కు రూ.50. ప్రైవేట్ బ్యాంకులైతే ఉచిత లావాదేవీలు ముగిశాక ప్రతి లావాదేవీ మీద రూ.150 వసూలు చేస్తున్నాయి. ఏటీఎం నిర్వహణకూ చార్జీలే.. సొంత బ్యాంకు ఏటీఎంలో అయినా ఇతర బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు డ్రా చేస్తే చార్జీలున్నాయి. ఎస్బీఐలో మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే 3 సార్లు, పట్టణాల్లో అయితే 5 సార్లు ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీ మీద సొంత బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.10, ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.20 చార్జీ ఉంటుంది. ఎస్బీఐలో సాధారణ డెబిట్ కార్డు జారీకి ఎలాంటి చార్జీలు లేవు. కానీ, గోల్డ్ డెబిట్ కార్డు జారీకి అయితే రూ.100, ప్లాటినం డెబిట్ కార్డుకైతే రూ.300, చార్జీ విధిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే డెబిట్ కార్డు జారీకి చార్జీ లేదు కానీ, ఏటా కార్డు నిర్వహణకు రూ.120 చార్జీ వసూలు చేస్తుంది. చిరిగిన నోట్లు మారిస్తే.. నోట్లు చిరిగిన లేదా శిథిలావస్థకు చేరిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకూ చార్జీలున్నాయి. ఎస్బీఐలో అయితే నోట్ల విలువ రూ.5 వేలకు మించితే ప్రతి నోటుకు రూ.2 చొప్పున వసూలు చేస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆన్లైన్ ద్వారా బస్సు లేదా రైలు టికెట్లు లేదా కరెంట్ బిల్లు స్థానిక సంస్థల ఫీజులు చెల్లించినా సరే చార్జీలున్నాయి. ఆయా సేవలకు మొత్తం విలువపైన డెబిట్ కార్డుతో అయితే 0.75–1.5 శాతం, క్రెడిట్ కార్డుతో అయితే 1.75–2.5 శాతం వరకు చార్జీలున్నాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించినా సరే రూ. 10తో పాటూ జీఎస్టీ కట్టాల్సిందే. చెక్, డీడీ, స్టేట్‌మెంట్‌కూ మోతే! చెక్ బుక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), స్టేట్మెంట్ అన్నింటికీ చార్జీలున్నాయి. ఎస్బీఐ ఖాతాదారులు త్రైమాసికంలో లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్ నిర్వహణ చేసేవారికి చెక్‌బుక్ తొలి 25 పేజీలు ఉచితం. ఆ తర్వాత 10 చెక్‌లకు రూ.30, 25 చెక్‌లకు రూ.75, 50 చెక్‌లకు రూ.150 చెల్లించాలి. జీఎస్టీ అదనం. ప్రయవేటు బ్యాంకులతో పాటు చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా కాల పరిమితిని బట్టి ఉచిత స్టేట్మెంట్లు ఇచ్చే సదుపాయం ఉన్నా... స్టేట్ బ్యాంకు మాత్రం దీనికి భారీగానే వసూలు చేస్తోంది. ఎస్బీఐలో రూ.5 వేల డీడీకి రూ.25, రూ.10 వేలకు రూ.50, లక్షకైతే ప్రతి 1,000కి రూ.5 చార్జీ కట్టాల్సిందే. ఎస్ఎంఎస్, మొబైల్ వ్యాలెట్కూ బాదుడే! ఖాతాలో నగదు పడినా, లేదా డ్రా చేసినా వెంటనే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) వచ్చేలా పెట్టుకున్నారా! అయితే మీ జేబుకు చిల్లే. ఎస్ఎంఎస్ సేవలకు గాను ప్రతి బ్యాంకు 3 నెలలకొకసారి రూ.15 వసూలు చేస్తున్నాయి. అంతేకాదు నగదు ఒకే సంస్థకు చెందిన ఒక వ్యాలెట్ నుంచి మరొక దానికి బదిలీ చేసినందుకు కొన్ని సంస్థలు ఉచితంగా అందిస్తే, మరికొన్ని రూ.10–20 వరకు చార్జీ చేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా ఆన్లైన్ బ్యాంకు ద్వారా నగదు రీచార్జి చేసినప్పుడు ఉచితంగా సేవలందిస్తున్నాయి. కానీ, ఆ నగదు అవసరానికి తిరిగి బ్యాంకు ఖాతాలోకి మళ్లించేందుకు నగదు విలువ ప్రకారం రూ.10–100 వసూలు చేస్తున్నాయి. సర్వీసుల్లో పోటీ ఏదీ? చార్జీల విషయంలో ప్రభుత్వ బ్యాంకులు తామేమీ తక్కువ తినలేదన్నట్లు ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. కానీ సేవల్లో మాత్రం... నాసిరకమే!! బ్యాంకుకెళితే సిబ్బంది తీరు ఎలా ఉంటుందన్నది అందరికీ అనుభవమే. ప్రయివేటు బ్యాంకులు ఆటోమేషన్తో సిబ్బందిని నేరుగా కలవాల్సిన అవసరాన్ని తప్పిస్తుండగా... ప్రభుత్వ బ్యాంకులు దీనికింకా ఆమడ దూరంలోనే ఉన్నాయి. పైగా ఎస్బీఐ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల్లో చెక్‌బుక్ కోసం రిక్వెస్ట్ పెడితే... 10–12 రోజులు పడుతుందనే సమాచారం రావటంతో పాటు... దాదాపు అంతే సమయం తీసుకుంటున్నారు కూడా!! అదే ప్రయివేటు బ్యాంకులైతే 3–4 రోజుల్లోనే చెక్‌బుక్‌ను పంపిస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు మరీను!! ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలందిస్తున్నా... రెండుమూడు అగ్రశ్రేణి బ్యాంకులు తప్ప మిగతావన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ దిగ్గజ బ్యాంకులు కూడా తరచూ సేవలకు అంతరాయం కలగటం, నెట్‌బ్యాంకింగ్ పనిచేయకపోవటం, ఒకవేళ కస్టమర్ ఎవరైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమస్యల గురించి బ్యాంకు సిబ్బందిని వెళ్లి అడిగితే వారిక్కూడా ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవటం... ఇలాంటి సమస్యలు తక్కువేమీ కాదు. ఉదాహరణకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకున్నవారికి తొలుత చూసే హక్కులు (వ్యూయింగ్ రైట్స్) మాత్రమే వస్తాయి. అంటే వీరు ఖాతాను నెట్లో తెరిచి చూసుకోవటం తప్ప ఎలాంటి లావాదేవీలూ చెయ్యలేరు. ఇంటర్నెట్లోనే యాక్సెస్ స్థాయిని అప్‌గ్రేడ్ చేసుకుంటే... అప్పుడు లావాదేవీలు జరిపే హక్కులొస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రిక్వెస్ట్ పెట్టుకుని నాలుగైదు రోజులైనా అది అప్‌గ్రేడ్ కాదు. బ్యాంకుకెళ్లి అడిగితే వారు నెట్ లాగిన్‌ను చెక్‌చేసి... స్టేటస్ చెప్పటం తప్ప ఏమీ చెయ్యలేరు. కొందరు సిబ్బందికీ దీనిపై అవగాహన తక్కువే. కాకపోతే ఈ విషయంలో ప్రయివేటు బ్యాంకులు ముందంజలోనే ఉన్నాయని చెప్పొచ్చు. వాటి ఇంటర్నెట్ బ్యాంకింగే దాదాపు 90 శాతం అవసరాలను తీర్చేస్తోంది. అదీ కథ. -
సెక్యూరిటీ గార్డుపై దాడి
పులివెందుల : పట్టణంలోని స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డిపై దాడి జరిగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. శనివారం బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రెడ్డిపై పట్టణానికి చెందిన రిటైర్డు సీడీపీవో విజయలక్ష్మి కుమారులు అశోక్, అమృత్‌లు భాస్కర్‌రెడ్డిని బ్యాంకులో నుంచే తీవ్రంగా కొట్టుకుంటూ బ్యాంకు వెలుపలికి తీసుకొచ్చి అక్కడ కూడా దాడి చేశారు. భాస్కర్‌రెడ్డి శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన విజయలక్ష్మిని క్యూలో నిలబడాలని కోరడంతో శనివారం మళ్లీ ఆమె బ్యాంకు రాగా.. అదేవిధంగా క్యూలో నిలబడాలని చెప్పగా..కోప్రోదిక్తులైన ఆమె కుమారులు భాస్కర్‌రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు. భాస్కర్‌రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనపై విచారిస్తున్నారు. దాడి చేసిన వారిలో అశోక్ ఏఆర్ కానిస్టేబుల్‌గా నిర్వహిస్తుండటం విశేషం. -
ఆ నోట్లు నేరుగా వెళ్లే అవకాశం లేదు
శేఖర్‌రెడ్డికి 2 వేల నోట్ల చేరికపై బ్యాంకు వర్గాల వివరణ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా కొత్త 2 వేల నోట్లు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ ‘స్కేప్’ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు నవంబర్ 7న రిజర్వు బ్యాంక్ నుంచి విశాఖ స్కేప్‌కు కొత్త రూ.2 వేల నోట్లు వచ్చాయి. ఏపీ జిల్లాలకు ఈ నోట్లనే పంపిణీ చేయాలి. ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో పంపిణీ చేస్తారు. నవంబర్ 7న ఆర్బీఐ నుంచి వచ్చిన రూ.కొత్త 2 వేల నోట్లను కూడా ఆయన సమక్షంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల చెస్ట్ శాఖలకు వ్యాన్లు, లారీల్లో పంపిణీ చేసినట్టు స్టేట్ బ్యాంక్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా ఈ సొమ్ము శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నాయి. మరోవైపు శేఖర్‌రెడ్డి అక్రమ నగదు నిల్వలపై ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటివరకు విశాఖలోని స్కేప్ అధికారులను విచారించలేదని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
ఏటీఎంకు దండేసి.. దండం!
-
ఏటీఎంకు దండేసి.. దండం!
ఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నాటి నుంచి ప్రజల నోట్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో సెక్యూరిటీ గార్డు తప్పించి ఎప్పుడూ ఎవరూ కనిపించని ఏటీఎం సెంటర్ల వద్ద కూడా చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలల్లోనే ప్రజల సమయం గడిచిపోతోంది. ఇక చాలా ఏటీఎంలలో క్యాష్ కొరతతో బ్యాంకు సిబ్బంది అసలు డబ్బు నింపడం లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న తూర్పు ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతం ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఎప్పుడూ నో క్యాష్ బోర్డు కనిపిస్తుండటంతో.. ఏటీఎం మెషిన్‌కు పూజలు చేసి.. కాస్త డబ్బుకావాలని వేడుకున్నారు. ఈ పూజా నిరసన కార్యక్రమంలో సుమారు 50 మంది ప్రజలు పాల్గొని ఏటీఎం మెషిన్‌కు హారతి ఇచ్చి దండేసి దండం పెట్టారు. చూడాలి మరి.. ఈ నిరసనతో అయినా బ్యాంకు అధికారులు నో క్యాష్ బోర్డు తొలగిస్తారేమో! -
వృద్ధురాలికి 'ఆన్లైన్' బురిడీ!
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట మండలంలోని చెంచుగారిపల్లె దళితవాడకు చెందిన యాగల లక్ష్మీనరసమ్మ కూలి పని చేసుకొని జీవిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం మరణించారు. వితంతు పింఛన్ తీసుకుంటోంది. తనకు ఎవరూ లేకపోవడంతో పెన్షన్, కూలి పని చేసుకుని సంపాదించుకున్న మొత్తాన్ని ఒంటిమిట్ట స్టేట్‌బ్యాంకులో నంబర్: (11524745925)తో 2007లో ఖాతా ఓపెన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఖాతాలో కొంత నగదుతోపాటు, భర్త ద్వారా సంక్రమించిన భూమిని విక్రయించగా వచ్చిన రూ.50 వేల నగదును అకౌంట్లో వేసుకుంది. 2015 నాటికి రూ.99,928 నిల్వకు చేరుకుంది. 2016లో బ్యాంక్‌కు వెళ్లి రూ.20 వేలు డ్రా చేసుకుంది. తర్వాత అకౌంట్ పుస్తకంలో కంప్యూటర్ ద్వారా నగదు వివరాలను ఎక్కించుకుంది. రూ.19,909 మాత్రమే నిల్వ ఉన్నట్లు చూపడంతో వృద్ధురాలిలో ఆందోళన మొదలైంది. మిగతా డబ్బు గురించి బ్యాంక్ అధికారులను అడగ్గా తమకు తెలియదని చెప్పడంతో ఏమీ చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆన్లైన్లో ఎవరో ట్రాన్స్క్షన్ చేసుకొని ఉంటారని బ్యాంకు అధికారులు ఉచిత సలహా ఇచ్చేశారు. ఏడు దఫాలుగా డ్రా.. తన అకౌంట్ నుంచి ఏడు దఫాలుగా రూ.63 వేలను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా వివరాలు తెలుసుకోగలిగింది. కాగా వృద్ధురాలికి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత సబ్సిడీ కోసం ఆధార్‌కార్డును చిన్నకొత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇప్పించుకుని, వేలిముద్ర వేయించుకునే వాడు. అతనిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇదే విధంగా వేరే వారికి చేస్తే.. వారు నిలదీస్తే డబ్బులు తిరిగి ఇచ్చేశాడనే ఆరోపణలు ఉన్నాయని ఆమె చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని విలేకర్ల వద్ద వాపోయింది. దళిత వృద్ధురాలికి కనీసం దళితనాయకులు అండగా నిలిచి.. ఆమెను ఆన్లైన్ ద్వారా మోసం చేసి నగదు తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నారంటే.. లక్ష్మీనరసమ్మ అకౌంట్లో నగదు గల్లంతు విషయంతో తనకు సంబంధం లేదని ఒంటిమిట్ట ఎస్బీఐ మేనేజర్ వెంకట్రావు తెలిపారు. ఆన్లైన్లో నగదు ట్రాన్స్క్షన్ జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
బ్యాంకుల్లో నో క్యాష్
సుండుపల్లి: ప్రభుత్వం రూ.500లు, రూ.1000ల నోట్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. సిండికేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, జీకేరాచపల్లి స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ బ్యాంకులలో సైతం డబ్బులు లేక ఖాతాదారులు వెనుతిరిగిపోయారు. సామాన్య ప్రజలు ఉదయం బ్యాంకుల దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి డబ్బులు లేవు అని తెలియడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే డిపాజిట్లు మాత్రం జరిగాయి. విత్‌డ్రా మాత్రం డబ్బులు లేక బ్యాంకుల లావాదేవీలు జరుగలేదు. సహకార బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడంకానీ, డిపాజిట్ చేయడంకానీ అవకాశం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. సిండికేట్ బ్యాంకు ఏటీఎం సుండుపల్లి ఎస్బిఐ ఏటీఎం, జీకేరాచపల్లి ఎస్బీఐ ఏటీయం, ప్రైవేటు ఏటీఎంలు ఉన్నా డబ్బులు లేక ఏటీఎంలు తెరచుకోలేదు. సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు -
నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు
మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్ బ్యాంకులో రూ. 4 వేల నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మ ద్య ఉన్న జారుుంట్ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేరుుంచుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. -
చేతులెత్తేసిన తపాలాశాఖ
-
తపాలాశాఖ చేతులెత్తేసింది
- చాలా పోస్టాఫీసులకు అందని కొత్త నోట్లు - రూ.60 కోట్లడిగితే ఇచ్చింది రూ.12 కోట్లే - చెల్లింపులు చేయలేమంటూ బోర్డులు సాక్షి, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి తమవల్ల కాదంటూ పోస్టల్ శాఖ చేతులెత్తేసింది. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకులు తపాలా కార్యాలయాలకు చాలినంత నగదు పంపడంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా కార్యాలయాలు పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించలేదు. పాత నోట్లను మార్చలేమంటూ బోర్డులు పెట్టేశాయి. నగదు మార్పిడికి అవకాశం కల్పించేందుకు పోస్టాఫీసులకు కూడా నగదు పంపాలని కేంద్రం నిర్ణరుుంచడం తెలిసిందే. ఆ మేరకు ఆర్బీఐ, స్టేట్ బ్యాంకు శాఖల నుంచి ఏ రోజుకా రోజు పోస్టాఫీసులకు నగదు అందాలి. ఇలా తొలి రోజునే పోస్టాఫీసుల ద్వారా రాష్ట్రంలో రూ.52 కోట్ల మార్పిడి జరిగింది. దాంతో రోజుకు రూ.60 కోట్లకు తగ్గకుండా నగదు కావాలని తపాలా అధికారులు కోరినా రూ.30 కోట్లకు మించ కుండానే ఆర్బీఐ, స్టేట్‌బ్యాంకు పంపుతు న్నాయి. పోస్టాఫీసులు తమ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు కూడా కలిపి నోట్ల మార్పిడి చేస్తూ వచ్చారుు. రెండో రోజు రూ.78 కోట్లు, మూడో రోజు రూ.83 కోట్లు, నాలుగోరోజు రూ.50 కోట్లు, ఐదోరోజు 60 కోట్లు, ఆరోరోజు రూ.65 కోట్ల చొప్పున మార్చారుు. రోజుకు రూ.60 కోట్లు సమకూర్చాలని రాష్ట్ర అధికారులు బుధవారం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేశారు. కానీ, పరిస్థితి మరింత దిగజారింది. గురువారం రూ.12 కోట్ల నగదే వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో నాలుగో వంతు కంటే తక్కువ పోస్టాఫీసులకు, సికింద్రాబాద్‌లో కొన్నింటికి, జిల్లాల్లోని ప్రధాన పోస్టాఫీసులకు, అది కూడా అరకొరగానే కొత్త నోట్లు అందారుు. దాంతో గురువారం నామమాత్రంగానే మార్పిడి జరిగింది. పేరుకుపోతున్న పాత నోట్లు మరోవైపు పోస్టాఫీసులకు నిత్యం రూ.55 కోట్లకు తగ్గకుండా పాత నోట్లు వస్తుండటంతో వాటిని స్టేట్‌బ్యాంకులకు పంపుతున్నారు. కానీ తమ వద్దే భారీగా నోట్లు పేరుకుపోతున్నందున తీసుకోలేమని అవి బదులిస్తుండటంతో పోస్టాఫీసుల్లో పాత నోట్లు కుప్పలు పడుతున్నారుు. వాటిని ఎక్కడ దాచాలో కూడా తెలియని గందరగోళం నెలకొంది. ప్రస్తుతం పోస్టాఫీసుల వద్ద రూ.250 కోట్ల వరకు పాత నోట్ల నిల్వ ఉంటుందని అధికారులంటున్నారు. -
కొత్త నోట్లు వచ్చేశాయ్!
అనంతపురం అగ్రికల్చర్ : కొత్తనోట్లు జిల్లాకొచ్చేశాయి. రూ.2,000, రూ.500 నోట్లను బుధవారం ఉదయమే రెండు లారీల్లో చెక్కపెట్టెల్లో భద్రపరిచి తీసుకొచ్చారు. ఈ నోట్లను స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ భద్రపరిచారు. చాలా బ్యాంకులకు బుధవారం రాత్రి ఈ నోట్లు చేరాయని, వీటితో పాటు రూ.100 నోట్లు కూడా వచ్చాయని తెలిసింది. అయితే.. బ్యాంకర్లు అధికారిక సమాచారం ఇవ్వడంలేదు. గురువారం బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయని, ఏటీఎం కేంద్రాలు మాత్రం ఉండవని వారు తెలిపారు. -
డబ్బుల్లేని ఏటీఎంలు
► ప్రతినెలా కార్మికుల పరేషాన్ ► వేతనాల సమయంలోనే పరిస్థితి యైటింక్లయిన్‌కాలనీ : ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు పరేషాన్ అవుతున్నాయి. అత్యధిక సింగరేణి కార్మిక కుటుంబాలు నివాసముంటున్న యైటింక్లయిన్‌కాలనీలో ఈపరిస్థితి ప్రతినెలా వేతనాల సమయంలో సర్వసాదారణంగా మారుతోంది. సిం గరేణి కార్మికులకు యాజమాన్యం నెలవారీ వేతనాలను ప్రతినెల 4లోగా ఖాతాల్లో జమచేస్తుంది. వేతనాలను తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళ్లిన కార్మికులకు అందులో డబ్బులు లేక నిరాశగా వెనుదిగాల్సి వస్తోం ది. ముఖ్యంగా యైటింక్లయిన్‌కాలనీ, మహాకవిపోతనకాలనీలో ఏర్పా టు చేసిన ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలలో ఈపరిస్థితి ఎక్కువగా ఉంటోం ది. పోతనకాలనీలో ఏర్పాటు చేసిన స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో యంత్రంపైనున్న 1,2,7 నంబర్లు సరిగా పనిచేయక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 40రోజులుగా ఈయంత్రం ఇదేవిధంగా ఉం టున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని గుర్తింపు, ప్రాతి నిధ్య సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, నాచగోని దశరధంగౌడ్ పేర్కొన్నారు. దీనిపై సంబందిత అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం పట్టించుకొని కార్మికులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు. -
బంగారు వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
రైతులతో కలిసి బ్యాంకు ముట్టడి ఉరవకొండ: ఉరవకొండ స్టేట్‌బ్యాంకు పరిధిలో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు రుణాలు చెల్లించకపోవడంతో వారి బంగారాన్ని శనివారం బ్యాంకు అధికారులు వేలం పాట నిర్వహించారు. విషయుం తెలుసుకుని బాధిత రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ, సీపీఎం నాయుకులు బ్యాంకును వుుట్టడించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ రాజేంద్రన్‌తో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిలు రాకెట్ల అశోక్, ఎగ్గుల శ్రీనివాసులు, బసవరాజులు, సీపీఎం వుండల కార్యదర్శి రంగారెడ్డి వూట్లాడుతూ తీవ్ర కరువుతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని, పంటలు పండక పెట్టుబడులు కుడా వెనక్కి రాని దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు చెల్లించాలని రైతుల పై ఒత్తిడి తెచ్చి, వారి ఆత్మాభివూనం దెబ్బతినేలా బంగారాన్ని వేలం వేయుడం సరైంది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణమాఫీ పేరుతో రైతులను తీవ్రంగా మోసగించిందని, చివరకు రుణమాఫీ కాక రైతులు అప్పుల పాలయ్యూరని తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ వూట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తావుు వేలం వేస్తున్నావుని, రైతులంతా కలిసి ఒక ఆర్జీ ఇస్తే వాటిని ఉన్నతాధికారులకు పంపి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటావున్నారు. -
దేవుడి బంగారం.. గాలిలో దీపం!
* గోల్డ్ డిపాజిట్ స్కీంలో పెట్టాలనే ఆదేశానికి తిలోదకాలు * నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లాకర్లకు తరలింపు * వడ్డీ పొందాల్సిందిపోయి ఎదురు చార్జీల చెల్లింపు * బయటపెట్టిన ఆడిట్ విభాగం * తేరుకొని లెక్కలు సేకరిస్తున్న దేవాదాయశాఖ సాక్షి, హైదరాబాద్: దేవుడి మాన్యానికే కాదు.. స్వామి బంగారానికీ రక్షణ కరువైంది. విరాళాలు, కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారం సరైన లెక్కాపత్రం లేకుండా లాకర్లలో మగ్గుతోంది. ఏ లాకర్లో ఎంత పుత్తడి ఉందనే వివరాలు లేకుండా పోయాయి. ఇటీవల బ్యాంకులు, వాటి ఏటీఎంలపై దొంగలు గురిపెడుతున్న నేపథ్యంలో దేవుడి సొత్తు గాలిలో దీపమైంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టొద్దని, కిలోకు మించి స్వర్ణం ఉంటే స్టేట్‌బ్యాంక్ గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్‌లో ఉంచి వడ్డీ పొందాలనే ప్రభుత్వ ఆదేశాన్ని తోసిరాజని ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆడిట్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. ఆడిట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా మచ్చుకు 12 ఆలయాలను పరిశీలించగా, 9 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని లాకర్లలో మగ్గబెట్టినట్టు తేలింది. కేంద్రం అమలుచేస్తున్న గోల్డ్ డిపా జిట్ స్కీం గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆడిట్ విభాగం శ్రీముఖం పంపేసరికి నాలుక్కరుచుకున్న దేవాదాయశాఖ అన్ని ఆల యాల్లో బంగారు నిల్వలపై లెక్కలు సేకరిం చడం మొదలెట్టింది. గుర్తించిన బంగారాన్ని స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేయాలా, లేదా కేంద్ర పథకం కింద ఉంచాలా అన్న దానిపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపింది వడ్డీ గోవిందా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవుళ్లకు స్వర్ణాభరణాలున్నాయి. ఇవి కాకుండా భక్తుల కానుకలు, విరాళాల రూపంలో బంగారం సమకూరుతోంది. అది చిన్న ముక్కలు, బిస్కెట్లు, ఇతర ఆకృతుల్లో ఉంటోంది. ఆభరణాల రూపంలో ఉన్నవాటిని వేడుకలు, పండగల సమయంలో అలంకరించాలని, ఇతర రూపంలో ఉన్న బంగారం కిలోకు మించితే స్టేట్‌బ్యాంక్‌లోని గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమచేసి వడ్డీ పొందాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని చాలా ఆలయాలు పట్టించుకోలేదు. ఆడిట్ గుర్తించిన ఆలయాలు.. బంగారు నిల్వలు బాసర సరస్వతీ ఆలయం-10.26 కిలోలు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం-7.3 కిలోలు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం- 5.70 కిలోలు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం- 3.49 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం-2.8 కిలోలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం-2.1 కిలోలు, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం-1.8 కిలోలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం-1.6 కిలోలు, నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం-1.2 కిలోలు. -
తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో సోదాలు
తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో డోన్ డీఎస్పీ వేణుగోపాల్ సోదాలు నిర్వహించారు. సోమవారం ఆయనతో పాటు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసగుప్తా ఈ సోదాల్లో పాల్గొన్నారు. వివరాలు.. రెండేళ్ల క్రితం తాడిమర్రి స్టేట్ బ్యాంక్ పరిధిలో 82 బోగస్ మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. 3.5 కోట్ల రూపాయలను స్వాహా చేశాయి. అయితే, ఈ విషయంపై ఐకేపీ ఏపీఎమ్ పద్మావతి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో అప్పటి బ్యాంక్ మేనేజర్, ఐకేపీ ఏపీఎమ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఈ కేసు విషయమై సోమవారం తనిఖీలు చేపట్టిన డీఎస్పీ మోదుగులకుంట, శివంపల్లి, మద్దులచెరువు, తాడిమర్రి మండల కేంద్రాల్లో ఎక్కువగా బోగస్ సంఘాలు ఉన్నట్లు గుర్తించారు. -
బ్యాంక్‌ను ముట్టడించిన మహిళలు
రుణాల కోసం నిరసన మేనేజర్ పక్షపాత వైఖరిపై మండిపాటు మంత్రాలయం : రుణాలు ఇవ్వాలంటూ స్థానిక స్టేట్ బ్యాంక్‌ను బుధవారం మహిళలు ముట్టడించారు. మొత్తం 53 పొదుపు సంఘాల మహిళలు నిరసనలో పాల్గొన్నారు. చెట్నెహళ్లి, చిలకలడోణ, మంత్రాలయానికి చెందిన గ్రూపు మహిళలు 11.30 గంటల సమయంలో బ్యాంకు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ బైఠాయించారు. మూడు గంటల పాటు బ్యాంకు గేట్లు మూసేసి ఆందోళన చేపట్టినా బ్యాంకు మేనేజర్ సురేష్ అత్రేయ స్పందించలేదు. దీంతో మహిళలు మూకుమ్మడిగా బ్యాంకులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏఎస్ఐ బీఎస్ మూర్తి నేతృత్వంలో పోలీసులు వారిని నిలవరించారు. కొందరు గ్రూపు లీడర్లను బ్యాంకులో ప్రవేశానికి అనుమతించారు. మిగతా గ్రూపు రుణాలు వసూలు చేసేంత వరకు తానేమీ చేయలేనని మేనేజర్ చెప్పడంతో మహిళలు అక్కడే బైఠాయిస్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పొదుపు మహిళ సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. రుణమాఫీతో సంబంధం లేకుండా 38 గ్రూపులు రుణాలు చెల్లించాయన్నారు. ఏడాదిగా రుణాల కోసం తిరుగుతున్నా చలించడం లేదన్నారు. అలాగే కొత్తగా 15 పొదుపు గ్రూపులు పొదుపు చేస్తున్నా బ్యాంకు లింకేజీ రుణం ఇవ్వడం లేదన్నారు. రుణాల మంజూరులో పక్షపాతం చూపుతూ తమను సతాయిస్తున్నారని వాపోయారు. ఇటీవల శ్రీఖర్ గ్రూపునకు రుణం మంజూరు చేశారన్నారు. ఆందోళనలో పొదుపు సంఘాల లీడర్లు పద్మావతి, జానమ్మ, ఆదిలక్ష్మి, పుష్పావతి, నాగరత్న, లక్ష్మి, సిద్దమ్మతోపాటు 200 మంది మహిళలు పాల్గొన్నారు. -
స్టేట్ బ్యాంక్‌లో చోరీకి యత్నం
అనంతపురం : స్టేట్ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూంను తెరవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలారం మోగింది. స్థానికులు ఎవరైన వస్తారేమోననే.. భయంతో దుండగులు పరారయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని మేనేజర్ రాంప్రసాద్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాధమిక దర్యాప్తు చేపడుతున్నారు. (కళ్యాణదుర్గం) -
బ్యాంకును మోసగించిన ఐదుగురి అరెస్టు
వైఎస్సార్ జిల్లా: నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి బ్యాంకు నుంచి రూ. కోటికి పైగా అప్పుగా తీసుకున్న మోసగాళ్లను, సహకరించిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కడపకు చెందిన మోడెం శ్రీనివాసులు, అతని తమ్ముడు రమేశ్, బావ బొల్లా నర్సింహులు, స్నేహితుడు వడ్డేపల్లి వెంకట సుబ్బయ్య నకిలీ ఆస్తి పత్రాలను తయారు చేశారు. వాటితో వైఎస్సార్ జిల్లా కడపలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి రూ. కోటి 12 లక్షల 63 వేలను తీసుకున్నారు. వీరికి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణమోహన్ సాయం చేశాడు. 2012-13 కాలంలో వీరు ఏడు విడతలుగా రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు 24వతేదీ రాత్రి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
దాతలను కాదని.. వసూళ్లపైనే శ్రద్ధ
శ్రీకూర్మం(గార) : శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్ల పార్కు ఆదాయ వనరు కేంద్రంగా మారింది. తాబేళ్ల సంరక్షణకు అవసరమమైన నిధులు సమకూరుస్తామని పలువురు భక్తులు ముందుకొచ్చినా కాదని.. తాబేళ్లను చూపి వసూళ్ల పర్వం వైపే అధికారులు మొగ్గు చూపుతుండటం వెనుక ఆంతర్యం చిలక్కొట్టుడేనని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆలయంలో ఉన్న తాబేళ్ల సంరక్షణకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పార్కు ఏర్పాటు చేశారు. అయితే ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆహారం అందక తాబేళ్లు శుష్కించిపోగా.. పార్కు పాడవడంతో కుక్కలు పార్కులో చొరబడి తాబేళ్లను చంపేసేవి. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో తాబేళ్లను అడవిలో విడిచిపెట్టాలని అటవీ శాఖాధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమలానంద భారతి స్వామి హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో తాబేళ్లను ఆలయంలోనే ఉంచి సంరక్షించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు 2011లో రూ. 4 లక్షలతో కృష్ణమ్ వందే జగద్గురుమ్ పేరిట ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సూచనలతో తాబేళ్ల పార్కు ఏర్పాటు చేశారు. అయితే పార్కులో ఉన్న సుమారు 200 తాబేళ్ల ఆహార ఖర్చులకు రూ.100 కేటాయించడంతో ఆహారం అందించలే కపోతున్న పరిస్థితులపై ‘సాక్షి’లో కథనం ప్రచురించింది. దాంతో స్పందించిన దేవస్థానం అధికారులు తాబేళ్ల పార్కు నిర్వహణకు శ్రీకాకుళానికి చెందిన గ్రీన్‌మెర్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పార్కు నిర్వహణకు ఆ సంస్థకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలన్నది ఈ ఒప్పందం సారాంశం. కాగా ఈ మొత్తాన్ని తానే చెల్లిస్తానని అప్పట్లోనే కృష్ణమ్ వందే జగద్గురుమ్ సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు అధికారులకు తెలియజేశారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన అధికారులు.. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని భావించారో ఏమో గానీ.. తాబేళ్లను చూపి రోజువారీ వసూళ్లకు తెర తీశారు. మళ్లీ అడవి బాటలోకి? ఇదిలా ఉండగా తాబేళ్ల పేరిట వసూళ్లు చేయడం నేరమని అటవీ శాఖాధికారులు స్పష్టం చేయడంతో వాటిని ఆలయం నుంచి తరలించేందుకు దేవస్థానం అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది, నిధుల కొరత సాకుతో వాటిని వదిలించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. శ్రీకూర్మనాథాలయంతోపాటు పాతాళ సిద్ధేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయాల్లో మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు. రూ. 30 లక్షల ఆదాయం వచ్చే ఆలయానికి ఈ సిబ్బంది ఎక్కువే. ఇక నిధుల కొరత సమస్య కాదు. తాబేళ్ల సంరక్షణకు దాతలే ముందుకొస్తునానరు. స్థానిక సర్పంచ్ బరాటం రామశేషు సైతం గతంలో ఆలయ అధికారులకు ఇదే విషయం చెప్పారు. మరోవైపు గోవుల సంరక్షణ కంటే తాబేళ్ల సంరక్షణ చాలా సులువు. తాబేళ్లు చాలా తక్కువ ఆహారం తీసుకుంటాయి. రెండు గోవుల కంటే వంద తాబేళ్ల పోషణ ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఈ అంశాలను అధికారులు విస్మరిస్తున్నారు. కాగా తాబేళ్ల పేరిట వసూళ్లు చే స్తున్న విషయాన్ని జిల్లా అటవీ శాఖాధికారులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దేవస్థానం ఖాతాలో తాబేళ్ల పేరిట నగదు జమ అయ్యి ఉంటే ఇబ్బందులు వస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. -
రుణమాఫీ కాలేదని ఆగిన రైతు గుండె
కూడేరు: రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది. సొసైటీ బ్యాంక్‌లో రూ.35 వేలు, స్టేట్‌బ్యాంక్‌లో బంగారం తాకట్టుపెట్టి రూ. 75 వేలు తీసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో మాఫీ వర్తించలేదు. పేరు మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో రుణమాఫీ వర్తించదన్న మనోవేదనతో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. -
ఎవరి రూల్ వారిది
ఇది ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ టౌన్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. రుణమాఫీకి సంబంధించి రైతులు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు 1-బి ఒరిజనల్, రేషన్, ఆధార్‌కార్డు, లోన్ తీసుకున్న రశీదు జిరాక్స్‌లు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తును కూడా బ్యాంక్ అధికారులు ముద్రించారు. చివరితేదీ ఈనెల 3వ తేదీ అని బ్యాంక్ నోటీసు బోర్డులో పెట్టారు. రుణమాఫీ కోసం గత నెల 25వ తేదీ చివరి రోజుగా ప్రొద్దుటూరు పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో రైతులు గ్రామాల నుంచి తరలి వచ్చి క్యూలో నిల్చొని ఒరిజనల్ పుస్తకాలను చూపించి జిరాక్స్ పత్రాలను ఇవ్వాల్సి వచ్చింది. ఈ బ్యాంక్‌లో 1-బి పత్రాలు మాత్రం అడగలేదు. అది ప్రొద్దుటూరు పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ అభివృద్ధి శాఖ బ్రాంచి. ఇక్కడ 1-బి ఒరిజనల్తోపాటు పట్టాదారుపాస్పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు 1-బి తయారు చేసి ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో దానిని తొలగించారు. ఎర్రగుంట్లలోని ఎస్బీఐలో ఏకంగా రైతుల నుంచి టైటీల్ డీడ్ ఒరిజనల్ పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ పుస్తకం తీసుకున్నట్లు రైతులకు రశీదులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎదురు ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులు ఏమంటారోనని బ్యాంక్ అధికారులు అడిగిన వాటిని రైతులు సమర్పిస్తున్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
దేవరపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. దేవరపల్లి స్టేట్ బ్యాంకు ద్వారా డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాల మంజూరు పత్రాలను బుధవారం ఆయన మహిళలకు అందజేశారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బ్రాంచి చీఫ్ మేనేజర్ బి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 2019 నాటికి జిల్లాలోని ప్రతి డ్వాక్రా సంఘం కనీసం రూ.10 లక్షలు రుణం తీసుకోవాలని, దీనిద్వారా ప్రతి సంఘం రూ.లక్ష ఆదాయం పొందాలన్నారు. జిల్లాలోని ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వనున్నట్టు కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్రాంచిని జిల్లాలోని ఇతర బ్యాంకులు నాందిగా తీసుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,100 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రతి సంఘానికి రూ.లక్ష పొదుపు ఖాతాలో జమచేస్తుందన్నారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కె.సుధారాణి. సర్పంచ్ సుంకర యామినినిసన్మానించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హేనా నళిని, చీఫ్ మేనేజర్ బి.వంకరరావు, ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, తహసిల్దార్ ఎండీ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
రుణాలు కడితే సరి.. లేదంటే చర్యలే మరి
ప్రభుత్వం రేపోమాపో రుణాలు మాఫీ చేస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా, పంట రుణాలు రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. వీలైనంత త్వరగా వసూలు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు రావడంతో బ్యాంకర్లు వసూళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. నిన్నయిన్నటి వరకూ రైతులు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇస్తూ.. వారి సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతూ వచ్చిన బ్యాంక్ అధికారులు తాజాగా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఊరూరా ఆటోల్లో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను, బంగారు ఆభరణాలపై తీసుకున్న, మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను గడువులోగా చెల్లించి ఆర్బీఐ సూచనల ప్రకారం ప్రకారం వడ్డీ, రాయితీలు వినియోగించుకోవాలని చెబుతున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆందోళన మొదలైంది. ఏంచేయాలో పాలుపోవడం లేదని వారంతా వాపోతున్నారు. తాళ్లపూడి -
అక్రమాల మేడలు
అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. సెట్ బ్యాక్ అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. దీని సంగతి అటుంచి ఏకంగా రోడ్డు, కాలువ స్థలాలను ఆక్రమిస్తూ ర్యాంప్‌ల నిర్మాణం వంటివి చేపడుతున్నారు. కొన్ని చోట్ల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం (సెల్లార్)లో కూడా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. సెంటు లేదా ఒకటిన్నర సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారిపై తమ అధికార పెత్తనాన్ని చూపించే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అనుమతులకు విరుద్ధంగా బడాబాబులు నిర్మిస్తున్న భవనాలు, అపార్టుమెంట్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి నుంచి అన్ని స్థాయిల్లో ముడుపులు ముడుతుండడంతోనే ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల సెట్ బ్యాక్ స్థలాన్ని వదలకుండా రోడ్డు మీదకు వచ్చేలా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వచ్చినా, విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినా ఆ తక్షణమే స్పందించినట్లు వ్యవహరించి మొక్కుబడిగా కేసుల నమోదుతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యల జోలికి వెళ్లడం లేదు. తప్పించుకునే మార్గాలూ వీరే చూపుతారు అక్రమ నిర్మాణాల గురించి అధికారులు ప్రశ్నిస్తే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హుటాహుటిన వెళ్లి మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ గండం నుంచి తప్పించుకునే మార్గాలను అక్రమ నిర్మాణానికి పాల్పడిన భవన యజమానికి తెలియజే స్తున్నారు. కొద్ది రోజుల క్రితం కమలానగర్లో ఇదే చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జుగుతున్నట్లు ఆర్డీఎంఏకి ఫిర్యాదు వెళ్లింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారు అక్రమ కట్టడం వద్దకు వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. కోర్టుకు వెళ్లాలని సదరు యజమానికి ఉచిత సలహా ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కోర్టు వెళ్లారు. ఏంటి ప్రస్తుత పరిస్థితని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే కోర్టులో ఉందని చల్లగా చెప్పి జారుకుంటున్నారు. అక్రమార్జన అపార్టుమెంట్లు, భారీ భవనాల నిర్మాణం ఇక్కడి అధికారులకు కాసులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. ప్లాన్ అప్రూవల్ కావాలంటే అన్ని స్థాయిల్లోనూ ముడుపులు ఇచ్చుకుంటే తప్ప చేతికంద దని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ కట్టడాల నిర్మాణానికి చెక్ పెట్టాలంటే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తుండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జోరుగా నకిలీ నోట్ల చెలామణి
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీ నోట్లను వారికి అంటగడుతున్నారు. నిత్యకృత్యంగా ఈ దందా సాగుతున్నా పోలీసు యంత్రాంగం అరికట్టలేకపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలా సాగుతోంది... బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వ్యాపారపరంగా బెల్లంపల్లి పురోగమిస్తోంది. ఇక్కడ అనేక వ్యాపారాలు జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు భారీ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తుంటారు. తాండూర్లోని ఐబీ కేంద్రం అంగడికి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రతి శనివారం మేకల వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోపక్క బొగ్గు ట్రాన్స్‌పోర్టు కార్యకలాపాలు ఐబీ కేంద్రం నుంచే సాగుతున్నాయి. ఆ రకంగా బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో రోజువారీగా సుమారు రూ.కోటికిపైగా వ్యాపారం జరుగుతుందనేది అంచనా. అందువల్లే ఆ రెండు ప్రాంతాలను నకిలీ నోట్ల చెలామణిదారులు అడ్డాలుగా మలుచుకున్నారు. ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను ప్రజలకు అంటగట్టి గుట్టుగా దందా నిర్వహిస్తున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను జోరుగా చెలామణి చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బయటపడిన సంఘటనలు ఇటీవల ఓ మెడికల్ షాపుకు వెళ్లి కొద్ది మొత్తం మందులు కొ నుగోలు చేసి రూ.500 నకిలీ నోటును ఓ వ్యక్తి అప్పగించి వె ళ్లిపోయాడు. కాల్‌టెక్స్‌లో మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఓ వ్యక్తి రూ.1,000 నకిలీ నోటును అంటగట్టాడు. బేకరీ షాపులోనూ నకిలీ నోటు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆం ధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకులకు రోజువారీగా ఒకటి, రెండు నకిలీ నోట్లు రావడం సర్వసాధారణంగా మారింది. బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను చించివేయడం చేస్తున్నారు. మహిళలు వీటిని తీసుకువస్తుండటంతో సిబ్బంది ఏమి చేయలేకపోతున్నారు. దం దా నిర్వహిస్తున్న వ్యక్తులు ఏమాత్రం అనుమానం రాకుండా మహిళలకు నకిలీ నోట్లు అప్పగిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చేతికి కూడా నకిలీ నోటు వచ్చింది. చిల్లర మార్పిడి, సరుకుల కొనుగోలులో నకిలీ నోట్లు సునాయాసంగా చెలామణి చేస్తున్నారు. నోట్లను క్షుణ్ణంగా పరిశీలించకపోవడంతో అసలు నోటుగా భావించి అమాయకులు నకిలీ నోట్లను తీసుకుంటున్నారు. నకిలీ నోట్లను ఇలా గుర్తించాలి * అసలు నోటు పత్తితో చేయబడిన కాగితంతో తయారు చేస్తారు. ఇది ప్రత్యేకమైన పెళపెళ శబ్ధం చేస్తుంది. * నకిలీ నోటు తయారీకి వాడే కాగితం సాధారణ వెదురు గుజ్జుతో తయారవుతుంది. అందువల్ల ఆ నోటు దళసరిగా, నున్నగా ఉంటుంది. * అసలు నోటులో కొన్ని భాగాల్లో ప్రింట్ ఉబ్బెత్తు(ఇంటాగ్లియో)గా ఉంటుంది. * దొంగనోట్లలో ఉబ్బెత్తు ప్రింట్ కనిపించదు. * అసలు నోటులో మహాత్మాగాంధీ వాటర్ మార్కును ఎలక్ట్రోలైటు వాటరు మార్కును, సెక్యూరిటీ దారాన్ని లైటుకు ఎదురుగా పెట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. * దొంగనోట్లలో వాటరు మార్కును కూడా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు నోటులో ఉండే సూక్ష్మాంశాలను అనుకరించలేకపోతున్నారు. నకిలీ నోటును వెలుతురుకు ఎదురుగా పెట్టకపోయిన వాటర్ మార్కు కనిపిస్తుంది. సెక్యూరిటీ దారాన్ని కూడా నకలు చేసే ప్రయత్నం చేసినా అది మొరటుగా ఉంటుంది. * అసలు నోటులో నంబర్ ప్యానెల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుంది. * దొంగనోటులో నంబర్ ప్యానెల్ ఒక క్రమంలో ఉండదు. సాధారణంగా నంబర్లు అసలు నోట్లలోని నంబర్లకన్నా చిన్నగా ఉంటాయి. * అసలు నోటులో మహాత్మాగాంధీ బొమ్మ తలకు వెనుక ఆకుపచ్చ ప్యానెల్‌కు వెనుక సూక్ష్మమైన ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్‌పై సూక్ష్మంగా ఆర్బీఐ అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. అలాంటి అక్షరాలను భూతద్దం ద్వారా స్పష్టంగా కనపడుతుంది. * నకిలీ నోట్లలో సూక్ష్మాక్షరాలు ఉండవు. మైక్రో ప్రింటింగ్‌లోని నాణ్యత, స్పష్టత దొంగనోట్లలో ఉండదు. -
ఏటీఎంలో దొంగ నోటు..?
రాజాం: స్థానిక స్టేట్‌బ్యాంక్ ఏటీఎం నుంచి మంగళవారం వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడింది. పట్టణానికి చెందిన న్యాయవాది శాసపు అప్పలనాయుడు రెండు విడతలుగా బ్యాంకు ఏటీఎం నుంచి రూ.40 వేలను విత్ డ్రా చేసి మరో బ్యాంకులో జమ చేయడానికి వెళ్లగా అందులో ఒక వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడడంతో బ్యాంకు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని స్టేట్‌బ్యాంకు మేనేజర్ వినోద్‌కుమార్ వద్ద అప్పలనాయుడు ప్రస్తావించారు. తాము ఏటీఎంలో పెట్టిన నోట్లున పరిశీలించి పెడతామని, దొంగనోట్లు వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు ఏటీఎంలో పెట్టిన నోట్ల నెంబర్లు మీ వద్ద ఉంటాయా అని న్యాయవాది ప్రశ్నించగా అటువంటివి నమోదు చేయమని, పాత, కొత్త నోట్లు లక్షల రూపాయలను స్థానికంగా ఉన్న నాలుగు ఏటీఎంలలో పెడతామని అన్నారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే ఉన్నతాధికారులకు పంపించి చర్యలు తీసుకుంటామని మేనేజర్ స్పష్టం చేశారు. -
తిరుమలగిరి స్టేట్‌బ్యాంకులో దోపిడీ యత్నం
రూ.కోటి నగదు క్షేమం స్థానికంగా కలకలం బొల్లారం, న్యూస్‌లైన్: తిరుమలగిరి స్టేట్‌బ్యాంకులో దోపిడీ యత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు చేసిన ఈ ప్రయత్నం పోలీసులు, బ్యాంక్ అధికారులను కలవరానికి గురి చేసింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బ్యాంక్ అధికారులు బుధవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి రాజీవ్ రహదారిపై ఉన్న ఎస్బీఐలో గుర్తుతెలియని దుండగులు భవనం వెనుక ఉన్న కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోనికి ప్రవేశించారు. బ్యాంక్‌లోకి వెళ్లగానే మొదట విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న నాలుగు సీసీ కెమెరాల కనెక్షన్లను కట్ చేశారు. సీసీ కెమెరాలు చూపించిన సమయం ప్రకారం దుండగులు 6వ తేదీ (మంగళవారం) రాత్రి 11.30 గంటలు దాటిన తర్వాత బ్యాంక్‌లోకి వచ్చారని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఇద్దరు దుండగులు ప్రవేశించిన దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఆ తర్వాత దుండగులు లాకర్, స్ట్రాంగ్ రూమ్ వైపు వెళ్లినప్పటికీ అక్కడ వాటిని తెరిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా బ్యాంక్‌లోనే దాదాపు నాలుగు గంటల పాటు తిరిగినట్లు తేలింది. ఆ సమయంలో సిగరెట్ తాగడంతో పాటు గుట్కాలు తిని బ్యాంక్‌లోనే ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసిన మరకలు కనబడ్డాయి. ఈ నేపథ్యంలో దుండగులు బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించినప్పటికీ ధైర్యం సరిపోక తిరిగి వెళ్లిపోయారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి దుండుగులు ఎలాంటి చోరీ చేయకుండా వె ళ్లిపోవడంతో బ్యాంక్‌లో ఉన్న కోటి నగదు క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. రెండు నెలల కిందట ఇలాగే.. రెండు నెలల కిందట ఎస్బీఐకు కొద్ది దూరంలోనే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దుండగులు దోపిడీ యత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీ చేసిన గ్యాంగ్ సభ్యులే ఈ ఘటనకూ పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. అయితే ఆ ఘటనలో సరైన ఆధారాలు దొరక్కపోవడంతో కేసులో పురోగతి కనిపించ లేదు. ఆ గ్యాంగ్ సభ్యులేనా? ముత్తూట్ సంస్థలో దోపిడీ యత్నానికి పాల్పడ్డ వారే ఎస్బీఐ దోపిడికి యత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పోలీసులకు అలాంటి ఆధారాలేవీ లభించలేదు. సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలతో నిందితులను గుర్తించేందుకు పోలీ సులు ఫోరెన్సిక్ అధికారుల సహాయాన్ని తీసుకుంటున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు తప్పని తిప్పలు
