CPI state council
-
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మూడో మహాసభలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. బుధవారం రాత్రి వరకు కార్యదర్శి ఎన్నికకు సంబంధించిన హైడ్రామా కొనసాగింది. ఇప్పటివరకు రెండు దఫాలు కార్యదర్శిగా కొనసాగిన చాడ వెంకట్‌రెడ్డి కూడా మరోసారి అవకాశం కావాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం బరిలో నిలిచారు. దీంతో ముగ్గురు నేతలు పోటీ పడటంతో సభ్యుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము రెండున్నర వరకు సభ్యులు తర్జనభర్జన పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరికి చాడ వెంకటరెడ్డి తప్పుకోగా కూనంనేని, పల్లా మధ్య పోటీ అనివార్యమైంది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మహాసభలో ఎన్నికైన రాష్ట్ర సమితి సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మొత్తం 110 ఓట్లు పోలు కాగా, అందులో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్లు చెల్లలేదు. దీంతో 14 ఓట్ల మెజారిటీతో కూనంనేని విజయం సాధించారు. కాగా, అంతకుముందు మహాసభ 101 మంది రాష్ట్ర సమితి సభ్యులను, 9 మంది కంట్రోల్ కమిషన్ సభ్యులను ఎన్నుకుంది. సమితి సభ్యుల నుంచి 31 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుంది. గురువారం నూతన కార్యవర్గం వివరాలను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెల్లడించారు. కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు చిన్న వయసు నుండే పార్టీలో పనిచేసు్తన్నారని, విశాలాంధ్ర విలేకరిగా, ఖమ్మం జిల్లాలో పార్టీలో వివిధ హోదాలను నిర్వర్తించారని, రాష్ట్ర సహాయ కార్యదర్శిగానూ పనిచేశారని చాడ తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల విధానం ద్వారా పార్టీ కార్యదర్శిగా కూనంనేనిని ఎన్నుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు: కూనంనేని ప్రజాసమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాలను నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇదీ చదవండి: కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు! -
ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాత పథకాలకు పాతరవేసి, కొత్త ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కుయుక్తులతో బర్రెలు, గొర్రెలు, కంటి వెలుగు పేరుతో రోజుకో పథకాన్ని తెరపైకి తెస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. మఖ్దూం భవన్లో బుధవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆగస్టు 10న సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. -
వారు కలిస్తేనే హోదా సాధ్యం: రామకృష్ణ
సాక్షి, వైఎస్సార్ కడప: రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కె.రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ 2015లోనే తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మానేసి ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై అన్ని సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలిసేలా ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. కడపలో సోమవారం జరిగిన 26వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక అనంతరం పలు ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు చర్చించారు. -
ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సాక్షి, హైదరాబాద్: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయాలన్నా, అవినీతిని అంతమొందించాల న్నా.. దాన్ని చేపట్టేవారు అవినీతి రహితులై ఉండాలని సీపీఐ ప్రధా నకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సహారా, బిర్లా కంపెనీ వ్యవహారాల్లో 9 పర్యాయాలు రూ.56కోట్ల ముడుపులను అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తీసుకున్నట్లు సాక్షాత్తు ఈడీ రికార్డుల్లో లభ్యమైందన్నారు. దీనిపై విపక్షనేతలు పలుమార్లు ఆరోపణలు చేశార ని, బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు దీన్ని తేలికగా కొట్టిపారేయకుండా విచారణ జరపాలన్నారు. మోదీ అవినీతికి పాల్పడ్డా రని తాము ఆరోపించడంలేదని, వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. గురువారం మఖ్దూం భవన్ లో పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు పేదలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా డబ్బు లు దొరకకపోగా, మరోవైపు ఆర్బీఐ నుంచి నేరుగా వందల కోట్లు బడాబాబులు, కార్పొరేట్ శక్తులకు ఎలా తరలిపోతున్నా యని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దువల్ల ఎదురైన సమస్యలను వివరించడా నికి వచ్చేనెల 3–10 తేదీల మధ్య దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ శక్తులను కలుపుకుని దేశవ్యాప్తంగా పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్ర భూసేకరణ చట్టం 2013కు తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద న్నారు. పార్టీ నాయకులు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
శేఖర్‌రెడ్డి అక్రమాలపై బాబు నోరు విప్పాలి!
ధ్వజమెత్తిన సీపీఐ రాష్ట్ర సమితి సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల అండతో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి వంటి నల్లకుబేరులు రూ.వందల కోట్లను తెల్లడబ్బుగా మార్చుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి ధ్వజమెత్తింది. ఏ ప్రభుత్వ అధినేత అండతో శేఖర్‌రెడ్డి రూ.70 కోట్ల కొత్త కరెన్సీని సంపాదించారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘరానా మోసగాళ్లకు చంద్రబాబు ఎలా పదవులు కట్టబెట్టారో చెప్పాలని నిలదీసింది. రెండు రోజులుగా విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. శేఖర్‌రెడ్డి ఇంట్లో వందల కోట్ల డబ్బు, కిలోల కొద్దీ బంగారం దొరికిన తర్వాత టీటీడీ బోర్డు నుంచి తీసేసినంత మాత్రాన చంద్రబాబు పాపం ప్రక్షాళన అయిపోదని, ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. టీటీడీ బోర్డులో వ్యాపార, వాణిజ్యవేత్తలను నియమించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమే పెద్దనోట్ల రద్దు
విజయవాడ (గాంధీనగర్) : పెద్దనోట్ల రద్దు ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. సామాన్యులు పాలకులను తిడుతున్నాయని, అంబానీ, అడ్వాణీ వంటి కోటీశ్వరులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు. రూ.2వేల నోటు కారణంగా నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల్లో చెప్పిన విధంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో చంద్రబాబును కన్వీనర్‌గా నియమించడం బాధాకరమన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్ష మహిళా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవానీ మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ, మద్యనియంత్రణ, మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఏ.విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, కోశాధికారి పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. -
‘కరువు’పై గవర్నర్ నివేదిక సరికాదు: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో తీవ్ర కరు వు పరిస్థితులుంటే ముమ్మరంగా కరువు సహాయక చర్యలను చేపడుతున్నట్లు కేం ద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలకు కరువు సహాయం అందడం లేదని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేస్తుంటే నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సోమవారం మఖ్దూం భవన్లో మాట్లాడుతూ... రాష్ర్టం నాలుగు వందల స్కూళ్లు మూసివేయాలని చూడడం సరికాదన్నారు. పాలేరు ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ రకరకాల వాగ్దానాలతో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిందనీ.. అయితే సానుభూతి పనిచేయడంవల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు. -
చంద్రబాబు తీరుతోనే ‘హోదా’ పట్ల నిర్లక్ష్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు హితవు పలికారు. కృష్ణా నీటి పంపిణీపై బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ఇరు రాష్ట్రాలలోని పాలమూరు ప్రాంతం, రాయలసీమ,ప్రకాశం జిల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.చర్చల ద్వారా నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంలను రామకృష్ణ కోరారు. -
విమర్శలకు ఎదురుదాడి సరికాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా అధికారపక్షం, ఎదురుదాడి చేయడమే మార్గంగా ఎంచుకోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త ఆలోచనలు, మార్పులుంటాయని ఆశించిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వపాలన ఆశాభంగాన్ని కలగజేసిందన్నారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీనేత పల్లా వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షల పరిహారాన్ని గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సైతం వర్తింపచేయాలని డిమాండ్‌చేశారు. వరంగల్ లోక్‌సభ సీటు ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంలో మిగతా వామపక్షాలతో చర్చించి త్వరలోనే నిర్ణయిస్తామని చాడ చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం మఖ్దూంభవన్‌లో చాడ వెంకటరెడ్డిని తెలంగాణ ఉద్యమవేదిక నేత చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ కలుసుకున్నారు. వరంగల్‌లో వినోద్‌కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని ఆయనను సుధాకర్ కోరారు. ఎన్కౌంటర్లపై ప్రభుత్వ వైఖరి తెలపాలి ఇటీవల వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తోపాటు నక్సలైట్ల అణచివేత, ఎన్కౌంటర్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్షాలు నిర్ణయించాయి. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సీఎం స్థాయిలో ప్రకటన వెలువడేలా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు కలుపుకుని విస్తృతస్థాయిలో చలో అసెంబ్లీ, ఇతరత్రా నిరసన కార్యక్రమాలను చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాయి. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో విరసం నేత వరవరరావు సమావేశమయ్యారు. -
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
అఖిలపక్ష నేతల డిమాండ్ హైదరాబాద్: మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని, 10 నెలల వేతన బకాయిలు ఇప్పిం చాలని, కార్మికులకు శాశ్వత ఉద్యోగభద్రత కల్పిం చాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాయిదా తీర్మానమిచ్చి సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిర్పూరు పేపర్ మిల్లు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద కుటంబసభ్యులతో కలసి కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ మిల్లు తెలంగాణ ఏర్పడిన కొద్దిమాసాలకే మూతపడడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యూనియన్ నాయకుడైన కార్మిక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే సీఎంతో మాట్లాడి మిల్లును తెరిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడమేనా అని ప్రశ్నించారు. మిల్లును తెరిపించడానికి కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఎం నేత వెంకటేష్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, సీపీఐ నేత గుండా మల్లేశ్, టీడీపీ నేత రమేష్ రాథోడ్, మాజీమంత్రి బోడ జనార్దన్, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్ఎల్ పద్మ, సిర్పూరు పేపరు మిల్లు సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసు పాల్గొన్నారు. -
ప్రజలకు మీరు చేసిందేమిటి..?
కడప ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని అప్పటి నుంచి నేటి వరకూ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిం చారు. కడప జిల్లా పరిషత్తులోని సభాభవనంలో శని వారం సీపీఐ ఆధ్వర్యంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిపై రాయలసీమ జిల్లాలకు సంబంధిం చిన ప్రతినిధులతో సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమం త్రి చంద్రబాబు హామీలు తప్ప ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. రాయలసీమ వరుస కరువులతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ 4 జిల్లాలకు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్రాకేజీతోపాటు ప్రత్యేక హోదాను ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలే దన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకూ చేసిందేమీలేదన్నా రు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికి 13 వందల కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ. 620 కోట్లు ఖర్చుచేశారన్నారు. కానీ 4 కిలోమీటర్ల పైపు లై న్ కూడా పూర్తి చేయలేదన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు తప్ప రాయలసీమకు నీళ్లు రావన్నారు. సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి సీవీ సత్యనారాయణ, శాసనమండలి సభ్యుడు జీజే చంద్రశేఖర్‌రావులు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం ఖర్చు చేసిన నిధులతో రాయలసీమ ప్రజలను ఆదుకొని ఉండొచ్చన్నారు. ఇటీవల కుప్పంలో నిర్వహించిన సభలో హంద్రీనీవాకు 2 టీఎం సీల నీటిని ఇస్తామని హామీ ఇచ్చారన్నా రు. హంద్రీనీవా ప్రాజె క్టు పూర్తి కాకుం డానే నీరు ఎలా ఇస్తారన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కేసీ కెనాల్‌కు చుక్కనీరు ఇవ్వలేని చంద్రబాబు కుప్పంకు ఎలా నీరు ఇస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 14 ఏళ్లు అవుతోందని అప్పటి నుంచి ప్రధానమంత్రిని చంద్రబాబు 8 సార్లు కలిశారని కానీ రాష్ట్రానికి ప్రయోజనమేమీ లేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు అన్యాయం రాయలసీమకు నీటి కేటాయింపుల్లో పాల కులు తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశే ఖర్‌రెడ్డి, సాగునీటి సాధన సమితి క న్వీనర్ బొజ్జా దశర థరామిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్రెడ్డిలు విమర్శించారు. రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని 16 వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని ద్వారా రాయలసీమకు ఒరి గేది ఏమీ లేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి ము ఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులు అంతోఇంతో అభివృద్ధి చెందాయన్నారు. 1962లో గౌహతి కమిషన్ గోదావ రి బేసిన్ నుంచి క్రిష్ణా బేసిన్‌కు 160 టీఎంసీలు నీటిని కేటాయిస్తే దాని గురించి పట్టించుకునే వారే లేరన్నా రు, శ్రీశైలం ప్రాజెక్టును 1963లో పవర్ప్రాజెక్టుగా ప్రకటిస్తే దానిపై ఏ ఒక్కరూ మా ట్లాడలేదన్నారు. శ్రీశైలంలో 854 టీఎం సీల మేర నీటి మట్టం నిల్వ ఉండాలని మాట్లాడే పరిస్థితి ఈ పాలకులను అస లు లేదన్నారు. పట్టిసీమకు కేటాయిం చిన నిధులను పెండింగ్ ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే కొంతమేరైనా పనులు జరుగుతాయన్నారు. ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, అనంతపు రం, చిత్తూరు. కర్నూలు, వైఎస్సార్ జి ల్లాల సీపీఐ కార్యదర్శులు జగదీష్, రా మానాయుడు, రామాంజనేయులు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
దున్నేవాడిదే భూమి
- ప్రతి నిరుపేదకూ నాలుగెకరాలు ఇవ్వాలి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ - చింతకుంట సమీపంలో భూపోరాటం పుట్లూరు : దున్నేవాడిదే భూమి అని, భూమిలేని ప్రతి నిరుపేదకూ నాలుగు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పుట్లూరు మండలంలోని చింతకుంట గ్రామం వద్ద సీపీఐ నాయకులు బుధవారం భూ పోరాటంలో భాగంగా విత్తనం వేసే పనులు చేపట్టారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు వేల ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం నిరుపేదలకు ఎకరా కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుని జీవిస్తారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు భూమి పంపిణీ చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతకుంట వద్ద 200 ఎకరాలు, కడవకల్లులో 212 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని అర్హులైన భూమిలేని నిరుపేదలకు ఇచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ భూమిలో దున్నటం, విత్తన పనులు చేపట్టడంతో తహశీల్దార్ రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి రూరల్ సీఐ అస్సార్బాషా, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు ఎస్ఐలు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. దీంతో సీపీఐ నాయకులు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. తాము పేదలకు భూమి ఇప్పించడానికి పోరాటం చేస్తుంటే పోలీసులను మోహరించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ భూమి ప్రజల భూమి అని, భూమిలేని పేదలు సాగు చేసుకోవడానికి వచ్చి న సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని ఎవరికీ ఇవ్వకూడదన్న నిభందన ఉందని తహ శీ ల్దార్ వారికి తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు సేద్యం పనులు ప్రారంభించి వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జిల్లా కార్యదర్శి జగదీష్, పైలానరసింహయ్య, రంగయ్య, శింగనమల గోపాల్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా
- లక్ష్యం సాధించే వరకు విశ్రమించం - అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కడప అగ్రికల్చర్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే, తెచ్చే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ డ్రామా లాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. బస్సుయాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నాటి పార్లమెంటు సమావేశాల్లో హామీ ఇచ్చారని, ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రులు, పార్టీ నేతలు పలు రకాలుగా మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌భాష మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకు మనుపు బళ్లారి-చెన్నై జాతీయ రహదారి నుంచి ర్యాలీగా నగరంలోకి బస్సుయాత్ర వచ్చింది. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేశు, ఏఐవైఎఫ్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయలక్ష్మీ, పద్మావతి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రామసుబ్బారెడ్డి, కార్యదర్శి చంద్ర, సీనియర్ నాయకులు పులి కృష్ణమూర్తి, పాలెం చెన్నకేశవరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట రూరల్: ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే సీపీఐ వారు బస్సు యాత్ర చేపట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్(పాతబస్టాండు)లో శుక్రవారం బస్సు యాత్ర చేపట్టిన సీపీఐ నాయకులకు ఆకేపాటి వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డితో కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి, నాగినేని నాగేశ్వరనాయుడు, డి.భాస్కర్‌రాజు, పసుపులేటి సుధాకర్, గోవిందు బాలకృష్ణ, జీవీ సుబ్బరాజు, సీ.జ్యోతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. నందలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు చేపడుతున్న బస్సుయాత్ర నందలూరు మీదుగా వెళ్లిన సందర్భంగా స్థానిక సీపీఐ నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ నాయకులు మహేష్, మండల నాయకుడు శివరామకృష్ణ దేవర పాల్గొన్నారు. రైల్వేకోడూరు అర్బన్:రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బస్సుయాత్ర మార్గమధ్యంలోని రైల్వేకోడూరు పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి శంకరయ్య, రాధాకృష్ణ, సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి, పండుగోల మణి, సుధాకర్, చైతన్య, చెన్నయ్య, విజయలక్ష్మీ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సభలో రాజకీయాలా?
చంద్రబాబు తీరును ఎండగట్టిన సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ ఒంగోలు టౌన్ : ‘మంగళగిరిలో జరిగిన సభకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు. ప్రభుత్వ నిధులతో జనాలను తరలించారు. ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి సభలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛాలెంజ్‌లు విసిరారు. రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సన్నని విభజన రేఖను పూర్తిగా మార్చివేశారని’ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు తీరును ఎండగట్టారు. సీపీఐ జిల్లా కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక మల్లయ్య లింగం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా నడుస్తున్నాయన్నారు. ఎవరిపై తొడ కొడుతున్నావు? ‘దొంగ దొరికితే ముసుగు వేసుకొని బయటకు వస్తాడు. ఎవరైనా చూస్తారన్న అవమానంతో తల దించుకొని వెళతాడు. అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి బయటకు వస్తూ మీసాలు మెలేశాడు. అంతటితో ఆగకుండా తొడ కొట్డాడు. తలవంచుకొని వెళ్లాల్సిన వ్యక్తి ఎవరిపై ఆయన తొడ కొట్టాడో అర్థం కావడం లేదని’ రామకృష్ణ పేర్కొన్నారు. జైలులో ఉన్న రేవండ్రెడ్డికి మనోస్థైర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించుకొందని, ఆయన ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. నోట్ల కట్టల కుంభకోణంలో జైలులో ఉన్న వ్యక్తికి నైతిక స్థైర్యం కల్పించేందుకు అనుమతి తీసుకొని క్యాబినెట్ అంతా చర్లపల్లి జైలుకు వెళితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జిల్లా వెనుకబాటుతనంపై ఒంగోలులో సదస్సు: జిల్లా వెనుకబాటుతనంపై త్వరలో ఒంగోలులో సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ విభజన బిల్లును అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నిర్ణయించిందని, మహబూబ్‌నగర్, అనంతపురం కంటే ప్రకాశం జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటుకు నోటును సీబీఐతో విచారించాలి - ముప్పాళ్ల ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడం ద్వారా వ్యాపారంగా మార్చివేశాయని విమర్శించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలుపుతున్నారన్నారు. పవిత్రమైన రాజకీయ ఉద్యమాల కోసం సీపీఐ ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజలతో ఉద్యమించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ, సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. 16 నుంచి ప్రజల వద్దకు సీపీఐ ఒంగోలు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రజల వద్దకు సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ వెల్లడించారు. పక్షం రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిం చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థానిక మల్లయ్య లింగం భవనంలో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడంతోపాటు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారన్నారు. వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గసభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, కేవీవీ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్డీ సర్ధార్, పీవీఆర్ చౌదరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీ హనుమారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రావు, జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలు రావమ్మతోపాటు జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఇది ప్రభుత్వ భూదాహం
జైల్‌భరోలో నినదించిన సీపీఐ 200 మంది అరెస్టు నినదించిన సీపీఐ విజయవాడలో జైల్‌భరోకు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు 200 మంది అరెస్టు భూసేకరణ తీరును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడ : రైతుల భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకే పేదల నుంచి చంద్రబాబు లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ జాతీయ మహాసభ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జైల్‌భరో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు రైతుల భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో కృష్ణాజిల్లాలో 12వేల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 33వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు యత్నిస్తున్నారన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పది వామపక్ష పార్టీలను కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చంద్రబాబుకు భూదాహం పట్టిందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని స్వామీజీలు, బాబాలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రామకృష్ణ, దోనేపూడి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 200 మందికిపైగా సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో నాయకుడు పల్లా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్ - బెల్లంపల్లిలో బైలుభరో బెల్లంపల్లి : ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. గురువారం దేశ వ్యాప్త పిలుపులో భాగంగా బెల్లంపల్లి ఏఎంసీ మైదానం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సత్యాగ్రహం(జైలుభరో) నిర్వహించారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు సామూహికంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం గా, భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రధా న ద్వారం వద్ద నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ చట్టానికి సవరణ తీసుకురావడం వల్ల రైతులకు రక్షణ లేని పరిస్థితు లు ఏర్పడతాయని, ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాంతంలోనే నిర్మించి జిల్లాలోని 1.66 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలని అన్నారు. పోడు వ్యవసాయ చేసుకుంటున్న దళిత, గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలన్నారు. కేకే-2 మెగా ఓపెన్‌కాస్ట్, శ్రావణ్‌పల్లి ఓపెన్‌కాస్ట్ ప్రతిపాదనలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ కె.శ్యామలాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి సిహెచ్.నర్సయ్య, మండల కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశం, కాసిపేట మండల సీపీఐ కార్యదర్శి కె.లక్ష్మణ్, సీపీఐ జిల్లా నాయకులు దాగం మల్లేశ్, ఎస్.తిరుపతి, గురిజాల సర్పంచ్ డి.తిరుపతి, నాయకులు రత్నం ఐల య్య, జి.సరోజ, పూర్ణిమ, తాళ్లపల్లి మల్లయ్య, పి.శేషగిరి రావు, ఆర్.ప్రశాంత్, జి.మాణిక్యం, డి.శ్రీధర్ పాల్గొన్నారు. జైల్ భరో ఉద్రిక్తం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణను నిరసిస్తూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిర్వహించిన జైల్‌భరో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కల్పించడం కోసమే చట్టాన్ని తీసుకొస్తోందని విమర్శించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, పట్ణణ కార్యదర్శి ఎస్.అరుణ్‌కుమార్, మహిళా నాయకురాలు ముడు పు నళినిరెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి రూ.9 కోట్ల నష్టం
ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. మరోవైపు ఈ సమ్మె వల్ల రోజురోజుకూ ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. ఆరు రోజుల సమ్మె వల్ల జిల్లాలో సంస్థకు రూ.9 కోట్ల మేర నష్టం మిగిలింది. సాక్షి, విజయవాడ : జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సోమవారం కూడా నిరసన ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగించారు. విజయవాడలోని పాత బస్‌స్టాండ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖ్యఅతిథులుగా హాజైరై కార్మికులకు మద్దతు తెలిపి, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు గుర్రం విజయ్‌కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజుతో పాటు వామపక్ష పార్టీల జిల్లా, నగర కార్యదర్శులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. జిల్లాలోని పలు డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుడివాడ బస్‌డిపో నుంచి కార్మిక సంఘాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరువూరులో ర్యాలీ, అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జగ్గయ్యపేటలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన, ఆ తరువాత మౌన ప్రదర్శన జరిపారు. నష్టాల ఊబిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల రోజురోజుకు ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలోని 14 డిపోల్లో మొత్తం 1440 బస్సులు ఉన్నాయి. సమ్మె తొలి రోజు కేవలం పదిశాతం బస్సులు, రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు సగటున 40 శాతం బస్సులు, నాలుగు నుంచి ఆరు రోజులు 50 నుంచి 60 శాతం వరకు బస్సు సర్వీసులను కాంట్రాక్ట్ కార్మికులతో, హైయర్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో నడిపారు. అయినప్పటికీ బస్సులు పూర్తి స్థాయిలో తిరగకపోవడం వల్ల ఇప్పటి వరకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోజుకు బస్సు సర్వీసుల ద్వారా ఆర్టీసీకి సగటున రూ.1.75 కోట్ల ఆదాయం వస్తుంది. డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రూ.800 చెల్లిస్తున్నారు. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ప్రయాణిస్తున్నా టికెట్లు ఇవ్వకపోవడంతో ఆదాయం ఆశించిన మేరకు రావడంలేదు. కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు అవనిగడ్డ : స్థానిక ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆరో రోజూ కొనసాగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని నిరశిస్తూ అఖిలపక్ష (బీజేపీ, టీడీపీ మినహా) నాయకులతో కలసి కార్మికులు బస్‌స్టాండు సెంటరులో సోమవారం రాస్తారోకో చేశారు. తొలుత డిపో నుంచి వంతెన సెంటరు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మోసం, దగా, వెన్నుపోటు తప్ప ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని ప్రయివేటు పరంచేసి టీడీపికి నిధులు సమకూర్చే నాయకులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల తరుణంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు చంద్రబాబును కలిసిన తరుణంలో తాను మారిన మనిషినని, తనను నమ్మితే న్యాయం చేస్తానంటూ వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రూ.12 వేల వరకూ వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రం రూ.7180 ఇవ్వడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డితోపాటు తామంతా అండగా నిలుస్తామని సారథి భరోసా ఇచ్చారు. -
పోడు రైతులకు అండగా ఉంటాం..
హన్మకొండ అర్బన్ : పోడు రైతులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పోడు రైతు సమస్యలపై సీపీఐ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు. పోడు రైతుల సమస్యలపై ఈనెల 30న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర నాయకులు పి.వెంకట్‌రెడ్డి, తమ్మెర విశ్వేశ్వరయ్య, సీహెచ్.రాజారెడ్డి, విజయసారథి, లింగారెడ్డి, రవి, సదానందం, బి.అజయ్, రమేష్, రవీందర్, కరుణాకర్, రవి పాల్గొన్నారు. -
పునరేకీకరణే కమ్యూనిస్టుల కర్తవ్యం
సీపీఐ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ సభలో సురవరం (విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొనివున్న సంక్షుభిత పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పునరేకీకరణే తక్షణ ఆవశ్యకత అని సీపీఐ ప్రకటించింది. అభివృద్ధికి కమ్యూనిస్టులు ఆటంకమనే వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనాంతరం సీపీఐ ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్ర మహాసభ, ఉమ్మడిగా చూస్తే 25వ రాష్ట్ర మహాసభను పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి బుధవారమిక్కడ ప్రారంభించారు. మహాసభల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నేత, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు జల్లి విల్సన్, జి.దేవుడు, జి.ఈశ్వరయ్య, వి.జయలక్ష్మీ, కరీముల్లా, మునీర్ అధ్యక్షవర్గంగా వ్యవహరించిన సభలో సురవరం ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో భ్రష్టుపట్టిపోయిన కాంగ్రెస్ స్థానంలో దేవదూతగా అభివర్ణించిన మోదీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే సామాన్యుల పాలిట భూతంగా అవతరించారని సురవరం ధ్వజమెత్తారు. మోదీ పాలనలో భావ ప్రకటనకు, లౌకికత్వానికి ముప్పు ఏర్పడిందని విమర్శించారు. అంతర్మథనం చేసుకుంటున్నాం.. తాము చేసిన కొన్ని పొరబాట్లవల్ల నష్టపోయామని సురవరం అంగీకరించారు. అయితే ఇప్పుడు అంతర్మథనం చేసుకుంటున్నామని, కమ్యూనిస్టుల్ని ఏకం చేసేపనిలో పడ్డామని వివరించారు. గాంధీని జాతిపిత అన్నదే మేము గాంధీని జాతిపిత అని తొలుత అన్నది కమ్యూనిస్టులేననీ అప్పటి తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషి ఓ సందర్భంలో తొలిసారిగా.. గాంధీని జాతిపితగా పిలిచారన్నారు. సీపీఐని వీడని విభజన గాయాలు ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ గుండా మల్లేశ్నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ముఖ్య నేతలను ఇబ్బందులకు గురిచేశాయి. రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారమిక్కడ ప్రారంభమైన సీపీఐ ఏపీ 25వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిధులు రావని తెలిసే చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారంది. చంద్రబాబుపై మండిపాటు అధికారంలో లేనప్పుడు వామపక్షాలతో అంటకాగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ప్లేటు ఫిరాయించి పచ్చి మతతత్వ శక్తులతో చేతులు కలిపాడని సీపీఐ విమర్శించింది. కాగా కార్యదర్శి నివేదికపై చర్చ గురువారం కూడా కొనసాగుతుంది. కార్యదర్శి రామకృష్ణ చర్చకు జవాబిస్తారు. సాయంత్రం నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత కార్యదర్శినే తిరిగి కొనసాగించే అవకాశముంది. -
నల్ల కుబేరులతో బీజేపీ కుమ్మక్కు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ 24వ జిల్లా మహాసభలు ప్రారంభం ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం నల్ల కుబేరులతో కుమ్మకైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ 24వ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఏలూరు సుబ్బమ్మదేవి మునిసిపల్ పాఠశాల ఆటస్థలంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి నల్ల కుబేరులతో సంబంధాలు ఉన్న కారణంగానే వారి పేర్లు వెల్లడించలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తీసుకువస్తామని నరేంద్రమోదీ ఎన్నికల సమయంలో చెప్పారని రామకృష్ణ గుర్తుచేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలు, కష్టజీవులు, గిరిజనులు, దళితుల సమస్యలను గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్లో రూ. 5 లక్షల 26వేల కోట్ల రాయితీలను కార్పొరేట్ వర్గాలకు కల్పించారని తెలిపారు. ఎన్డీఏ 100 రోజుల పాలనలో దేశంలో కార్పొరేట్ శక్తులు రూ. 1లక్షా 60 వేల కోట్ల ఆస్తులను పెంచుకున్నాయన్నారు. రిలయన్స్ సంస్థ రూ. 32 వేల కోట్లు అంబానీ గ్రూపు సంస్థలు రూ. 48 వేల కోట్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సంపాదించారంటే ఏ మేరకు ఊడిగం చేస్తున్నారో అర్థమవుతుందని వివరించారు. బీజేపీ శక్తులు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగోడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. ఢిల్లీలో చర్చిలు, స్కూల్ భవానాలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. మోడీ హవ ఇక సాగదని ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. కేంద్రమంత్రి వెంకన్ననాయకుడు తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి పుస్తకాలు రాయించుకుని, సన్మానాలు చేయించుకున్నారని రామకృష్ణ తెలిపారు. అయితే ఆయన ప్రస్తుతం మాట మార్చుతున్నారని ఆరోపించారు. వెంకయ్యనాయుడు వెంటనే ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర సమితి సభ్యులు వంక సత్యనారాయణ, నెక్కంటి సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస డాంగే, ఎం. వసంతరావు, కోణాల భీమారావు, వైట్ల విద్యాధరరావు, ఎం. సీతారాం తదితరులు ప్రసంగించారు. మహాసభలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఏలూరు నగరంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
కేసీఆర్... ప్రజలను మోసగిస్తున్నారు
నయీంనగర్ : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్స్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో సోమవారం సీపీఐ నగర శాఖ 24వ మహాసభలు జరిగాయి. నగర కార్యదర్శి మేకల రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, ఆసరా, ఇంటింటికి నల్లా, కేజీ టూ పీజీ విద్య వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న కేసీఆర్.. మరో పక్క ఉన్న సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు నిర్మించడంతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ధరలు పెంచుతున్న కేంద్రం వంద రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చిన బీజేపీకి కేంద్రంలో పట్టం కడితే... ఈ వంద రోజుల్లో మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచిందని వెంకట్‌రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారని, మతోన్మాదాన్ని పెంచి పోషించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి వలీ ఉల్లాఖాద్రీతో పాటు స్వామిచరణ్, వీరగంటి సదానందం, సిరబోయిన కరుణాకర్, నేదురుమల్లి జ్యోతి, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వేయిస్థంబాల దేవాలయం నుంచి సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
కోటీశ్వరులతో బాబు కుమ్మక్కు
బుక్కరాయసముద్రం : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశ ప్రధాని నరేంద్రమోడి కుమ్మక్కయ్యారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమానికి తిలోదకాలిచ్చి ఇద్దరూ విదేశీ పర్యటనకు సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులను అణగదొక్కేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలనడం దారుణమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదేపంథాను అనుసరించడం దారుణమని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటూ రైతులకు సంబందించిన భూమలను లాక్కొని కోట్ల రుపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదోనికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు ఆవుల శేఖర్, భీమలింగప్ప, కేశవరెడ్డి, జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్ఎఫ్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భార త విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 2 విభాగాలుగా ఏర్పడింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్త కమిటీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నేత స్టాలిన్, ప్రధాన కార్యదర్శిగా శివరామకృష్ణ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన కరీముల్లా, ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన బయ్యన్న నియమితులయ్యారు. -
బోస్పై గుండాగిరి
కవాడిగూడ,న్యూస్‌లైన్: సీపీఐ నగరకార్యదర్శి వీఎస్ బోస్పై ఇద్దరు వ్యక్తులు గుండాగిరి చేశారు. అందరూ చూస్తుండగానే ఆయన కాలర్ పట్టుకొని దాడిచేశారు. ఈఘటన మంగళవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి..డీబీఆర్ మిల్లు స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సుధాకర్, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రదీప్, అరుణ, ఝాన్సీల ఆధ్వర్యంలో డీబీఆర్ మిల్లు కార్మికుల పక్షాన ముషీరాబాద్ తహసీల్దార్ వసంతకుమారికి వినతిపత్రం అందించారు. అనంతరం కార్మికులంతా మిల్లు ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ క్రమంలో డీబీఆర్ మిల్లు ప్రాంతంలోని 6 ఎకరాల స్థలాన్ని తానే కొనుగోలు చేశానని చెప్పుకుంటున్న రాజ్‌కుమార్ మాల్పానీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కార్మికుల ఫొటోలు తీస్తుండగా వీఎస్ బోస్ ఎందుకు ఫొటోలు తీస్తున్నావని ప్రశ్నించారు. దీంతో బోస్పై సదరు వ్యక్తులు రాములు, అబ్దుల్ రహీమ్లుపై దాడిచేసి కొట్టారు. ఎందుకు కొడుతున్నావు..అని ఎదురుతిరిగినా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న కార్మికులు దాడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై తిరగబడి తరిమికొట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఆలస్యంగా ఆ ఇద్దరు వ్యక్తులను రక్షక్ వాహనంలోకి ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బోస్పై దాడి జరిగిన సమయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ,ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ అక్కడే ఉండడం గమనార్హం. మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే రక్షించాలి : నారాయణ డీబీఆర్ మిల్లు స్థలానికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని,ఆ స్థలానికి హైకోర్టు నుంచి స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేసేందుకు యత్నించిన రాజ్‌కుమార్ మాల్పానీపై భూకబ్జా కేసును నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. డీబీఆర్ మిల్లు ఆవరణలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సుమారు రూ.1500 కోట్లు విలువచేసే స్క్రాప్‌ను పోలీసులు, అధికారుల కనుసన్నల్లో భూకబ్జాదారులు మాయం చేశారన్నారు. హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఉండగా మిల్లు స్థలంలోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. అలాంటి వారిపై భూకబ్జా కేసు నమోదు చేయాలని, రౌడీ,గుండాయాక్టు ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీబీఆర్ మిల్లు స్థలాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధమని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రదీప్ స్పష్టం చేశారు. దాడి కేసులో ఇద్దరు అరెస్టు బన్సీలాల్‌పేట: సీపీఐ నగరకార్యదర్శి వీఎస్ బోస్పై దాడి ఘటనలో అబ్దుల్ రహీం, రాములును గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసిన ట్లు సీఐ సంజీవరావు తెలిపారు. అడ్డగించి దాడి చే సిన నేపథ్యంలో 341, 323 సెక్షన్ల కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.