apgb bank
-
బ్యాంకుల్లో నో క్యాష్
సుండుపల్లి: ప్రభుత్వం రూ.500లు, రూ.1000ల నోట్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. సిండికేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, జీకేరాచపల్లి స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ బ్యాంకులలో సైతం డబ్బులు లేక ఖాతాదారులు వెనుతిరిగిపోయారు. సామాన్య ప్రజలు ఉదయం బ్యాంకుల దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి డబ్బులు లేవు అని తెలియడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే డిపాజిట్లు మాత్రం జరిగాయి. విత్‌డ్రా మాత్రం డబ్బులు లేక బ్యాంకుల లావాదేవీలు జరుగలేదు. సహకార బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడంకానీ, డిపాజిట్ చేయడంకానీ అవకాశం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. సిండికేట్ బ్యాంకు ఏటీఎం సుండుపల్లి ఎస్బిఐ ఏటీఎం, జీకేరాచపల్లి ఎస్బీఐ ఏటీయం, ప్రైవేటు ఏటీఎంలు ఉన్నా డబ్బులు లేక ఏటీఎంలు తెరచుకోలేదు. సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు -
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
ఏపీ జీబీ మేనేజర్ చొరవతో వెలుగులోకి రైతుపై పోలీసులకు ఫిర్యాదు సూత్రధారులను పట్టుకోవాలని ఎస్సైని కోరిన తహసీల్దార్ కలిగిరి : బ్యాంక్‌లో పంట రుణం పొందడానికి తహసీల్దార్ స్టాంప్‌లు, సంతకాలు ఫోర్జరీ చేసిన రైతుపై శుక్రవారం తహసీల్దార్ రవీంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రవీంద్రనాథ్ సమాచారం మేరకు.. గంగిరెడ్డిపాళెం పంచాయతీ మార్తులవారిపాళెంకు మూలి పెంచలయ్య పట్టాదారు పాసుపుస్తకంతో పంట రుణం పొందడానికి గురువారం కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లాడు. చిన్నఅన్నలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 2680–2లో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పంట రుణం కోసం బ్యాంక్‌కు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేశాడు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో తహసీల్దార్ సంతకం తేడా ఉండటాన్ని బ్రాంచ్ మేనేజర్ ప్రదీప్ గుర్తించారు. రికార్డులు పరిశీలించి రుణం ఇస్తామని పెంచలయ్యను పంపించారు. అనంతరం తహసీల్దార్ రవీంద్రనాథ్‌కు సమాచారం అందించారు. ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తహసీల్దార్ తన సంతకం, వీఆర్వోల సంతకంతో పాటు స్టాంప్‌లు కూడా ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. సంతకం, స్టాంప్‌లు ధ్రువీకరణ పత్రాలపై ఫోర్జరీకి పాల్పడిన పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు స్టాంప్‌లు, సంతకాలు ఫోర్జరీలు చేస్తున్న సూత్రధారులను ప్రత్యేక చొరవ చూపి పట్టుకోవాలని ఎస్సై ఎస్కే ఖాదర్‌బాషాను తహసీల్దార్ రవీంద్రనాథ్ కోరారు. -
ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమారాచారి నెల్లూరు(బందావనం) : వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు చెందిన వ్యాపార ప్రతినిధుల వద్ద బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని ఆ బ్యాంక్ చైర్మన్ డి.సంపత్‌కుమారాచారి తెలిపారు. గురువారం నెల్లూరులోని కరెంటాఫీస్ సమీపంలో ఉన్న బ్యాంకు నెల్లూరు రీజినల్ కార్యాలయంలో ఆయన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్సిస్టం ఆఫ్–అస్ (ఏపీపీఎస్ ఆఫ్–అస్) సదుపాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తమ బ్యాంక్ సేవలను విస్త్రత పరచాలనే లక్ష్యంతో ‘ఏఈపీఎస్ ఆఫ్–అస్’ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్), పెన్షన్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం ద్వారా అందించే సొమ్ము మొత్తాన్ని బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జయచేయనుందన్నారు. ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు గ్రామీణ ప్రాంతాల్లో తమబ్యాంక్ వ్యాపార ప్రతినిధి నుంచి తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి ధన్యోజన పథకంలో 22,160 మంది ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య, ప్రధాన కార్యాలయం చీఫ్ మేనేజర్ జి.మస్తానయ్య పాల్గొన్నారు.