
నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతున్నది. ఈ తరుణంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను నిబంధనల్లో మార్పులు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్, టోల్ ట్యాక్స్, పన్ను రాయితీల నుంచి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ చెల్లించే అంశాల్లో ఇలా అనేక మార్పులు జరుగుతాయి.
ఈ తరుణంలో ప్రముఖ ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఖాతాదారులకు షాకిచ్చింది. మే 1 నుంచి అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10 + జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు మెసేజ్ రూపంలో సమాచారం అందించింది.
డెబిట్ కార్డ్ ఛార్జీలపై సవరణ
పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం..సవరించిన ఛార్జీలు డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ ఛార్జీలు, వార్షిక నిర్వహణ ఛార్జీలను అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు బ్యాంక్ తెలియజేసింది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనందున డెబిట్ కార్డ్ ద్వారా చేసే పీఓఎస్ (Point of sale), ఈ-కామర్స్ లావాదేవీలపై (డొమెస్టిక్ / ఇంటర్నేషనల్) ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment