punjab national bank
-
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
పీఎన్బీ రుణ రేట్లు కట్..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది. అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ ప్రకటించింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త డిపాజిట్ స్కీములు..
భారతీయులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుండటంతో ఎఫ్డీలు చాలా కాలంగా సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన ఎఫ్డీ పథకాలను ప్రారంభిస్తున్నాయి.ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా తాజాగా వివిధ టెన్యూర్లలో రెండు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను (FD schemes) ప్రారంభించింది. 303 రోజులు, 506 రోజుల టెన్యూర్ ఉండే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త 303 రోజుల వ్యవధి ఎఫ్డీలో డబ్బు డిపాజిట్ చేసే పెట్టుబడిదారులు 7 శాతం వడ్డీని పొందుతారు. అదేవిధంగా 506 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 6.7 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే ఈ రెండు ఎఫ్డీలలో ఎక్కువ వడ్డీని పొందుతారు.ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు.. చేశారో అంతే..!సీనియర్ సిటిజన్లకు 303 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీ, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 300 రోజుల వ్యవధి ఎఫ్డీలపై 7.85 శాతం, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది.ఇతర ఎఫ్డీలుపంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీ స్కీములను అందిస్తోంది. వీటిపై సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50% నుండి 7.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4% నుండి 7.75% వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై అత్యధికంగా సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉన్నఎఫ్డీలపై 4.30% నుండి 8.05% వడ్డీని అందిస్తోంది. వీరికి ప్రస్తుతం 400 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై 8.05% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. -
ఓటీపీ లేకుండానే రూ.1.90 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లేకుండానే రూ.1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లు ఫోన్లో మెసేజ్ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 1930 కాల్ సెంటర్లో ఏజెంట్ కాల్ రిసీవ్ చేసు కుని వెంటనే బ్యాంకింగ్ ఫాలోఅప్ బృందాన్ని అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి అక్కడున్న రూ.75,69,223లను స్తంభింప చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో రూ.35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్‌లో పెట్టించారు. ఈ విధంగా రూ.1.90 కోట్ల నిధుల్లో నుంచి రూ.1,10,70,000లను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. మిగిలిన రూ.79.30 లక్షల విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఒకట్రెండు గంటల్లోనే (గోల్డెన్ హవర్స్) ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు. -
నీరవ్ మోదీ రూ.29.75 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. రూ. 6,498 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్‌లు ఉన్నట్టు తెలిపారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది. కాగా ఇంతకు ముందు భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇవే గాక పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలర్ట్.. ఆగస్టు 12 డెడ్‌లైన్!
దేశంలో పురాతన, అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తమ కస్టమర్లను కోరింది. నిర్ణీత గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే, వారి ఖాతాలను నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అల్టిమేటం మార్చి 31 నాటికి కేవైసీ వివరాలు అప్డేట్ చేయని ఖాతాల కోసమని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ వంటివి అందించి కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్డేట్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. పీఎన్బీ వన్ యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఈ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్ని సందర్శించడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. -
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
మరో ఐదు బ్యాంకులకు 'ఆర్బీఐ' జరిమానా!.. కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు నిబంధనలను పీఎన్బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్‌పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
బ్యాంకులో పట్టపగలే రూ.18.80 కోట్ల దోపిడీ
ఇంఫాల్: మణిపూర్‌లోని ఓ బ్యాంకులో గురువారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని సాయుధ దుండగులు సుమారు రూ.18.80 కోట్లను దోచుకెళ్లారు. ఉఖ్రుల్ పట్టణంలోని వ్యూలాండ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. రిజర్వు బ్యాంకు అధికారులు ఉఖ్రుల్ జిల్లాలోని అన్ని ఏటీఎంలకు అవసరమైన నగదును వ్యూలాండ్ బ్రాంచిలో నిల్వ ఉంచుతుంటారు. గురువారం సాయంత్రం 5.40 గంటల సమయంలో అత్యాధునిక ఆయుధాలతో ముసుగులు ధరించిన దుండగులు బ్యాంకు సిబ్బంది ప్రవేశించే గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదిరించి వాష్‌రూంలో బంధించారు. క్యాషియర్‌కు తుపాకీ గురిపెట్టి, క్యాష్ వాల్ట్‌ను తెరిపించారు. మొత్తం రూ.18.80 కోట్లను ఎత్తుకెళ్లి పోయారు. -
ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లను ఏ మాత్రం పెంచకుండా యధాతధంగా ఉంచినప్పటికి.. రెండు బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో రుణ గ్రహీత కట్టాల్సిన ఈఎమ్ఐ అమాంతం పెరిగింది. ఇంతకీ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులేవీ? ఎంత శాతం వడ్డీ పెంచిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండూ కూడా తమ మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచింది. పెరిగిన ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. కావున ఎవరైతే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఉంటారో వారు కట్టాల్సిన ఈఎమ్ఐలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కావున ఓవర్ నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం & మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.50 శాతం, 8.85 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి చేరింది. ఓవర్ నైట్ 8.45% ఒక నెల 8.45% మూడు నెలలు 8.50% ఆరు నెలలు 8.85% ఒక సంవత్సరం 8.95% ఇదీ చదవండి: నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే? పంజాబ్ నేషనల్ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇది కూడా ఐదు బేసిస్ పాయింట్ల మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచింది. దీంతో ఈ బ్యాంక్ ఓవర్ నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8.5 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలకు సంబంధించిన రేట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతం, 8.55 శాతానికి పెరిగాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెంచారు. ఓవర్ నైట్ 8.15% ఒక నెల 8.25% మూడు నెలలు 8.35% ఆరు నెలలు 8.55% ఒక సంవత్సరం 8.65% మూడు సంవత్సరాలు 8.95% -
ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! ఆ మూడు బ్యాంకుల్లో..
ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ 'ఐసీఐసీఐ'తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలకమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మూడు బ్యాంకులు తమ 'మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను (MCLR) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది బహుశా కష్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రూల్స్ ఇప్పటికే (2023 ఆగష్టు 01) అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు బ్యాంకులు ఇచ్చే లోన్ మీద అమలు చేసే ఒక ప్రామాణిక వడ్డీ. ఒక వేలా ఎంసీఎల్ఆర్ రేట్లు పెరిగితే దీనికి అనుబంధంగా ఉండే వెహికల్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని ఈఎమ్ఐలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కొత్త నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ కారణంగా ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3 & 6 నెలల కాలానికి వరుసగా 8. 41 శాతం, 8.80 శాతానికి చేరాయి. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) ఇప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లు యధాతధంగా ఉన్నట్లు సమాచారం. కావున బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) ఇక చివరగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఇది కూడా కొత్త నిర్ణయాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం ఉండగా.. ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.15 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉంది. -
మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఫండ్ ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్‌లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే 1వ తేదీ నుంచి కస్టమర్ల ఖాతాలలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ లావాదేవీకి రూ.10 చొప్పున పెనాల్టీ ఛార్జీని బ్యాంక్ విధంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అలాగే ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయడానికి ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించింది. అయితే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే ఆ సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొందించింది. విఫలమైన ఏటీఎం ట్రాన్సాక్షన్ గురించి కస్టమర్లు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800180222 లేదా 18001032222 ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. కాగా మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10తోపాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు బ్యాంక్ ఇదివరకే సమాచారం అందించింది. -
షాక్: ఈ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10 ప్లస్ జీఎస్టీ
నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతున్నది. ఈ తరుణంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను నిబంధనల్లో మార్పులు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్, టోల్ ట్యాక్స్, పన్ను రాయితీల నుంచి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ చెల్లించే అంశాల్లో ఇలా అనేక మార్పులు జరుగుతాయి. ఈ తరుణంలో ప్రముఖ ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాదారులకు షాకిచ్చింది. మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10 + జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు మెసేజ్ రూపంలో సమాచారం అందించింది. డెబిట్ కార్డ్ ఛార్జీలపై సవరణ పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం..సవరించిన ఛార్జీలు డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ ఛార్జీలు, వార్షిక నిర్వహణ ఛార్జీలను అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు బ్యాంక్ తెలియజేసింది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనందున డెబిట్ కార్డ్ ద్వారా చేసే పీఓఎస్ (Point of sale), ఈ-కామర్స్ లావాదేవీలపై (డొమెస్టిక్ / ఇంటర్నేషనల్) ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బ్యాంక్ అకౌంట్లో రూ.236, జైలులో దుర్భర జీవితం గడుపుతున్న నీరవ్ మోదీ
నీరవ్ మోదీ! ఒకప్పుడు ప్రముఖ బిలియనీర్. కానీ ఇప్పుడు చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తూ జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన కేసులో కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కావాలని అర్రులు చాస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీరవ్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2019లో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి వేల కోట్ల ఎగనామం పెట్టి యూకేకి పారిపోయాడు. అక్కడ భారత్‌లో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అ తర్వాత నీరవ్ పతనం ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం.. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) వద్ద రూ. 236 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐకి రూ. 2.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాంక్‌లకు నీరవ్ చెల్లించాల్సిన మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది. అప్పు కావాలి! కాగా, గత వారం భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు నీరవ్‌ను ఆదేశించింది. కానీ నీరవ్ మోదీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. దీంతో మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. అందుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, తనకు తగిన వనరులు లేవని, కోర్టుకు చెల్లించే మొత్తాన్ని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్‌కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్‌లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్‌లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్‌లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, బీవోఐ రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: గృహ రుణాల ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతోపాటు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రుణాల రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. కనీస రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును హెచ్డీఎఫ్సీ 0.25 శాతం పెంచి 9.20 శాతానికి చేర్చింది. అయితే, 760 కంటే మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.70 శాతానికే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.10% పెంచింది. దీంతో పీఎన్బీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.5%కి చేరింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలను ఈ రేటు ఆధారంగానే బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఆర్ఎల్ రేటును 0.10% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ ఎంపీసీ ఫిబ్రవరి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడం తెలిసిందే. ఇక గతేడాది మే నెల నుంచి చూసుకుంటే మొత్తం పెంపు 2.50 శాతంగా ఉంది. -
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి కేంద్రం భారీ షాక్!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. కటకటాల్లోకి మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్‌లో ఉన్న నీరవ్‌ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆస్తుల వేలం ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్ ఆదేశాలతో నీరవ్‌కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్ జరగనుంది. అధికారుల దర్యాప్తు ముమ్మరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. ప్రాప్టరీ విలువ ఎంతంటే విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్సర్లో ఉన్న యో పూణే హౌసింగ్ స్కీమ్‌లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు. నోటీసులు జారీ వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్‌కు చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ ఆర్ యూఎస్, ఏఎన్ఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్డీఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు. -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్‌కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్‌లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్‌కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఎన్పీఏల భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్టాండలోన్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో 63% తగ్గిరూ.411 కోట్లకు చేరింది. ఆదాయం రూ.23,001 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,105 కోట్లు, ఆదాయం రూ.21,262 కోట్ల చొప్పున ఉన్నాయి. మొండి బకాయిల భారం కొంత తగ్గినప్పటికీ.. వీటి కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలను ప్రభావితం చేసింది. వడ్డీ ఆదాయం రూ.17,980 కోట్ల నుంచి రూ.20,154 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.8,271 కోట్లుగా ఉంది. రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 13.36 శాతం నుంచి 10.48 శాతానికి (రూ.87,034 కోట్లు) తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.49 శాతం నుంచి 3.80 శాతానికి పరిమితమయ్యాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత దంపతులు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. చదవండి: (దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్) -
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రుణాల పేరిట బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. -
ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పీఎన్బీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాలాల ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే 10-20 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్ల పునరుద్ధరణ రెండింటికీ వర్తిస్తాయని పీఎన్బీ స్పష్టం చేసింది. సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50శాతంగా ఉంటుంది. రెండు నెంచి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ చెల్లిస్తుంది. పీఎన్బీ ఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ అందించే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ పీఎన్‌బీఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ పథకం వ్యవధి 91 రోజుల నుండి 1111 రోజుల వరకు ఉంటుంది . ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు వరుసగా 4.05శాతం 5.55 శాతం దాకా ఉంటుంది. -
మిషన్.. స్వదేశీ
భారత స్వాతంత్య్ర పోరాటం జోరందుకుంటున్న తరుణమది. తెల్లదొరలు అడ్డగోలుగా చేసిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ 1905లో విదేశీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ ఉద్యమం పెల్లుబికింది. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు ముందుకొచ్చారు. తదనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు స్వదేశీ నినాదమే పట్టుగొమ్మగా నిలిచింది. ఈ ఉద్యమాలు అప్పటి ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్వదేశాగ్నిని రగిలించడంతో.. దేశంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పురుడుపోసుకున్నాయి. ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పురోభివృద్ధి సాధిస్తున్నాయి. మరికొన్ని కాలానుగుణంగా కొత్త మార్పులను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన భారత్‌కు చేదోడుగా నిలుస్తున్నాయి. శతాబ్ది స్వాతంత్య్ర వేడుకల నాటికి ‘స్వదేశ్ 2.0’తో దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్నది ‘మేకిన్ ఇండియా’ లక్ష్యం. దీని సాకారానికి ‘ఆత్మనిర్భర్‘తో సమాయత్తమవుతున్న వేళ... 1947కు పూర్వం మొగ్గతొడిగిన మన స్వదేశీ వ్యాపారామృతాల్లో కొన్నింటి గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెమరువేసుకుందాం. బ్యాంకింగ్‌లో ‘పంజా’బ్! స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్.. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలంటే స్వదేశీ సంస్థల ఏర్పాటుతోనే సాధ్యమని భావించారు. మన దేశ సంపదను బ్రిటిష్ బ్యాంకులు, కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేయాలంటే.. మనకంటూ ఒక భారతీయ బ్యాంక్ ఉండాలనుకున్నారు. అలా ఆవిర్భవించిందే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). 1895 ఏప్రిల్ 12న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి బ్రాంచ్‌లో మొదటి బ్యాంక్ అకౌంట్‌ను తెరిచిన వ్యక్తి లాలా లజపతి రాయ్. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వరాజ్య సారథులు సైతం ఈ బ్యాంకు ఖాతాదారులుగా మారారు. భారత్‌లో టెల్లర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ (1944లో) కూడా ఇదే. దేశ విభజనను ముందే పసిగట్టిన అప్పటి పీఎన్బీ సారథి లాలా యోద్ రాజ్.. బ్యాంక్ రిజిస్టర్డ్ ఆఫీసును లాహోర్ నుంచి ఢిల్లీకి తరలించారు. విభజన తర్వాత పశ్చిమ పాకిస్థాన్‌లోని 92 బ్రాంచ్‌లను పీఎన్బీ మూసేసింది. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడంతో పీఎన్బీ ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. సంక్షోభాలు, కుంభకోణాలు ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తన స్వదేశీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇంట్లో బీరువా.. ఇంటికి తాళంకప్ప.. ఒంటికి సబ్బు! స్వదేశీ ఉద్యమ నినాదం మార్మోగుతున్న వేళ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్.. సబ్బుల తయారీలో ‘స్వదేశీ‘ సత్తా ఏంటో చాటుతామని ప్రతినబూనారు. 1918లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెజిటబుల్ ఆయిల్‌తో స్నానపు సబ్బు ‘చావీ’ని తయారు చేసి రికార్డు సృష్టించారు. తొలుత నం. 2, తర్వాత నం.1 పేర్లతో ఈ బ్రాండ్‌లో సబ్బులు ప్రవేశపెట్టారు. ఈ స్వదేశీ సబ్బులకు రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ టాగోర్ వంటి దిగ్గజాలు ప్రచారం చేయడం విశేషం. ఇక 1920 చివర్లో వచ్చింది గోద్రెజ్ ‘వత్నీ’! దీనికి అర్థం ‘వతన్ సే’.. అంటే ‘మాతృభూమి నుంచి’ అన్నమాట! వందేళ్ల తర్వాత కూడా నం.1 బ్రాండ్ ఉండటమే కాకుండా, ఏటా 38 కోట్లకు పైగా సబ్బులు అమ్ముడవుతున్నాయి. 1897లో సోదరుడితో కలసి గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు అర్దేశిర్. మొదట్లో తాళాలు, సేఫ్‌లు, సెక్యూరిటీ పరికరాలను తయారు చేసేవారు. అంతేకాదు 1951లో జరిగిన తొలి భారత సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను తయారు చేసిందీ గోద్రెజే కావడం విశేషం. అప్పట్లో ఇంట్లో గోద్రెజ్ బీరువా, ఇంటికి గోద్రెజ్ తాళంకప్ప.. ఈ ఉత్పత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఫర్నిచర్ నుంచి కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, గృహోపకరణాలు, ఇన్ఫోటెక్, ఏరోస్పేస్.. ఇలా 15 రంగాలకు పైగా విస్తరించి ఆత్మనిర్భర్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది గోద్రెజ్. షర్బత్ అంటే.. రూహ్ అఫ్జా! స్వాతంత్య్రోద్యమ కాలంలో పక్కా మేడిన్ ఇండియా బ్రాండ్‌గా ఆవిర్భవించింది ‘హమ్దర్ద్’. 1906లో హకీమ్ హఫీజ్ అబ్దుల్ ఢిల్లీలో ఈ యునానీ ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పారు. ఆ తర్వాత అది తన విలక్షణ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ చిరపరిచితంగా మారిపోయింది. షర్బత్ అంటే ‘రూహ్ అఫ్జా’ అనేంతగా ప్రాచుర్యం సంపాదించింది. అనేక యునానీ ఔషధాలనూ ఇది విక్రయిస్తోంది. హఫీజ్ మరణానంతరం కుమారుడు హకీమ్ అబ్దుల్ హమీద్‌తో కలసి భార్య రబియా బేగమ్ ఈ వ్యాపారాన్ని ఏమాత్రం రుచి తగ్గకుండా కొనసాగిస్తూ.. భారతీయుల మదిలో సుస్థిర స్వదేశీ బ్రాండ్‌గా నిలబెట్టారు. ఉద్యమానికి స్ట్రాంగ్ ‘చాయ్!’ స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో చాలా టీ ఎస్టేట్లు ఉన్నా.. వాటిని బ్రిటిషర్లు తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పీసీ ఛటర్జీ.. ఈ దుస్థితిని గమనించి.. తన వ్యాపారానికి సరికొత్త స్వదేశీ ‘రుచి’ని అందించాలని నిర్ణయించారు. ఆ విధంగా కోల్‌కతా కేంద్రంగా 1912లో లక్ష్మీ టీ కంపెనీ ఆవిర్భవించింది. కింగ్ ఆఫ్ పంజాబ్ – రాజా సింగ్ బ్లెండ్ నుంచి.. క్వీన్ ఎలిజబెత్ బ్లెండ్ వరకూ లక్ష్మీ టీ తన ప్రతి ఉత్పత్తిలోనూ చరిత్రను పెనవేసుకునేలా చేసింది. విఖ్యాత డార్జిలింగ్ టీతో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఎస్టేట్లు లక్ష్మీ గ్రూప్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా టీ ఎగుమతులు చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ టీ బ్రాండ్లకు తేయాకు సరఫరా చేసేది ఇదే. ఏటా 3 కోట్ల కేజీల టీ ఉత్పత్తి చేస్తూ.. స్వదేశీ ఘుమఘుమలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది. మన ‘చెప్పు’చేతల్లో...! మెట్రో షూస్.. ముంబైలోని ఒక చెప్పుల షాపులో సేల్స్‌మన్‌గా పనిచేసిన మాలిక్ తేజానీ.. దేశ విభజనలో ఆ షాపు యజమానులు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో 1947లో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి దాన్ని కొన్నారట. అప్పటి బొంబాయి నగరంలో పేరొందిన మెట్రో సినిమా దగ్గర్లో ఉండటంతో దానికి మెట్రో షూస్‌గా పేరు పెట్టారు. ఆయన తదనంతరం 16 ఏళ్ల వయసులో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు రఫీక్ తేజానీ.. అంచెలంచెలుగా దాన్ని దేశ ప్రజలకు ప్రియమైన పాదరక్షల బ్రాండ్‌గా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీకి సీఈఓగా ఉన్న మాలిక్ మనుమరాలు ఫరా మాలిక్ భాంజీ దీన్ని మెట్రో బ్రాండ్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో కూడా లిస్టింగ్ చేసి, తనదైన నడకలు నేర్పుతూ ముందడుగు వేస్తున్నారు. డెనిమ్ కింగ్.. అరవింద్ దేశంలో 1897లోనే లాల్‌భాయ్ దల్పత్ భాయ్ సారస్పూర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరుతో అహ్మదాబాద్‌లో టెక్స్టైల్ మిల్లును స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయన కుమారుడు లాల్‌భాయ్.. కుటుంబ సభ్యులు కస్తూర్భాయ్, నరోత్తమ్భాయ్, చిమన్‌భాయ్ 1931లో మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమం పిలుపుతో.. అరవింద్ మిల్స్‌ను అధునాతన సాంకేతికతతో నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం స్పీడు పెంచిన ఈ కంపెనీ.. 1980లో యువతకు భారతదేశపు తొలి డెనిమ్ (జీన్స్ క్లాత్) వస్త్ర బ్రాండ్ ఫ్లయింగ్ మెషిన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుగా నిలుస్తోంది. అంతేకాదు, 2015లో తొలిసారిగా ఖాదీ డెనిమ్‌ను తీసుకొచ్చి స్వదేశీ వారసత్వాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అరవింద్.. టెక్స్‌టైల్స్‌తో పాటు రియల్టీ, రిటైల్ తదితర రంగాల్లోకీ విస్తరించింది. అరవింద్ తయారు చేసిన ఫ్యాబ్రిక్‌తో భూమిని 6 సార్లు చుట్టేసి రావచ్చట!! చెదపట్టని ‘ఎస్ చంద్!’ దేశంలో విదేశీ పుస్తకాలకు బదులు.. భారతీయ రచయితలు, విద్యావేత్తలు రాసిన అచ్చమైన స్వదేశీ పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఆవిర్భవించినదే.. ఎస్ చంద్. 1939లో శ్యామ్‌లాల్ గుప్తా ఈ పబ్లిషింగ్ సంస్థను ప్రారంభించారు. ప్రొషెసర్ బహల్ అండ్ తులి రాసిన ‘టెక్ట్స్‌బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ’ అనేది ఎస్ చంద్ పబ్లిష్ చేసిన తొలి టెక్ట్స్‌బుక్. దేశంలోని బోర్డు స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీ పరీక్షల్లో కోట్లాది విద్యార్థులకు ఎస్ చంద్ పుస్తకాలు చిరపరిచితమే. విద్యా రంగంలో పుస్తకాలకు ఎస్ చంద్ పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఏటా 5 కోట్ల టెక్ట్స్పుస్తకాలను విక్రయిస్తున్న ఈ 80 ఏళ్ల మేడిన్ ఇండియా బ్రాండ్.. పుస్తక ప్రపంచంలో ఇప్పటికీ తన స్థానానికి చెద పట్టనివ్వకుండా రెపరెపలాడుతోంది. వాహ్ తాజ్! దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెబితే పర్యాటకులకు టక్కున గుర్తొచ్చేది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్! అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం అప్పట్లో ముంబైలో ప్రసిద్ధి చెందిన వాట్సన్ లగ్జరీ హోటల్లోకి (దీని మొదటి యజమాని బ్రిటిషర్ జాన్ వాట్సన్) అడుగుపెట్టే భారతీయులను చాలా చిన్న చూపు చూసేవారట. దీంతో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా ఎలాగైనా మనకు కూడా యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా ఒక లగ్జరీ హోటల్ ఉండాలనుకున్నారు. ఆ స్వదేశీ కాంక్షతోనే 1902లో ఇండియన్ హోటల్స్ కంపెనీని స్థాపించి, 1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కట్టారు. తాజ్ హోటల్ దెబ్బకు ప్రభ కోల్పోయిన వాట్సన్‌ను 1944లో ఇండియన్ హోటల్స్ కొనుగోలు చేయడం విశేషం (తర్వాత 1980లలో దీన్ని అమ్మేసింది). 1984లో లండన్‌లోని సెయింట్ జేమ్స్ కోర్ట్ హోటల్‌ను చేజిక్కించుకుని బ్రిటిష్ కోటలో పాగా వేసింది. ఇండియన్ హోటల్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా 80 నగరాల్లో 196కు పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. అది ‘అరబిక్ కడలందం’గా నిలుస్తూ వాహ్ తాజ్ అనిపిస్తోంది!! టాటాల ‘ఉప్పు’ తింటున్నాం..! 1868లో 29 ఏళ్ల జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా రూ.21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించిన టాటా గ్రూప్.. నేడు ఆకాశమే హద్దుగా భారత్‌కు వ్యాపార జగత్తులో ఖండాతర ఖ్యాతిని తీసుకొచ్చింది. 1907లో జంషెడ్‌పూర్‌లో ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా టాటా స్టీల్‌ను నెలకొల్పి జంషెడ్జీ టాటా కలలను సాకారం చేశారు ఆయన తనయుడు సర్ దొరాబ్జీ టాటా. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి, భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టులు, కాండ్లా పోర్టు, చండీగఢ్ నగర నిర్మాణాలకు ‘స్టీలెత్తిన’ కంపెనీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ టాప్–10 స్టీల్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న టాటా స్టీల్.. 2006లో అంగ్లో–డచ్ కంపెనీ కోరస్‌ను ఏకంగా 8.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటిషర్లకు స్వదేశీ ‘ఉక్కు’ సంకల్పం అంటే ఏంటో చాటిచెప్పింది. 1910లో టాటా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీగా ఆవిర్భవించిన టాటా పవర్ నేడు దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తోంది. 1929లో టాటా ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పి భారతీయుల ఆర్థిక స్వేచ్ఛా కలను వినువీధిలో విహరింపజేశారు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా. 1946లో ఎయిర్ఇండియాగా పేరుమార్చుకుని, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం చెంతకు చేరినా.. తాజాగా మళ్లీ టాటాల గూటికే వచ్చి వాలింది ఈ లోహ విహంగం! ఇక హమామ్ బ్రాండ్ సబ్బు 1931లో టాటాలు తీసుకొచ్చిందే. ‘దేశ్ కా నమక్’గా పేరొందిన టాటా సాల్ట్ తయారీ సంస్థ టాటా కెమికల్స్ 1939లో ఆవిర్భవించింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్ ఐయొడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టింది. 1945లో టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)గా ఆరంభమైన టాటా మోటార్స్.. 2008లో బ్రిటిష్ ఐకానిక్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్రోవర్ను చేజక్కించుకుని మన సత్తాను చాటింది. ఐటీ రంగంలో దేశానికి మణిమకుటంగా వెలుగొందుతోంది టీసీఎస్. 150 ఏళ్ల చరిత్రతో ఉప్పు.. పప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు 30కి పైగా కంపెనీలతో మిషన్ స్వదేశీకి మూలస్తంభంగా నిలుస్తోంది టాటా. టీవీ‘ఎస్!’ 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన టీవీఎస్ గ్రూప్.. మొదట సదరన్ రోడ్‌వేస్ పేరుతో బస్సులు, ట్రక్కుల ట్రాన్స్పోర్ట్ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటి 2 సీట్ల మోపెడ్ (టీవీఎస్ 50)ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వివిధ విదేశీ ఆటోమొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో ద్వి, త్రిచక్ర వాహన రంగంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. ఇప్పుడిది ఆటోమొబైల్, ఏవియేషన్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఫైనాన్స్ వంటి రంగాల్లో అనేక కంపెనీలతో స్వదేశీ బహుళజాతి కంపెనీగా ఎదిగింది. టీవీఎస్ ఎక్స్ఎల్ పేరుతో మోపెడ్ రంగంలో ఇప్పటికీ ఈ కంపెనీ.. ఒకే ఒక్కడుగా చక్రం తిప్పుతోంది. స్వరాజ్య చరిత్రను లిఖించిన మన ‘రత్నం!’ స్వాత్రంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందిస్తే.. ఆ చరిత్రను లిఖించేందుకు తన సిరాను చిందించి.. అసలు సిసలు స్వదేశీ ‘రత్నం’గా నిలిచింది మన పెన్ను! 100% స్వదేశీ సిరా పెన్ను తయారు చేయాలన్న గాంధీజీ పిలుపుతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం 1932లో ‘రత్నం పెన్స్’ సంస్థను స్థాపించారు. 1935లో మహాత్మా గాంధీ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు స్వయంగా తమ సంస్థలో తయారైన పెన్నును ఆయనకు బహూకరించారట. ఈ ఫౌంటెన్ పెన్నులతో దాదాపు 31 వేల ఉత్తరాలను గాంధీజీ రాశారని ఆయన వారసులు చెబుతారు. అంతేకాదు, స్వదేశీ ఉద్యమానికి తన కలం ద్వారా ఇంకు నింపినందుకు రత్నంను అభినందిస్తూ ఆ పెన్నుతో గాంధీజీ స్వయంగా రాసిన లేఖ ఇప్పటికీ కేవీ రత్నం కుటుంబీకుల వద్ద భద్రంగా ఉంది. తొలి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. వంటి మహామహులందరూ రత్నం పెన్నులకు అభిమానులే. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ సైతం రత్నం సన్స్ తయారు చేసిన పెన్నును బహూకరించి, స్వదేశీ భారత్‌కు చెక్కుచెదరని బ్రాండ్‌గా దీని గొప్పతనాన్ని వివరించడం విశేషం. ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్‌లా ఉండే ఈ పెన్నుల రేట్లు రూ. 300 నుంచి రూ. 35,000 స్థాయి వరకూ (స్టీల్ పాళీ నుంచి 22 క్యారెట్ల బంగారంతో తయారైన పాళీ దాకా) ఉంటాయి. ఏకంగా రూ. 2 లక్షల పైగా విలువైన ప్రత్యేకమైన గోల్డ్ పెన్ కూడా ఉంది. ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్సైట్ గానీ లేకుండానే కేవలం నోటిమాటే ప్రచారంగా.. ఈ పోటీ ప్రపంచంలో దాదాపు 90 ఏళ్లుగా సిసలైన రత్నంగా నిలుస్తోంది! ‘అమృతాంజనం! నొప్పొస్తే.. ‘అమ్మా కాదు.. అమృతాంజనం’ అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిన బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదేమో! 129 ఏళ్ల క్రితం 1893లో వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు ఇలా ఒకటేంటి.. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కాశీనాథుని నాగశ్వరరావు రూపొందించిన ఈ నొప్పి నివారణ ఔషధం.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఎంతంటే, తలనొప్పి–అమృతాంజనం అనేంతలా! కుటుంబ సంస్థగా మొదలై.. 1936లో అమృతాంజన్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను కూడా ప్రారంభించి.. పత్రికా ప్రపంచంలో చరిత్ర సృష్టించడం విశేషం. స్వాతంత్య్రానంతరం అమృతాంజనానికి పోటీగా ఎన్ని రకాల ఔషధాలు వచ్చినా.. నేటికీ దీని స్థానం చెక్కుచెదరలేదు. అమృతాంజన్ హెల్త్‌కేర్‌గా పేరు మార్చుకుని, నాగేశ్వరరావు మనుమడు శంభు ప్రసాద్ సారథ్యంలో నేడు అమృంతాంజన్ సంస్థ ఫుడ్, సాఫ్ట్వేర్ రంగాల్లోకి కూడా విస్తరించింది. స్టాక్ మార్కెట్లో సైతం లిస్టయ్యి.. రూ. 2,400 కోట్ల మార్కెట్ విలువతో స్వదేశీ ‘బ్రాండ్’బాజా మోగిస్తోంది!! -శివరామకృష్ణ మిర్తిపాటి -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
పెట్రోల్‌పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!
న్యూఢిల్లీ: పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్‌గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. ‘‘ఇంధన కొనుగోళ్లపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తెలిపింది’’ అంటూ పీఎన్బీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మే నెల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు పీఎన్బీ తెలిపింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నాటి నిర్ణయం వల్ల వ్యవస్థలో నగదుకు కొంత కాలం పాటు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు డిజిటల్ రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు 0.75 శాతం రాయితీ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కోరింది. దీంతో 2016 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులపై రాయితీ లభించింది. ఈ ప్రోత్సాహకాన్ని క్రెడిట్ కార్డులపై ముందే తొలగించారు. ఇప్పుడు మిగిలిన డిజిటల్ చెల్లింపులపైనా ఎత్తేసినట్టు అయింది. చదవండి: ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు.. -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్‌బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో కీలక పురోగతి
-
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్‌దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
PNB SCAM: బ్యాంకులకు మళ్లీ కన్నం.. ఈసారి రూ.2060 కోట్ల మోసం !
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వరుస దెబ్బలను ఎదుర్కొంటోంది. రూ.2,060 కోట్ల భారీ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్పీఏ)గా ప్రకటించింది. ఢిల్లీ జోనల్ ఆఫీస్ పరిధిలోని ‘ఎక్స్ట్రా లార్జ్ కార్పొరేట్ బ్రాంచ్’ పరిధిలో ఇది జరిగినట్టు తెలిపింది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్బీఐకి రిపోర్ట్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది. పీఎన్బీ కంటే ముందే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించడం గమనార్హం. రూ.148 కోట్ల రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించి ఆర్బీఐకి సమాచారం ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థే (ఎస్పీవీ) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్. తమిళనాడులోని కడలోర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అమలుకు దీన్ని ఏర్పాటు చేసింది. మూడు విభాగాలు... నిర్ణీత కాలవ్యవధిలోపు రుణ చెల్లింపులు రాని ఖాతాలను ఎన్పీఏగా గుర్తించి ఆర్బీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్ఎంఏ–0 విభాగం కింద ఖాతాలను డిఫాల్ట్ కేసుగా పరిణిస్తారు. 30రోజులుగా అసలు, వడ్డీ చెల్లింపులు చేయని ఖాతాలు ఈ విభాగం కిందకు వస్తాయి. బకాయి మొత్తాన్ని చెల్లించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్ఏ–1 విభాగం కింద 31–60 రోజులుగా చెల్లింపులు చేయని (పూర్తిగా/పాక్షికంగా) ఖాతాలను చేరుస్తారు. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ కింద పరిష్కార చర్యలను బ్యాంకులు చేపడతాయి. ఎస్ఎంఏ–3 కింద 61–90 రోజులుగా చెల్లింపులు చేయని ఖాతాలు వస్తాయి. ఈ ఖాతాలను బ్యాంకులు ఎన్సీఎల్టీ ముందుకు తీసుకెళతాయి. -
పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!
చెక్కు మోసాల నుంచి బ్యాంకు ఖాతాదారులను రక్షించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేస్తామని నేడు తెలిపింది. ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల కోసం వచ్చే నెల నుంచి పీపీఎస్ తప్పనిసరి చేయనున్నట్లు రుణదాత తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. 1 జనవరి 2021 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో ₹50,000, అంతకంటే విలువ కలిగిన చెక్కుల కోసం పీపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్) కింద పెద్ద మొత్తం గల చెక్కును క్రాస్ చెక్ చేసే సమయంలో కొన్ని వివరాలను తప్పక తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్బీ కస్టమర్లు అకౌంట్ నెంబరు, చెక్ నెంబరు, చెక్ ఆల్ఫా కోడ్, జారీ తేదీ, మొత్తం, లబ్ధిదారుపేరు వంటి వివరాలను తెలపాల్సి ఉంటుంది. చెక్ క్లియరింగ్ కోసం కనీసం 24 పనిగంటల ముందు చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. కస్టమర్లు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ లేదా తమ హోమ్ బ్రాంచీకి వెళ్ళి వివరాలను పంచుకోవచ్చు. ₹5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను క్లియర్ చేయడం కోసం పాజిటివ్ పే సిస్టమ్ వేసులుబాటును ఆర్బీఐ బ్యాంకులకు కల్పించింది. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్‌ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్‌పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి పంజాబ్ & సిండ్ బ్యాంక్ పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!) -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారులకు అందించే సేవలకు సంబంధించిన చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఖాతా బ్యాలన్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచిన జాబితాలో ఉన్నాయి. కనీస బ్యాలెన్స్: మెట్రో ప్రాంతంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఎబి) పరిమితిని ₹10,000కు పెంచారు. ఇంతకు ముందు పరిమితి ₹5,000గా ఉండేది. త్రైమాసిక కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు గ్రామీణ ప్రాంతాల్లో రుసుమును ₹200 నుంచి ₹400కు, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో ₹300 నుంచి ₹600పెంచినట్లు పీఎన్బీ తెలిపింది. బ్యాంక్ లాకర్ ఛార్జీలు: పీఎన్బీ గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో తన లాకర్ అద్దె ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను ₹500 పెంచారు. బ్యాంక్ లాకర్: జనవరి 15, 2021 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ ని ఏడాదికి ఉచితంగా చూసే సంఖ్య 12(ఇంతకముందు 15)కు తగ్గుతుంది. ఆ తర్వాత లాకర్ తెరిచిన ప్రతిసారి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్ మూసివేత ఛార్జీలు: కరెంటు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అపరాధ రుసుము చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.600గా ఉండేది. కరెంటు ఖాతా తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. పొదుపు ఖాతా లావాదేవీల రుసుము: జనవరి 15 నుంచి పీఎన్బీ నెలకు 3 ఉచిత లావాదేవీలను చేసుకునే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹50/(బీఎన్ఏ, ఏటీఎమ్, సిడీఎమ్ వంటి ప్రత్నామ్నాయ ఛానళ్లు మినహాయించి) ఛార్జ్ చేస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్ ఖాతాలకు ఇది వర్తించదు. ఇంకా పొదుపు, కరెంట్ ఖాతాల్లో లావాదేవీ ఫీజులను కూడా పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ బేస్, నాన్-బేస్ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలను బ్యాంకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆపై చేసే ప్రతి లావాదేవీకి రూ.25 ఛార్జ్ చేస్తుంది. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు: పొదుపు, కరెంట్ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్ పరిమితిని తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹2 లక్షల నుంచి ₹1 లక్షకు తగ్గించింది. (చదవండి: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!) -
రూల్స్ ఉల్లంఘన.. పిఎన్‌బి, ఐసీఐసీఐకు భారీ పెనాల్టీ!
భారతీయ బ్యాంకులకు పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి), ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. కేంద్ర బ్యాంకు పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా విధించగా, ఐసీఐసీఐ బ్యాంకు మీద 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 చట్టంలోని కొన్ని సెక్షన్లను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (2)కు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో పిఎన్‌బి బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ కనుగొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో చూపించాలని ఆర్బీఐ బ్యాంకు పిఎన్‌బికి నోటీసు జారీ చేసింది. విచారణ సమయంలో చేసిన బ్యాంక్ పేర్కొన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో పేర్కొన్న కొన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ఆర్బీఐ పిఎన్‌బి బ్యాంకుపై జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తేలింది. ఐసీఐసీఐపై రూ.30 లక్షల జరిమానా ఐసీఐసీఐ బ్యాంకుకు పొదుపు బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణ విషయంలో శిక్షారుసుములు విధించడంపై కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకుండా, నిబందనలకు విరుద్దంగా పొదుపు ఖాతాదారుల నుంచి కనీస బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు ఛార్జీలు వసూలు చేయడంతో ఐసీఐసీఐకు బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉండటంతో జరిమానా విధించినట్లు తెలిపింది. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!) -
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 18 కోట్ల ఖాతాదారులకు భారీ షాక్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) సర్వర్‌లో భారీ లోపం ఒకటి తాజాగా బయటపడింది. ఈ లోపం వల్ల సుమారు ఏడు నెలల పాటు తన 18 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటకి వెల్లడైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 తెలిపింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇంతలో బ్యాంకు ఈ లోపం గురించి ధృవీకరించింది, కానీ దుర్బలత్వం కారణంగా కీలకమైన డేటా బహిర్గతం కాలేదని తెలిపింది. "దీని వల్ల కస్టమర్ డేటా/అప్లికేషన్లు ప్రభావితం కావు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్వర్ షట్ డౌన్ చేసినట్లు" అని పీఎన్బీ తెలిపింది. "పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) గత 7 నెలలుగా 180 మిలియన్లకు పైగా ఖాతాదారుల నిధులు, వ్యక్తిగత, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో బ్యాంక్ రాజీ పడింది. సైబర్ ఎక్స్9 లోపం కనుగొన్న తర్వాత సిఇఆర్టి-ఇన్, ఎన్‌సిఐఐపీసి సహాయంతో పీఎన్బీకి తెలియజేయడంతో బ్యాంక్ మేల్కొని లోపాన్ని పరిష్కరించింది" అని సైబర్ ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండి హిమాన్షు పాఠక్ తెలిపారు. సైబర్ ఎక్స్9 పరిశోధన బృందం పీఎన్బీలో చాలా క్లిష్టమైన భద్రతా సమస్యను కనుగొన్నట్లు తెలిపింది. (చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..!) ఈ లోపం సైబర్ దాడులకు వీలు కల్పించే విధంగా ఉందని, అడ్మిన్ యాక్సెస్ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఖాతాదారుల ఈ-మెయిల్ సైతం యాక్సెస్ చేసుకునే విధంగా ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 19న పీఎన్బీ చర్యలు చేపట్టినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. అయితే, దీనిపై పీఎన్బీ స్పందిస్తూ.. సర్వర్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ఎలాంటి సున్నితమై, క్లిష్టమైన డేటా లేదని పేర్కొంది. ఆన్-ప్రిమ్ నుంచి ఆఫీస్ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ఎక్స్9 చెప్పినట్లుగా ఖాతాదారులకు సంబంధించిన డేటా ఏదీ బయటకు రాలేదని చెప్పింది. ఎప్పటికప్పుడు సిఇఆర్టి-ఇన్ ఎంప్యానెల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని వివరించింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు దీపావళి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. రెపో ఆధారిత రుణ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రభుత్వం రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బుధవారం(నవంబర్ 3) ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. తాజా నిర్ణయం నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలకు తాజా తగ్గింపు రేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 17నే బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ను 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటే-రెపో రేటు. ప్రస్తుతం ఈ రేటు 4 శాతంగా ఉంది. ఎలక్ట్రిక్/గ్రీన్ వాహనాలను కొనే కస్టమర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం పంచుకునేందుకు పీఎన్బీ ఈవీ, సిఎన్జి వాహనాలపై వడ్డీ రేటును 6.65%కు తగ్గించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు, వాహనం, వ్యక్తిగత, బంగారం, ఆస్తి రుణాలపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసింది. (చదవండి: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!) -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
-
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్...!
పండగ సీజన్లో మరింత ఆనందాన్ని అందించేందుకు రకరకాల డీల్స్, ఆఫర్స్‌తో గతంలో ఎన్నడు లేని రీతిలో తన బ్యాంకింగ్ సేవలు, లావాదేవీలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అత్యంత ఆకర్షణీయంగా మార్చింది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్ పాయింట్లు తగ్గించి కస్టమర్లకు మరింత సంతోషాన్ని అందించనుంది. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)పై 7.2%, బంగారు అభరణాలపై 7.30% రేటుకు పీఎన్బీ ఇప్పుడు రుణాలు అందిస్తోంది. దాంతోపాటుగా హోమ్ లోన్ రేట్లను కూడా పీఎన్బీ తగ్గించింది. హోమ్‌లోన్ వడ్డీరేటు 6.60 శాతం నుంచి అందుబాటులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీరేట్లకే పలు లోన్లను పీఎన్బీ అందిస్తోంది. కారు లోన్స్ 7.15 శాతం, పర్సనల్ లోన్స్ 8.95శాతం మేర వడ్డీ రేట్లకు అందుబాటులో ఉంది. ఇటీవల హోమ్లోన్స్, వెహికిల్ లోన్‌పై ప్రకటించిన విధంగా ఇప్పుడు పండగ సీజన్లో బంగారు అభరణాలు, ఎస్‌జీబీపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజును పీఎన్బీ పూర్తిగా తొలగించింది. హోమ్ లోన్స్‌పై మార్జిన్స్‌కు కూడా బ్యాంక్ తగ్గించింది. హోమ్‌లోన్ తీసుకోదలిచిన వారు రుణ మొత్తంపై ఎటువంటి అప్పర్ సీలింగ్ లేకుండా ఆస్తి విలువలో ఇప్పుడు 80% వరకు పొందవచ్చు. చదవండి: పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త! -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ!) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్‌లు పనిచేయవు
మీకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే, ఒక హెచ్చరిక. ఈ రెండు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్‌లు వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. కాబట్టి ఈ బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఓబీసీ, యూబీఐ రెండూ ఏప్రిల్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు విలీనమైనప్పటికీ ఇప్పటి వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లనే కొనసాగించారు. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు వీలైనంత త్వరగా పీఎన్బీ ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ నుంచి వీటిని పొందొచ్చని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. ఏదైనా సాయం లేదా క్వైరీ కొరకు కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-180-2222ని సంప్రదించండి అని కూడా తెలిపింది.(చదవండి: భారీ లాభాలను గడించిన డ్రీమ్-11..! ఏంతంటే..?) -
ఛార్జీల రూపంలో బ్యాంకులకు భారీ ఆదాయం
2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బి)కు చార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు విధించడం వల్ల దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆర్టీఐ సమాచారం తెలిసింది. ఛార్జీల విధించడం వల్ల ఆర్జించిన పీఎన్‌బి ఆదాయం 2019-20లో రూ.286.24 కోట్లుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఛార్జీలను విధిస్తుంటాయి. 2020-21 ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఏబి) రూ.35.46 కోట్లుగా(పొదుపు, కరెంట్ ఖాతా రెండింటిలోనూ) ఉంది. అయితే ఎఫ్ వై21 రెండో త్రైమాసికంలో ఏటువంటి ఛార్జీలు విధించలేదు. మూడో, నాలుగో త్రైమాసికాల్లో క్యూఏబీ నిర్వహణేతర ఛార్జీలు వరుసగా రూ.48.11 కోట్లు, రూ.86.11 కోట్లుగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్బీ ఈ సమాధానమిచ్చింది. అలాగే, రుణదాత సంవత్సరంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీల రూపంలో రూ.74.28 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు ఏడాది 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉంది. 2020-21 మొదటి త్రైమాసికంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దు చేసినట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!) -
లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్
మీరు కొత్తగా హోమ్ లోన్, వ్యక్తి గత రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. బ్యాంకులు కొద్ది రోజుల నుంచి వడ్డీ రేట్లు తగ్గయిస్తున్నాయి. ఈ విషయంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందువరుసలో ఉన్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో అనుసంధానిత రుణ రేటును(ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.80 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గిస్తున్న ఆర్ఎల్ఎల్ రేటు అనేది నేటి(17-09-2021) నుంచి అమలులోకి రానుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను రెపో రేటుకు లింక్ చేయడం ప్రారంభించాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడు రుణగ్రహీతలు వెంటనే ప్రయోజనం పొందుతారు. రెపో రేటు అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణం రేటు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకొనేటప్పుడు ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్న రుణగ్రహితలకు దీని వల్ల లాభం చేకూరుతుంది. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు తగ్గడం వల్ల అంత మేర మీరు ప్రతి నెల వడ్డీ తగ్గుతుంది. ఈ బ్యాంకుతో పాటు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త!) -
ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కొత్త చెక్‌బుక్ నిబందనలో మార్పుకు సంబంధించి తన ఖాతాదారులకు ఒక కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ)లకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1, 2021 నుంచి పనిచేయవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని కోరింది. (చదవండి: చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?) "ప్రియమైన వినియోగదారులరా.. ఈఓబీసీ, ఈయుబీఐ బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు 1-10-2021 నుంచి నిలిపివేస్తున్నాము. దయచేసి ఈఓబీసీ, ఈయుబీఐ పాత చెక్‌బుక్‌ల స్థానంలో ఐఎఫ్ఎస్ సీ, ఎమ్ ఐసీఆర్ తో అప్ డేట్ చేసిన పీఎన్బీ కొత్త కొత్త చెక్‌బుక్‌లు పొందండి. కొత్త చెక్‌బుక్ కోసం ఎటీఎమ్/ఐబీఎస్/పీఎన్బీ వన్ ద్వారా అప్లై చేసుకోండి" అని ఒక ట్వీట్ చేసింది. Take note & apply for your new cheque book through👇 ➡️ ATM ➡️ Internet Banking ➡️ PNB One ➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0 — Punjab National Bank (@pnbindia) September 8, 2021 లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్, 2020లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ) పీఎన్బీలో విలీనం అయిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ రెండు కాకుండా, మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ మెగా కన్సాలిడేషన్ ప్రణాళిక కింద ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. -
ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత
న్యూఢిల్లీ: రిటైల్ రుణ ఉత్పత్తులపై ప్రాసెసింగ్, సర్వీస్ చార్జీలను ఎత్తివేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ప్రకటించింది. కస్టమర్లకు విరివిగా రుణాలు ఇచ్చే లక్ష్యంతో ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. గృహ రుణాలను 6.80 ఆకర్షణీయ రేటుకే ఆఫర్ చేస్తున్నామని.. అలాగే, కారు రుణాలపై 7.15 శాతం రేటు, వ్యక్తిగత రుణాలు 8.95 శాతం రేటు నుంచి అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. -
రోజు రూ.100 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.15 లక్షలు మీ సొంతం..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సుకన్య సమృద్ది యోజన కింద పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పథకం కింద పంజాబ్ బ్యాంకులోని ఏ శాఖలోనైనా ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చును. ఒక పేరెంట్‌గా, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి ఖాతాలో రూ .250 కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ .1,50,000 డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. తల్లిదండ్రులు ఖాతా ఓపెన్ చేసిన 15 సంవత్సరాల వరకు లబ్దిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్‌ను డిపాజిట్ చేయవచ్చును. ఖాతా తెరిచిన తేదీ నాటికి లబ్ధిదారులకు 10 సంవత్సరాలు నిండి ఉండకూడదు .సుకన్య సమృద్ధి ఖాతాలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ ఖాతాలపై బ్యాంకు 7.6 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది. ఈ ఖాతాలను పోస్టాఫీసులకు బదిలే చేసుకునే సౌకర్యాన్ని పీఎన్బీ బ్యాంకు కల్పిస్తుంది. అకౌంట్ హోల్డర్ ఉన్నత విద్య కోసం, ఖాతాలోని అమౌంట్ నుంచి గరిష్టంగా 50 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చును. సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ అయినప్పటి నుంచి మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలుగా ఉండనుంది. మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో రోజుకు రూ.100 చొప్పున అంటే నెలకు రూ .3000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం మిగిసే సమయానికి లబ్థిదారులు రూ .15 లక్షలకు పైగా పొందవచ్చును. ఏటా రూ .36,000 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 14 సంవత్సరాల తర్వాత 7.6 శాతం వడ్డీరేటుతో రూ .9,11,574 వరకు పొందుతారు. 21 సంవత్సరాల తర్వాత, అమౌంట్ రూ .15,22,221 వరకు వస్తోంది. -
పీఎన్బీతో ఎన్ఎఫ్డీబీ ఒప్పందం
హైదరాబాద్: జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్ఎఫ్డీబీ).. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మత్స్య పరిశ్రమలకు పీఎన్బీ ద్వారా రుణ సాయం లభించనుంది. మత్స్య రంగంలో సామర్థ్యం ఉండీ, అంతగా వెలుగుచూడని పరిశ్రమలకు ఎఫ్ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను పీఎన్బీతో ఒప్పందం వీలు కల్పిస్తుందని ఎన్ఎఫ్డీబీ సీఈవో సువర్ణ చంద్రప్పగిరి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సువర్ణ చంద్రప్పగిరి, పీఎన్బీ ఎండీ, సీఈవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎఫ్డీ వడ్డీ రేట్లు సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులు జమ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టె ఎఫ్డీ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.9% - 5.25% మధ్య వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా ఎఫ్డీ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల కంటే తక్కువ): డిపాజిట్ కాల వ్యవది వడ్డీ రేటు 7 నుంచి 14 రోజులు 2.9% 15 నుంచి 29 రోజులు 2.9% 30 నుంచి 45 రోజులు 2.9% 46 నుంచి 90 రోజులు 3.25% 91 నుండి 179 రోజులు 3.80% 180 రోజుల నుంచి 270 రోజులు 4.4% 271 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 4.4% 1 సంవత్సరం 5% 1 సంవత్సరం కంటే పైన & 2 సంవత్సరాల వరకు 5% 2 సంవత్సరాల కంటే పైన & 3 సంవత్సరాల వరకు 5.10% 3 సంవత్సరాలు పైన & 5 సంవత్సరాల వరకు 5.25% 5 సంవత్సరాల కంటే పైన & 10 సంవత్సరాల వరకు 5.25% -
Nirav Modi: నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ నిందితుడు నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. నీరవ్‌మోదీ చెల్లెలు పూర్వి మోడీ ఈడీకి అప్రూవర్‌గా మారింది. పూర్వి మోడీ యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి ₹17 కోట్లకు పైగా నగదును భారత ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. "పూర్వి మోడీ(నీరవ్ మోడీ సోదరి) యుకె బ్యాంక్ ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలిచేశారు. దీంతో నీరవ్‌మోదీ లండన్ అకౌంట్స్ నుంచి రూ.17.25 కోట్లు రికవరీ చేసినట్లు" దర్యాప్తు సంస్థ పేర్కొంది. జూన్ 24న పూర్వి మోడీ తన పేరిట యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్‌లో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినట్లు, తన సోదరుడు నీరవ్‌మోదీ ఆదేశాల మేరకు ఖాతా ఓపెన్ చేసినట్లు, అందులో ఉన్న నిధులు తనకు చెందినవి కాదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు తెలియజేసింది. కొన్ని షరతులతో ఈడీ ఆమెకు క్షమబిక్ష పెట్టింది. ఈడీకి అప్రూవర్‌గా మారిన పూర్వి మోడీ తన యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలీ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నీరవ్ మోడీ ప్రస్తుతం యుకె జైలులో ఉన్నారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.13,000 కోట్లు తీసుకొని బ్రిటన్ కు పారిపోయాడు. కొద్ది రోజుల క్రితం భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో చేసుకున్న అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం -
బీఓఐ, పీఎన్బీలకు రూ.6 కోట్ల జరిమానా
ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం మొత్తం రూ.6 కోట్ల జరిమానా విధించింది. ఇందులో బీఓఐకి విధించిన జరిమానా రూ.4 కోట్లుకాగా, పీఎన్బీ విషయంలో ఈ మొత్తం రూ.2 కోట్లు. బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన నివేదికను ఆర్బీఐకి ఆలస్యంగా సమర్పించడం, అన్క్లైమ్డ్ బ్యాలెన్స్‌ను డీఈఏ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్) ఫండ్‌కు బదలాయించడంలో తాత్సారం వంటి అంశాలకు సంబంధించి నిబంధనలను పాటించకపోవడం దీనికి కారణమని రెండు వేర్వేరు ప్రకటనల్లో ఆర్బీఐ పేర్కొంది. చదవండి: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు సెబీ షాక్.. భారీ జరిమానా -
మెహుల్ చోక్సీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని గురువారం పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. మరోవైపు చోక్సీకి బెయిల్ ఇస్తే అతను పారిపోతాడని, భారత్‌లో ఆర్థిక నేరాలకు సంబంధించిన 11 కేసులు ఉన్నాయని, ఇంటర్‌పోల్ నోటీసులూ అతనిపై జారీ అయ్యాయని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చోక్సీ చుట్టూ ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రేట్ కేండియా కేరట్ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు వేసే జరిమానాకు రెట్టింపు మొత్తం 10 వేల కరీబియన్ డాలర్లు చెల్లిస్తామని చోక్సీ తరఫు లాయర్ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు. అయితే బెయిల్ కోసం పై కోర్టుకు వెళతామని లాయర్ విజయ్ అగర్వాల్ మీడియాకి వెల్లడించారు. వాదనల సమయంలో భారత్ నుంచి వెళ్లిన బృందం కోర్టుకి హాజరైంది. డొమినికా ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే భారత్‌కు తీసుకురావడానికి ఆ బృందం వెళ్లింది. అయితే ఇప్పుడిప్పుడే చోక్సీని అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులంటున్నారు. చోక్సీపై కోర్టుకు వెళితే మరిన్ని రోజులు ఈ కేసు సాగే అవకాశాలున్నాయి. 2018 నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అక్కడ్నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ప్రేయసితో విహార యాత్ర కోసం డొమినికాకు వెళ్లాడన్న ఆరోపణలున్నాయి. మే 23న తమ దీవుల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారంటూ డొమినికా పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. చోక్సీని వెనక్కి తెస్తాం: భారత విదేశాంగ శాఖ మెహుల్ చోక్సీని కచ్చితంగా భారత్‌కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ ధీమా వ్యక్తం చేసింది. డొమినికాలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయితే వెంటనే అతనిని భారత్‌కి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు. ఆ సమస్య మనకొద్దు చోక్సీని డొమినికా నుంచే భారత్‌కు పంపిస్తే మంచిదని అంటిగ్వా, బార్బుడా దేశం భావిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చోక్సీ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చోక్సీ డొమినికా పోలీసు కస్డడీలో ఉన్నందున ఇది వాళ్ల వ్యవహారమని, ఇక్కడికి వస్తే ఆ సమస్యలు తమకు చుట్టుకుంటాయని సమావేశం అభిప్రాయపడింది. -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తర్వులపై యుకె హోంశాఖ కార్యదర్శి ఈ రోజు సంతకం చేశారు. 50 ఏళ్ల నీరవ్ మోడీకి చివరగా యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్ మాల్యా 2019 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రభుత్వం తన అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత కోర్టుకు వెళ్లారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం, మనీలాండరింగ్ కోసం నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. -
పేద వర్గాల కోసం పీఎన్బీ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉన్నతి హోమ్ లోన్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. దీని కింద రూ.35 లక్షల దాకా లేదా ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా (ఉద్యోగులకు), స్వయం ఉపాధి పొందుతున్న వారికి 80 శాతం దాకా రుణం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టియర్-1 నగరాల్లో కనిష్టంగా రూ.8 లక్షలు, టియర్-2 నగరాల్లో రూ.6 లక్షల మేర రుణం పొందవచ్చన్నారు. ఇక నగర పరిధిలో 225 చ.అ. లేదా 40 చ.గ.ల్లో ఇంటి నిర్మాణానికి కూడా ఉన్నతి స్కీమ్ ద్వారా లోన్ పొందవచ్చని ప్రసాద్ వివరించారు. ఇంటి వద్దే బీమా పాలసీలు, సర్వీసులు అందించేందుకు పలు బీమా దిగ్గజాలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్‌లైన్‌ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్‌లైన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్‌ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
నీరవ్ మోదీ కోసం బ్యారక్ 12 సిద్ధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో, నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నీరవ్‌ని ముంబైకి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ను ఆర్థర్ రోడ్ జైలులో అత్యధిక భద్రత ఉన్న బ్యారక్ నంబర్ 12లోని మూడు సెల్‌లలో ఒకదానిలో ఉంచనున్నారు. నీరవ్‌కు జైల్లో కల్పించే వసతులను గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తక్కువ మంది ఖైదీలున్న సెల్లో అతడిని ఉంచుతామని జైలు అధికారులు వెల్లడించారు. బ్యారక్‌లో నీరవ్‌కు మూడు చదరపు మీటర్ల స్థలం మాత్రమే ఉంటుంది. ఒక కాటన్ పరుపు, తలదిండు, ఒక దుప్పటి, కప్పుకోవడానికి బ్లాంకెట్ ఇస్తామని అధికారి తెలిపారు. అక్కడ తగు మాత్రంగా గాలి, వెలుతురు సోకుతుందని, ఆయనకు సంబంధించిన వస్తువులు పెట్టుకునే స్థలం కూడా ఉంటుందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విజయ్‌మాల్యాని యూకే నుంచి భారత్‌కి అప్పగిస్తే ఇదే ఆర్థర్ రోడ్ జైల్లో, 12వ నంబర్ బ్యారక్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్, మోసం కేసులో విజయ్ మాల్యా మార్చి 2016 నుంచి యూకేలో ఉన్నాడు. -
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించండి
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని తిరిగి దేశానికి తీసుకువచ్చే విషయంలో భారత్‌కు నిర్ణయాత్మక విజయం లభించింది. మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో భారత్‌లోని కోర్టులో విచారించాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జి శామ్యూల్ గూజీ గురువారం తీర్పునిచ్చారు. భారత్‌లోని కోర్టులో తనకు న్యాయమైన విచారణ జరగదన్న నీరవ్ మోదీ వాదనను తోసిపుచ్చారు. భారత్‌లో నిష్పక్షపాత విచారణ జరగదన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు 200 కోట్ల డాలర్ల(రూ. 14.5 వేల కోట్లు) మేరకు మోసం చేసిన ఆరోపణలపై, నగదు అక్రమ చెలామణి ఆరోపణలపై మోదీపై భారత్‌లో సీబీఐ, ఈడీ పలు కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నీరవ్ మోదీ వాదిస్తున్నట్లు ఈ కేసులో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన కూడా లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైద్యపరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వాండ్స్‌వర్త్ జైలు నుంచి నీరవ్ మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ‘పీఎన్బీ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ పేర్కొన్న నగదు అక్రమ చెలామణి, సాక్ష్యులను బెదిరించడం, సాక్ష్యాధారాలను నాశనం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించి నీరవ్ దీపక్ మోదీని దోషిగా నిర్ధారించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నాయ’ని ఈ సందర్భంగా జడ్జి శ్యామ్యూల్ గూజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా కేసును న్యాయమూర్తి ఉదహరించారు. దీర్ఘకాలం జైలులో ఉండడంతో నీరవ్ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదన్న విషయాన్ని అంగీకరిస్తూనే.. అది భారత్‌కు ఆయనను అప్పగించేందుకు అడ్డంకిగా భావించడం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసులో 16 బండిళ్ల సాక్ష్యాధారాలను, మరో 16 బండిళ్ల నిపుణుల నివేదికలను భారత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాటిని పరిగణనలోకి తీసుకున్నానన్నారు. అయితే, భారత అధికారులు వాటి డాక్యుమెంటేషన్‌ను సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించారు. యూకేలోని నేరస్తుల అప్పగింత చట్టం–2003 ప్రకారం .. తన తీర్పు కాపీని న్యాయమూర్తి హోం మినిస్టర్ ప్రీతి పటేల్ పరిశీలనకు పంపిస్తారు. అనంతరం, రెండు నెలల లోపు భారత్, యూకేల మధ్యనున్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం, ఆమె నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయమై నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా కోర్టు తీర్పు మేరకే మంత్రి నిర్ణయం ఉంటుంది. అయితే, నీరవ్ మోదీకి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అనంతరం రెండు వారాల్లోగా ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. నీరవ్‌పై కేసు ఎప్పుడు, ఎలా..? జనవరి 29, 2018: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు కలిసి 2.81 బిలియన్ రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోదీపై ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 5, 2018: ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 16, 2018: నీరవ్ మోదీ ఇంటి నుంచి రూ.56,74 బిలియన్ల విలువైన డైమండ్లు, బంగారం, నగలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 17, 2018: సీబీఐ ఈ కుంభకోణంలో తొలి అరెస్టులు చేసింది. ఇద్దరు పీఎన్బీ ఉద్యోగులు, నీరవ్ మోదీ గ్రూప్‌కి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ని సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 17, 2018: ఈకుంభకోణంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను నాలుగు వారాల పాటు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 21, 2018: నీరవ్ మోదీ సీఎఫ్ఓ, మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సీబీఐ అరెస్టు చేసింది. నీరవ్ ఫాంహౌస్‌ని కూడా సీల్ చేసింది. ఫిబ్రవరి 22, 2018: నీరవ్‌కి సంబంధించిన 9 ఖరీదైన కార్లను ఈడీ సీజ్ చేసింది. ఫిబ్రవరి 27, 2018: నీరవ్‌కి మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఆగస్టు 3, 2018: నీరవ్‌ను అప్పగించాల్సిందిగా యూకే అధికారులకు భారత్ అభ్యర్థన డిసెంబర్ 27, 2018: నీరవ్ తమ దేశంలో ఉన్నట్టు భారత్‌కి తెలిపిన యూకే. మార్చి 9, 2019: బ్రిటిష్ పత్రిక ‘ద టెలిగ్రాఫ్’ లండన్ వీధుల్లో నీరవ్ ఉన్నట్లు ధృవీకరించింది. మార్చి 18, 2019: భారత్ కోరిన మేరకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు నీరవ్ అరెస్టు వారెంట్. మార్చి 20, 2019: లండన్‌లో నీరవ్‌ని అరెస్టు చేసి, వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నీరవ్ కి బెయిలు నిరాకరించింది. మార్చి 20, 2019: నీరవ్‌ని మార్చి 29 వరకు హర్ మెజెస్టీస్ ప్రిసన్(హెచ్ఎంపి)కి పంపారు. ఏప్రిల్9: 2వసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ. మే 8, 2019: మూడోసారి నీరవ్ బెయిల్ తిరస్కరణ. తిరిగి యూకే జైల్లోనే నీరవ్. జూన్ 12, 2019: నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని నాలుగోసారి కోర్టు బెయిలు నిరాకరణ. ఆగస్టు 22, 2019: నీరవ్ రిమాండ్ సెప్టెంబర్ 19 వరకు పొడిగించిన యూకే కోర్టు. నవంబర్ 6, 2019: నీరవ్ కొత్త బెయిలు పిటిషన్‌ను తిరస్కరించిన యూకే కోర్టు. మే 11, 2020: పీఎన్బీ కేసులో నీరవ్‌పై యూకేలో ప్రారంభమైన ఐదు రోజుల విచారణ. మే 13: మనీలాండరింగ్ కేసులో నీరవ్‌కి వ్యతిరేకంగా భారత్ మరిన్ని ఆధారాలు సమర్పణ. డిసెంబర్ 1, 2020: నీరవ్ రిమాండ్ పొడిగింపు. జనవరి 8, 2021: ఫిబ్రవరి 25, 2021న నీరవ్ అప్పగింత కేసులో తీర్పు ప్రకటించాలని నిర్ణయించిన యూకే కోర్టు. -
మంచి పరిణామమేగానీ...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ. 14,000 కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టి హఠాత్తుగా 2018 ఫిబ్రవరిలో మాయమై చివరకు ఆ మరుసటి ఏడాది లండన్‌లో పట్టుబడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించవచ్చంటూ బ్రిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు కీలక మైనది. భారత్‌కు పంపితే తన మానవ హక్కులు హరించుకుపోతాయని నీరవ్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. తనను నిర్బంధించే జైలు సౌకర్యవంతంగా వుండదన్న వాదనను కూడా కొట్టిపారేసింది. బ్యాంకు సిబ్బంది తోడ్పాటుతో మోసపూరితంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ)లను అపహరించి, వాటి ఆధారంగా భారీ మొత్తంలో డబ్బు కైంకర్యం చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుండగా... ఆ నిధులు సరిహద్దులు దాటిన వైనాన్ని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. సాక్ష్యాధారాలు మాయం చేయటం, సాక్షుల్ని బెదిరించటం, వేధించి ఒకరి మరణానికి కారకుడు కావటం వంటి ఆరోపణలు కూడా ఆయనగారిపై వున్నాయి. కేవలం బ్యాంకు సొమ్ము కొట్టేయాలన్న ఏకైక ఉద్దేశంతో వ్యాపారం పేరు చెప్పి నీరవ్ మోదీ ఏడేళ్ల వ్యవధిలో వేల కోట్లు కొట్టేశారు. అయినా సులభంగా దేశం విడిచి పారిపోగలిగాడు. అతనికి రెండేళ్ల ముందు మరో ఎగవేతదారు విజయ్ మాల్యా సైతం ఈ మాదిరే పరారయ్యాడు. మాల్యాను దేశం తీసుకు రావటానికి చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. రకరకాల సాకులు చెబుతూ, ఏవేవో అభ్యంతరాలు లేవనెత్తుతూ మాల్యా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. నీరవ్ మోదీ ఎప్పటికి వస్తాడన్నది ఎవరూ చెప్పలేరు. అయితే మాల్యా బెయిల్ తీసుకోగా, ప్రస్తుతానికైతే నీరవ్ మోదీ జైల్లో వున్నాడు. ఆయన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే వుంది. మన బ్యాంకుల చేతగానితనానికి, వాటిలో ఉన్నత స్థాయిలో పనిచేసేవారి చేతివాటుతనానికి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులు నిదర్శనం. ఒక సాధారణ వ్యక్తి రుణం తీసుకోవటానికి ప్రయత్నిస్తే సవాలక్ష య„ý ప్రశ్నలేసే బ్యాంకులు ఇలాంటి మోసగాళ్లముందు ఎంత సులభంగా మోకరిల్లుతాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2011లో నీరవ్ మోసపూరిత పనులకు పాల్పడటం మొదలుపెడితే 2018 వరకూ... అంటే ఏడేళ్లపాటు అవి యధేచ్ఛగా సాగిపోయాయి. రికార్డుల్లో ఎక్కడా చూపకుండా నీరవ్ మోదీ, ఆయన సంబంధీకులు ఎల్వోయూలను ఉపయోగించుకుని విదేశీ ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. తమ ఖాతాదారు చెల్లించాల్సిన మొత్తానికి పూచీపడుతూ బ్యాంకులు ఈ ఎల్ఓయూలు జారీ చేస్తాయి. వీటి ఆధారంగానే విదేశాల్లోని బ్యాంకులు రుణాలిస్తాయి. అలా ఇచ్చేముందు ఎల్ఓయూ జారీ చేసిన బ్యాంకును సంప్రదిస్తాయి. ఇవన్నీ ‘సజావుగానే’ పూర్తయ్యాయి! వేల కోట్లు నీరవ్ మోదీ చేతుల్లో వాలిపోయాయి. ఈ మొత్తం వ్యవహారమంతా మన బ్యాంకింగ్ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టింది. పకడ్బందీ తనిఖీ వ్యవస్థ అనుకున్నది సైతం ఏడేళ్లపాటు అక్కరకు రాకుండా పోయిందంటే...ఏటా జరిగితీరాల్సిన అంతర్గత ఆడిటింగ్‌లో కూడా ఇది దొరకలేదంటే ఏమను కోవాలి? ఈ లావాదేవీలు ఎక్కడా నమోదు కాకుండా నీరవ్ చూడగలిగాడు. అందుకే మొదట్లో బ్యాంకుకు రూ. 11,300 కోట్ల మేర నష్టం జరిగిందని లెక్కేయగా...తవ్వినకొద్దీ అది పెరగటం మొదలెట్టింది. నీరవ్ మోసాన్ని యధేచ్ఛగా సాగనీయటమే కాదు...‘మోసం బట్టబయలైంద’ని ఆ బ్యాంకులో కీలక బాధ్యతల్లో వున్నవారు ఉప్పందించారు. ఇది జరిగాకైనా బ్యాంకులు అప్రమత్తంగా వున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు 2019–20 సంవత్సరంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే బ్యాంకింగ్ మోసాలు రెండున్నర రెట్లు పెరిగాయి. నీరవ్ మోసం వెల్లడైన 2018–19లో ఈ మాదిరి మోసాల పరిమాణం మొత్తంగా రూ. 71,500 కోట్లు కాగా...2019–20లో అది రూ. 1.85 లక్షల కోట్లకు చేరుకుంది. మరి నీరవ్ కేసు బ్యాంకుల్ని ఏం అప్రమత్తం చేసినట్టు? మోసాలను నివారించటం సంగతలా వుంచి...వాటిని వెనువెంటనే గుర్తించటంలో, మాయగాళ్లను చట్టానికి పట్టివ్వటంలో బ్యాంకులు బాగా వెనకబడి వున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. నీరవ్ మోదీ ఇక్కడ కూడబెట్టిన ఆస్తుల్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోగలిగాయి. కానీ ఈ కొట్టేసిన డబ్బంతా పెట్టి అంతకు అనేక రెట్లు విలువచేసే విలాసవంతమైన భవంతుల్ని, ఇతర ఆస్తుల్ని లండన్, న్యూయార్క్‌వంటి చోట్ల అతను కొనుగోలు చేశాడు. అతని ఆచూకీ రాబట్టడంలో మన నిఘా విభాగాలు విఫలమైనా, బ్రిటన్ దినపత్రిక ‘డైలీ టెలిగ్రాఫ్’ పాత్రికేయులు ముగ్గురు నీరవ్‌ను గుర్తించి బయటపెట్టారు. ఇప్పుడు బ్రిటన్ కోర్టులో నీరవ్ వాదన వీగిపోయేలా చూడ టంలో మన న్యాయవాదులు విజయం సాధించటం సంతోషించదగ్గదే. అయితే ఇదింకా అయి పోలేదు. నీరవ్ వినతిపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవాలి. అందుకామెకు గరిష్టంగా రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆమె నిర్ణయం తనకు ఆమోదయోగ్యం కానట్టయితే ఆ తర్వాత మరో 14 రోజుల్లో నీరవ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అక్కడ విచారణ ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పరిష్కారమై, నీరవ్‌ను ఇక్కడికి తీసుకొచ్చి విచారించి శిక్షించగలిగితే ఈ తరహా మోసగాళ్లకు అదొక గుణపాఠమవుతుంది. -
వ్యవసాయం, చిన్న పరిశ్రమలకోసం పీఎన్బీ క్యాంపులు
హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఆధ్వర్యంలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని బ్యాంకు ఎండీ ఎస్.ఎస్.మల్లికార్జునరావు తెలిపారు. ’గ్రామ్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. గాంధీ జయంతి నాడు ఒకే రోజున దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లో 526 గ్రామాల్లో క్యాంపులు చేపట్టి వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులు, గృహనిర్మాణ దారులకు రుణాలపై అవగాహన కల్పించామన్నారు. 4 వేల గ్రామీణ బ్రాంచీల ద్వారా డిసెంబర్ 31 నాటికి 25 గ్రామాల్లో క్యాంపులు పెట్టాలని నిర్ణయించామన్నారు. కేంద్ర పథకాల సద్వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్,క్రెడిట్, సోషల్ సెక్యూరిటి, ఆధార్ సీడింగ్, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలపై క్యాంపులో అవగాహన కల్పిస్తామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో 141, ఆంధ్రప్రదేశ్‌లో 137 పంజాబ్ నేషనల్ శాఖలు ఉన్నాయని తెలిపారు. -
మార్కెట్ నుంచే నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: నిధుల సాయం కోసం ఈ విడత కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. మార్కెట్ నుంచే నిధులను సమీకరించాలనుకుంటున్నట్టు చెప్పారు. రూ.14,000 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారని, ఇందులో రూ.7,000 కోట్లు ఈక్విటీ రూపంలో ఉంటుందని సోమవారం మీడియాతో వర్చువల్ గా నిర్వహించిన సమావేశం సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఇష్యూలకు తగినంత ఆసక్తి ప్రభుత్వ బ్యాంకుల నిధుల అవసరాలను తీర్చే అనుకూల పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయని మల్లికార్జునరావు చెప్పారు. బీవోబీ, పీఎన్బీ ఇటీవలే చేపట్టిన టైర్–2 బాండ్ ఇష్యూకు వడ్డీరేటు సహేతుకంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదే(2020–21) రియల్ ఎస్టేట్ ఆస్తుల విక్రయం రూపంలో మరో రూ.500 కోట్లను సమీకరించుకోనున్నట్టు చెప్పారు. దివాలా కేసుల రూపంలో రూ.8,000 కోట్లు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా చట్టం కింద కేసుల పరిష్కారం రూపంలో రూ.6,000–8,000 కోట్లు రావచ్చని తాము అంచనా వేస్తున్నట్టు మల్లికార్జునరావు తెలిపారు. అనుబంధ సంస్థ పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ లో ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా రైట్స్ ఇష్యూ రూపంలో రూ.600 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. 4–6 శాతం మేర రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎన్బీ రుణ వితరణలో 4–6 శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మల్లికార్జునరావు చెప్పారు. అక్టోబర్ నుంచి ఆర్థికరంగ కార్యకలాపాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 40,000 కోట్ల రుణాల పునర్ వ్యవస్థీకరణ ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఆగస్ట్ తర్వాత పీఎన్ బీ సుమారు రూ.40,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని మల్లికార్జునరావు వెల్లడించారు. కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు రుణ చెల్లింపులపై మారటోరియం అవకాశం ఇచ్చిన ఆర్ బీఐ, అనంతరం ఒక్కసారి రుణ పునర్ వ్యవస్థీకరణకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. పీఎన్బీ లాభం రూ.308 కోట్లు 2020–21 ఏడాది తొలి త్రైమాసికానికి (ఏప్రిల్–జూన్) పీఎన్బీ రూ.308 కోట్ల స్టాండలోన్ లాభాన్ని(అనుబంధ సంస్థల ఫలితాలు కలపకుండా) ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన లాభం రూ.1,018 కోట్లతో పోలిస్తే రెండొంతులు తగ్గిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కావడంతో, ఈ ఆర్థిక సంవత్సరం జూన్ ఫలితాలను క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చలేమని బ్యాంకు పేర్కొంది. -
నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంక్(పీఎన్బీ)ను మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీకి చెందిన రూ.1,400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ, ఐటీ జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ఆస్తులను జప్తు చేసే ముందు నీరవ్ మోడీకి అప్పీలు చేయడానికి 30 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లో ఉంటున్నారు. భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: బెదిరిస్తున్న నీరవ్ మోదీ -
వేలానికి నీరవ్‌మోదీ విలాస వస్తువులు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణాల రూపంలో రూ.14,000 కోట్లకు పైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్‌మోదీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్‌లు, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున ‘శాఫ్రోనార్ట్’ అనే సంస్థ వేలం వేయనుంది. వీటికి సంబంధించి మార్చి 5న ప్రత్యక్ష వేలం నిర్వహించనుంది. అలాగే, మరో 72 వస్తువులకు మార్చి 3, 4వ తేదీల్లో ఆన్లైన్ వేలం కూడా చేపట్టనుంది. తొలుత ప్రత్యక్ష వేలాన్ని ఈ నెల 27న నిర్వహించేందుకు నిర్ణయించగా, ఈడీ నుంచి వచ్చిన ఆదేశాలతో మార్చి 5కు మార్చినట్టు శాఫ్రోనార్ట్ స్పష్టం చేసింది. విలువైన పెయింటింగ్‌లు.. ♦ 1935నాటికి చెందిన అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ ‘బోయ్స్ విత్ లెమన్స్’’ అధికంగా రూ.12–18 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 1972 నాటి పెయింటింగ్‌ను కూడా వేలం వేయనున్నారు. దీనికి కూడా దగ్గర దగ్గర ఇంతే ధర వస్తుందని భావిస్తున్నారు. అలాగే వీఎస్ గైతోండే, మంజిత్‌బవా, రాజా రవివర్మ పెయింటింగ్‌లను వేలంలో అందుబాటులో ఉంచనున్నారు. ♦ జాగర్ లీకోల్చర్ పురుషుల ‘రివర్స్ గైరోటర్బిల్లాన్ 2’ అనే లిమిటెడ్ ఎడిషన్ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుం దని అంచనా. పటేక్ ఫిలిప్ నాటిలస్ అనే బంగారం, వజ్రాల చేతి గడియారానికి కూడా రూ.70 లక్షలు లభిస్తుందని భావిస్తున్నారు. ♦ రోల్స్ రాయిస్ గోస్ట్ కారు రూ.95 లక్షలు పలుకుతుందని అంచనా. n బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగులను కూడా వేలంలో ఉంచనున్నారు. n ఇక మార్చి 3, 4న జరిగే వేలంలో పోర్షే ప్యానెమెరికా ఎస్ కార్ తదితర 72 వస్తువులను వేలానికి ఉంచనున్నట్టు శాఫ్రోనార్ట్ తెలిపింది. -
పీఎన్బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ లెక్కల ప్రకారం పీఎన్బీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్పీఏలుగా చూపించింది. దీంతో ఆర్బీఐ, పీఎన్బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ చూపగా, ఆర్బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. -
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నీరవ్ మోదీ
ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని ’పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి’గా (ఎఫ్ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో మోదీ ఆస్తుల జప్తునకు మార్గం సుగమమైంది. 2018లో ఎఫ్ఈవో చట్టం వచ్చిన తర్వాత.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తర్వాత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది నీరవ్ మోదీకే. పీఎన్బీ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోయారు. 2019 మార్చిలో లండన్‌లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తనను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది. -
పీఎన్బీని వెంటాడుతున్న మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.507 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.4,532 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.14,036 కోట్ల నుంచి రూ. 15,557 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.4,264 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 7% పెరిగినా, రుణాలు 0.7 % తగ్గాయి. పెరిగిన మొండి బకాయిలు.. గత క్యూ2లో 17.16 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.76 శాతానికి తగ్గాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.49 శాతంగానే ఉన్నాయి. ఈ క్యూ1లో 7.17 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.65 శాతానికి పెరిగాయి. ఈ క్యూ1లో రూ.5,412 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.7,460 కోట్లకు పెరిగాయి. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గాయి. గత క్యూ2లో రూ.7,733 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,253 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆరి్థక సంవత్సరానికి మొండి బకాయిలు రూ.19,000 కోట్లకు పెరుగుతాయని పీఎన్బీ అంచనా వేస్తోంది. . -
పీఎన్బీ లాభం రూ. 507 కోట్లు
సాక్షి,ముంబై: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఆర్థికసంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం అధికం.మొండిబకాయిలకు రూ.2,928.90 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది. ఇదే ఏడాది క్యూ1లో రూ.2,023.31 కోట్లను మాత్రమే కేటాయించింది. గతేడాది క్యూ2లో కేటాయించిన రూ.9,757.90 కోట్లతో పోలిస్తే 70శాతం తక్కువ. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏలు 16.76శాతానికి , నికర ఎన్పీఏలు 7.65శాతానికి పెరిగాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఈ షేరు 5.3 శాతం తగ్గి రూ .64.60 వద్ద ముగిసింది. -
మెహుల్ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13,000 కోట్లకుపైగా రుణ ఎగవేతల కేసులో మెహుల్ చోక్సీకి చెందిన రూ.22.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం జప్తు చేసింది. దుబాయ్‌లో మూడు కమర్షియల్ అసెట్స్, మెర్సిడెజ్ బెంజ్ కారు, దేశ విదేశాల్లో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న కొన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద చోక్సీపై ఉత్తర్వులు జారీ అయినట్లు కూడా ఈ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యలతో కలుపుకుంటే, మొత్తం రూ.2,535 కోట్ల చోక్సీ ఆస్తుల జప్తు జరిగింది. -
బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంకు!!. ఈ బ్యాంకులో మోసపు ఘటనలు 2,047 నమోదయినప్పటికీ, విలువ మాత్రం 28,700 కోట్ల మేర ఉంది. ముఖ్యంగా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒక్కరే రూ.13,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం గమనార్హం. పీఎన్బీ తర్వాత ఎస్బీఐకి మోసాల సెగ ఎక్కువగా తగిలింది. 23,734 కోట్ల మేర మోసాలు జరిగాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు బదులుగా ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం53,334 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. పీఎన్బీలో భారీగా... పీఎన్బీలో రూ.28,700 కోట్ల మొత్తానికి సంబంధించి 2,047 మోసాలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకులో రూ.5,033.81 కోట్లకు సంబంధించి 6,811 కేసులు ఈ కాలంలో నమోదయ్యాయి. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐలో 6,793 మోసపు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి విలువ రూ.12,358 కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రూ.1,200.79 కోట్లకు సంబంధించి 2,497 మోసపూరిత ఘటనలు జరిగాయి. బ్యాంకు ఆఫ్ బరోడాలో 2,160 మోసపూరిత కేసులు నమోదు కాగా, వీటి మొత్తం రూ.12,962.96 కోట్లుగా ఉంది. విదేశీ బ్యాంకుల్లోనూ...: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు సైతం మోసపూరిత ఘటనల బారిన పడినట్టు తెలుస్తోంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇదే కాలంలో 1,862 మోసపూరిత కేసులను రిపోర్ట్ చేసింది. వీటి మొత్తం రూ.86.21 కోట్లు. అలాగే, సిటీ బ్యాంకులో రూ.578 కోట్లకు సంబంధ/æంచి 1,764 కేసులు వెలుగు చూశాయి. హెచ్ఎస్బీసీలో రూ.312 కోట్ల మేర రూ.1,173 మోసాలు, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ పీఎల్‌సీలో రూ.12.69 కోట్ల మేర 216 కేసులు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో రూ.1,221.41కోట్లతో ముడిపడిన 1,263 ఘటనలు వెలుగు చూశాయి. -
మెగా బ్యాంకుల సందడి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్బీఐ, బీవోబీ తర్వాత మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్బీలో రెండు లేదా మూడు చిన్న సైజు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల లిస్టులో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అలహాబాద్ బ్యాంక్‌ల పేర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో ఈ బ్యాంకులను టేకోవర్ చేసే ప్రక్రియను పీఎన్బీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టున్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పీఎన్బీ గతేడాదే ప్రయత్నాలు చేసింది. విజయ బ్యాంకుపై కూడా దృష్టి పెట్టింది. అయితే, మొండి బాకీలు ఏకంగా 18 శాతానికి ఎగియడం, నీరవ్ మోదీ కుంభకోణాల ప్రభావం తీవ్రంగా పడటం వంటి పరిణామాలతో ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే యత్నాలు తాత్కాలికంగా విరమించుకుంది. ప్రస్తుతం కోలుకుంటూ ఉండటంతో విలీన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న దరిమిలా ఈ విలీన ప్రక్రియ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు భారీ బ్యాంకులు.. 2017లో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది తొలినాళ్లలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌లను కలిపేశారు. దీంతో 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులతో ఎస్బీఐ తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఇక గతేడాది మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఇందులో కేంద్రమే కీలకపాత్ర పోషించింది. పెద్ద బ్యాంకులతో.. ఎక్కువ ప్రయోజనాలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 159 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏకంగా 1,44,952 శాఖలతో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలుస్తోంది. అయితే, చిన్నా చితకా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉండటం కన్నా.. మెరుగైన భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే.. బీవోబీలో రెండు బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 21 నుంచి 18కి దిగి వచ్చింది. వీటిని కూడా కుదించి దాదాపు 6 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తదనుగుణంగానే కొన్ని మధ్య స్థాయి బ్యాంకులు కేంద్రం దృష్టిలోకి వచ్చాయి. ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులను కాస్త పెద్దవైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది. విలీనాలకు అనేక కారణాలు.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేసి భారీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. ►చిన్న బ్యాంకులు ఇటు మొండిబాకీల సమస్యలను అటు రుణ వృద్ధి సవాళ్లను (ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు రుణాలు) సమర్ధంగా ఎదుర్కొనలేకపోతున్నాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. వాటిని గాడిన పెట్టేందుకు, నిధుల సమీకరణ సామర్థ్యాలను పెంచేందుకు మెరుగైన ఇతర బ్యాంకులో విలీనం చేయొచ్చన్నది ఒక అభిప్రాయం. ► చిన్న బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు కొంత స్థాయికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే పెద్ద బ్యాంకులైతే భారీ స్థాయిలో కార్యకలాపాలు ఉండటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో విలీనం కావడం వల్ల చిన్న బ్యాంకులు తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది. ► విలీనంతో బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు మొండిబాకీల నిర్వహణ, రిస్కు మేనేజ్మెంట్ మెరుగుపర్చుకోవచ్చు. ► అధిక మూలధనం, అధిక లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం పదే పదే అదనపు మూలధనం సమకూర్చాల్సిన భారం తగ్గుతుంది. ► ఇక భారీ బ్యాంకులో భాగంకావడం వల్ల భౌగోళికంగా సేవలను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. పెద్ద బ్యాంకులు మరిన్ని పథకాలు, సర్వీసులు అందించడం ద్వారా ప్రొఫెషనల్ ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ బ్యాంకింగ్ రంగ వృద్ధికి తోడ్పడవచ్చు. అలాగే, భారీ భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన రేటింగ్ లభించవచ్చు. మరో తెలుగు బ్యాంకు కనుమరుగు.. ఒకవేళ ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉనికి కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు. -
హుండీలో వేస్తోన్న వజ్రాలు కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయి
-
‘దానిలో టీటీడీ బంగారం కూడా ఉంది’
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎంపీ చింతమోహన్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అనుమానాలు లేవనేత్తా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల హుండీ ఆదాయం రోజూ ప్రకటిస్తున్న టీటీడీ అధికారులు.. నిలువు దోపిడీ ఆదాయం వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుండీలో భక్తులు వేస్తోన్న విలువైన వజ్రాలు లెక్కల్లోకి రాకుండా మధ్యలోనే కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. టీటీడీలో అసలు జమాలజిస్టులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాక టీటీడీ బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన సమయంలో బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి పాత్ర బయటకు రావాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. గతంలో శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగిన దాడుల్లో దొరికిన బంగారంలో టీటీడీ బంగారం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి సొమ్ము రూ. 11 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఏ ఏ బ్యాంకులలో ఉన్నాయో భక్తులకు తెలియాలన్నారు. టీటీడీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంక్‌తో టీటీడీకి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో జనాలకు చెప్పాలన్నారు. టీటీడీ అవినీతిపై ఈఓను చర్చకు పిలిచాను.. కానీ అనిల్ కుమార్ సింఘాల్ చర్చకు రాకుండా ముఖం చాటేస్తున్నారని చింతా మోహన్ మండిపడ్డారు. -
టీడీపీ కనుసన్నల్లో టీటీడీ ఫైనాన్స్!
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో కీలకమైన ఆర్థిక విభాగం వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల వినియోగం, డిపాజిట్లపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే టీటీడీ ఆర్థిక విభాగం కొందరు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తోంది. వారు ఏది చెబితే దానికి తలూపుతూ ఇష్టారాజ్యంగా నిధులను విడుదల చేస్తూ టీటీడీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం వ్యవహారంలో టీటీడీ ఆర్థిక విభాగం పనితీరు మరోసారి తెరపైకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన బంగారాన్ని తిరిగి తీసుకునే విషయంలో టీటీడీ ఆర్థిక విభాగం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిచ్చింది. అంతేకాకుండా ఇతర ఆర్థిక లావాదేవీల్లోనూ ఆర్థిక విభాగం పనితీరు దారుణంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కనిపించడం లేదని భక్తులు తప్పుపడుతున్నారు. టీటీడీ ఆర్థిక విభాగాన్ని కొందరు ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బలహీనపరిచారు. అందుకే ఐదేళ్ల కాలంలో ఆర్థిక విభాగాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. టీటీడీకి ఉన్న ప్రాధాన్యం రీత్యా ఈవో, జేఈతో పాటు ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారిని ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానానికి ప్రభుత్వ పెద్దల సహకారంతో టీటీడీలోని కొందరు అధికారులు, పాలకమండలి సభ్యులు మంగళం పాడారు. టీటీడీలో లెక్కలేనన్ని అక్రమాలు గత ఐదేళ్లుగా టీటీడీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు అడ్డే లేకుండా పోయింది. స్వామివారి నిధులను ఆ పార్టీ పెద్దలు ఇష్టానుసారంగా దారి మళ్లించుకున్నారు. టీటీడీకి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమిని టాటా ఆసుపత్రికి కేటాయించారు. టీడీపీ నేతల స్వప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులకు టీటీడీ నిధుల నుంచి రూ.40 కోట్లు మంజూరు చేయించుకుని ఖర్చుచేశారు. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.150 కోట్లు టీటీడీ కేటాయించింది. రాజధానిలో ప్రైవేటు సంస్థలకు వందలాది ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం టీటీడీకి మాత్రం భూమిని ఉచితంగా ఇవ్వలేదు. దీంతో టీటీడీ అమరావతిలో రూ.12.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది. తిరుమలలో లడ్డు పోటును విస్తరించే క్రమంలో ఉగ్రాణం వద్ద ఉన్న గోడను తొలగించి పెద్ద గోడ నిర్మించాలని టీటీడీ భావించినట్లు సమాచారం. పాత గోడను తొలగించేందుకు టీటీడీ రూ.2 కోట్లతో టెండర్ పిలిచి నిధులు దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక గోడను తొలగించడానికి రూ.2 కోట్లు అవసరమా? అని టీటీడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద మెట్లను ఏర్పాటు చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్దంగా వాటిని ఏర్పాటు చేశారని విమర్శలు రావడంతో వెంటనే తొలగించారు. ఆ మెట్లు ఏర్పాటు చేయటానికి రూ.33 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో రెస్టారెంట్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ నేతలు బినామీ పేర్లతో అతి తక్కువ ధరకే దక్కించుకున్నారు. ఫలితంగా టీటీడీ భారీగా ఆదాయం కోల్పోయింది. టీటీడీలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారి ముఖ్య గణాంకాధికారిగా ఉంటే టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండేది కాదని అంటున్నారు. టీటీడీ ఉద్యోగే ముఖ్య గణాంకాధికారి టీటీడీలో పనిచేసే ఉద్యోగినే ముఖ్య గణాంకాధికారి(ఎఫ్ఏ అండ్ సీఏవో)గా నియమించడానికి వీలుగా నిబంధనలను మార్చేశారు. టీటీడీలో అడిషనల్ ఎఫ్ఏగా ఉన్న బాలాజీ అనే వ్యక్తిని ముఖ్య గణాంకాధికారిగా నియమించడానికి కొందరు పెద్దలు పావులు కదిపారు. నిబంధనల ప్రకారం టీటీడీలో ముఖ్య గణాకాంధికారిని నియమించాలంటే ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీసులో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రెటరీ, ఆపై పోస్టులో కనీసం ఐదేళ్లు పనిచేసైనా ఉండాలి. లేదంటే చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పదేళ్ల అనుభవం ఉన్న వారిని నియమించాలి. ఇవేమీ లేకున్నా బాలాజీని టీటీడీ ముఖ్య గణాంకాధికారిగా నియమించడం గమనార్హం. టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో పాలకమండలి సభ్యులు, అధికారులు పెత్తనం చెలాయించడానికే నిబంధనలకు విరుద్ధంగా బాలాజీని ముఖ్య గణాంకాధికారిగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.