ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమారాచారి
నెల్లూరు(బందావనం) : వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు చెందిన వ్యాపార ప్రతినిధుల వద్ద బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని ఆ బ్యాంక్ చైర్మన్ డి.సంపత్‌కుమారాచారి తెలిపారు. గురువారం నెల్లూరులోని కరెంటాఫీస్ సమీపంలో ఉన్న బ్యాంకు నెల్లూరు రీజినల్ కార్యాలయంలో ఆయన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్‌సిస్టం ఆఫ్–అస్ (ఏపీపీఎస్ ఆఫ్–అస్) సదుపాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తమ బ్యాంక్ సేవలను విస్త్రత పరచాలనే లక్ష్యంతో ‘ఏఈపీఎస్ ఆఫ్–అస్’ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), పెన్షన్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం ద్వారా అందించే సొమ్ము మొత్తాన్ని బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జయచేయనుందన్నారు. ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు గ్రామీణ ప్రాంతాల్లో తమబ్యాంక్ వ్యాపార ప్రతినిధి నుంచి తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి ధన్‌యోజన పథకంలో 22,160 మంది ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య, ప్రధాన కార్యాలయం చీఫ్ మేనేజర్ జి.మస్తానయ్య పాల్గొన్నారు.