చీపురుపల్లి : సిబ్బంది కొరత కార ణంగా స్థానిక స్టేట్‌బ్యాంక్ వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో అత్యం త ప్రాధాన్యత కలిగిన బ్రాంచి చీపురుపల్లి ఎస్బీఐ. ఈ బ్రాంచిలో దాదాపు 40 వేల ఖాతాలు ఉన్నాయి. ప్రతిరోజూ కోట్లాది రూపాయిలు టర్నోవర్ జరుగుతుంటుంది. అలాం టి ఈ బ్రాంచిలో రెండు నెలలుగా బ్రాంచి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు కిందట వరకూ ఇక్కడ మేనేజర్‌గా సేవలందించిన గోవింద్తివారి పదోన్నతిపై వెళ్లిపోయారు. తరువాత మేనేజర్‌ను నియమించలేదు. క్లరికల్, గుమస్తా సిబ్బంది కూడా తక్కువ శాతంలో ఉండడంతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాయంత్రం 4 గంటలకు సమయం ముగిసే సమయానికి కూడా ఇంకా పదుల సంఖ్యలో ఖాతాదారులు ఉంటారు. వారందరి పని ముగించాలంటే సిబ్బంది అదనంగా గంట సమయం సేవ లు అందించాల్సి ఉంటుంది. అదనంగా సేవలందిం చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఇటీవల ఖాతాదారులకు సిబ్బందికి మద్య వాగ్వాదం కూడా జరిగింది. పట్టణంలో అదనపు బ్రాంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయపడుతున్నారు. 3 -
ఎస్బీఐ క్విప్ ఇష్యూకు ఎల్ఐసీ తోడ్పాటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ఎల్ఐసీ అండతో విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎస్బీఐ రూ. 8,032 కోట్లను సమీకరించినట్లు సంబం ధిత వర్గాలు తెలిపాయి. క్విప్ ద్వారా రూ. 9,500 కోట్ల వరకూ సమీకరించేందుకు బ్యాంక్ బోర్డు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇష్యూలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 3,000 కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,000 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూలో భాగంగా షేరుకి గరిష్టంగా రూ. 1,629.35, కనిష్టంగా రూ. 1,565 ధరను బ్యాంక్ నిర్ణయించింది. అయితే అత్యధిక శాతం బిడ్స్ కనిష్ట ధరలోనే దాఖలైనట్లు తెలుస్తోంది. క్విప్ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎస్బీఐ షేరు 3.5% క్షీణించి రూ. 1,519 వద్ద ముగిసింది. క్విప్ తరువాత బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 62% నుంచి 58.6%కు పరిమితంకానుంది. -
‘బంగారు తల్లి’కి కష్టాలు
లబ్ధిదారుల ఖాతాల్లో పడని నగదు ఏపీజీబీ అకౌంట్లు ఇచ్చిన వారికి ఆన్లైన్ సమస్యలు పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న తల్లులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వారికి 2013 మే నుంచి పథకాన్ని ప్రారంభించారు. వైద్యశాలలో బిడ్డ జన్మించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేయగానే బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేయాలి. అప్పటి నుంచి కష్టాలు మొదటి ఏడాదికి వెయ్యి, 3,4,5 సంవత్సరాలకు ఏటా రూ. 1500, 6-10 సంవత్సరాలకు ఏడాదికి రూ. 2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు ఏడాదికి రూ. 2,500, 14-15 కు రూ. 3 వేలు, ఇంటర్మీడియెట్‌కు రూ. 3,500, డిగ్రీలో ఏడాదికి రూ. 4 వేలు, ఇంటర్ పూర్తయిన తర్వాత రూ. 50 వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 56 మండలాల్లో 7,412 మంది పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 4,475 మందికి మాత్రమే మొదటి ఇన్స్టాల్మెంట్ నగదు బ్యాంకు ఖాతాలో జమైంది. జిల్లాలోని అన్ని మండలాల ఏపీఎంల వ ద్ద 455, డీపీఎం వద్ద 165 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లబ్ధిదారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, తల్లీబిడ్డల ఫొటోలు, బ్యాంకు అకౌంట్ పుస్తకాలను మండల ఐకేపీ ఏపీఎంలకు అందజేశారు. - ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చిన జిల్లాలోని 140 మందికి ఆన్లైన్ సమస్యతో నేటికీ మొదటి విడత నగదు పడలేదు. సెప్టెంబర్‌లో ఏపీజీబీ ఖాతాలో నగదు జమ చేసినట్లు కంప్యూటర్లో పే స్లిప్‌లు తీసిచ్చారు. కానీ బ్యాంకులకు వెళ్లి చూసుకుంటే జమకాలేదు. అప్పటి నుంచి నిత్యం ఐకేపీ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. - స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన లబ్ధిదారులకు వెంటనే మొదటి ఇన్స్టాల్మెంట్ మంజూరైంది. 7 నెలల క్రితం నమోదు చేసుకున్న తల్లులు ఇంత వరకు నగదు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 6,526 మంది లబ్ధిదారులు సర్టిఫికెట్లన్నీ అందజేసినా చిన్నపాటి సమస్యలతో 2,051 మందికి సకాలంలో పథకం నగదు అకౌంట్లలో జమకాలేదు. అష్టకష్టాలు పడి అధికారుల చుట్టూ తిరిగి ఐకేపీ అధికారులు కోరిన సర్టిఫికెట్లు అందజేసినా పథకం వర్తించకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పే స్లిప్ వచ్చినా..నగదు పడలేదు కటికల రూతమ్మ, చింతలపాలెం 2013 జూన్ నెలలో బంగారు తల్లి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చాను. 2013 నవంబర్ నెలలో రూ. 2500 అకౌంట్లో పడినట్లు పేస్లిప్ ఇచ్చారు. బ్యాంక్‌కు వెళ్లి చూసుకుంటే నగదు జమకాలేదు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఆన్లైన్ సమస్య పరిష్కరిస్తున్నాం.. కృపారావు, డీపీఎం బంగారు తల్లి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఆన్లైన్ సమస్య ఉండటంతో ఆ బ్యాంకులో అకౌంట్లున్న తల్లులకు నగదు పడలేదు. ఈ మధ్య కాలంలో బ్యాంక్ ఆన్లైన్ కావడంతో సమస్య పరిష్కరిస్తున్నాం. కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఏపీఎంలు ఆన్లైన్లో పలుమార్లు తల్లుల ఏపీజీబీ ఖాతాలను నమోదు చేయడంతో ఆన్లైన్ అవుతున్నాయి. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది.