Collecterate
-
అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్!
వరంగల్: అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రతీవారం ఉన్నతాధికారులు ఆయా విభాగాల అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అర్జీలు వెల్లువెత్తుతున్నా.. ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌పై ‘సాక్షి’ పరిశీలన – కరీమాబాద్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వివిధ కారణాలతో స్థానికంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే.. పలుమార్లు గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూములకు సంబంఽధించిన అర్జీలు వస్తున్నాయి. తర్వాత పింఛన్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపు స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అర్జీలు ఇలా.. వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 97 ఆర్జీలు వచ్చాయి. వాటిలో జీడబ్ల్యూఎంసీ 4, బీసీ డెవలప్మెంట్ 3, వ్యవసాయశాఖ 9, రెవెన్యూ 36, మైనార్టీ వెల్ఫేర్ 3, ఏసీపీ ఖిలా వరంగల్ 1, వెటర్నరీ 1, లీడ్ బ్యాంక్ 5, పంచాయతీ అధికారి 6, డీఆర్డీఓ 11, ఉపాధి శాఖ 1, ఎస్సీ డెవలప్మెంట్ 1, జిల్లా సంక్షేమ శాఖ 5, సివిల్ సప్లయ్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2, యుజవన క్రీడలు 1, ‘కుడా’ 2, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ 1, ఎంజీఎం 1, ఎన్పీడీసీఎల్ 1, ఈఈ ఇరిగేషన్ 1, విద్యాశాఖ అధికారికి సంబంఽధించిన అర్జీ 1 వచ్చాయి. కాగా.. ప్రజావాణి కార్యక్రమానికి 35 శాఖలకు చెందిన అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులు రాలేని పరిస్థితిలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు. ఈక్రమంలో సోమవారం పలువురు హాజరు కాలేదు. కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఫోటోలో ఉన్న బాలుడు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు మణిదీప్. ఇతడికి మానసిక దివ్యాంగుల పెన్షన్ కోసం మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. సదరం క్యాంపులో 75 శాతం చూపుతున్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు వచ్చామని బాలుడి తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికై నా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. -
మేం 'తెలంగాణ బిడ్డలం' కాదా..? మరెందుకు మాపై ఇలా..
మెదక్: మేం తెలంగాణ బిడ్డలం కాదా? అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం కేసీఆర్ 15 నుంచి 20 ఏళ్లుగా రోగులకు సేవలందిస్తున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు తన్వీర్ మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ డిపార్ట్మెంట్లో కొందరిని, వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిన సీఎం తమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో ఉన్నామని, కొత్తగా నోటిఫికేషన్ వేసి తమ కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో తులసి, సంగీత, సులోచన, రమ్య, యాదమ్మ పాల్గొన్నారు. -
నాకు చెప్పేదెవడ్రా?.. నా కొడుకల్లారా..! కలెక్టరేట్ సాక్షిగా బూతులు..
కరీంనగర్: ‘నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా...మీరెవర్రా నాకు చెప్పేది. మీరు చెబితే వినాల్నారా? నా...కొడుకల్లారా’ అంటూ నగరపాలక సంస్థకు చెందిన ఓ డీఈ తన పైఅధికారులపై చిందులు వేశారు. బల్దియా వర్గాల్లో సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ఇలా ఉన్నాయి. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పైస్థాయి అధికారులు డీఈలు, ఏఈలకు కలెక్టరేట్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే సమయంలోనే సదరు డీఈ ‘నేను రాను...నాకు పని ఉంది...కలవడం అవసరమా?’ అంటూ పెడసరిగా మాట్లాడడంతోనే సదరు అధికారి మిన్నకుండిపోయారు. అతను లేకుండానే అదనపు కలెక్టర్‌ను కలిసి బయటకు వస్తున్న క్రమంలో సదరు డీఈ సైతం కలెక్టరేట్‌కు వచ్చి తారసపడ్డారు. ‘పని ఉంది రానంటివి కదా?’ అని పైస్థాయి అధికారి ఒకరు అనడంతోనే డీఈ తిట్లదండకం అందుకున్నాడు. పరుషపదజాలంతో దూషించడంతో పాటు, నానా బూతులు తిట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో అధికారులతో పాటు కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. సాక్షాత్తు కలెక్టరేట్లో తన పైఅధికారులను ఇష్టారీతిన డీఈ బూతులు తిట్టడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. చెప్పుకునే దిక్కేది...? నగరపాలకసంస్థ కార్యాలయంలో ‘పనిమంతుడు’గా గుర్తింపు పొందిన సదరు డీఈ కొంతకాలంగా ప్రదర్శిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ పనులు తన ‘చేతుల మీదుగా’ జరుగుతుండడం, ప్రజాప్రతినిధులతో ఉన్న సాన్నిహిత్యం అతడిని దారితప్పేట్లు చేస్తున్నాయనే ప్రచారం ఉంది. కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఇతనే బాధ్యుడని, అంచనాలు, బిల్లులు పెంచడంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తన పై అధికారులను లెక్కచేయడని, బెదిరింపులకు గురిచేస్తాడని ఇతనికి పేరుంది. ఇటీవల వరుసగా తన పైఅధికారులను, సహచర అధికారులను ఇష్టారీతిన బూతులు తిట్టినా.. అతనికి చిన్న మెమో కూడా జారీ కాలేదంటే అతడి పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. బాధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సదరు డీఈని మందలించే సాహసంకూడా ఎవరూ చేయడంలేదు. ఏదిఏమైనా సదరు అధికారి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
వరద బాధితుల కోసం ఎయిర్ బోట్స్..
నిర్మల్: వరద నీటిలో చిక్కుకున్న బాధితులను సులువుగా రక్షించేందుకు ఎయిర్ బోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువులో ఎయిర్ బోట్స్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు తెలిపారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిన్నటి వరకు సుమారు 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. భైంసా డివిజన్లో చాలా మందిని పోలీస్ శాఖ ద్వారా రెస్క్యూ చేశామని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 60 మందిని పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి, రోప్‌తో, లైవ్ జాకెట్స్‌తో కాపాడారని వివరించారు. ఎయిర్ బోట్స్ ఉంటే ఇంకా సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా కాపాడవచ్చన్నారు. ఎస్పీ, పోలీస్ శాఖతో చర్చించి, ఎయిర్ బోట్స్ శిక్షణకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దీంతో ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు రోప్స్ తెప్పించామన్నారు. అనంతరం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు, రోప్స్ కొనడానికి సహకరించిన కలెక్టర్‌కు పోలీస్ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను మరింత సురక్షితంగా కాపాడలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, ఎంపీవో వినోద్, ఆర్ఎస్ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలు..మిన్నంటిన సంబరాలు
సాక్షి నెట్వర్క్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు రెట్టింపు అవడంపై వాడవాడలా సంబరాలు మిన్నంటాయి. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు ఉన్నతాధికారుల బాధ్యతల స్వీకారంతో సందడిగా మారాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. వాడవాడలా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కల నెరవేరినందుకు ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ► విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో తొలిరోజునే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ► శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌లు సోమవారం ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ► విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం ‘కొత్త’ సందడి కనిపించింది. మన్యం జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలను డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణితో పాటు ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, కళావతి, కలెక్టర్, ఎస్పీలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గరివిడి మండలం నుంచి చీపురుపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. జాతీయ జెండాలు ఎగరవేశారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా కేంద్రం ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మూరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నిడదవోలు నుంచి గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వరకు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన జిల్లా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎలీజా, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్ అప్పారావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ► ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా రంజిత్ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు. పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ భారీ ర్యాలీలు జరిగాయి. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ సీఎం జగన్ చిత్రపటానికి పూలతో అభిషేకం చేశారు. ► ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ► ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. ఒంగోలు పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. సీఎం చిత్రపటానికి కాకాణి క్షీరాభిషేకం చేశారు. ► ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, కీలు గుర్రాలతో ర్యాలీ హోరెత్తింది. గడికోట, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్, కలెక్టర్ గిరీషా, జేసీ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు ఊరేగింపుగా పాల్గొన్నారు. పెద్దఎత్తున అన్నదానం చేశారు. ► గత పాలకులు సాధించలేనిది మూడేళ్లలో జగనన్న సాయంతో సాధించామని తిరుపతి జిల్లాలో ఏర్పాటైన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరిందన్నారు. అంతకుముందు.. పార్టీ మహిళా నేత బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. నూతన జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి శంకరనారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ బసంత్‌కుమార్, ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, బాబా భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పుట్టపర్తి వీధులన్నీ సందడిగా మారాయి. మడకశిర, కదిరిలోనూ సంబరాలు చేసుకున్నారు. ► నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇసాక్‌బాషా, భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రనాథరెడ్డి, ఎస్పీ రఘువీరారెడ్డి, జేసీ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు: సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తూ ప్రకటన చేయగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘటన అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పద్మజ, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: లక్ష మందికి నైపుణ్య శిక్షణ) -
మాకు ఆ సారే కావాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆ సారు రాకపోతే మా పిల్లలు బడికి వెళ్లమంటున్నారు.. ఇంటింటికీ వచ్చి మా పిల్లలను బడికి తీసుకువెళ్లి చదువుపై శ్రద్ధ కలిగే విధంగా కృషి చేశారు.. తీరా మాకు ఇష్టం కలిగి బుద్ధిగా పాఠశాలకు వెళ్తుంటే ఆ సారును బదిలీ చేశారు. ఇప్పుడు మా పిల్లలు బడికి వెళ్లాలంటే ఇష్టపడడం లేదు. అందుకే మాకు ఆ సారు కావాలని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామంటూ పాల్వంచ మున్సిపాలిటీ వెంగళరావు కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ‘సాక్షి’తో మాట్లాడారు. వెంగళరావుకాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ నేతృత్వంలో గ్రామస్తులు ప్రజావాణిలో ఈ మేరకు దరఖాస్తు ఇచ్చిన తరువాత మాట్లాడారు. పాఠశాలకు ఎస్జీటీగా వచ్చిన ఎస్.రాజశేఖర్ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ సొంతంగా చెప్పించేవారని, పాఠశాలకు ఎల్ఈడీ టీవీని కూడా తీసుకువచ్చి పాఠాలు బోధించేవారని చెప్పారు. ఎవరైనా బడికి రాకపోతే ఇంటికి వచ్చిమరీ తీసుకువెళ్లేవారని వివరించారు. అలాంటి వారిని బదిలీ చేశారని, ఈ విషయంపై ఇప్పటికే ఎంఈఓకు, డీఈఓకు పలుమారు విన్నవించినా స్పందన కరువైందన్నారు. కార్యక్రమంలో బానోత్ శరత్, బోడా నాగరాజు, సపావత్ సక్రి, భూక్యా శారద, సీతమ్మ, రమణ తదితరులు ఉన్నారు. -
‘మేరా మహబూబ్‌నగర్ మహాన్’
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: సర్వమత సహనానికి ప్రతీకగా విరాజిల్లిన మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి మంగళవారం నాటికి 128 ఏళ్లు అవుతుంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులచే కీర్తించబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండేవని, అందుకే ఈ పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని వేర్వేరు కథనాలు ఉన్నప్పటికీ.. ఖండాంతరాలు మహబూబ్‌నగర్‌ను ఆసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారు. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసిఫ్‌జాహి రాజులు 1890 డిసెంబర్ 4వ తేదీన మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. శాతవాహన, చాళుక్యరాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందకి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు ఆసిఫ్‌జాహి నవాబులచే పాలించబడింది. భారత స్వాతంత్య్రానంతరం 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవంతులను, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుంది. నిజాం భవనాలే.. నిజాం పాలనలో నిర్మించబడిన భవనాలను జిల్లాకేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో అత్యధిక భవంతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ప్రజాహిత కార్యక్రమాలకు అందుబాటులో కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ సముదాయ భవనం, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ, ఆర్అండ్బీ ఈఈ, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాసాబ్‌గుట్ట హైస్కూల్, మోడల్ బేసిక్ హైస్కూల్, జిల్లా రైల్వేస్టేషన్ తదితర భవనాలు ప్రముఖ చోటును సంపాదించాయి. -
భద్రత కట్టుదిట్టం..!
ఇకపై కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల లోపలికి వెళ్లాలంటే అర్జీదారులు కాస్త ఇబ్బంది పడాల్సిందే. దరఖాస్తుదారులు ఎవరైనా సరే తమ వెంట తెచ్చుకున్న వస్తువులు, పత్రాలను ఆయా కార్యాలయాల బయట పోలీస్ సిబ్బందికి చూపించాకే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, జగిత్యాల : సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకు వచ్చి పురుగుల మందు తాగడం.. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం వంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టడానికి పోలీస్ బాస్ భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓ క్యాబిన్ ఏర్పాటుచేశారు. ఇందులో ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ హోంగార్డుకు విధులు కేటాయించారు. వీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఆర్జీదారులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారిపై దృష్టిపెట్టనున్నారు. ఎవరైన పురుగుల మందు డబ్బాలు.. కిరోసిన్‌తో వస్తే వారిని బయటే అడ్డుకుని వెంట తీసుకొచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటారు. కేవలం ఫిర్యాదుదారుడిని లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. మరోపక్క.. ఇప్పటికే ప్రతి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భవనంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నలుగురైదుగురు పోలీసులకు విధులు కేటాయిస్తున్నారు. అయితే.. ఇకపై ప్రతి సోమవారం వారి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపై కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయం వద్ద నలుగురు.. కలెక్టరేట్లో మరో నలుగురు.. మొత్తం ఎనిమిది మంది హోంగార్డులను నియమించి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ‘నిఘా’ ఏదీ..? ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల ఆత్మహత్యాయత్నాల వెనక దళారులు ఉన్నట్లు కలెక్టర్ శరత్ ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పథకాల్లో పెరుగుతున్న దళారుల ప్రమేయంపై సీరియస్ అయ్యారు. అనర్హులకూ లబ్ధి చేకూరుస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ భవనం, పరిసర ప్రాంతాల్లోనూ బాధితులు, వారి వెంట వచ్చి వెళ్లే వారిని గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్యాం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘ ఐఎంఏ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సాంకేతిక సిబ్బంది వచ్చి కెమెరాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. -
సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి
ఏలూరు (మెట్రో) : సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం వేచి చూడాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వారి సమస్య పరిష్కారం కాలేదంటూ తర్వాతవారమే మీ కోసం కార్యక్రమానికి వచ్చి వినతులు అందిస్తున్నారన్నారని, ప్రజలిచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో ఆ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా కొన్నిరోజులు వేచి చూడాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తన దగ్గరకు వస్తే ఆ సమస్య ఏ పరిస్థితుల్లో ఉందో తాను తెలుసుకుని వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. lభీమడోలు మండలం గుండుగొలను 2వ వార్డులో పంచాయతీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని రెడ్డి దుర్గారావు, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. lగోపాలపురం మండలం కొవ్వూరుపాడులోని ఎస్సీ పేటకు ఆనుకుని ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని, దానివల్ల దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు, దోమలు, విషపురుగుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కె.చిట్టిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. lచింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామ ఉప సర్పంచి పాములపాటి నర్సారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు చేశారు. lపోలవరం మండలం గూటాలకు చెందిన ముంగర రమణరావు, మల్లిపూడి వెంకటలక్ష్మి తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిధులు తమకు అందలేదని ఫిర్యాదు చేశారు. lదెందులూరు మండలం కొవ్వలికి చెందిన యర్రా రాము, చాట్ల ధర్మయ్య, చప్పిడి ముసలయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి చెందిన ఎకరా 25 సెంట్లు భూమి ఇళ్లస్థలాలుగా అందించాలని కోరారు. lఆకివీడు మండలం సిద్ధాపురానికి చెందిన సర్పంచి తోట శివాజీ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని వందమిల్లిపాడులో ఉన్న 38 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యలపై స్పందించిన కలెక్టర్ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారాల్లో అధికారులు తాత్సారం చేస్తే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, హౌ సింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి
ఏలూరు (మెట్రో) : సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం వేచి చూడాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వారి సమస్య పరిష్కారం కాలేదంటూ తర్వాతవారమే మీ కోసం కార్యక్రమానికి వచ్చి వినతులు అందిస్తున్నారన్నారని, ప్రజలిచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో ఆ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా కొన్నిరోజులు వేచి చూడాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తన దగ్గరకు వస్తే ఆ సమస్య ఏ పరిస్థితుల్లో ఉందో తాను తెలుసుకుని వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. lభీమడోలు మండలం గుండుగొలను 2వ వార్డులో పంచాయతీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని రెడ్డి దుర్గారావు, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. lగోపాలపురం మండలం కొవ్వూరుపాడులోని ఎస్సీ పేటకు ఆనుకుని ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని, దానివల్ల దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు, దోమలు, విషపురుగుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కె.చిట్టిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. lచింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామ ఉప సర్పంచి పాములపాటి నర్సారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు చేశారు. lపోలవరం మండలం గూటాలకు చెందిన ముంగర రమణరావు, మల్లిపూడి వెంకటలక్ష్మి తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిధులు తమకు అందలేదని ఫిర్యాదు చేశారు. lదెందులూరు మండలం కొవ్వలికి చెందిన యర్రా రాము, చాట్ల ధర్మయ్య, చప్పిడి ముసలయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి చెందిన ఎకరా 25 సెంట్లు భూమి ఇళ్లస్థలాలుగా అందించాలని కోరారు. lఆకివీడు మండలం సిద్ధాపురానికి చెందిన సర్పంచి తోట శివాజీ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని వందమిల్లిపాడులో ఉన్న 38 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యలపై స్పందించిన కలెక్టర్ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారాల్లో అధికారులు తాత్సారం చేస్తే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, హౌ సింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏల సమ్మెబాట
కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు ప్రారంభం ముకరంపుర: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు సమ్మెబాట పట్టారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలకు దిగారు. తెలంగాణ వీఆర్ఏ అసోసియేషన్ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా 2012, 2014లో నియామకమైన వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎన్నోమార్లు విన్నవించినా ఫలితం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు పెరిగాయని, కాంట్రాక్ ్ట ఉద్యోగులను రెగ్యులర్ చేశారని తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్ఏలను రెగ్యులర్ చేసి పేస్కేలు వర్తింపజేయాలన్నారు. 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి పదోన్నతి కల్పించాలన్నారు. దీక్షలను కాటారం జెడ్పీటీసీ చల్ల నారాయణ సందర్శించి సంఘీభావం తెలుపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఆనంద్‌కుమార్, రవి, తిరుపతి, సజిత్‌రెడ్డి, సంకీర్తన, కోశాధికారి నరేందర్‌రావు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి
కోదాడఅర్బన్: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నునావత్ రవి, సాయి, నగేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తం
కలెక్టరేట్ వముట్టడికి ఎస్ఎఫ్ఐ నాయకుల యత్నం భగ్నం చేసిన పోలీసులు సీఎం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్ఎఫ్ఐ బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత దుర్మార్గపు చర్యంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు, కార్యాలయం గేట్లు మూసివేశారు. దీంతో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఒక్క ఉదుటన నాయకులు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. ఒకరిద్దరు విద్యార్థులు కలెక్టరేట్ గేటుపైకి ఎక్కారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తొపులాట చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు కుమార్, రమే శ్,తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అంతకుముందు నిర్వహించిన ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజినేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 15న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ
అధికార పార్టీ నాయకుడి నిర్వాకం కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వంచన నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షలు వసూలు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మోర్తాడ్: నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ.20 లక్షలకు టోకరా వేశాడో వ్యక్తి. కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేసిన అధికార పార్టీ నాయకుడు ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లంచం అడిగితే నేరుగా తన కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ పక్క పేర్కొంటుంటే, అదే పార్టీకి చెందిన నాయకుడు మరోపక్క అవినీతికి తెరలేపాడు. కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మండలంలోని శెట్పల్లికి చెందిన ఐదుగురు నిరుద్యోగులకు నమ్మబలికాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు వసూలు చేశాడు. ఇది జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. ఉద్యోగాలు ఇప్పించాలని సదరు బాధితులు ఏడాది నుంచి ఆ నాయకుడి చుట్టూ తిరుగుతున్నారు. వారం, పదిహేను రోజులు అంటూ వాయిదా పెడుతూ వస్తుండడంతో, విసిగిపోయిన నిరుద్యోగులు ఇటీవల గట్టిగా నిలదీయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. పదిహేను రోజుల్లో పని పూర్తి చేస్తానని ఆ నాయకుడు వారికి చెప్పాడు. కానీ, ఆ గడువు కూడా ముగిసిపోయింది. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో అప్పు చేసి మరీ డబ్బు చెల్లించిన నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడే తమను వంచించడంతో ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. మరోవైపు, కలెక్టరేట్లో కొలువుల గురించి బాధితులు ఆరా తీయగా, అసలు ఉద్యోగాలే లేవని వెల్లడైంది. దీంతో తాము చెల్లించిన డబ్బు రాబట్టుకొనేందుకు వారు సదరు నాయకుడు చుట్టూ తిరుగుతున్నారు. -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ఏలూరు (మెట్రో) : జీతాలు పెంచినట్టు ఆగస్టు నెలలో ప్రకటించినప్పటికీ నేటికీ చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షురాలు పి.హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అంగన్వాడీల జీతాలు పెంచి వెంటనే అమలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం జీతాల ఊసే ఎత్తడం లేదన్నారు. సీఐటీయూ నాయకుడు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగులను, కార్మికులను పట్టించుకోకుండా పాలకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యటన పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఐటీయూ ఏలూరు నగర శాఖ ప్రధాన కార్యదర్శి పి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సార్..! సమస్యలు ఆలకించండి !!
- ప్రజావాణిలో వినతుల వెల్లువ - స్వయంగా అర్జీలు స్వీకరించిన జేసీ వెంకట్రాంరెడ్డి సంగారెడ్డి జోన్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జేసీ వెంకట్రాంరెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. విచారణ చేసి సత్వరం న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తన ప్రమేయం లేకుండానే తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, గ్రామ పట్వారీలపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన ప్రభాకర్ కోరారు. తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తమకు ఎకరా భూమి పట్టా ఇచ్చారని, కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదని పాపన్నపేట మండలం మిన్పూర్కు చెందిన ఏసమ్మ, బాలమ్మలు తెలిపారు. తమకు వెంటనే పొజిషన్ చూపించాలని, లేకుంటే మూడెకరాల భూమి ఇప్పించాలని జేసీకి విన్నవించారు. మావోయిస్టుగా జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తనకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని మెదక్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య కోరారు. విధి నిర్వహణలో తన భర్త మతిస్థిమితం కోల్పోయినందునా తనకు ఉపాధి కల్పించాలని కొండాపూర్మండలం మారేపల్లికి చెందిన ఇందిరమ్మ విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని అందోల్ మండలానికి చెందిన సువర్ణ, దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన సునీత, యాదమ్మ వినతిపత్రం అందజేశారు. తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన కోనమ్మ విజ్ఞప్తి చేశారు. తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించానని, ఈ కారణంగా తమ కూ తురుకు బాలిక సంరక్షణ పథకం వర్తింపజేయాలని జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కుచెందిన మంగళి విజయకుమార్ కోరారు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తినంతా వారికే ఇచ్చారని, న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇప్పించాలని న్యాల్కల్కు చెందిన అంజమ్మ జేసీకి విజ్ఞప్తి చేసింది. తన భూమిలో అక్రమంగా ఇతరులు రోడ్డు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోహీర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లయ్య కోరారు. మెదక్ మండలం హవేళీఘన్పూర్కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అందోల్ మండలం పోసానిపేటకు చెందిన వడ్డే యాదమ్మ కోరారు. తాను గత 30 సంవత్సరాలుగా పిండి గిర్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నానని, దాన్ని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నట్టు చేగుంటకు చెందిన రాజలింగం తెలిపారు. పిండి గిర్ని యథావిధిగా నడిపించుకొనేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే సమస్యల పరిష్కారం : ఎస్పీ సంగారెడ్డి క్రైం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి.సుమతి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా
విధుల నుంచి సస్పెండ్ అయిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లు కర్నూలు కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నాకు దిగారు. కూలీలకు నిబంధనల మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారంటూ 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగిస్తూ గత నెల 23న డ్వామా పీడీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విధుల నుంచి సస్పెండ్ అయిన 60 ఫీల్డ్ అసిస్టెంట్ లు ధర్నాలో పాల్గొన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు..
-
దద్దరిల్లిన కలెక్టరేట్
మహారాణిపేట : వరుస ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఏపీ స్టేట్ ప్రభుత్వ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఫెడరేషన్.. అనకాపల్లి, మునగపాక మండలాల్లో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ.. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ జరిపించాలని ఏపీ స్టేట్ ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ ఏపీ స్టేట్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 3 లక్షల మంది కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదేళ్లుగా ఒక్క రూపాయి జీతం పెంచలేదని వాపోయారు. ఇచ్చిన జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచడమే కాకుండా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నగర కన్వీనర్ ఎస్.ఇందీవర, రాష్ట్ర నాయకులు వి.రాంప్రసాద్, కె.ఈశ్వరరావు, ఎస్.అమీర్, ఎన్.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. లాజిస్టిక్ పార్క్‌ను రద్దుచేయాలి అనకాపల్లి, మునగపాక మండలాల్లో 500 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టి.సిరసపల్లి, వెంకటాపురం, రామారాయుడుపేట, తానాం, తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పార్కులు కడతారా? అని ప్రశ్నించారు. మీ సోకులకు మా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధర్నాలో వెంకటాపురం సర్పంచ్ సుందరపు కనక అప్పారావు, సీఐటీయూ నాయకలు గనిశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ నిరుద్యోగ వికలాంగుల జేఏసీ ధర్నా చేపట్టింది. జిల్లాలో 52 బ్యాక్లాగ్ ఉద్యోగాల (వికలాంగులు) భర్తీకి మార్చి 14న ఇచ్చిన నోటిఫికేషన్లో దొర్లిన తప్పులను సవరించాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోస్టుల భర్తీలో కాసులకు కక్కుర్తిపడి జీవో 31, 104ను కూడా వికలాంగుల సంక్షేమశాఖాధికారులు తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో వికలాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డేవిడ్‌రాజు, ఎన్పీఆర్డీ అధ్యక్షుడు రాంబాబు, డీవైఎఫ్ఐ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన పారిశుద్ధ్య కార్మికులు
- సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా - దీక్షలను భగ్నం చేసిన పోలీసులు - 96 మంది ఆందోళనకారుల అరెస్టు - నిరసనగా నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు సంగారెడ్డి క్రైం: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరి ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ మద్దతు పలికింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు మూడు విడతలుగా ధర్నాలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, దీక్షలను భగ్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడంతో పోలీసులు మోహరించి ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా చేపడుత్ను నిరాహార దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజయ్య, నాయకులు జయరాం, సంజీవులు, తాజుద్దీన్, మల్లేశం, మాణిక్యం, ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 37 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. 96 మంది ఆందోళనకారుల అరెస్టు ఆందోళన చేపడుతున్న ఆందోళనకారులను సీఐలు ఆంజనేయులు, వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 96 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. -
వినతులు మావి.. పరిష్కారం మీది
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చొని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంకు వినతు లు, ఫిర్యాదులు అందజేశారు. సమస్యలు పరి ష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. గ్రీవెన్స్ సెల్ లో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ-2 పి.రజనీకాంతారావు, డీఆర్వో బి.హేమసుం దర వెంకట్రావు, డుమా పీడీ ఆర్.కూర్మనాథ్, జెడ్పీ సీఈవో వసంతరావు, ముఖ్య ప్రణాళికా అధికారి ఎం.శివరామనాయకర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్య నిర్వాహక ఇంజి నీరు టి.శ్రీనివాసరావు, ఉప విద్యాశాఖాధికారి ఎ.ప్రభాకరరావు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని... = వంశధార చానల్‌ను కప్పేసి తమ భూములకు సాగునీరు అందకుండా చేస్తున్నారంటూ సరుబుజ్జిలి మండలంలోని చిగురువలస గ్రామానికి చెందిన రైతులు టి.రాంబాబు, సీహెచ్ గోపాల కృష్ణ తదితర రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాగునీటి అడ్డంకులు తొలగించాలని కోరారు. = గ్రామంలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.7 లక్షల నిధు లు స్వాహా చేశారని, సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ జలుమూరు మండల రాణా పంచాయతీకి చెందిన బొమ్మాళి సిం హాచలం, పి.రామారావులు విజ్ఞప్తి చేశారు. = పలాస మండలంలోని రాజగోపాలపురం, ఉదయంపూరంలోని భూము లు ఆక్రమణలకు గురయ్యాయని, సర్వే చేసి ఆక్రమణలు తొలగిం చాలంటూ కొంచాడ రామూర్తి కలెక్టర్‌కు విన్నవించారు. = గతంలో రూ.70కి వచ్చే కూబిక్ మీటరు ఇసుకను టీడీపీ ప్రభుత్వం 650కి పెంచేసిం దని, దీంతో ఇళ్లనిర్మాణాలు నిలిచిపోతున్నాయని, పేదలు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని, తక్షణమే ధరలు తగ్గించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు మంతెన హరనాథ్, ఎం.ఆదినారాయణ మూర్తి తదితరులు కలెక్టర్‌కు కోరారు. = రేగిడి ఆమదావలస మండలంలోని గుళ్లపాడు గ్రామానికి పక్కారోడ్డు వేయాలని గ్రా మానికి చెందిన యువకులు వి. హరికృష్ణ, జి. రవి, డి.కిరణ్. కె.హరి, జి.కృష్ణారావులు కోరారు. = హుద్‌హుద్ తుపాను తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రవాణా చార్జీలను ఇప్పటికీ చెల్లించలేదని బీజేపీ ప్రతినిధులు ైపైడి వేణుగోపా లం, పూడి తిరుపతిరావు, ఎస్.ఉమామహేశ్వరి, సంపతరావు నాగేశ్వరరావు, బి.వి.రెడ్డిబాబు, పి.సత్యం, చల్లా వెంకటేశ్వరులు ఫిర్యా దు చేశారు. = అంగన్వాడీ కార్యకర్త నియామకంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా సంతబొమ్మాళి మండలం పందిగుట్ట గ్రామంలో ఎస్సీకి కేటాయించిన పోస్టును బీసీని నియమించారని, మంత్రి, ఆర్డీవోలే దీనికి బాధ్యులని, తక్షణమే ఎస్సీ లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ కుల నిర్మూలనా పోరాట సమి తి ప్రతినిధులు బెలమాన ప్రభాకర్, పి.పాపారావు, కె.వెంకట్రావు విన్నవించారు. = రిమ్స్, పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీల్లో స్వచ్ఛంద సంస్థ సభ్యులకు సభ్యత్వం కల్పించాలని కె.వసంతకుమార్ కోరారు. = కేశవరెడ్డి పాఠశాలలో పిల్లల చదువుల కోసం చేసిన డిపాజిట్ చెల్లింపులో యాజమాన్యం జాప్యం చేస్తోందని, స్పష్టమైన సమాచా రం ఇవ్వడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రు లు టి.వి.రమణ, ఎం.చంద్రమౌళి, వి.లలితకుమారి, కె.త్రినాథరావులు ఫిర్యాదు చేశారు. =ఎస్‌హెచ్‌జీలతో హెల్మ్ట్లు విక్రయించాలని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లావాసులు ఫోన్లో తెలిపిన సమస్యలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్లైట్లకు వినతి గిరిజన దర్బార్‌లో వినతులు సీతంపేట: బూర్జ మండలం బండిలోయం, చిన్నచలం, గుడ్డలమేడ గ్రామాలకు సోలార్లైట్లు మంజూరు చేయాలని ఆ గ్రామాల గిరి జనులు పీఎంఆర్సీలో సోమవారం నిర్వహించిన గిరిజనదర్బార్‌లో కోరారు. దర్బార్‌లో పీఓ జల్లేపల్లి వెంకటరావు స్వయంగా వినతులు స్వీకరించారు. వలగజ్జి ఎగువగూడలో మంచినీటి సమస్య ఉందని, బావి అడుగంటిందని సర్పంచ్ శాంతమ్మతో పాటు గిరిజనులు కోరారు. నెల్లిగండి- ఈతమానుగూడ రహదారి నిర్మించాలని కె.బుగత కోరారు. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పించాలని కె.కూర్మారావు కోరారు. ఐదోతరగతిలో ప్రవేశానికి మినీగురుకులంలో సీటు ఇప్పించాలని ఎం.దివ్య కోరారు. భూతగాదా పరిష్కరించాలని కొత్తపసుకుడికి చెందిన కె.సుగ్రీవులు వినతిపత్రం సమర్పించారు. లివిరి జంక్షన్ నుంచి మూలగూడ, బూర్జగూడలకు రహదారి నిర్మించాలని సర్పంచ్ సిరంగి విన్నవించారు. కంగారు గుమ్మిగెడ్డ వద్ద మినీ రిజర్వాయర్ నిర్మించాలని తాడిపాయి గ్రామానికి చెందిన గంగారావు కోరారు. ఏపీఆర్ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని అయ్యప్పగూడకు చెందిన బి.శ్రీనివాసరావు విజ్ఞాపన అందించారు. దర్బార్‌లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఈఈలు శ్రీనివాస్, రమణ, డీడీ ఎం.పి.వి.నాయక్, డిప్యూటీ డీఈవో మల్లయ్య, ఎంపీడీవో రవణమ్మ, తహశీల్దార్ సావిత్రి, హౌసింగ్ డీఈ విక్టర్, ఎస్ఎంఐ డీఈ ఉషారాణి, ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్‌కు పది వినతులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఎస్ ఖాన్ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు పది వినతులు వచ్చాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. వినతుల్లో సివిల్ తగాదాలకు చెందినవి రెండు, ఇప్పటికే నమోదైన కేసుల విషయంలో పరిష్కారం కోరుతూ ఐదు, ఇతర కారణాలకు చెందినవి మూడు ఉన్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు 18 వినతులు వచ్చాయి. వాటిలో పాతవి ఆరు వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో ఓఎస్డీ కె.తిరుమలరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వేణుగోపాలరావు, ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ పెంటారావు, న్యాయ సలహాదారుడు ఆఫీస్‌నాయుడు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, డీఆర్డీఏ (వెలుగు) నుంచి డి.విజయకుమారి, ఏసీడీఎస్ కె.నిర్మల, విశ్రాంత ఎస్ఐ పి.రాజేశ్వరరావు, అడ్వకేట్లు టి.వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
లాఠీ ప్రతాపం
- 15 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు - చర్చలకు పిలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం - కడప కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు - లోపలకు చొచ్చుకెళుతుండగా అడ్డుకున్న పోలీసులు.. తోపులాట - లాఠీలు ఝళిపించిన పోలీసులు.. 25 మందికి గాయాలు - ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ను ముట్టడించిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసివేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయి కొందరు, పోలీసుల లాఠీచార్జ్‌లో మరికొందరు మొత్తం 25 మంది గాయపడ్డారు. వీరిలో కొందరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపాలిటీ ఒప్పంద కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతకూ స్పందించక పోవడంతో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు వందలాది మంది కార్మికులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రధాన రహదారిపై మండుటెండలో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనతో కలెక్టరేట్ వైపు వెళ్లే ఒక రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్సీపీ, అనుబంధ సంఘాల నాయకులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కార్మికులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో కొంత మంది మహిళలు కిందపడగా, పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఝళిపించడంతో ఎక్కడికక్కడ చాలామంది కిందపడిపోయారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు సుమారు 25 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమందిని చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. సొమ్మసిల్లిన కార్మికుడు: కడప నగర పాలక సంస్థలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే పారిశుద్ధ్య కార్మికుడు తోపులాటలో సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో ఆందోళన కారులు కొంతమేర ఉద్రిక్తతకు గురైనా, తొలున శ్రీనివాసులును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కార్మికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీసు వలయాన్ని చేధిం చుకుని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో పోలీసులు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకటశివలు మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే చర్చలకు ఆహ్వానించి పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశానికి అంటుతూ జీవన వ్యయం పెరిగిపోయిన పరిస్థితిలో కార్మికులు కనీస వేతనం కోరుతున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి నిజంగా సరిలేకపోతే సీఎం చాంబర్ ఏర్పాటుకు, ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలకు వెళ్లడానికి, ప్రచారాలకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 వేల మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారని, ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున వేతనాలు పెంచినప్పటికీ ఏడాదికి రూ.300 కోట్లు మాత్రమే అవుతుందని విశ్లేషించారు. కోట్ల రూపాయలు దుబారా చేస్తున్న ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. సమ్మె విరమించకపోతే తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సహించబోమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ మద్దతు: కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజాద్‌బాషలు మద్దతు తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏడెనిమిది వేల రూపాయలతో ఈ రోజుల్లో ఒక కుటుంబం బతకడం సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తాము ఏడెనిమిది వేల రూపాయల జీతంతో బతుకుతామని చెబితే ఉద్యమాన్ని విరమిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు మరిచారని విమర్శించారు. సంపద సృష్టించే కార్మికులకు కడుపునిండా తిండిలేకుండా చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు లక్షా 25 వేల రూపాయలు జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ వస్తుందన్నారు. మరణిస్తే భార్యకు 50 శాతం పెన్షన్‌గా ఇస్తున్నారని తెలిపారు. కానీ నిత్యం మలినాలను తొలగించే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమన్నారు. ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో 1600 కోట్ల రూపాయలు తగిలేసిన ముఖ్యమంత్రి.. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల వివక్ష చూపడం అన్యాయమన్నారు. సర్కార్ మెడలు వంచైనా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని రాష్ర్ట బంద్‌కు సైతం సిద్ధం కావాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కనీస వేతనాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పక్కనున్న రాష్ట్రంలో మాదిరి ఇక్కడ కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మాత్రమే పెంచుతామని చెప్పడం సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, కేసీ బాదుల్లా, సీఐటీయూ నాయకులు శంకర్, బీఎం ఎస్ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, సీపీఐ నేత ఎల్.నాగసుబ్బారెడ్డి, సీపీఎం నాయకులు సావంత్ సుధాకర్‌రావు, పాపిరెడ్డి, సిద్దిరామయ్య, ైవె ఎస్ఆర్సీపీ నాయకులు నిత్యానందరెడ్డి, యూత్ నేత రాజశేఖర్, ఎస్సీ ఎస్టీ సెల్ నేత సునీల్‌కుమార్, మైనార్టీ నేత షఫీ, ఎస్టీ విభాగం నాయకుడు వేణుగోపాల్ నాయక్, మహిళా నాయకులు వెంకట సుబ్బమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సమయ పాలనపై ఆగ్రహం 19మంది ఉద్యోగులకు ముఖాలు ఫైల్ ట్రాకింగ్ ఆన్లైన్లు చేయాలని ఆదేశం హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్(డీఆర్వో కార్యాలయం)లో ఉద్యోగుల సమయ పాలనపై కలెక్టర్ వాకాటి కరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్ కార్యాలయంలోని అన్ని విభాగాలను నేరుగా తనిఖీలు చేశారు. ప్రతి సెక్షన్లో సూపరింటిండెంట్ పేరు, ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకుని సెక్షన్లో ఖాళీ కుర్చీలపై ఆరా తీశారు. విధులకు సమయానికి రాని ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె.శోభకు ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ ఫైల్ట్రాకింగ్.. కలెక్టరేట్లో సీ సెక్షన్లో ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్ ఫైల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి సమాచారం సరిగా రాకపోవడంతో ఫైల్ ట్రాకింగ్ విధానం పక్కాగా అమలు చేయాలని హుకుం జారీ చేశారు. ఫైల్ పర్యవేక్షణకు అనుకూలంగా ఉండే సాఫ్ట్ వేర్‌ను వినియోగించుకుని జవాబుదారిగా ఉండాలని ఆదేశించారు. 19మందికి నోటీసులు కలెక్టర్ ఆకస్మిక తనిఖీల సందర్భంగా విధుల్లో లేని 19 మంది ఉద్యోగులను గుర్తించి వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. నోటీసు అందుకున్న వారిలో నలుగురు సూపరింటెండెంట్లు విజయలక్ష్మి (డిసెక్షన్), రవీంద్రమోహన్(ఈ), యోగీశ్వర్(జీ), రంగారావు(హెచ్), సెక్షన్ సహాయకులు (14మంది) శివ(ఏ3), ర హీం(బీ1), ప్రవీణ్(బీ2), మేఘన(డీ1), రాజేశ్వర్‌రావు (డీ2) సంతోష్(డీ3), వినయ్‌రెడ్డి(ఈ5), మధుచంద్ర(జీ1), జ్యోతి(హెచ్3), సురేష్(హెచ్5), ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తిరుమల్, ఖర్షీదా,రాజేష్, ఇద్దరు వక్ఫ్ ఇన్స్పెక్టర్లు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. -
అయినా మారలే!
అక్రమాలకు విధేయుడు ! కలెక్టరేట్లో వసూల్ రాజా కలెక్టర్, జేసీ పేరు చెప్పి బెదిరింపులు అధికారులకు బాధితుల ఫిర్యాదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యో గి ఏసీబీకి పట్టుబడి 20 రోజులు కాలే దు. ‘మ్యాటర్ సెటిల్ చేస్తా’నని సదరు ఉద్యోగి తన పంథాలోనే సాగుతున్నాడు. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. అవినీతి, అక్రమ వసూళ్ల విషయంలో ఉన్నతాధికారులు ఎన్ని హితబోధలు చేసినా సిబ్బంది మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లా పాలనా కేంద్రం కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడి సరిగ్గా 20రోజులు కాకముందే అదే కలెక్టరేట్లోని ఒక ఉద్యోగిపై ఉన్నతాధికారులకు బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. జేసీ కోర్టులో ఉన్న కేసుల వ్యవహారంలో తాను అడగినంత ఇస్తే తీర్పు అనుకూలంగా ఇప్పిస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవని తమను వేధిస్తున్నాడని సదరు ఉద్యోగిపై బాధితులు ఫిర్యాదు చేశారు. గతం నుంచి వృత్తిపరమైన విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి అక్రమ వసూళ్ల వ్యవహారం ప్రస్తుతం కలెక్టరేట్లో చర్చనీయాంశగా మారింది. కలెక్టర్, జేసీల పేరు చెప్పి... ఫిర్యాదు దారులు అధికారులు ఇచ్చిన సమాచా రం ప్రకారం కలెక్టరేట్లో ఒక విభాగంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ తన సెక్షన్‌కు సంబంధించి పనులపై వచ్చే వారి నుంచి కలెక్టర్, జేసీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. తన వద్ద ఉన్న భూములకు సంబంధించి ఫైళ్ల విషయంలో భూముల ధరను బట్టి బాధితులను లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇతని వసూళ్ల లెక్క ఒక్కోక్కరి వద్ద అరలక్షకు తక్కువ కాకుండా ఉంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు ఇచ్చే దాంట్లో సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి ఉన్నతాధికారులందరికీ ఇస్తానని వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలుకుతున్నాడు. జేసీ కోర్టులు పెండింగ్‌లో ఉన్న భూముల సంబంధించిన కేసుల ఇరు పక్షాల వారికి ఫోన్‌చేసి ‘మ్యాటర్ సెటిల్చేస్తా’ నంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అధికారులను తప్పుదోవ... భూ వివాదాల పరిష్కారం విషయంలో సహజంగా ఉన్నతాధికారులు సంబంధిత అధికారి వివరాలు తెలుసుకుంటాడు. ఈ సమయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చీ మరి తన పని తాను చేసుకున్న సందర్భాలూ ఉన్నారుు. సదరు ఉద్యోగిపై గతంలో చేర్యాలకు సంబంధించి ఒక భూమి విషయంలో బాధితులను వేధించినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇతని ఆగడాలు శృతి మించడంలో బాధితులు తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై అధికారులు సీరియస్‌గా తీసుకుని సదరు ఉద్యోగిని సంజాయిషీ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా పదోన్నతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉద్యోగి ప్రస్తుతం పదోన్నతులు పొందుతున్న రెవెన్యూ ఉద్యోగుల జాబితాలో పేరున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జారీ చేసిన క్రమ సంజాయిషీ నోటీసును పక్కన పెట్టిన అధికారులు సదరు ఉద్యోగికి పదోన్నతి పత్రం అందజేయడం ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది. -
మెడికల్ రిప్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించాలి
ఒంగోలు టౌన్ : మెడికల్ రిప్రజంటేటివ్స్‌ను హైస్కిల్డ్ వర్కర్స్‌గా గుర్తించి న్యాయమైన వేతనం చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ.గిరి మాట్లాడుతూ కొంతకాలంగా తమ కంపెనీల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని చెప్పారు. కార్మిక శాఖ మంత్రి నుంచి కలెక్టర్ వరకు చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మెడికల్ రిప్రజంటేటివ్స్‌కు సంబంధించిన స్పెషల్ యాక్ట్ 1976ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడేను సెలవు దినంగా అన్ని కంపెనీలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేల్స్ ప్రమోషనల్ ఎంప్లాయీస్ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని గిరి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రసాద్, కృష్ణమోహన్, అచ్యుత్, వేణు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
మా మొర ఆలకించండి సారూ...!
చిత్తూరు (అగ్రికల్చర్): మామొర ఆలకించడండి సారూ..అంటూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్)లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విన్నవించారు. ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) నారాయణభరత్‌గుప్తా, జిల్లా సంయుక్త కలెక్టర్ (ఏజీసీ) వెంకటసుబ్బారెడ్డి పాల్గొని, ప్రజల వ ద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో భవన వసతి కల్పించండి మహాత్మా జ్యోతిరావ్‌పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో భవన వసతి కల్పించాలని ఆ పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో జేసీ భరత్‌గుప్తాకు విన్నవించారు. జిల్లాలోని పీలేరు, కలికిరి, ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణి క్యంలో ఉన్న బీసీ రెనిడెన్సియల్ పాఠశాలలో ఈ ఏడాదికి దాదాపు 240 మంది విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం పొందారన్నారు. ప్రవేశాలు జరిగి రెండువారాలైనా భవన వసతిలేక ఇంతవరకు పాఠశాల్లో తరగతులు ప్రారంభించ లేదన్నారు. వెంటనే భవన వసతి కల్పించి, తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చెరువులో ఆక్రమణలు తొలగించండి తమ గ్రామానికి చెరువులోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఐరాల మండలం అబ్బుగుండు దళితవాడ వాసులు జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. కొంత కాలంగా తమ గ్రామ చెరువును కొందరు స్వార్థపరులు ఆక్రమించుకుని వ్యవసాయ పొలాలుగా మార్చుకున్నారని తెలిపారు. ఆక్రమణల కారణంగా చెరువు రూపురేఖలు కోల్పోయిందన్నారు. ఫలితంగా వర్షం వస్తే ఈ చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదన్నారు. దీంతో చెరువు ఆయకట్టుకు భవిష్యత్‌లో నీరందే పరిస్థితి లేదని చెఆప్పరు. ఆక్రమణలను తొలగించి చెరువును కాపాడాలని వారు కోరారు. ఎస్సీలకు చేయూతనివ్వండి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయభాస్కర్, యం.సుధాకర్‌లు ప్రజావాణిలో జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇండస్ట్రీయల్ పాలసీ కింద వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించడం లేదన్నారు. కావున ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరి వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు బ్యాంక్ గ్యారంటీ పథకం కింద రూ. 25 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పరంగా అందించిన ఇళ్లపట్టాలు, వ్యవసాయ బంజరు భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఉద్యోగం ఇప్పించండి సారూ తాను నిరుపేద వికలాంగుడినని, ఎంకామ్ వరకు చదువుకున్నానని.. తనకు ఉద్యోగం ఇప్పించాలని బంగారుపాళెం మండలం శేషాపురం గ్రామానికి చెందిన కృష్ణమనాయుడు సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. తనకు 90 శాతం వికలత్వం ఉన్నట్లు సదరన్ ద్వారా గుర్తింపు కూడా ఉన్నట్లు తెలియజేశారు. తాను గతంలో పలు సార్లు ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నామని తెలిపారు. అయితే ఉద్యోగాల కేటాయింపులో తనకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆయన వాపోయారు. తనది నిరుపేద కుటుంబమని, తమ తల్లిదండ్రులు రోజువారి కూలీపనులకు వెళ్లి, జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కావున తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వినతి చేశాడు. -
ఏసీబీ దాడి.. నాలుగోసారి
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కడం ఇది నాలుగోసారి. సుమా రు పదేళ్ల కిత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంపై ఉన్న చిన్నమొత్తాల పొదుపు ప్రత్యేక తహసీల్దార్‌గా పనిచేసిన పంత్ ఒక ఏజెంట్ నుంచి లెసైన్స్ రెన్యూవల్ విషయంలో లంచం డిమాండ్ చేసి డబ్బు లు తీసుకుంటూ కలెక్టరేట్లోనే ఏసీబీకి చిక్కాడు. 2010లో కలెక్టరేట్ ప్రగతి భవనంలో సోషల్ వెల్ఫేర్ డీఎస్‌డబ్ల్యూవోగా పనిచేసిన వై.గాలయ్య ఒక వార్డెన్‌కు సంబంధించి వైద్య ఖర్చుల బిల్లులు మంజూరు విషయంలో సంతకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా రు. ఇదేశాఖలో గాలయ్య తర్వాత ఇన్చార్జ్ డీఎస్‌డబ్ల్యూవోగా బాధ్యతలు స్వీకరిం చిన ఏఎస్డబ్ల్యూఓ ప్రభాకర్ అదే వార్డెన్‌కు గ్రేడ్‌వన్ పదోన్నతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుడ్డారు. -
లాటరీ షురూ
- ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ - ఒకరికి ఒక షాపే కేటాయింపు - సౌకర్యాలు నిల్ - ఆందోళనకు దిగిన టెండరుదారులు మచిలీపట్నం : లాటరీ పద్ధతిలో మద్యంషాపుల కేటాయింపు ప్రక్రియ కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగింది. జిల్లాలో 335 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 33 మద్యం దుకాణాలను ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన 302 షాపులకు టెండర్లు ఆహ్వానించగా 294 మద్యం దుకాణాలకు 6,995 దరఖాస్తులు వచ్చాయి. ఎనిమిది మద్యం షాపులకు అసలు టెండర్లు దాఖలు కాలేదు. 29 మద్యం దుకాణాలకు సింగిల్ టెండర్లు వచ్చాయి. తొలుత సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి షాపులను కేటాయించారు. కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు, ట్రైనీ కలెక్టర్ సలోమి సైదాని, ఎక్సైజ్ డీసీ బాబ్జిరావు, మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌లు జి.మురళీధర్, ఎంవీ రమణ పర్యవేక్షణలో లెసైన్సులను జారీ చేశారు. ఒక్కో షాపునకు వచ్చిన టెండర్ల ఆధారంగా టెండరు దాఖలు చేసిన వారిని పేర్ల వారీగా పిలిచి వారి సమక్షంలోనే లాటరీ తీశారు. ఆలస్యంగా ప్రారంభం లాటరీ ప్రక్రియ ఉదయం 10.30కు ప్రారంభమవుతుందని ప్రకటించినా 11.45కు ప్రారంభించారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి లెసైన్సులు జారీ చేయగా, 11.55కు మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని ఒకటో నంబరు షాపును లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వెళ్లారు. జేసీ గంధం చంద్రుడు, బందరు ఆర్డీవో సాయిబాబు, ఎక్సైజ్ అధికారులు ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తులు, టెండరు బాక్సుల్లో ఉన్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపును జేసీ ప్రారంభించారు. ఒకరికి ఒక షాపే మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని షాపులకు చంద్రుడు, విజయవాడ ఈఎస్ పరిధిలోని మద్యం దుకాణాలకు బందరు ఆర్డీవో సాయిబాబు లాటరీ తీశారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారు, లాటరీ పద్ధతిలో ఒక షాపు దక్కించున్నవారిని గుర్తించి మిగిలిన షాపులకు నిర్వహించే లాటరీలో వారి పేర్లు తొలగిస్తున్నట్లు జేసీ ప్రకటించారు. ఒకరి పేరున ఒక షాపు మాత్రమే కేటాయించటం జరుగుతుందని తెలిపారు. అర్ధరాత్రి సమయానికీ లాటరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వారికి చలానాలు ఇచ్చి, లెసైన్సు ఫీజులోని 25 శాతం నగదును ఎక్సైజ్‌శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులు సూచించారు. టెండరుదారుల ఆందోళన లాటరీలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి టెండరుదారులు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. ఎక్సైజ్ అధికారులు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవటం, తాగునీటిని అందుబాటులో ఉంచకపోవటంతో టెండరుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కూడా మద్యం షాపుల కేటాయింపు ప్రారంభం కాకపోవటం, సౌకర్యాలు లేకపోవటంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలు వద్దకు వెళ్లి తమదైన శైలిలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం వస్తే వేలాది కుర్చీలు వేస్తారని, లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన తమకు కూర్చునేందుకు కుర్చీలు వేయలేదని, తాగునీరు అందుబాటులో ఉంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న జేసీ బయటకు వచ్చి దరఖాస్తులు అధికంగా ఉండటంతో వాటన్నింటినీ పరిశీలించటంలో ఆలస్యం జరుగుతోందని సర్ది చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు చేస్తామని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు. మహిళలు కూడా రావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. భారీగా పోలీస్ బందోబస్తు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో టెండరుదారులు తరలిరాగా వారి వాహనాలను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ఆర్అండ్బీ అతిథి గృహం, కలెక్టర్ బంగ్లాకు వెళ్లే రోడ్డు, జిల్లాపరిషత్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ జిల్లా పరిషత్ ప్రాంగణంలో కార్లు బారులు తీరాయి. కలెక్టరేట్‌కు ఉన్న మూడు ప్రధాన గేట్ల వద్ద ఎక్సైజ్ శాఖ జారీచేసిన పాస్‌లు ఉన్న వారినే లోనికి అనుమతించారు. -
మద్యం టెండర్లకు నేటితో గడువు పూర్తి
- 302 షాపులకు టెండర్ల ఆహ్వానం - వ్యాపారుల నుంచి తగ్గిన స్పందన - నిబంధనల నేపథ్యంలోనే వెనుకంజ మచిలీపట్నం : జిల్లాలో మద్యం టెండర్ల స్వీకరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ నెల 25 నుంచి మద్యం షాపుల టెండర్లను ఎక్సైజ్ అధికారులు కలెక్టరేట్లో స్వీకరిస్తున్నారు. జిల్లాలో 335 వైన్ షాపులు ఉండగా ఈ సారి వాటిలో 33 షాపులను ప్రభుత్వమే నిర్వహించనుంది. మిగిలిన 302 షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 17, విజయవాడ ఈఎస్ పరిధిలో 16 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. మిగిలిన షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇందుకుగాను కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లను ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేశారు. ఈ నెల 25న 10 టెండర్లు దాఖలు కాగా శుక్రవారం జోరు పెరిగింది. దాదాపు 730 టెండర్లు రెండోరోజై దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అయితే గతేడాదితో పోల్చితే ఇది తక్కువేనని అధికారులు చెబుతున్నారు. గతేడాది మొత్తం 3,600 టెండర్లు రాగా, ఈసారి ఆ స్థాయిలో రాకపోవచ్చని అంటున్నారు. టెండర్ల స్వీకరణ గడువు శనివారంతో ముగియనుంది. ఆఖరు రోజు కావటంతో అధిక సంఖ్యలో టెండర్లు వస్తాయని ఎక్సైజ్ అధికారులు ఆశిస్తున్నారు. ఈ నెల 29న టెండరు బాక్సులు తెరిచి లాటరీ పద్ధతిలో మద్యం షాపులను కేటాయించనున్నారు. ని‘బంధనాలు’... ఈసారి మద్యం షాపులను రెండేళ్ల గడువుతో ఇవ్వనున్నారు. 2015 జూలై ఒకటి నుంచి 2017 జూన్ 30 వరకు మద్యం షాపులు నడుపుకొనేందుకు లెసైన్సు జారీ చేయనున్నారు. లెసైన్సులు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం ధరలను పెంచి విక్రయాలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలను నిర్వహించనుండటంతో ఆ అవకాశం తక్కువగా ఉంటుందని వ్యాపారుల భావిస్తున్నారు. లెసైన్సు ఫీజును జనాభా ప్రాతిపదికన రూ.30 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు నిర్ణయించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 28 షాపులకు అసలు టెండర్లు దాఖలు కాలేదు. ఈ ఏడాది మార్చిన నిబంధనల ఆధారంగా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది టెండరు దరఖాస్తు ఫీజు రూ.25 వేలు కాగా ఈ ఏడాది జనాభా ప్రాతిపదికన రూ.30 వేలు, రూ.40 వేలు, రూ.50 వేల వరకు పెంచారు. ఈ నగదు తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవటంతో లాటరీలో మద్యం షాపు రాకుంటే ఈ సొమ్మును కోల్పోతామని వ్యాపారులు వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. దీంతో పాటు టెండరు దాఖలు చేసేవారు రెండేళ్ల ఐటీ రిటర్న్స్‌ను సమర్పించాలనే నిబంధన విధించారు. గతంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు సైతం టెండరు దాఖలు చేసేందుకు అవకాశం ఉండేది. ఈసారి ఆ పరిస్థితి లేకపోవటంతో తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు షాపింగ్ మాల్స్‌లో మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్ల రూపంలో మద్యాన్ని అందుబాటులో ఉంచటం, సహకార సంఘాల ద్వారా మద్యం విక్రయాలు జరుపనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో షాపులను దక్కించుకుంటే ఎంతమేర లాభపడతామనే ఆలోచనలో వ్యాపారులు ఉన్నారు. గత రెండు రోజులుగా కలెక్టరేట్లో మద్యం షాపులకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుండగా ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేసిన వారే టెండరు దాఖలు చేసేందుకు ముందుకు వచ్చారు. గడువు పూర్తయ్యే సమయానికి ఎన్ని టెండర్లు దాఖలవుతాయో వేచిచూడాలి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక్కడే జిల్లాలో 33 షాపులను ప్రభుత్వమే నడపనుంది. గెజిట్ నంబర్ల వారీగా వాటి వివరాలివీ... మచిలీపట్నం 6, పెడన 11, బంటుమిల్లి 21, మోపిదేవి 37, మొవ్వ 49, గుడివాడ 58, పామర్రు 67, దోసపాడు 78, కైకలూరు 87, కలిదిండి 90, ముదినేపల్లి 96, నందివాడ 112, గన్నవరం 127, బాపులపాడు 132, తరిగొప్పుల 138, ఉయ్యూరు 154, పమిడిముక్కల 169, యనమలకుదురు 206, ఈడుపుగల్లు 217, ఇబ్రహీంపట్నం 242, మైలవరం 246, జి.కొండూరు 250, నందిగామ 264, పెనుగంచిప్రోలు 271, కంచికచర్ల 283, చిల్లకల్లు 297, నూజివీడు 307, తిరువూరు 319, విస్సన్నపేట 329, విజయవాడలో 183, 192, 198, 225 గెజిట్ నంబర్లతో ప్రభుత్వం ద్వారా నిర్వహించనున్నారు. -
రైతుకు రిక్తహస్తం
- రైతుల్ని పట్టించుకోని బాబు ప్రభుత్వం - ఘోరంగా విఫలమైన సర్కార్ - వైఎస్సార్సీపీ మహా ధర్నాలో ధ్వజమెత్తిన నాయకులు - కలెక్టరేట్ వద్ద పోలీసుల ఓవర్‌యాక్షన్ - హాఎమ్మెల్యే ఈశ్వరి పట్ల ఏసీపీ దురుసు వైఖరి సాక్షి, విశాఖపట్నం: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా జరిగింది. ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతోపాటు రైతులు, డ్వాక్రామహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం పది గంటల నుంచి ప్రారంభ మైన ధర్నా మధ్యాహ్నం ఒం టిగంట వరకు జరిగింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ ధర్నాకు తరలివచ్చిన కార్యకర్తలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా తమ ప్రసంగాల్లో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా రైతులకు రుణాలు..విత్తనాలు, ఎరువులు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఎస్ఎల్బీసీ సమావేశం ఇప్పటివరకూ జరగకపోవడం చరిత్రలో ముందెన్నడూలేదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అనంతపురంలోనే 100మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సర్కార్‌కు కనీస స్పందనలేదన్నారు. మరోపక్క ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొం దుపర్చిన కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న వాటాను రాబట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఓ టుకునోటుకేసులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయలేదని.. పైగా టేపుల్లో ఆ వా యిస్ నీది అవునా కాదా అని అడిగితే డొంకతిరుగుడు స మాధానాలతో తప్పించుకుంటున్నారని ధ్వజ మెత్తారు.గవర్నర్‌ను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ సెక్షన్-8 పేరిట సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో రాష్ర్ట కార్యదర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్, పీలా ఉమారాణి, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మాజీ ఎమెల్యే తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రి సీతారాం, మిలటరీ నాయుడు, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, అదీప్‌రాజు, కోలా గురువులు, పార్టీ మహిళా, యువజన, ఎస్సీ, సేవాదళ్ సాంస్కృతిక విభాగాల జిల్లా అధ్యక్షులు ఉషాకిరణ్, వల్లూరి భాస్కర్, బోని శివరామకృష్ణ, వాసు, రాధ, రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, సీఈసీ సభ్యులు వీసం రామకృష్ణ, శ్రీకాంత్‌రాజు,రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల రవిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ జిల్లా అధికార ప్రతినిధి ఉరుకూటి అప్పారావు, చిక్కాల రామారావు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్, సత్తిరామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్ నగర పరిధిలోని డివిజన్ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గిడ్డి ఈశ్వరిపై ఏసీపీ జులం ధర్నా అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా కలెక్టర్‌తో సహా అధికారులెవరూ లేకపోవడంతో ఛాంబర్ వద్ద బైటాయించారు. ఛాంబర్ కు వినతిపత్రం అంటించే ప్రయత్నం చేస్తుండగా ఏసీపీ రమణ అడ్డుకుని ప్రతులను లాక్కొని నలిపేశారు. ఎమ్మెల్యే ఈశ్వరి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి పీలా ఉమారాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషారాణి తదితరులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లను గెంటేసే ప్రయత్నం చేశారు. ఏసీపీ వెనక్కి నెట్టేయడంతో యలమంచిలి పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు కింద పడిపోయారు. డీఆర్‌ఒ నాగేశ్వరరావు ఆహ్వానించగా లోనికి వెళ్లనీయకుండా ఏసీపీ మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఆర్వో వారిస్తున్నా వినకుండా ఈశ్వరి పట్ల ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారు. మళ్లీ ధర్నా ఎలా చేస్తారో చూస్త్తానంటూ ఏకవచనంతో ఏసీపీ రెచ్చిపోయారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ ఎస్టీ మహిళా ఎమ్మెల్యేనైన తన పట్ల ఏసీపీ రమణ ప్రవర్తించిన తీరు కలిచి వేసిందన్నారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరించాలనుకుంటే పచ్చ చొక్కాలు వేసుకోవాలని సూచించారు. ఏసీపీపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేస్తానని, స్పీకర్‌కు, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీమహిళల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ రమణపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని అమర్నాథ్ చెప్పారు. -
నయవంచన పై నిరసన
చంద్రబాబు విధానాల వల్ల రైతు పరిస్థితి దుర్భరంగా మారింది. రైతు అని చెప్పుకుంటే అప్పు పుట్టదనేంత స్థాయిలో పరిస్థితి ఉంది. చంద్రబాబు హయాంలో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేదిగా తయారైంది. రుణమాఫీ జరగక, విత్తనాలు లేక, ఉన్న అప్పులు తీరక, కొత్త అప్పు పుట్టక రైతు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు రూ.300 బోనస్ సొమ్ము వచ్చేలా కృషి చేయాలి. - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రైతు తిరగబడే రోజు వస్తుంది.. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకా రం వరికి రూ.2,522 మద్దతు ధర ఇవ్వాలి. కానీ రూ.1360 ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో రైతుకు ఉత్పత్తి వ్యయం కూడా రాని దుస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రూ.550 నుంచి రూ.వెయ్యికి మద్దతు ధర పెంచడం ద్వారా 81.8 శాతం పెంపుదల అయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 8.1 శాతం మాత్రమే పెరిగింది. వైఎస్ హయాంలో గిట్టుబాటు ధరతోపాటు క్వింటాల్‌కు 2006 నుంచి 2010 వరకూ ఏటా రూ.40 నుంచి రూ.100 వరకూ బోనస్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణాలు రద్దు చేయకపోగా వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని సొసైటీల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. పరిస్థితి చూస్తే మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి చేరుతోంది. పట్టిసీమ ప్రాజెక్టును ప్రజలు బద్దలుగొట్టి తిరగబడే రోజు కూడా దగ్గరలోనే ఉంది. - పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ నైతికత ఉంటే రాజీనామా చేయండి.. వైఎస్‌పై అభియోగం మోపిన మరుక్షణమే 17 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరి ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన చంద్రబాబు విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఫోరెన్సిక్ నివేదికలో సైతం చంద్రబాబు స్వరమేనని వచ్చింది. రేపో మాపో ఆయనకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం నైతికత ఉన్నా టీడీపీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలి. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డ చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. - వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ‘బాబు’ను తరిమికొట్టే సమయమొచ్చింది.. రైతును దగా చేసిన చంద్రబాబును తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు అప్పుల పాలైన రైతుల బాధలు పట్టకపోవడం హాస్యాస్పదం. చెప్పినది, చెప్పనిది చేసే గుణం వైఎస్‌లో ఉంటే, నమ్మించి మోసం చేసే నైజం చంద్రబాబుది. ఒకప్పుడు వెన్నుపోటు పొడిచి బయటకు పంపిన ఎన్టీఆర్ పేరును ఉచ్చరించనిదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గతిలేని పరిస్థితి ఏర్పడింది. - జక్కంపూడి విజయలక్ష్మి, సీజీసీ సభ్యురాలు సర్కారుకు రానున్నవి గడ్డురోజులే.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ ఆర్డినెన్స ఆధారంగా జీవో 116 తెచ్చి 10 లక్షల ఎకరాలను బలవంతంగా సేకరించేందుకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది అమలు జరిగితే రైతు పరిస్థితి మరింత దుర్బరమవుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రైతు కంట కన్నీరు కారుస్తున్న సర్కార్‌కు ఇక రానున్నవన్నీ గడ్డు రోజులే. - పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు నమ్మించి దగా చేసిన బాబు, పవన్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దుకు సంబంధించి ‘తొలి సంతకం’ చేసి మాట నిలబెట్టుకున్నారు. అదే చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ‘తొలి సంతకం’ విలువను దిగజార్చేలా ప్రవర్తించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానంటూ బీరాలు పలికిన పవన్‌కల్యాణ్ అడ్రస్ లేకుండా పోయాడు. - ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్ములను స్వార్థ రాజకీయాల కోసం ఖర్చు పెడుతున్న చంద్రబాబు తీరు అత్యంత హేయం. వ్యవసాయం దండగని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు దానిని నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు. - రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే -
దగాకోరు సర్కారుపై మడమ తిప్పని పోరు
నమ్మించి దగాచేసిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్ సీపీ శ్రేణులు కన్నెర్రజేశాయి. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కి ఆనక గాలికొదిలేసిన వైనాన్ని వివరించిన నేతలు పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్నిచ్చారు. రుణాలు రద్దుకాక, కొత్త రుణాలు అందక, మద్దతు ధర లభించక, నకిలీ విత్తనాలతో సమస్యల వలయంలో చిక్కుకున్న రైతులకు, ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడతామనే భరోసానిచ్చారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపె వెన్నుచూపని పోరాటం సాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎలుగెత్తారుు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి నేతలు, పార్టీ శ్రేణులు కాపెద్ద ఎత్తున తరలివచ్చారు. గద్దెనెక్కేందుకు ప్రజలను నమ్మించి, తర్వాత దగా చేసిన చంద్రబాబును ఎండగట్టిన నేతలు ‘నోటుకు ఓటు’ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు ఖాయమంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. నేతలు చంద్రబాబు తీరును ఎండగట్టే సందర్భంలో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ‘విజన్ 2020-చంద్రబాబు 420’ ‘పాత ఇనుప సామాన్లు కొంటాం -ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తాం’ అంటూ చంద్రబాబు నిజస్వరూపాన్ని ఎండగట్టేలా కార్యకర్తల చేతుల్లో ఉన్న స్లకార్డులు ఆకట్టుకున్నాయి. చంద్రబాబు ఏ స్థాయి ప్రజాప్రతినిధులకు ఎంత రేటు నిర్ణయించారో తెలియచేసేలా ప్లకార్డులలో పట్టిక రూపంలో ఉంచారు. నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని జ్యోతుల నెహ్రూ ఎండగట్టారు. పుష్కరాల పనుల్లో వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ సరిదిద్దుకోలేకపోతే తప్పుకోవాలని, తమ పార్టీ తరఫున ప్రతి భక్తుడికీ సేవలందించేందకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తానిచ్చిన లేఖతో విభజనకు కారణమైన బాబు విలీన మండలాల్లో అమాయకులైన గిరిజన విద్యార్థులకు కనీస విద్య కూడా అందించ డం లేదని విమర్శించారు. సర్కార్ స్పందించకుంటే ఆ బాధ్యతను భుజానకెత్తుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని విసిరిన సవాల్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇందుకు ఆయన సర్కార్‌కు 15 రోజులు గడువు ఇచ్చారు. లేదంటే దశలవారీ ఉద్యమం తప్పదని జారీ చేసిన హెచ్చరికలతో ఏడు విలీన మండలాల్లో గిరిజనుల వెంట ఉంటామని భరోసా కల్పించారు. రైతుల నుంచి ప్రతిఘటన తప్పదు.. దివంగత మహానేత వైఎస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర 81.8 శాతం పెరగ్గా, బాబు హయూంలో 3.81 శాతం మాత్రమే పెరిగిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఎత్తిచూపారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని సంబరపడుతున్న చంద్రబాబు ఏదో ఒక రోజు రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఇప్పుడు ముఖం చాటేసిన వైనాన్ని ఎత్తిచూపారు. చిన్నపాటి అభియోగాలకే వైఎస్ హయాంలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాచేసి ఎన్నికలను ఎదుర్కొన్న ధైర్యాన్ని గుర్తుకు తెస్తూ నోటుకు ఓటు కుంభకోణంలో కూరుకుపోయిన బాబు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో చెప్పాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నిలదీయడంతో కార్యకర్తలు కేరింతలుకొట్టారు. పవనిజమంటూ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నావన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సూటి ప్రశ్నకు యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. భూసేకరణ మాటున రియల్ ఎస్టేట్ దందా పుష్కరాల్లో అవినీతి, భూ సేకరణ చట్టంలో లొసుగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు తీరును పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎండగట్టారు. టీడీపీ వైఫల్యాలను పార్టీ ప్రచార సెల్ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో ఎత్తిచూపారు. రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, అధికారప్రతినిధి దొంగ రామసత్యనారాయణ, ప్రచార సెల్ అధ్యక్షుడు సిరిపురపు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ధర్నా అనంతరం పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లే సమయంలో పోలీసులకు, నెహ్రూకు మధ్య కొద్దిసేపు సంవాదం జరిగింది. డీఆర్వో యాదగిరికి పలు అంశాలతో పాటు జిల్లాలోని నాలుగు ప్రధాన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఇటీవల తుపాన్లో మృతి చెందిన మత్య్యకారులకు సర్కార్ ప్రకటించిన నాలుగున్నర లక్షలు కాకుండా ఐదు లక్షలు పరిహారంగా అందచేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, జడ్పీ ప్రతిపక్ష నాయకుడు తోట నవీన్, రాజమండ్రి కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామి నాయుడు, తోట సుబ్బారావునాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి కురుమళ్ళ రాంబాబు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, మండపాక అప్పన్నదొర, అబ్దుల్‌బషీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, మట్టా సుజాత, మానే దొరబాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, కర్రి నారాయణరావు, మోతుకూరి వెంకటేష్, బొబ్బిలి గోవిందు, దంగేటి రాంబాబు, పెంకే వెంకట్రావు, రావు చిన్నారావు, ఎన్ఎస్ రాజు, మంచాల బాబ్జీ, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, మీసాల దుర్గాప్రసాద్, గట్టి రవి, సత్తి వీర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఆదిత్యకుమార్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జోగా రాజు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అల్లి రాజబాబు, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు పెద్దిరెడ్డి రామలక్ష్మి, సత్యవతి, నేతలు విప్పర్తి వేణుగోపాలరావు, గుర్రం గౌతమ్, ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. -
పాలన అస్తవ్యస్తం
శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో గడచిన ఏడాదిలో పాలన అస్తవ్యస్తంగా తయారైందనీ, రైతులకిచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని నట్టేట ముంచారనీ, మహిళా సంఘాలను మోసగించారనీ, ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడి కలెక్టరేట్ ఎదుట గురువారం భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఇందులో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి కూడా తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతూ ఇంతవరకూ లేని సెక్షన్-8ను తెరపైకి తెస్తున్నారన్నారు. గత 20రోజులుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు విత్తనాలు అందించలేకపోయారనీ, ఖరీఫ్ప్లాన్పై బ్యాంకర్ల సమావేశం ఇంతవరకూ నిర్వహించలేదని, కొత్తరుణాలు లేకపోవడంతో బీమా సదుపాయాన్ని కూడా రైతాంగం నష్టపోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. గతంలో అభియోగం వచ్చినపుడు నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు వంటి నాయకులు స్వతహాగా రాజీనామా చేసి వారి నిజాయితీ నిరూపించుకున్నారని, ఇపుడు చంద్రబాబు కూడా అదేరీతిలో తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే తమ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. కృష్ణాజలా ల్లో మనవాటా సాధించడంలో విఫల మయ్యారని దుయ్యబట్టారు. పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పాలవలస విక్రాంత్‌లు మాట్లాడుతూ సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేయడం, అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం, గ్రామస్థాయిలో తమకు అనుకూలం కానివారిపై వేధింపులకు పాల్పడడం వంటివి ఈ ఏడాదిలో పెచ్చుమీరాయన్నారు. అనంతరం ఏడాది పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన, రైతాంగ సమస్యలపైన జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా నాయకులు పిరియా సాయిరాజ్, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, నర్తు రామారావు, వై.వి.సూర్యనారాయణ, చల్లా రవికుమార్ శిమ్మ రాజశేఖర్, జె.జె.మోహనరావు, అంధవరపు సూరిబాబు, ధర్మాన పద్మప్రియ, ఎం.వి.పద్మావతి, గొండు కృష్ణమూర్తి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, గేదెల రామారావు, మార్పు ధర్మారావు, చిట్టి జనార్దన, టి.కామేశ్వరి, పీస శ్రీహరి, బీఎల్ నాయుడు, శిమ్మ వెంకటరావు, ధర్మాన రామలింగంనాయుడు, చల్లా అలివేలు మంగ, బరాటం నాగేశ్వరరావు, కిల్లి వెంకట సత్యనారాయణ, దుంపల శ్యాం, పేరాడ తిలక్, సనపల నారాయణరావు, బల్లాడ జనార్దనరావు, అబ్దుల్ రెహమాన్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏడాది రుణప్రణాళిక ఏదీ? రైతులకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఈ ఏడాది రైతులకు సంబంధించిన రుణప్రణాళిక ఇంతవరకూ తయారు కాలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా పాత రుణాలు తీరక, కొత్తరుణాలు అందక ఆర్థిక ఇబ్బందుల్లో పడి ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు చేయకపోవడంతో బ్యాంకులకు, రైతులకు మధ్య సత్సంబందాలు తెగిపోయాయి. జిల్లా మంత్రి హైదరాబాదుకే పరిమితమయ్యారు. - ధర్మాన ప్రసాదరావు రాజ్యాంగ వ్యవస్థ అభాసుపాలు రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా పోయింది. రాజ్యాంగ అధినేతకు కూడా దుర్బాషలాడిన నీచ సంస్కృతి టీడీపీ మంత్రులు, శాసనసభ్యుల్లో చోటుచేసుకుంది. రాష్ట్రాన్ని దొంగలు పాలిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలే... దొంగా దొంగా అని అరిచినట్టుంది. రైతులకు, మహిళలకు, చేనేత కార్మికులకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. 20రోజులుగా పాలన విడిచిపెట్టి సీఎం ఆత్మరక్షణలో పడ్డారు. - తమ్మినేని సీతారాం అడుగడుగునా మోసం రుణమాఫీ పేరుతో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న సీఎం దానినుంచి తప్పించుకునేందుకు సెక్షన్-8 తెరపైకి తెస్తున్నారు. టీడీపీ అవినీతిని ప్రజలకు వివరిద్దాం. అదే మన తక్షణ కర్తవ్యం. - రెడ్డి శాంతి -
ప్రజాసమస్యలపై మరోపోరు
శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రజా సమస్యల్ని మరింత జఠిలం చేస్తుండడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం చేసిన కృషి వల్ల రైతుల్లో ధీమా ఏర్పడింది. అటు తరువాత ప్రభుత్వాలు సంక్షేమ బాటను వీడి పదవుల కోసమే పనిచేయడంతో అన్ని వర్గాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా రైతులు పెట్టుబడులు లేక ఆందోళన చెందుతున్నారు. గతంలో పంట బీమాతో రైతన్న ధీమాగా ఉండేవాడు. ఇప్పుడలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా బీమా వల్ల రైతు నష్టపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను దగా చేసి బీమాకు సైతం నోచుకోకుండా చేశారు. రుణాల మాఫీ అంటూ రైతులను మాయ మాటలతో మోసగించడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేకుండా చేసింది. పెట్టుబడులు కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. ఇటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఓటుకు నోటులో పీకల్లోతు కూరుకుపోయి దానినుంచి బయటపడేందుకే సమయాన్నంతా కేటాయిస్తోంది. నీరు-చెట్టు వంటి గొప్ప పేర్లతో ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులను పార్టీ కార్యకర్తలకు తినిపిస్తోందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రైతుల పక్షాన పోరాడటానికి, రైతు సమస్యలను ప్రభుత్వ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సాఆర్సీపీ శ్రేణులు నడుం బిగించారు. -
సర్కారు వైఫల్యాలపై రణభేరి
ఏలూరు (టూ టౌన్) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ గురువారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యాచరణ అమలు చేయకపోవడం, వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, రైతులకు రుణాలు అందించే ఏర్పాటు చేయకపోవడం వంటి వైఫల్యాలను నిరసిస్తూ పార్టీ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 3లక్షల మంది రైతులు 2లక్షల 40వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకూ సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు రెండు లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, సరపడా ఎరువులను సిద్ధం చేయలేదు. ఏ మండలానికీ పూర్తిస్థాయిలో విత్తనాలు చేరలేదు. మెట్ట ప్రాంతంలో విద్యుత్ అంతరాయంతో బోర్లు ఉన్న రైతులు సైతం దుక్కులు ప్రారంభించలేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల అవస్థలను సర్కారు దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. తరలిరండి : కొత్తపల్లి ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలు తరలి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆంధ్రా అన్నపూర్ణగా పేరున్న మన జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై పోరాడటానికి అంతా కలసి రావాల న్నారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మహిళలూ.. తరలిరండి రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించే ధర్నాకు మహిళలు తరలిరావాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. -
ఉద్యమ పథం
- రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన - 25న కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలి - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ అనకాపల్లి రూరల్ : ప్రభుత్వ రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 25న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులవుతున్నా ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోయిందన్నారు. రుణప్రణాళిక విషయంలోనూ స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. విత్తనాల కోసం మండల కేంద్రాల్లో రోజూ అష్టకష్టాలకు గురవుతున్నారన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మంత్రులెవ్వరూ మాట్లాడలేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై సీఎం రాజీనామా చేయాలన్నారు. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ప్రజా, రైతు సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ అన్నదాతకు ఆపద రానీయమని చెబుతున్న మంత్రులు అడిగిన విత్తనాలు సరఫరా చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. రైతులతోపాటు కౌలు రైతులకు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు అన్నీ కష్టాలు కడగండ్లే అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి సెక్షన్ 8, ఫోన్ టాపింగ్ వంటి అంశాలతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తవ్వకాలకు ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బాక్సైట్ జోలికొస్తే గిరిజనుల తడాఖా చూపిస్తామన్నారు. అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రగడనాగేశ్వరరావు, చెంగల వెంకటరావు, అదీప్రాజ్లు సమావేశంలో మాట్లాడారు. -
కదం తొక్కిన ఉపాధిహామీ సిబ్బంది
ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ ముకరంపుర : ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బంది శనివారం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా వచ్చారు. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. ఉపాధిహామీ సిబ్బంది జిల్లా కమిటీ జేఏసీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ఆరు రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. కేడర్ ప్రకారం పే స్కేలు రివిజన్ చేసి జీతభత్యాలను 43 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. తె లంగాణ రాష్ట్ర ఇంక్రిమెంట్‌ను అందజేయాలని, కాంట్రాక్ట్ ఉ ద్యోగుల కోసం గతంలో హెచ్ఆర్ పాలసీ ద్వారా విడుదల చేసిన కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీని ఉద్యోగుల ప్రమోషన్ల కోసం అమలు చేయూలని కోరారు. జీవో 491ను రద్దుచేస్తూ సీనియర్ మేట్లుగా మారిన వారిని తిరిగి ఎఫ్‌ఏలుగా నియమించాలన్నారు. సమన్వయకర్తలు రాపోలు నాగరాజు. మం చికట్ల శ్రీనివాస్, జేఏసీ కో చైర్మన్లు బాలలింగం, సత్యప్రకాశ్, జగదీష్, కిషన్, జమీల్, లక్ష్మణ్, సబ్యులు లక్ష్మీ పెరిందేవి, వేణు, లక్ష్మయ్య, రాజు, రమేశ్, మమత, రజినీకాంత్, సాయిశ్రీ, రమేశ్, ఆంజనేయులు, సంతోష్ పాల్గొన్నారు. -
కరువు తీరా వాన
- విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం - వాయుగుండంతో నేడూ, రేపూ ప్రభావం - అధికార యంత్రాంగం అప్రమత్తం - మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరిక - కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు సాక్షి, విశాఖపట్నం: మూడు రోజుల నుంచి వాన ముంచెత్తుతోంది. కరువు తీరా వర్షం కురుస్తోంది. ఒక్కరోజూ వదలకుండా వాన ఇక చాలు అన్నంతగా దంచికొడుతోంది. నైరుతి రుతుపవనాల్లో చురుకుదనానికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తోడైంది. ఫలితంగా కుంభవృష్టిని తలపిస్తోంది. జనజీవనాన్ని స్తంభింపచేస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధిని హరిస్తోంది. కుండపోతగా కురిస్తే ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉండిపోయి పల్లపు ప్రాంతాలను జలమయం చేస్తుంది. కానీ ఏకధాటిగా కాకుండా కాస్త విరామం ఇస్తూ కురుస్తుండడం వల్ల ఒకింత ఊరటినిస్తోంది. లేదంటే ఇంతటి భారీ వర్షపాతానికి ఎంతో నష్టం వాటిల్లేది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఈ సీజనులో ఇదే అత్యధిక వర్షం కావడం విశేషం. నగరంతో పాటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నక్కపల్లిలో 10 సెం.మీలు, ఏజెన్సీలోని పెదబయలులో 7.5 సెం.మీల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వ ర్షాలకు మైదానంలోనూ, మన్యంలోనూ వాగు లు, వంకలు పొంగుతున్నాయి. నదుల్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాండవ, వరహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వానలకు కొన్నిచోట్ల చెరకు, మెట్టు పంటలు దెబ్బతిన్నాయి. కశిం కోట మండలంలో కాశీమదుం గ్రోయిన్ కొట్టుకుపోయింది. ఏజెన్సీలోని మత్స్యగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ఇతర గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో మన్యంలో గిరిజనులు నాటుపడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అనూహ్యంగా కురుస్తున్న వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలోకి ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇదే ఇప్పుడు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. నేడు, రేపు కూడా.. మరోవైపు ఉత్తరాంధ్రపై రుతుపవనాలు చురుగ్గా ఉండడం, వాయుగుండం ప్రభావం వెరసి ఆది, సోమవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వానలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. జిల్లాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద సూచికను జారీ చేసింది. -
ఈ-పాస్ పరేషాన్
నెల్లూరు(రెవెన్యూ) : రేషన్ కార్డుదారులకు ఈ-పాస్ తలనొప్పిగా మారింది. రేషన్ కోసం చౌకదుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. వేలాదిమంది కార్డుదారులకు ఆధార్ అనుసంధానం కాక నానా అవస్థలుపడుతున్నారు. వృద్ధులు, కార్మికులు వేలిముద్రలు పడక రేషన్ కోసం నానా ఇబ్బందులుపడుతున్నారు. నూతన ఈ-పాస్ విధానంతో తాము చౌకదుకాణాల చుట్టు తిరగాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలో ఇబ్బందులు లేకుండా సకాలంలో రేషన్ సరఫరా చేసేవారని కార్డుదారులు అంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 73 శాతం రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 1,774 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. 320 చౌక దుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. చౌకదుకాణాల్లో అవినీతి అక్రమాలను అరికట్టి కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. అక్రమాలను అరికట్టడం అటుంచితే రేషన్ కోతే లక్ష్యంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-పాస్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.1500 కోట్లు మిగులుతుందని సీఎంకు చెప్పడంతో మరో అలోచన చేయకుండా అమలు చేయమని ఆదేశాలు జారీచేశారని అధికారులే చెబుతున్నారు. ఎంత తిరిగినా ఫలితం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 8 వేల మందికి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. 8 వేలమంది రేషన్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి చౌకదుకాణం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదు. వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ అనుసంధానం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ యంత్రాలు గంట పనిచేస్తే మరో రెండు గంటలు మోరాయిస్తున్నాయి. కార్డుదారులు మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. ఈ-పాస్ విధానం ప్రారంభించి మూడు నెలలు పూర్తయిన అనేక ప్రాంతాల్లో ఇంకా లోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరు జిల్లాలకు ఒకటే సర్వర్ ఏర్పాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డీలర్లు అంటున్నారు. లోపాలను సవరించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో రేషన్‌కార్డుల ఆధార్ అనుసంధానం చేశారు. సుమారు 97 శాతం ఆధార్ పూర్తయిందని అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆధార్ సీడింగ్ కాలేదంటు డీలర్లు కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ అనుసంధానం కోసం కార్డుదారులు కలెక్టరేట్ వద్ద బారులుతీరుతున్నారు. 97 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి అయితే కలెక్టరేట్లో బారులు తీరుతున్నా కార్డుదారులు అర్హులా, అనర్హులా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
సమ్మెకు దిగిన ‘ఉపాధి’ ఉద్యోగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె మొదలైంది. గురువారం నుంచి కాంట్రాక్టు ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ఉద్యమబాట పట్టారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించడంతోపాటు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో వారంతా ఉద్యమబాట పట్టారు. అందులో భాగంగా గురువారం జిల్లా నీటియాజమాన్య సంస్థ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అదేవిధంగా మండల స్థాయిలోనూ ఉద్యోగుల వారి కార్యాలయాల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లోని డ్వామా కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఈజీఎస్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు రాజశేఖర్, రవీందర్‌రెడ్డి, హైమద్, వెంకటేశ్వర్, తిరుపతాచారి తదితరులు మాట్లాడుతూ 48రోజుల క్రితమే తమ డిమాండ్లు పేర్కొంటూ ప్రభుత్వానికి వినతి అందజేశామన్నారు. కానీ ఇప్పటివరకు వాటిపై ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని, తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులంతా సమ్మెలోకి దిగుతారని, దీంతో పాలన స్తంభించిపోనుందన్నారు. ఆ పరిస్థితి తలెత్తకముందే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సీట్లు ఖాళీ!
♦ కలెక్టరేట్లో సిబ్బంది కొరత ♦ 1990లో నాటి అవసరాల మేరకు సిబ్బంది సంఖ్య నిర్ణయం ♦ గత ఏడాదికాలంలో పదిమంది బదిలీ పనుల్లో తీవ్ర జాప్యం గుంటూరు ఈస్ట్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత పరిపాలన జాప్యానికి దారితీస్తోంది. జిల్లా పరిపాలనా బాధ్యత అంతా ఈ కార్యాలయం నుంచి నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో తొమ్మిది విభాగాలతో ఈ కార్యాలయంలో విధులు నిర్వహణ జరుగుతుంటుంది. అన్ని విభాగాల్లో జరిగే పని, ఫైళ్లు కీలకమైనవే ఉంటాయి. ఇక్కడ పనిలో జాప్యం జరిగితే ఆ ప్రభావం జిల్లాపై ఎక్కువే. ఈ కారణంగానే జిల్లా అధికారులు ఆయా విభాగాల్లో అనుభవం, ఎంత పని ఒత్తిడి అయినా తట్టుకునే సిబ్బందిని నియమించుకుంటారు. కలెక్టర్ కార్యాలయంలో విభాగాలను ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్,జీ,హెచ్,ఎల్ సెక్షన్లుగా విభజించారు. ప్రతి విభాగంలో వివిధ రకాల పనులు నిర్వహించేందుకు సెక్షన్ సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తుంటారు. జిల్లా అధికారులు తాము నిర్వహించాల్సిన పరిపాలన విధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తన విధానాలను ఈ శాఖ సిబ్బంది ద్వారా నిర్వహిస్తాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఏర్పడింది. అనేక సెక్షన్లలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు సొంతంగా సిబ్బందిని తీసుకునే అవకాశం లేదు. దీంతో కలెక్టరేట్లో అత్యవసర ఫైల్స్‌కు సంబంధించిన పనులే ముందుకు నడుస్తన్నాయి. సాధారణ ఫైల్స్ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. కలెక్టరేట్లో 1990 వ సంవత్సరంలో అప్పటి అవసరాలకు ఎంతమేర సిబ్బంది అవసరమో నిర్ణయించారు. దీని ప్రకారం ముగ్గురు గజిటెడ్ క్యాడర్ సూపరింటెండెంట్లు, 11 మంది సీనియర్ అసిస్టెంట్లు, 24 మంది జూనియర్ అసిస్టెంట్లు విధుల్లో ఉండేవిధంగా అప్పటి అధికారులు, ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ఇప్పటికీ అదే సంఖ్యలో సిబ్బంది కొనసాగుతున్నారు. గత సంవత్సరకాలంలో ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ప్రమోషన్లు, ఇతర కారణాలతో కలెక్టర్ కార్యాలయం నుంచి బదిలీ అయి వెళ్లారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఉన్న సిబ్బందితోనే పరిపాలన సాగిస్తున్నారు. పెరిగిన పనిభారం మేరకు సిబ్బంది అవసరం గత 17 సంవత్సరాల్లో జనాభా పెరిగింది. పట్టణాలు పెరిగాయి. ప్రభుత్వ పథకాలు, విధి విధానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది సంఖ్యను పెంచాల్సింది పోయి ఉన్న సిబ్బందిలోనే కొరత ఏర్పడింది. దీనికితోడు రాజధాని నిర్మాణం నేపథ్యంలో కలెక్టరేట్‌పై పనిభారం పదింతలైంది. ఈ కారణంగా కొన్ని సెక్షన్లలో సిబ్బంది రాత్రి ఒంటిగంట వరకు పనిచేస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడికి తోడు సెలవు దినాల్లోనూ కొందరు సిబ్బంది పనిచేయాల్సివస్తోంది. ఈ-కార్యాలయం ప్రారంభంతో పనులు వేగవంతం కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల్లో ఈ- కార్యాలయం ప్రారంభిస్తున్నాం. దానికి అవసరమైన అధునాతనమైన స్కానర్లు, కంప్యూటర్లను తెప్పి ంచాం. దీనివల్ల పనులు వేగవంతం అవుతాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ ఈ - కార్యాలయం ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. -డాక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా సంయుక్త కలెక్టర్-1 -
ఇదేం ఖర్మ బాబూ..
- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము - మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు - ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి సాక్షి, కడప : రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు. జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు. -
‘మాఫీ’ తిప్పలు
కలెక్టరేట్ వద్ద రోజంతా క్యూలో రైతుల నిరీక్షణ ఆధారాలు ఇచ్చేందుకూ ఇబ్బందులే మహారాణిపేట : రుణమాఫీ అవుతుందనే ఆశతో ఇప్పటికీ చాలామంది రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రోజుల తరబడి వ్యవసాయ పనులు మానుకొని నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అడిగినప్పుడల్లా జెరాక్స్ కాపీలు ఇస్తూనే ఉన్నారు. అధికారులు మాత్రం ఏదో సాకు చెప్పి రుణమాఫీ మాత్రం కాకుండా చేస్తున్నారు. రుణమాఫీ అవ్వని రైతుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కలెక్టరే ట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రీవెన్స్‌కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చారు. గ్రీవెన్స్ కౌంటర్ తెరవకముందే భారీ క్యూ కట్టారు. కొంతమంది జెరాక్స్‌ల కోసం ఎండలో తిరుగుతూ కనిపించారు. వీరిలో ఎవరిని కదిలించినా మాకు రుణమాఫీ వర్తించలేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆధార్ కార్డుంది.. రేషన్ కార్డూ ఉంది.. రుణం తాలూకా బ్యాంక్ కార్డు ఉంది. ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులన్నింటికీ మేము అర్హులమే. అయినా బ్యాంక్ అధికారులు ఏదో సాకు చెప్పి మమ్మల్ని రోజూ తిప్పుతున్నారు తప్ప మాఫీ మాత్రం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆధార్ ఎంటర్కాలేదట ఆధార్ కార్డు నెంబర్ ఎన్నిసార్లు ఇచ్చినా కంప్యూటర్లో ఎంటర్ కావడం లేదట. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా నా పేరు మీద ఆధార్ ఎంటర్ కావడం లేదనే అధికారులు చెప్తున్నారు. నేను నర్సీపట్నం ఏడీబీ బ్యాంకులో రూ. 34 వేలు లోన్ తీసుకున్నా ను. అప్పుడు ఆధార్‌కార్డు లేకుండానే లోన్ ఇచ్చారు. ఇప్పుడు రుణమాఫీ కోసం ఆధార్‌కార్డు అడిగితే ఆధార్‌కార్డు చేయించుకున్నాను. ఆ నెంబర్ ఇస్తే ఎంటర్ అవడం లేదని రుణమాఫీ ఆపేశారు. - సేనాపతి రామారావు, చెట్టుపల్లి, నర్సీపట్నం మండలం పేరులో తప్పుందన్నారు.. అనకాపల్లి ఏడీబీ బ్యాంకులో 2013లో రూ. లక్ష రుణం తీసుకున్నాను. ఆ రోజు నాకు కరణం నాగ జమున అనే పేరు మీద రుణం ఇచ్చారు. నా రేషన్ కార్డు, ఆధార్ కార్డులో మాత్రం కరణం జమున అని ఉంది. ఇప్పుడు రుణమాఫీ కోసం అడిగితే నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేరు తప్పుపడింది. వాటిని మార్పించుకో అని చెప్పారు. అయితే నా దగ్గరున్న ఆధార్‌కార్డు, రేషన్ కార్డు ప్రకారం బ్యాంకులో నాగజమునకు బదులు జమున అని మార్పించుకున్నాను. తరువాత మా ఆయన పేరు వెంకటరావుకు బదులు వెంకటరమణ అని బ్యాంక్ వారు ఇచ్చిన రుణఖాతాలో పడింది. దాన్నీ మార్పించుకున్నాను. ఇప్పుడు ఆ ఆధారాలన్నింటితో ఇవ్వడానికి వచ్చాను. - కరణం జమున, మాటూరు, అనకాపల్లి మండలం -
వారిపై మీ ప్రతాపమేంటి?
సంగారెడ్డి క్రైం: జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోన్నా, ఊరూరా బెల్ట్‌షాప్‌లు కొనసాగుతున్నా పట్టింపు లేదా? అని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ... మద్యంపై ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోని వారు మారుమూల గ్రామాలు, తండాల్లోని గిరిజనులపై గంజాయి సాగు చేస్తున్నారంటూ కేసులు బనాయించి జైళ్లకు పంపడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. గంజాయి సాగు చట్ట విరుద్ధమే అయినా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఎక్సైజ్ అధికారులు ఏనాడైనా గిరిజనులకు కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మానిటరింగ్ కమిటీ సభ్యుడు రవీందర్ నాయక్ మాట్లాడుతూ... అనవసరంగా గిరిజనులపై కేసులు నమోదు చేయడం మానుకోవాలని సూచించారు. నారాయణఖేడ్ వంటి గ్రామీణప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కల్హేర్, సిర్గాపూర్ పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సంబంధం లేని వారిని సైతం పోలీసులు ఇరికిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పందిస్తూ... గిరిజన తండాల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా గంజాయి, సారా తయారీకి వ్యతిరేకంగా చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టే అంశం పరిశీలిస్తామన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఆర్ రోడ్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే పనులు చేపడతామని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకంలో బ్యాంకుల్లో జీరో అకౌంట్ ఉంటే ప్రోత్సాహక డబ్బులు రావడం లేదని సభ్యుడు వెంకటేశ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ జీరో అకౌంట్లను సేవింగ్ అకౌంట్లుగా మారుస్తున్నామని చెప్పారు. పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ : ఎస్పీ సుమతి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, ఇతర కేసుల విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎస్పీ సుమతి తెలిపారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడంతోపాటు చట్టపరిధిలో విచారణ, పారదర్శకంగా దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు శాఖ తరఫున ఎస్సీ, ఎస్టీలకు చట్ట పరిధిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ దయానంద్, ఆర్డీఓలు, డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పోడు రైతులకు అండగా ఉంటాం..
