palla venkata reddy
-
దుష్పచారాన్ని తిప్పికొట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశిష్టతను, దాని ద్వారా సాధించుకున్న హక్కులు, గౌరవాన్ని తెలియజెప్పేందుకే రాష్ట్రవ్యాప్త స్ఫూర్తియాత్రను నిర్వహిస్తున్నట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. నాడు కమ్యూనిస్టులు జరిపిన ఈ చారిత్రక పోరాటాన్ని వక్రీకరిస్తూ, మతతత్వశక్తులు చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై ప్రముఖ కమ్యూనిస్టు నేత, తెలంగాణ పోరాటయోధుడు మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద సాయుధపోరాట వారోత్సవాలు పురస్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి ఈటి నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్ఫూర్తియాత్రను చాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధపోరాట స్ఫూర్తితో దేశంలో, రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కేడర్‌కు పిలుపు నిచ్చారు. భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత సర్దార్ పటేల్ సహకారంతో ప్రజల నుంచి దొరలు భూములను లాక్కున్నారని, కేంద్రానికి లొంగిపోయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు గవర్నర్ పదవిని పటేల్ ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు. నిజాంపాలనలో రజాకార్ల అకృత్యాలపై తిరుగుబాటు చేసేందుకు కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహీయుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి సాయుధపోరాటానికి పిలుపునిస్తూ సంతకం చేశారని అజీజ్‌పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా వెంకటరెడ్డి, వీఎస్ బోస్, ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న స్ఫూర్తియాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరుకుంది. సెప్టెంబర్ 17తో యాత్ర ముగుస్తుంది. -
‘కూటమి ఒప్పుకోకుంటే ప్లాన్- బీ అమలు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వటానికి మహాకూటమి ఒప్పుకోకుంటే ప్లాన్-బీని అమలు చేస్తామని సీపీఐ సహ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 5సీట్ల కంటే తక్కువ కేటాయిస్తే తీసుకోకూడదని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్లాన్-బీ అమలు చేయాల్సి వస్తే! 24 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. కూటమిలోని మిత్ర పక్షాలకు సీట్లు ఖరారు చేయకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించటానికి సిద్ధమైందన్నారు. సీపీఐకి రెండు మూడు సీట్లంటూ కాంగ్రెస్ ఇస్తోన్న లీకులు బాధాకరమని వ్యాఖ్యానించారు. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తమ ప్రాతినిథ్యం ఉండాలని కుండబద్దలు కొట్టారు. నల్గొండ జిల్లాలో కనీసం ఒక్క సీటైనా ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని చెప్పారు. ఏ స్థానాల్లో పోటీ చేయాలో తామే నిర్ణయించుకుని కూటమిలో పార్టీలకు తెలుపుతామన్నారు. కూటమి ముందుకు వెళ్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్చలకు ముందుకు రావటం లేదని తెలిపారు. -
ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సాక్షి, హైదరాబాద్: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్నా, అవినీతిని అంతమొందించాల న్నా.. దాన్ని చేపట్టేవారు అవినీతి రహితులై ఉండాలని సీపీఐ ప్రధా నకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సహారా, బిర్లా కంపెనీ వ్యవహారాల్లో 9 పర్యాయాలు రూ.56కోట్ల ముడుపులను అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తీసుకున్నట్లు సాక్షాత్తు ఈడీ రికార్డుల్లో లభ్యమైందన్నారు. దీనిపై విపక్షనేతలు పలుమార్లు ఆరోపణలు చేశార ని, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు దీన్ని తేలికగా కొట్టిపారేయకుండా విచారణ జరపాలన్నారు. మోదీ అవినీతికి పాల్పడ్డా రని తాము ఆరోపించడంలేదని, వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. గురువారం మఖ్దూం భవన్ లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు పేదలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా డబ్బు లు దొరకకపోగా, మరోవైపు ఆర్బీఐ నుంచి నేరుగా వందల కోట్లు బడాబాబులు, కార్పొరేట్ శక్తులకు ఎలా తరలిపోతున్నా యని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దువల్ల ఎదురైన సమస్యలను వివరించడా నికి వచ్చేనెల 3–10 తేదీల మధ్య దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ శక్తులను కలుపుకుని దేశవ్యాప్తంగా పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద న్నారు. పార్టీ నాయకులు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గవర్నర్లను డిస్మిస్ చేయాలి
సురవరం డిమాండ్ బీజేపీ దుర్మార్గాలపై పోరాడాలి దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్లను కేంద్రప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసలు గవర్నర్ పదవే వృథా అని, కేంద్రానికి ఏజెంట్‌గా వ్యవహరించేందుకే ఆ పదవి పనికొస్తోందని అన్నారు. సంఘ్‌పరివార్‌కు అనుకూలంగా వ్యవహరించే వారిని గవర్నర్లుగా నియమిస్తుండడంతో వారు తమ పాతకాలం నాటి బూజుపట్టిన భావాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని సురవరం డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, విద్య, సాంస్కృతిక, సామాజిక రంగాలపై దాడి జరుగుతోందని విమర్శించారు. ఈ దాడులకు నిరసనగా లెఫ్ట్, రాజకీయేతర సంస్థలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమ జాతీయ సమితి పిలుపునిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ సహా అన్ని వర్గాలు సమైక్యంగా ప్రతిఘటిస్తే తప్ప బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కొనలేమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు.. మహాత్మాగాంధీ హత్యకు గురికావడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందో లేదో తెలియదు కానీ ఆయన మరణం తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు జరుపుకుందని సురవరం వ్యాఖ్యానించారు. ఈ విషయాన్నే ఆర్ఎస్ఎస్కు రాసిన లేఖలో వల్లభాయ్‌పటేల్ పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా అప్పట్లో విజయవాడలో ఈ ఉత్సవాల విషయంలో సీపీఐ-ఆర్ఎస్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగిందన్నారు. కశ్మీర్ పరిణామాలపై అఖిలపక్షాన్ని పిలవాలి.. కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సురవరం డిమాండ్ చేశారు. బుర్హన్ అనే టైస్టు హతం కావడంపై వ్యాఖ్యానిస్తూ, గతంలో ఒక టైస్టు ఎన్‌కౌంటర్‌పై ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కాలేదన్నారు. దీంట్లో ఏదో తప్పు జరిగిందని (సమ్‌థింగ్ ఈజ్ రాంగ్) వ్యాఖ్యానించారు.