టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
జంప్డ్ డిపాజిట్ స్కామ్
జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంతకంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.
జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?
➤గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది.
➤ఒకవేళా మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.
➤బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫికెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.
➤ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి.
➤జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment