Canceled currency
-
రూ. 12 కోట్లు కావాలి!
సాక్షి, బెంగళూరు: నోట్లరద్దు వల్ల అంధుల ప్రపంచ కప్‌ను నిర్వహించడం భారంగా మారిందని సంఘం అధ్యక్షుడు కె. మహంతేశ్ అన్నారు. ‘వరల్డ్‌కప్ నిర్వహణకు కావల్సిన రూ. 12 కోట్ల నిధుల సేకరణ కష్టంగా మారింది. నోట్ల రద్దు కారణంగా కోకకోలా కంపెనీ తమ స్పాన్సర్‌షిప్‌ని రద్దుచేసింది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ రూ.2 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ సుప్రీం కోర్టు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులను తప్పించడంతో ఆ సంస్థ నుంచి రావాల్సిన డబ్బు కూడా ఇరకాటంలో పడింది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చును మాత్రం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భరించేందుకు ముందుకు వచ్చాయి అని మహంతేశ్ తెలిపారు. జనవరి 31 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. -
ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సాక్షి, హైదరాబాద్: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్నా, అవినీతిని అంతమొందించాల న్నా.. దాన్ని చేపట్టేవారు అవినీతి రహితులై ఉండాలని సీపీఐ ప్రధా నకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సహారా, బిర్లా కంపెనీ వ్యవహారాల్లో 9 పర్యాయాలు రూ.56కోట్ల ముడుపులను అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తీసుకున్నట్లు సాక్షాత్తు ఈడీ రికార్డుల్లో లభ్యమైందన్నారు. దీనిపై విపక్షనేతలు పలుమార్లు ఆరోపణలు చేశార ని, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు దీన్ని తేలికగా కొట్టిపారేయకుండా విచారణ జరపాలన్నారు. మోదీ అవినీతికి పాల్పడ్డా రని తాము ఆరోపించడంలేదని, వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. గురువారం మఖ్దూం భవన్ లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు పేదలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా డబ్బు లు దొరకకపోగా, మరోవైపు ఆర్బీఐ నుంచి నేరుగా వందల కోట్లు బడాబాబులు, కార్పొరేట్ శక్తులకు ఎలా తరలిపోతున్నా యని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దువల్ల ఎదురైన సమస్యలను వివరించడా నికి వచ్చేనెల 3–10 తేదీల మధ్య దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ శక్తులను కలుపుకుని దేశవ్యాప్తంగా పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద న్నారు. పార్టీ నాయకులు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నోట్లరద్దు అవినీతి వ్యతిరేక టీకా: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కేంద్ర ప్రసారాల,సమాచార శాఖా మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం అవినీతి వ్యతిరేక టీకాగా పనిచేస్తోందన్నారు. ఎన్డీయే రెండున్నరేళ్ల పాలనపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. -
సభను అడ్డుకోవడం దారుణం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరిపి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోరుు.. సభ జరిగినన్ని రోజులూ ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రతిపక్షాలు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయ న్నారు. శుక్రవారం ఢిల్లీలో తన కార్యాలయంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రసూతి సెలవుల పెంపు బిల్లు లోక్‌సభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని, ప్రతిపక్షాలు సభను జరగనిస్తే బిల్లు ఆమోదం పొంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంత స్తుల భవనం కూలి కార్మికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘట నపై పూర్తిస్థారుు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి మృతు ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఢిల్లీ పర్య టనలో ఉన్న సీఎం కేసీఆర్‌తో దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలి
మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ గజ్వేల్: నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారని.. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా సాగుతున్న దీక్షా శిబిరానికి వెళ్తూ గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల బడాబాబులు ఎవరూ సమస్యలు ఎదుర్కోవడం లేదన్నారు. -
విజయవాడలో కొనె కార్యాలయం
సాక్షి, అమరావతి: పెద్దనోట్ల రద్దు వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రతి కూల ప్రభావం చూపదని ఎలివేటర్, ఎస్కలేటర్స్ సంస్థ కొనె ఇండియా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో నివాస స్థిరాస్తి రంగంపై మాత్రం తాత్కాలికంగా ప్రభావం పడుతుందని కొనె ఇండియా ఎండి అమిత్ గొస్పైన్ చెప్పారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినా ఎలివేటర్ మార్కెట్ మాత్రం 6 శాతం వృద్ధిని నమోదు చేస్తోందన్నారు. గురువారం విజయవాడలో కొనె కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ’సాక్షి’తో మాట్లాడుతూ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండూ... ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. దేశీయంగా ఎలివేటర్ మార్కెట్ పరిమాణం సుమారుగా రూ. 60,000 కోట్లు ఉంటే ఇందులో 20 శాతం వాటాతో కొనె మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందన్నారు. ఇండియాలో వాస్తు నమ్మకాలు ఎక్కువగా ఉండటంతో దీనికి అనుగుణంగా ఎలివేటర్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. -
ఏ ఏటీఎంలోనైనా డబ్బులు తీసుకోండి!
చార్జీలు మినహారుుస్తున్నాం: యస్ బ్యాంక్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయ నేపథ్యంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తన కస్టమర్లకు ఏటీఎం చార్జీల నుంచి పది రోజులు మినహారుుంపునిచ్చింది. అంటే యస్ బ్యాంక్ కస్టమర్లు ఏ ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచైనా చార్జీల బాదుడు లేకుండా డబ్బుల్ని తీసుకోవచ్చు. అలాగే సొంత యస్ బ్యాంక్ ఏటీఎంల నుంచి కూడా ఎన్నిసార్లైనా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అరుుతే విత్‌డ్రాయెల్స్ అన్ని ఆర్బీఐ పరిమితులకు లోబడి ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది. చార్జీల మినహారుుంపు సౌకర్యం ఈ నెల 11 నుంచి 20 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఒక బ్యాంక్ కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బు డ్రా (పరిమితికి మించి) చేసుకుంటే.. ఆ విత్‌డ్రాకు బ్యాంకులు చార్జీలు విధిస్తారుు. అరుుతే యస్ బ్యాంక్ తన వినియోగదారులకు ఈ చార్జీలు మినహారుుంచింది. అలాగే యస్ బ్యాంక్.. సేవింగ్స అకౌంట్స్‌కు సంబంధించి క్యాష్ డిపాజిట్లకు కూడా డిసెంబర్ వరకు చార్జీలను మినహారుుంచింది. ఇక తమ బ్రాంచులను కొత్త నోట్లతో సంసిద్ధంగా ఉంచామని, ప్రజలు పాత నోట్లను ఇచ్చి కొత్త వాటిని పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది.