power infrastructure
-
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
రెండింతలైన జీవీకే నష్టం
జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నష్టాలు దాదాపు రెండింతలయ్యాయి. మార్చి త్రైమాసికంలో నికర నష్టం క్రితంతో పోలిస్తే రూ.105 కోట్ల నుంచి రూ.206 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.17 కోట్ల నుంచి రూ.26 కోట్లకు చేరింది. 2016–17లో నికర నష్టం రూ.123 కోట్ల నుంచి రూ.271 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.67 కోట్ల నుంచి రూ.79 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలియజేసింది. -
11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రెడీ
3 నెలల్లో పూర్తి చేసిన రేస్ పవర్ ఇన్ఫ్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ సంస్థ రేస్ పవర్ ఇన్ఫ్రా మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న 11.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంది. 46 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమై.. మంగళవారంతో పూర్తి చేసుకున్నట్లు సంస్థ సీఈఓ కేతన్ మెహత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సోలార్ పార్క్ పాలసీలో భాగంగా చేపట్టిన 500 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఒకటని పేర్కొన్నారు.