ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్నా, అవినీతిని అంతమొందించాల న్నా.. దాన్ని చేపట్టేవారు అవినీతి రహితులై ఉండాలని సీపీఐ ప్రధా నకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సహారా, బిర్లా కంపెనీ వ్యవహారాల్లో 9 పర్యాయాలు రూ.56కోట్ల ముడుపులను అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తీసుకున్నట్లు సాక్షాత్తు ఈడీ రికార్డుల్లో లభ్యమైందన్నారు. దీనిపై విపక్షనేతలు పలుమార్లు ఆరోపణలు చేశార ని, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు దీన్ని తేలికగా కొట్టిపారేయకుండా విచారణ జరపాలన్నారు.
మోదీ అవినీతికి పాల్పడ్డా రని తాము ఆరోపించడంలేదని, వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. గురువారం మఖ్దూం భవన్ లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు పేదలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా డబ్బు లు దొరకకపోగా, మరోవైపు ఆర్‌బీఐ నుంచి నేరుగా వందల కోట్లు బడాబాబులు, కార్పొరేట్ శక్తులకు ఎలా తరలిపోతున్నా యని ప్రశ్నించారు.
పెద్దనోట్ల రద్దువల్ల ఎదురైన సమస్యలను వివరించడా నికి వచ్చేనెల 3–10 తేదీల మధ్య దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ శక్తులను కలుపుకుని దేశవ్యాప్తంగా పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద న్నారు. పార్టీ నాయకులు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.