
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్‌పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది.
ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్‌బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్‌బీ కూడా దీన్ని ఎన్‌పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment