ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే..
ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం..
జీఎస్టీ కొత్త రూల్
జీఎస్టీ ఇన్‌వాయిస్‌ల అప్‌లోడ్‌కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్‌లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్‌వాయిస్ అప్‌లోడ్‌కు ఎలాంటి కాల పరిమితి లేదు.
మ్యూచువల్ ఫండ్స్
కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది.
గ్యాస్ సిలిండర్ ధర
కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు.
పీఎన్‌బీ ఏటీఎం చార్జీలు
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది.
ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!
Comments
Please login to add a commentAdd a comment