సుండుపల్లి: ప్రభుత్వం రూ.500లు, రూ.1000ల నోట్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. సిండికేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, జీకేరాచపల్లి స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ బ్యాంకులలో సైతం డబ్బులు లేక ఖాతాదారులు వెనుతిరిగిపోయారు. సామాన్య ప్రజలు ఉదయం బ్యాంకుల దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి డబ్బులు లేవు అని తెలియడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే డిపాజిట్లు మాత్రం జరిగాయి. విత్‌డ్రా మాత్రం డబ్బులు లేక బ్యాంకుల లావాదేవీలు జరుగలేదు. సహకార బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడంకానీ, డిపాజిట్ చేయడంకానీ అవకాశం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. సిండికేట్ బ్యాంకు ఏటీఎం సుండుపల్లి ఎస్‌బిఐ ఏటీఎం, జీకేరాచపల్లి ఎస్‌బీఐ ఏటీయం, ప్రైవేటు ఏటీఎంలు ఉన్నా డబ్బులు లేక ఏటీఎంలు తెరచుకోలేదు. సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు