హన్మకొండ అర్బన్ : పోడు రైతులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పోడు రైతు సమస్యలపై సీపీఐ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు.
పోడు రైతుల సమస్యలపై ఈనెల 30న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర నాయకులు పి.వెంకట్‌రెడ్డి, తమ్మెర విశ్వేశ్వరయ్య, సీహెచ్.రాజారెడ్డి, విజయసారథి, లింగారెడ్డి, రవి, సదానందం, బి.అజయ్, రమేష్, రవీందర్, కరుణాకర్, రవి పాల్గొన్నారు.
పోడు రైతులకు అండగా ఉంటాం..
Published Thu, Apr 23 2015 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement