![ఏ ఏటీఎంలోనైనా డబ్బులు తీసుకోండి!](/styles/webp/s3/article_images/2017/09/4/71478811188_625x300.jpg.webp?itok=VGxJWWq6)
ఏ ఏటీఎంలోనైనా డబ్బులు తీసుకోండి!
చార్జీలు మినహారుుస్తున్నాం: యస్ బ్యాంక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయ నేపథ్యంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తన కస్టమర్లకు ఏటీఎం చార్జీల నుంచి పది రోజులు మినహారుుంపునిచ్చింది. అంటే యస్ బ్యాంక్ కస్టమర్లు ఏ ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచైనా చార్జీల బాదుడు లేకుండా డబ్బుల్ని తీసుకోవచ్చు. అలాగే సొంత యస్ బ్యాంక్ ఏటీఎంల నుంచి కూడా ఎన్నిసార్లైనా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అరుుతే విత్‌డ్రాయెల్స్ అన్ని ఆర్‌బీఐ పరిమితులకు లోబడి ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది. చార్జీల మినహారుుంపు సౌకర్యం ఈ నెల 11 నుంచి 20 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
సాధారణంగా ఒక బ్యాంక్ కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బు డ్రా (పరిమితికి మించి) చేసుకుంటే.. ఆ విత్‌డ్రాకు బ్యాంకులు చార్జీలు విధిస్తారుు. అరుుతే యస్ బ్యాంక్ తన వినియోగదారులకు ఈ చార్జీలు మినహారుుంచింది. అలాగే యస్ బ్యాంక్.. సేవింగ్‌స అకౌంట్స్‌కు సంబంధించి క్యాష్ డిపాజిట్లకు కూడా డిసెంబర్ వరకు చార్జీలను మినహారుుంచింది. ఇక తమ బ్రాంచులను కొత్త నోట్లతో సంసిద్ధంగా ఉంచామని, ప్రజలు పాత నోట్లను ఇచ్చి కొత్త వాటిని పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది.