ATM Charges
-
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? లిమిట్ దాటితే బాదుడే!
క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది.వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది.ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి. -
మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.. జీఎస్టీ కొత్త రూల్ జీఎస్టీ ఇన్వాయిస్ల అప్‌లోడ్‌కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్వాయిస్ అప్‌లోడ్‌కు ఎలాంటి కాల పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు. పీఎన్బీ ఏటీఎం చార్జీలు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు! -
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే 1వ తేదీ నుంచి కస్టమర్ల ఖాతాలలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ లావాదేవీకి రూ.10 చొప్పున పెనాల్టీ ఛార్జీని బ్యాంక్ విధంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అలాగే ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయడానికి ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించింది. అయితే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే ఆ సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొందించింది. విఫలమైన ఏటీఎం ట్రాన్సాక్షన్ గురించి కస్టమర్లు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800180222 లేదా 18001032222 ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. కాగా మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10తోపాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు బ్యాంక్ ఇదివరకే సమాచారం అందించింది. -
షాక్: ఈ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10 ప్లస్ జీఎస్టీ
నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతున్నది. ఈ తరుణంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను నిబంధనల్లో మార్పులు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్, టోల్ ట్యాక్స్, పన్ను రాయితీల నుంచి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ చెల్లించే అంశాల్లో ఇలా అనేక మార్పులు జరుగుతాయి. ఈ తరుణంలో ప్రముఖ ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాదారులకు షాకిచ్చింది. మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10 + జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు మెసేజ్ రూపంలో సమాచారం అందించింది. డెబిట్ కార్డ్ ఛార్జీలపై సవరణ పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం..సవరించిన ఛార్జీలు డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ ఛార్జీలు, వార్షిక నిర్వహణ ఛార్జీలను అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు బ్యాంక్ తెలియజేసింది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనందున డెబిట్ కార్డ్ ద్వారా చేసే పీఓఎస్ (Point of sale), ఈ-కామర్స్ లావాదేవీలపై (డొమెస్టిక్ / ఇంటర్నేషనల్) ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏటీఎం ఉపయోగిస్తే చార్జీల మోత
-
బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై..
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్ ఖాతాదారులు అటు ఆఫ్‌లైన్ ఇటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం! ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్‌డ్రా చేస్తే.. ఎస్బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్‌డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్‌ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్‌డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది. పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్ చేస్తోంది. చదవండి: ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
విత్ డ్రా ఛార్జీల బాదుడు.. ఆర్బీఐ క్లారిటీ
ATM Withdrawal Alert: బ్యాంక్ ఖాతాదారులకు కొత్త సంవత్సరం నుంచే షాక్ తగలనుంది. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు దాటితే ఛార్జీలు ఎక్కువే వసూలు చేయనున్నాయి సంబంధిత బ్యాంకులు. అయితే అది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ మరోసారి సంకేతాలు ఇచ్చింది. క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ ఇటీవలె బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బ్యాంకులు తమ ఖాతాదారులను ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి కూడా. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ , బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. 21రూ.ల కంటే ఎక్కువే! అయితే ఏటీఎం ఛార్జీల పెంపుపై విమర్శలు వస్తుండడంతో ఆర్బీఐ తన నొటిఫికేషన్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. DPSS.CO.PD.No.316/02.10.002/2014-2015 dated August 14, 2014 సర్క్యులర్ ప్రకారం.. ఉచిత ట్రాన్జాక్షన్స్ ముగిశాక సెయిలింగ్/క్యాప్ ప్రకారం.. కస్టమర్ల నుంచి 20రూ. వసూలు చేసుకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంది. అయితే బ్యాంకుల మీద పడుతున్న హయ్యర్ ఇంటర్చేంజ్ రుసుమును భర్తీ చేయడానికి, పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లు బ్యాంకులకు సాధారణ వృద్ధి అందించడానికి 21.రూ.లకు సవరించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ ఛార్జీతో పాటు అదనంగా బ్యాంకులు ట్యాక్సులు వసూలు చేస్తాయి. కమిటీ సిఫారుసుల తర్వాతే.. ఏటీఏం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. దీంతో సిఫారుసులపై సమీక్ష అనంతరం ఆర్బీఐ.. పెంపునకు అంగీకరిస్తూ ఒక నొటిఫికేషన్ జూన్ 10, 2021నే విడుదల చేసింది. క్యాష్ రీసైక్లర్ మెషిన్లో జరిగే లావాదేవీలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). కొత్త ఛార్జీల ప్రకారం.. 21రూ. + జీఎస్టీ పేరుతో ఇప్పటికే వెబ్సైట్లో అప్డేట్ చేశాయి హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు. విత్‌డ్రా లిమిట్‌ను అనుసరించి హెడ్‌డీఎఫ్‌సీ తన సొంత ఏటీఎంలలో ఐదు క్యాష్ విత్ డ్రా ట్రాన్జాక్షన్లకు ఉచితంగా అనుమతిస్తుండగా.. ఆ పరిధి దాటితే వసూలు చేయనుంది. అయితే బ్యాలెన్స్ ఎంక్వయిరీ,మినీ స్టేట్మెంట్, పిన్ ఛేంజ్ సర్వీసులను మాత్రం పరిమితులు లేకుండా ఫ్రీగా అందించనున్నట్లు తెలుస్తోంది. కానీ, నాన్-హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో మాత్రం ఎలాంటి సేవల్ని వినియోగించుకున్నా(ఫ్రీ ట్రాన్జాక్షన్స్ ముగిశాక) ఛార్జీలు వసూలు చేయనుంది. చదవండి: కార్డులతో చెల్లింపులు.. గూగుల్ అలర్ట్, జనవరి 1లోపు ఇలా చేయాల్సిందే! -
బ్యాంకు ఖాతాదారులకు షాక్.. జనవరి 1 నుంచి?
మీరు ఎక్కువగా ఏటిఎం కేంద్రాల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. జనవరి 1 నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక, చేసే ప్రతి లావాదేవీకీ చెల్లించాల్సిన ఛార్జీని రూ.20 నుంచి 21కి పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జూన్ నెలలో బ్యాంకులకు అనుమతించింది. ఏటిఎం విత్ డ్రా ఛార్జీలు పెంపు వచ్చే జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అదనపు భారం బ్యాంకు ఖాతాదారులకు దక్కే నూతన సంవత్సర కానుక అన్నమాట. జనవరి 1, 2022 నుంచి ఉచిత లావాదేవీల నెలవారీ పరిమితి ముగిశాక బ్యాంకు ఖాతాదారులు ప్రతి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారులు తమ స్వంత బ్యాంకు ఏటిఎం కేంద్రాల నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ప్రతి లావాదేవికి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఏటిఎం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. ఏటిఎం ఛార్జీలను లెక్కించడానికి జనాభాను మెట్రిక్‌గా ఉపయోగించాలని కమిటీ సిఫారసు చేసింది. (చదవండి: Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ) -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
మహాప్రభో! మళ్లీ బాదుడా?
‘ఈ ప్రాంగణంలో అత్యంత ముఖ్యమైన అతిథి వినియోగదారే. అతను లేదా ఆమె మన మీద ఆధారపడి లేరు. మనమే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు మన పనికి అడ్డు కాదు. వాళ్ళే మన పనికి ఆధారం...’ ఇలా సాగే ఓ సుదీర్ఘ సూక్తి జాతీయ బ్యాంకుల్లో మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. మహాత్మా గాంధీ మొదలు ఇంగ్లిష్ వ్యాపారవేత్త ఎల్.ఎల్. బీన్ దాకా రకరకాల వ్యక్తుల పేర్ల మీద చలామణీ అయ్యే ఈ సూక్తిని ప్రచార పటాటోపానికి బ్యాంకుల్లో పెట్టడమేనా? లేక మన బ్యాంకింగ్ వ్యవస్థ నిజంగా కస్టమరే దేవుడని నమ్ముతోందా? అనేక సందర్భాల్లో బ్యాంకుల వ్యవహారశైలి మొదలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఉత్తర్వుల దాకా అన్నీ చూసినప్పుడు ఆ అనుమానం రాక మానదు. బ్యాంకు ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచడానికి సమాయత్తమవుతూ ఆర్బీఐ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు చూసినప్పుడు మళ్ళీ అదే అనుమానం కలుగుతుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక, చేసే ప్రతి లావాదేవీకీ చెల్లించాల్సిన ఛార్జీని రూ.20 నుంచి 21కి పెంచేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది. అయిదు నెలల్లో వచ్చే జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అదనపు భారం బ్యాంకుల నుంచి కస్టమర్లకు దక్కే నూతన సంవత్సర కానుకన్న మాట. ఇక, ఒక బ్యాంకు మరో బ్యాంకుకు సేవలందించినందుకు గాను ఒక్కో లావాదేవీకి చెల్లించే ఇంటర్ ఛేంజ్ ఫీజును కూడా పెంచుకొనేందుకు ఆర్బీఐ కొత్త ఉత్తర్వు అనుమతించింది. ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంపు ఈ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. ఇది బ్యాంకుల మధ్య లావాదేవీల ఫీజుగా కనిపించినా, ఈ భారమూ చివరకు బడుగు వినియోగదారుడి మీదే పడుతుందనేది ఊహకు అందే విషయమే. ఛార్జీలు పెంచడానికి ఉత్సాహపడ్డ ఆర్బీఐ అదేమిటో కానీ, వినియోగదారులకు ఇచ్చే ఉచిత లావాదేవీల సంఖ్యను మాత్రం పెంచకపోవడం విషాదం. నిజానికి, రెండేళ్ళ క్రితం 2019 జూన్‌లో ఆర్బీఐ ఓ కమిటీ వేసింది. ఏటీఎం ఛార్జీలు, ఫీజులకు సంబంధించి సమీక్ష కోసం వేసిన ఆ కమిటీకి ‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సారథి. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడీ కొత్త ఛార్జీలను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. బ్యాంకులు వాటిని అమలు చేయడమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో మన దేశంలోని బ్యాంకుల ఏటీఎం వ్యవస్థను గమనిస్తే, ఎన్నో లోటుపాట్లు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో అన్నీ కలిపి 2 లక్షల 13 వేల పైచిలుకు ఏటీఎంలున్నాయి. అలాగే, రకరకాల బ్యాంకుల వన్నీ కలిపితే దాదాపు 90 కోట్ల దాకా డెబిట్ కార్డులున్నాయి. నిరక్షరాస్యులకూ, టెక్నాలజీ ప్రావీణ్యం లేని గ్రామీణ ప్రాంతాల వారికీ, వీటి వల్ల ఎంత ప్రయోజనమన్నది వేరే చర్చ. అసలింతకీ దేశంలోని 130 కోట్ల పైగా జనాభాకూ, ఇన్ని కోట్ల డెబిట్ కార్డులకు ఈ ఏటిఎంలు ఏ పాటి? పైగా ఈ ఏటీఎంలలో సగానికి సగం పని చేయవన్నది కస్టమర్లకు నిత్యం అనుభవైకవేద్యం. పనిచేస్తున్న వాటిలోనూ నగదు అందుబాటులో ఉండేవి అంతంత మాత్రమే. కస్టమర్ల లావాదేవీ ఏ కారణం వల్ల మధ్యలో ఆగినా, ఆ సమస్యను తక్షణం పరిష్కరించే నాథుడూ ఉండరు. ఇలాంటి కథలు లాక్డౌన్ కాలంలో అనేకం. మరి, ఈ మాత్రపు ఏటీఎంలకే ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయంటూ ఛార్జీలను హెచ్చించాలనుకోవడం, వినియోగదారులపై మరింత భారం వేయాలనుకోవడం ఏమంత న్యాయం? ఆ మాటకొస్తే ఫిక్సెడ్ డిపాజిట్ల కన్నా మామూలు సేవింగ్స్ ఖాతాలకు బ్యాంకులు తక్కువ వడ్డీ ఇచ్చేదే– ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు విత్‌డ్రా చేసే హక్కు కస్టమర్లకు కల్పిస్తున్నందుకు! కానీ, ‘ఏటీఎంలలో ఇన్ని లావాదేవీలే చేయాలి, ఎక్కువైతే ఫీజు చెల్లించాలి’ అనడం ఒక రకంగా కస్టమర్ల హక్కుకు భంగం కలిగించడమే! పైపెచ్చు తడవకు ఒకసారి ఏటీఎం ఛార్జీలు పెంచడమూ సరికాదు. కస్టమర్లు బ్యాంకులకొచ్చి నిల్చొని, నగదు తీసుకొనే కన్నా, ఏటీఎం వినియోగించడం వల్ల ఖర్చు, శ్రమ తగ్గుతాయి. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కి వచ్చే కన్నా ఏటీఎంల వాడకం వల్ల అందులో పదోవంతు ఖర్చుకే పని అయిపోతుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఏటీఎంల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన వేళ, దాన్ని భారం చేయడం హేతుబద్ధంగా తోచదు. కాబట్టి, ఆర్బీఐ ఈ ఉత్తర్వులపై పునరాలోచన చేయడం మంచిది. కరోనా కాలంలో అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహిస్తున్నామంటున్న పాలకులు అందుకే ఈ పని చేపట్టారని అనుకోవడానికీ లేదు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేయడం మాటెలా ఉన్నా, కస్టమర్లు తమ డబ్బులు తాము బ్యాంకుల్లో నుంచి తీసుకోవాలన్నా కూడా మరింత ఫీజు బాదుడుతో వెంటపడడం సరైనది కాదు. దీనివల్ల చివరకు బ్యాంకులకే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కస్టమర్లు బ్యాంకులను వదిలేసి, మొబైల్ ఫోన్ ఆపరేటర్ ద్వారా పేమెంట్ బ్యాంక్ ఖాతా తెరుచుకొనే వీలుంది. బ్యాంకు ఖాతాలోని అధిక భాగం నగదును ఎయిర్టెల్, జియో పేమెంట్స్ బ్యాంక్ లాంటి పలు పేమెంట్ బ్యాంకులకు మార్చేసుకోవచ్చు. చిన్న కస్టమర్లకూ, వ్యాపారులకూ తమకు అనువుగా భావించే ఈ పేమెంట్ బ్యాంకుల వల్ల వాళ్ళకు మెరుగైన వడ్డీ వస్తుంది. ఎప్పుడు, ఎలా కావాలంటే అలా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి పేమెంట్ బ్యాంకులు నడుపుతున్న ఫిన్‌టెక్ కంపెనీలకూ, మొబైల్ ఆపరేటర్లకూ వేలాది అవుట్‌లెట్లుంటాయి గనక కస్టమర్లకు నగదు లావాదేవీలు సులభం. వెరసి, బ్యాంకులకే నష్టం. దీంతో, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్టు మారితే, బ్యాంకులు తమను తాము తప్ప మరెవరినీ నిందించలేవు. తస్మాత్ జాగ్రత్త! -
బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్!
ఆర్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్(ఏటిఎం) లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై మరీ ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారిపై మరింత భారం పడనుంది. ఇంటర్‌ఛేంజ్ చార్జీల వల్ల ఇక నుంచి బ్యాంకులు ఆర్ధిక లావాదేవిలపై రూ.17 వరకు రుసుమును వసూలు చేయవచ్చు. ఈ ఫీజు ఇప్పటి వరకు రూ.15గా ఉండేది. అలాగే ఆర్ధికేతర లావాదేవీలపై ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది. ఒకవేల ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు ఏటీఎం లావాదేవీలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు చేయొచ్చు. ఈ రుసుము ప్రస్తుతం రూ.20గా ఉంది. ఆర్ధిక లావాదేవిలపై విధించే ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అదే ఆర్ధికేతర లావాదేవీలపై ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే? మీరు వేరే బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్నప్పడు మీ బ్యాంక్ ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దాన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు. ఏటిఎం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. ఏటిఎం ఛార్జీలను లెక్కించడానికి జనాభాను మెట్రిక్‌గా ఉపయోగించాలని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు, 1 మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని కేంద్రాల్లోని ఏటిఎంలలో ఉచిత లావాదేవీలను నెలకు ప్రస్తుతం ఉన్న 5 నుంచి 6కు పెంచాలని సూచించింది. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న కేంద్రాలలో ఉచిత లావాదేవీల పరిమితిని 3 వద్ద ఉంచాలని సిఫారసు చేసింది. ఒక మిలియన్ అంతకు మించి జనాభా ఉన్న అన్ని కేంద్రాల్లోని ఆర్థిక లావాదేవీల ఫీజు రూ.17, ఆర్థికేతర లావాదేవీల ఫీజును రూ.7కు పెంచాలని కమిటీ సూచించింది. ఏటిఎం లావాదేవీల కోసం ఇంటర్చేంజ్ ఫీజు నిర్మాణంలో చివరిగా ఆగస్టు 2012లో మార్పు జరిగిందని, కస్టమర్లు చెల్లించాల్సిన ఛార్జీలు చివరిగా ఆగస్టు 2014లో సవరించినట్లు ఆర్బీఐ గురువారం తెలిపింది. చదవండి: ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు -
బ్యాంకు వినియోగదారులకు మరో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఛార్జీలు, ఫీజు తగ్గించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఏటీఎం ఇంటర్ చార్జీలు, ఫీజు విధానాన్ని సమీక్షించేందుకు త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు గురువారం (మే 6) ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా ఆర్బీఐ ఈ సంకేతాలిచ్చింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా చేపట్టే ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట నివ్వబోవడం విశేషం. ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్బీఐ ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్‌కు చోటు కల్పిస్తామన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత, రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో విధి విధానాలను వెలురిస్తామని పేర్కొంది. కాగా పాలసీ రివ్యూలో భాగంగా రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. దీంతో 2010 సెప్టెంబర్ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు దిగి వచ్చింది. -
ఇక రోజువారీ పరిమితి రూ.25వేలు
సాక్షి, ముంబై : డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే చర్యలో భాగంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫండ్ ట్రాన్సఫర్ పరిమితులను పెంచింది. మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్సఫర్ పరిమితులను పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. యూజర్లు రోజూ తమ అకౌంట్లలోకి మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా రూ.25వేల వరకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చని ఎస్బీఐ చెప్పింది. అదే థర్డ్ పార్టీ అకౌంట్లకు అయితే రోజుకు రూ.10వేలు ట్రాన్సఫర్ చేసుకోవచ్చని పేర్కొంది. నెలవారీ అయితే సొంత అకౌంట్లకు ఎలాంటి పరిమితులు లేవు. కానీ థర్డ్ పార్టీ అకౌంట్లకు రూ.50వేల వరకే ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. 5000 రూపాయలకు మించి ఫండ్ ట్రాన్సఫర్లకు ఓటీపీ అవసరం పడుతుందని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అదేవిధంగా ఏటీఎం లావాదేవీలు ఉచితానికి మించి వినియోగించుకుంటే, 18 శాతం జీఎస్టీ ఛార్జీలను బ్యాంకు విధించనుంది. ఒకవేళ లావాదేవీ జరుగకపోయినా కూడా పన్ను భారాన్ని భరించాల్సిందేనని బ్యాంకు పేర్కొంది. ఏటీఎంలలో కార్డులెస్ లావాదేవీలకు జీఎస్టీతో పాటు జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. కాగ, మెట్రో సిటీల్లో సేవింగ్స్ బ్యాంకు కస్టమర్లకు ఎనిమిది ఏటీఎం లావాదేవీలు ఉచితం. దీనిలో ఐదు ఎస్బీఐ ఏటీఎం ద్వారా, మిగతా మూడు నాన్-ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఉచితం. అదే నాన్-మెట్రో సిటీల్లో అయితే 10 ఏటీఎం లావాదేవీలు ఉచితం. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు నెలకు కేవలం నాలుగు ఏటీఎం లావాదేవీలు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. ఈ పరిమితిని దాటితే ఎస్బీఐ ఏటీఎం వద్దనైతే రూ.10 ప్లస్ పన్ను. ఇతర బ్యాంకు ఏటీఎంల వద్దనైతే 20 రూపాయలతో పాటు పన్నును భరించాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ ఛార్జీల బాదుడు నేటినుంచే..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛార్జీల బాదుడు కార్యక్రమం నేటినుంచే ప్రారంభించబోతుంది.. కనీస బ్యాలెన్స్ ఉంచని పక్షంలో జరిమానాలు, నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే ఛార్జీల బాదుడు కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించబోతున్నట్టు ఎస్బీఐ అంతకముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడుపై ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన్నప్పటికీ, ఎస్బీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎస్బీఐ అమలు చేయబోతున్న ఛార్జీల బాదుడుకు మొత్తం 31 కోట్ల డిపాజిట్ దారులు ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. దీనిలో పెన్షనర్లు, విద్యార్థులు కూడా ఉన్నారు. ఎస్బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులు విలీనమవుతున్న తరుణంలో ఈ బాదుడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రారంభించబోతుంది. కనీస బ్యాలెన్స్ కింద మెట్రో బ్రాంచు ఖాతాదారులు తమ అకౌంట్లో కచ్చితంగా నెలకు రూ.5000 ఉంచుకోవాల్సిందే. లేదంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల పెనాల్టీని భరించాల్సి ఉంటుంది. అలాగే అర్బన్, సెమీ-అర్బన్ బ్రాంచు ఖాతాదారులైతే కనీసం తమ బ్యాంకు బ్యాలెన్స్ రూ.3000, రూ.2000 ఉంచుకోవాల్సిందే. దీన్ని కనుక ఖాతాదారులు ఉల్లంఘిస్తే వీరికి కూడా రూ.20 నుంచి రూ.50 వరకు జరిమానా పడుతుందని బ్యాంకు అంతకమున్నుపే హెచ్చరించింది. సమీక్షించిన ఛార్జీల అనంతరం ఏటీఎం విత్ డ్రాయల్స్ పై కూడా 20 రూపాయల వరకు మోత మోగించనున్నారు. ఎస్బీఐ ఏటీఎంలలో కూడా ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండి సొంత ఏటీఎంలలో డ్రా చేసుకుంటే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. అలాగే ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకుంటూ ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉంచుకోవాలని బ్యాంకు సూచించింది. అయితే ఈ ఛార్జీల మోతను తమపై ఉన్న జన్ ధన్ అకౌంట్ల భారాన్ని తగ్గించుకోవడానికేనని ఎస్బీఐ సమర్ధించుకుంటోంది. అంతకముందు కూడా తాము ఈ పెనాల్టీలు వేశామని బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెబుతున్నారు. 2012లో వీటిని విత్ డ్రా చేసినట్టు తెలిపారు. -
ఏ ఏటీఎంలోనైనా డబ్బులు తీసుకోండి!
చార్జీలు మినహారుుస్తున్నాం: యస్ బ్యాంక్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయ నేపథ్యంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తన కస్టమర్లకు ఏటీఎం చార్జీల నుంచి పది రోజులు మినహారుుంపునిచ్చింది. అంటే యస్ బ్యాంక్ కస్టమర్లు ఏ ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచైనా చార్జీల బాదుడు లేకుండా డబ్బుల్ని తీసుకోవచ్చు. అలాగే సొంత యస్ బ్యాంక్ ఏటీఎంల నుంచి కూడా ఎన్నిసార్లైనా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అరుుతే విత్‌డ్రాయెల్స్ అన్ని ఆర్బీఐ పరిమితులకు లోబడి ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది. చార్జీల మినహారుుంపు సౌకర్యం ఈ నెల 11 నుంచి 20 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఒక బ్యాంక్ కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బు డ్రా (పరిమితికి మించి) చేసుకుంటే.. ఆ విత్‌డ్రాకు బ్యాంకులు చార్జీలు విధిస్తారుు. అరుుతే యస్ బ్యాంక్ తన వినియోగదారులకు ఈ చార్జీలు మినహారుుంచింది. అలాగే యస్ బ్యాంక్.. సేవింగ్స అకౌంట్స్‌కు సంబంధించి క్యాష్ డిపాజిట్లకు కూడా డిసెంబర్ వరకు చార్జీలను మినహారుుంచింది. ఇక తమ బ్రాంచులను కొత్త నోట్లతో సంసిద్ధంగా ఉంచామని, ప్రజలు పాత నోట్లను ఇచ్చి కొత్త వాటిని పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది. -
మళ్లీ ఏటీఎం చార్జీల బాదుడు!
ముంబై: బ్యాంకులు ఏటీఎం చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తమ ఏటీఎం కార్యకలాపాలు నష్టాల్లో నడుస్తున్నాయని... కస్టమర్ల నుంచి లావాదేవీల ఫీజును వసూలు చేయకతప్పదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అదేవిధంగా ఏటీఎం నెట్వర్క్ విస్తరణకు వాణిజ్యపరమైన లాభదాయక విధానం చాలా అవసరమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘మేం అందించే సేవలకుగాను వినియోగదారుల నుంచి కొంత ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఇరువురికీ ఆమోదయోగ్యమైన పరిస్థితి ఉండాలి. వాణిజ్యపరంగా లాభసాటి విధానం ఉండాలనేదే మా వాదన. ఈ కార్యకలాపాలపై నష్టాలు పెరుగుతూపోతే మావల్లకాదు’ అని ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. విస్తరించాలంటే చార్జీల విధింపే మార్గం... ఎస్బీఐకి దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ చివరినాటికి 32,777 ఏటీఎంలు ఎస్బీఐ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు అంచనా. వీటిని మరింత పెంచే ప్రణాళికల్లో బ్యాంక్ ఉంది. ‘ఎల్లకాలం ఏటీఎంపై మేం నష్టాలను భరించలేం. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ఏటీఎంలను మూసేయక తప్పదు. అందుకు మేం సిద్ధమే. అయితే, దీనికి సరైన సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది’ అని ఆమె చెప్పారు. బెంగళూరులో ఒక ఏటీఎంలో మహిళపై దుండగుడు దాడిచేసిన ఘటన నేపథ్యంలో ఏటీఎంలలో భద్రత పెంపునకు వీలుగా సేవలపై చార్జీలు విధించాలంటూ బ్యాంకింగ్ వర్గాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్బీఐ చీఫ్ స్పందిస్తూ... తమ సొంత కస్టమర్లపైనా లావాదేవీల ఫీజు వసూలు చేసేందుకు తాము సుముఖమేనని పేర్కొన్నారు. ఏటీఎంల నెట్‌వర్క్‌ను విస్తరించాలంటే లాభదాయక విధానం చాలా అవసరమన్నారు. కాగా, ఈ ఏడాది మార్చిచివరికల్లా ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంక్ కూడా తమ బ్రాంచ్‌కు ఆనుకుని ఒక ఏటీఎంను తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విదితమే. ఆ ప్రతిపాదనతో 5 దాటితే షాకే...! ప్రస్తుతం బ్యాంకులు తమ ఖాతాదారులకు సొంత ఏటీఎంలలో అపరిమితంగా లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే... నెలకు ఐదుసార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదికూడా గరిష్ట నగదు విత్‌డ్రా పరిమితి రూ.10 వేలు మాత్రమే. అయితే, ఈ సేవలకు గాను ఖాతాదారుడికి చెందిన బ్యాంక్... ఇతర బ్యాంక్‌కు ఒక్కో లావాదేవీకి రూ15 చొప్పున(పన్నులతో కలిపి దాదాపు రూ.17) చొప్పున చెల్లించాల్సి వస్తోంది. అయితే, పరిమితి దాటితే ఆ భారం నేరుగా ఖాతాదారుడిపైనే పడుతోంది. ఇప్పుడు ఐబీఏ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే... ఖాతాఉన్న బ్యాంక్, ఇతర బ్యాంకులనే తేడాలేకుండా ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపైనా చార్జీ పడుతుంది. గతేడాది మార్చి చివరినాటికి దేశవ్యాప్తంగా 1.4 లక్షల ఏటీఎంలు ఉన్నట్లు అంచనా. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 72,340. ప్రతి ఏటీఎం సెంటర్లో సీసీటీవీ కెమెరా, ఆయుధంతో కూడిన సెక్యూరిటీ గార్డును పెట్టాలంటే ఒక్కో ఏటీఎంకు దాదాపు రూ.40 వేల అధిక వ్యయం అవుతుందనేది ఐబీఏ అంచనా. ఉచిత లావాదేవీల తగ్గింపును పరిశీలిస్తున్నాం: ఆర్బీఐ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ఒక్కో ఖాతాదారుడికి నెలకు మొత్తం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని(సొంత, ఇతర బ్యాంకులతోకలిపి) 5కు తగ్గించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఇటీవలే ఆర్బీఐకి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ఉచిత పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీ విధించేలా ఇప్పుడున్న నిబంధనలనే ఆర్బీఐ కొనసాగించాలని కూడా ఐబీఏ తన సూచనల్లో పేర్కొంది. తాజా భద్రత పెంపు చర్యలతో బ్యాంకులపై నెలకు రూ.400 కోట్ల భారం పడుతోందనేది ఐబీఏ వాదన. ‘ఏటీఎంల విషయంలో ఐబీఏ సూచనల(నెలకు మొత్తం ఉచిత లావాదేవీలను 5కు తగ్గించడం)ను మేం పరిశీలించనున్నాం. ఇతర ప్రతిపాదనలు కూడా మాకు అందాయి. ప్రధానంగా ప్రజలు నగదు రూపంలో మరీ ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు. దీనివల్ల నిర్వహణ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుంది. అంతేకాకుండా మనీలాండరింగ్ రిస్క్‌లు కూడా పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఐబీఏ డిమాండ్ చాలా తెలివితక్కువ, అసంబద్ధమైనదంటూ ఆర్బీఐ మరో డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. సొంత ఖాతాదారులపైనే ఏటీఎం చార్జీల విధింపు ఎక్కడా ఉండదని, బ్యాంకులు తమ పనితీరు మెరుగుదలపై దృష్టిసారించాలని సూచించారు కూడా. -
ఏటీఎం చార్జీలు బ్యాంకుల ఇష్టం: ఆర్బీఐ
ముంబై: ఏటీఎం సర్వీసులకు సమంజసమైన చార్జీలను వసూలు చేసుకోవడానికి ఆర్బీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. ఏటీఎంల నిర్వహణ భారం కాకుండా ఉండడం కోసం ఖాతాదారుల ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు సముచితమైన చార్జీలు విధించుకోవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కె.సి. చక్రవర్తి గురువారం చెప్పారు. ఏటీఎంల సేవలకు సమంజసమైన చార్జీలు విధిస్తే, ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పదని పేర్కొన్నారు. ఆర్బీఐలో బ్యాంకింగ్ వ్యవహారాలను చక్రవర్తి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ చార్జీల విషయమై బ్యాంకుల నుంచి ఎలాంటి వినతులు ఇప్పటిదాకా రాలేదన్నారు. బ్యాంకింగ్ రంగంలో పోటీ తీవ్రంగా ఉన్నందున చార్జీల విధింపు మార్కెట్ శక్తుల నిర్ణయమేనని, అయితే చార్జీల విషయమై బ్యాంక్‌లకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ఇతర బ్యాంక్‌ల ఏటీఎంలను ఉపయోగించుకున్నందుకు గాను ఒక్కో బ్యాంక్ ఆ బ్యాంక్‌కు రూ.15 చార్జీ చెల్లిస్తోందని, అయితే ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు ఈ సర్వీసును ఉచితంగానే ఇస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై బ్యాంకులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని అంచనా.