
ముంబై: ఆర్థిక మోసాలను నివారించే దిశగా బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కస్టమర్లకు చేసే కాల్స్‌కి సంబంధించి ’1600’ ఫోన్ నంబరింగ్ సిరీస్‌ను మాత్రమే ఉపయోగించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అలాగే, ప్రమోషనల్ అవసరాల కోసం బ్యాంకులు, ఇతరత్రా నియంత్రిత సంస్థలు (ఆర్‌ఈ) ’140’ నంబర్ల సిరీస్‌నే ఉపయోగించాలని పే ర్కొంది.
బ్యాంకులు, ఆర్‌ఈలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల డేటాబేస్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరంగా మారినప్పటికీ, దీనితో మోసాల ఉదంతాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. నిర్దేశిత ఆదేశాలను మార్చి 31 కల్లా అమలు చేయాలని సూచించింది.