హన్మకొండ అర్బన్ : పోడు రైతులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పోడు రైతు సమస్యలపై సీపీఐ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు. పోడు రైతుల సమస్యలపై ఈనెల 30న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర నాయకులు పి.వెంకట్‌రెడ్డి, తమ్మెర విశ్వేశ్వరయ్య, సీహెచ్.రాజారెడ్డి, విజయసారథి, లింగారెడ్డి, రవి, సదానందం, బి.అజయ్, రమేష్, రవీందర్, కరుణాకర్, రవి పాల్గొన్నారు. -
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 వార్షిక సంవత్సర రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లతో రూపుదిద్దుకుంది. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణ మంజూరులో వేగం పెంచి లబ్ధిదారుల రుణ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని కోరారు. రూ.350.64 కోట్ల పెరుగుదల రుణ మంజూరులో బ్యాంకర్లు ఈ ఏడాది భారీ ప్రణాళికనే తయారు చేశారు. గతేడాది రూ.4,558.95 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించగా.. తాజాగా ఈ ప్రణాళిక రూ.4,909.59 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రూ.350.64 కోట్లు అదనంగా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కీలకమైన పంటరుణాల కింద రూ.730 కోట్లు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించారు. లింకేజీ రుణాల కింద రూ.281.51 కోట్లు, వ్యవసాయ యాంత్రికీకరణకు రూ.111.20 కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. పాడిపరిశ్రమకు రూ.130.75 కోట్లు, పౌల్ట్రీ రంగానికి రూ.116.45 కోట్లు, గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.50.06 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి గాను రూ.791.25 కోట్లు నిర్దేశించారు. ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, వార్షిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను సాధిస్తామని బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీహెచ్ డీజీఎం శేషసాయి, ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు, ఆర్బీఐ ఎల్డీఓ వెంకటేష్, ఎస్బీహెచ్ అగ్రీ డీజీఎం అనూరాధ, ఎల్డీఎం సుబ్రమణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
♦ వైగో ప్రకటనపై అప్రమత్తం ♦ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు ♦ రోజంతా పోలీసుల పడిగాపులు ♦ కలెక్టరేట్ వద్ద మోహరింపు సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో తమిళ కూలీలను పోలీసులు కాల్చివేసినందుకు నిరసనగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామంటూ తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు సరిహద్దులతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని పళ్లిపట్టు, కాలువపల్లె, పలమనేరు, వి.కోట, నాగలాపురం, పుత్తూరు, గుడిపాల, యాదమరి తదితర సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి తనిఖీలు నిర్వహించారు. వైగో ఏ క్షణంలోనైనా కలెక్టరేట్‌కు చేరుకుంటారనే ప్రచారంతో అక్కడి పోలీసులు టెన్షన్‌తో గడిపారు. కుప్పం నియోజకవర్గం గాంధీనగర్ సరిహద్దు వద్ద విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా, ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దులో ఉన్న తమిళ పోలీసులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పళ్లిపట్టు చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. పలమనేరు కాలువపల్లె సరిహద్దు, వి.కోట పేర్నంబట్టు సరిహద్దు, సత్యవేడు నాగలాపురం, సురుటి పల్లె చెక్‌పోస్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని రహదారుల్లో పెద్ద ఎత్తున పోలీసులు మకాం వేశారు. తమిళ ఆందోళనకారులు సరిహద్దు దాటకుండా భారీ బందోబస్తు నిర్వహించి తనిఖీలు చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తమిళనాడులోని వేలూరులో వైగోను పోలీసులు అరెస్టు చేశారనే వార్తతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా సరిహద్దుతో పాటు కలెక్టరేట్ వద్ద సాయంత్రం వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రకూలీలను జిల్లాకు చెందిన టాస్క్ఫోర్సు పోలీసులు ఈ నెల 7న తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. పోలీసులు ఏకపక్షంగా కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారంటూ తమిళనాడు ఎండీఎంకే నేత వై.గోపాలస్వామి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడుకు పంపి వైగో కదలికలపై నిఘా పెట్టారు. వైగో తమిళనాడు పరిధిలో వేలూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 500 మందితో అక్కడే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వైగో చిత్తూరుకు చేరుకోనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ తరువాత వైగోను వేలూరులోనే పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకుని ఇక్కడ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరిహద్దులతో పాటు చిత్తూరు కలెక్టరేట్ వద్ద వందలాది పోలీసులు సాయంత్రం 6 గంటల వరకు బందోబస్తు కొనసాగించారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కలెక్టరేట్ సోమవారం ఉదయం ఆందోళనలతో అట్టుడికిపోయింది. భూ, మైనింగ్ మాఫియాకు కొమ్ముకాస్తున్న నర్సీపట్నం ఆర్డీవోను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని ఏపీ గిరిజన సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించకుండా వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) నేతలు, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని నిలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం నేతల తీరుపై వైఎస్సార్సీపీ, సీపీఎం మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు. హిందూపురంలో టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కౌన్సిల్ సమావేశాల్లో తమపై దాడులకు దిగుతున్నారని, పర్సెంటేజీల పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. -
తేలిన లెక్క
లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ మొత్తం విస్తీర్ణం 6,575 చదరపు గజాలు. దాంట్లో భవన సముదాయాలు 4,895 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. 40ఏళ్ల క్రితం గోషామహల్లో నిర్మించిన సరూర్‌నగర్ ఆర్డీఓ ఆఫీస్ 10,890 చదరపు అడుగుల్లో ఉంది. భవనం కాకుండా సుమారు 3వేల గజాల ఖాళీ స్థలం ఉంది. ఖైరతాబాద్‌లోని 2.425 ఎకరాల్లో జెడ్పీ ప్రాంగణం ఉండగా, ఇది ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఉంది. బుద్వేల్లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం 1500 గజాల్లో ఉంది. కొలిక్కివచ్చిన సర్కారీ స్థిరాస్తుల వివరాలు శాఖాధిపతుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఆగమేఘాల మీద కొలతలు,బిల్టప్ ఏరియా అంచనాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ స్థిరాస్తుల లెక్క కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని సర్కారీ భవంతుల సమస్త సమాచారాన్ని బుధవారంలోపు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద ప్రభుత్వ భవనాలను కొలిచి సమగ్ర వివరాలను సేకరించిన యంత్రాంగం.. ఆయా శాఖాధిపతుల ద్వారా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. భవన విస్తీర్ణం, సర్వే నంబర్, లీజులు, ఆక్రమణలు, కోర్టు కేసులు, ప్రధాన మార్గానికి ఎంత దూరం? తదితర అంశాలపై రూపొందించిన నమూనాకు అనుగుణంగా వివరాలను పొందుపరిచింది. జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగానే సర్కారు ఆఫీసుల బిల్టప్ ఏరియా లెక్క తేల్చిన ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలువైన ప్రదేశాల్లో కొలువుదీరిన కార్యాలయాల స్థలాలను విక్రయించడం ద్వారా ఖజానా నింపుకొనే యోచన కూడా చేస్తున్న ప్రభుత్వం.. సమస్త సమాచారాన్ని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. -
‘మీకోసం’
ప్రజావాణి ఇక ‘మీ కోసం’ పేరుమారుతున్నా ప్రయోజనం దక్కేనా పేరుకుపోతున్న అర్జీలు పట్టించుకునే వారు లేరు.. విశాఖపట్నం: తీరు మారదు.. కానీ తరచూ పేరు మారుతుంది. వేలల్లో కాదు..లక్షల్లో పేరుకుపోతున్న అర్జీలను పట్టించుకునే నాథుడు కన్పించరు. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సామాన్య, నిరుపేదలు అల్లాడుతూనే ఉన్నారు. మొక్కుబడిగా సాగుతున్న గ్రీవెన్స్‌సెల్ వచ్చే వారం నుంచి ‘మీ కోసం’గా పేరు మార్చుకోబోతుంది. రెండు నెలలు కూడా కాలేదు ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మార్చి. ఇప్పుడు ‘మీ కోసం’ అంటూ ‘గ్రీవెన్స్ సెల్ ’ కొత్తఅవతారమెత్తుతోంది. 2009లో శ్రీకారం చుట్టిన గ్రీవెన్స్‌సెల్ ప్రతీ సోమవారం డివిజన్ స్థాయిలో ఆర్డీఒ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పలుమార్లు తిరిగినా పరిష్కారానికి నోచు కోని సమస్యలను డివిజనల్ స్థాయిలో జరిగే గ్రీవెన్స్‌లో ఇస్తారు. అప్పటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో అంద జేస్తుంటారు. కలెక్టర్ లేదా జేసీ వారిద్దరూ లేకపోతే డీఆర్‌ఒ ఎవరో ఒకరూ వీటిని పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులకు ఎండార్స్ చేస్తుంటారు. జిల్లా అధికారులు మళ్లీ మండల స్థాయి అధికారులకు పంపిస్తుంటారు. కొన్ని సమస్యలనైతే నేరుగా మండలాలకే ఎండార్స్ చేస్తూ అర్జీదారులను అక్కడకే వెళ్లి మండల స్థాయి అకారులను కలుసుకోమంటూ హితవు పలుకుతుంటారు. ఇలా అర్జీలు ఎక్కడ నుంచి వస్తాయో అక్కడకే చేరుతుంటాయి. అయినా పరిష్కారానికి నోచుకోవు. ఆన్లైన్లో మాత్రం పరిష్కార మైనట్టుగా కన్పిస్తుంటాయి. ఇదీ ఇప్పటి వరకు గ్రీవె న్స్ఉరఫ్ ప్రజావాణితీరు. పరిష్కారమయ్యేవి 70 శాతం లోపే కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీల్లో 70శాతం వరకు పరిష్కారానికి నోచుకుంటున్నా, డివిజన్ స్థాయిలో 50 శాతానికి మించడం లేదంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించాల్సిన మండల, గ్రామ స్థాయి అధికారుల వైఖరే కారణమని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు 55,410 అర్జీలు రాగా, 45,258 పరిష్కారమైనట్టుగా చెబుతున్నారు. మరో 9,348అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో నిర్ణీత గడువు ముగిసినా పరిష్కారానికి నోచుకోని అర్జీలు మరో 8412 వరకు ఉన్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలుండవు. డివిజన్ స్థాయిలో వినతుల సంఖ్య లక్షకుపైగానే ఉంటాయంటున్నారు. వీటిలో పరిష్కారమైనవి 50 శాతమే. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం మావి కావంటే మావి కావంటూ సరిహద్దు తగాదాల్లో బుట్టదాఖలు చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. జన్మభూమి ఫిర్యాదులకు దిక్కులేదు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా అక్షరాలా 2,64,829 వచ్చాయి. వీటిలో గ్రామీణప్రాంతాల్లో 1,93,863 రాగా, పట్టణ ప్రాంతాల్లో 70,966 ఉన్నాయి. అత్యధికంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం 76,545, రేషన్ కార్డుల కోసం 64,645, పింఛన్ల కోసం 45,974, రెవెన్యూ సంబంధిత సమస్యలపై 30,168 పిటీషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క పిటీషన్‌ను పరిష్కరించిన పాపాన పోలేదు. మండల స్థాయిలోనూ ‘మీ కోసం’ గ్రీవెన్స్‌సెల్ వచ్చేవారం నుంచి ‘మీ కోసం’గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటి వరకు డివిజనల్, జిల్లా స్థాయిల్లో జరిగే ఈ గ్రీవెన్స్‌ను ఇక నుంచి శాఖల వారీగానే కాకుండా మండల స్థాయిలో కూడా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి రెండవవారం నుంచి అధికారికంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఆసుపత్రుల రూపరేఖలు మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటెల రాజేందర్ గురువారం కలెక్టరేట్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై వైద్య, విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుప్రసాద్కుమారి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు, స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటెల అడిగి తెలుసుకోవడంతోపాటు అధికారులకు పలు ఆదేశాలు, సూచనలిచ్చారు. కలెక్టర్ సైతం పీహెచ్‌సీల పనితీరు, మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన చర్యలతోపాటు జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అధికారులను ఉద్ధేశించి మంత్రి ఏమన్నారంటే.. * స్వైన్‌ఫ్లూపై వ్యాధి నిర్మూలన, అవగాహనపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించండి. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతోపాటు రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి. * ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్మూలనకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచండి. బాధితులకు ప్రత్యేక గదులను కేటాయించండి. డాక్టర్లు సెలవు పెట్టకుండా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోండి. టైంపాస్‌కు వచ్చే డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేనిపక్షంలో మీరే వారిని గుర్తించి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోండి. * ప్రతి ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు, నైట్వాచ్మెన్లను నియమించాలి. బోరు మొదలు, కరెంట్, టాయిలెట్, బాత్రూంసహా కనీస సదుపాయాలు కల్పించండి. డ్రైనేజీకి, చెత్తకుప్పలకు, పందులకు, మందుబాబులకు నిలయంగా మార్చకండి. బిల్డింగ్ మరమ్మతులు, అదనపు బ్లాక్‌లు నిర్మించడంతోపాటు ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌కు అవసరమైన ప్రతిపాదనలు పంపండి. * ప్రస్తుత అవసరాలకు తగినట్లు పీహెచ్‌సీల డిజైన్లను రూపొందించండి. ఆసుపత్రిల్లో అవసరమైన యంత్రాలు, భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయల కల్పనకు డబ్బు కొదవలేనేలేదు. ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తా. * అన్ని సదుపాయాలున్నా డాక్టర్లు, సిబ్బంది పనితీరు సరిగా ఉండటం లేదు. గతంలో మాదిరిగా రొటీన్‌గా పనిచేస్తే లాభం లేదు. ఆసుపత్రుల్లోనే ఉండాలి. అక్కడే తింటూ రోగులతోపాటే ఉండాలి. గతంలో కంటే సర్కారీ ఆసుపత్రుల్లో మార్పు వచ్చిందనే నమ్మకం ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మీదే. * ఆసుపత్రుల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రి అభివృద్ధి నిధులను వాడుకోండి. ఈ విషయంలో రూల్స్ ప్రకారం కాకుండా ప్రజల అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. * ఆసుపత్రుల అభివృద్ధి, సదుపాయల కల్పనకు ఎమ్మెల్యేల, ఎంపీల నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్థాయిలోనే జీవోలిచ్చేలా చర్యలు తీసుకుంటాం. * కాంట్రాక్టు కార్మికులకు ఆరేడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా? ప్రతినెలా వేతనాలిచ్చేలా ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చినా ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్లకు నెలనెలా వేతనాలు ఇవ్వాల్సిందే. * కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ సైతం జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, కావాల్సిన పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు వంటి అంశాలపై వైద్యాధికారులను అడిగి నోట్ చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూపై రూపొందించిన పోస్టర్లను అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో అంటించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై ఈనెల 28న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. * పాఠశాలలు ప్రారంభమైన వెంటనే స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిరోజు ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు వివరించాలని జిల్లా డీఈఓ లింగయ్యను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లన్నింటిలోనూ ఈ వ్యాధిపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. * జిల్లా వైద్యాధికారి డాక్టర్ అలీం మాట్లాడూతూ ఇకపై ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రిసెప్షన్ కౌంట ర్ను ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. మీరు మారరా? * ల్యాబ్‌టెక్నీషియన్ లేడని * సిటీస్కాన్‌ను పక్కనపడేస్తారా? * డీసీహెచ్ఎస్ అధికారిపై ఈటెల ఆగ్రహం * జమ్మికుంట ఆసుపత్రి నిర్వహణపైనా అసంతృప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.25 లక్షలతో సిటీస్కాన్‌ను ఏర్పాటు చేసినా ల్యాబ్‌టెక్నీషియన్ లేడనే కారణంతో పక్కనపెట్టడంపై మంత్రి ఈటెల రాజేందర్ డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు ల్యాబ్టెక్నీషియనే దొరకకపోతే నాకు చెప్పండి. నేను ఒక్కరిని కాదు, ఎంతమందినైనా పంపిస్తా అంటూ మండిపడ్డారు. ల్యాబ్టెక్నీషియన్ను నియమించుకోవాలని మూడు నెలల క్రితమే చెప్పినా ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించగా.. డాక్టర్ భోజా పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో మళ్లీ ఈటెల స్పందిస్తూ ఁఅసలు మీతో వచ్చిన తిప్పలే ఇవి? ఇన్ని చెబుతున్నా మీరు మారరా? అందుకేనేమో తెలంగాణలో అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉన్న కరీంనగర్ జిల్లా డెంగీలోనూ ముందుంది* అంటూ అసహనం వ్యక్తం చేశారు. యంత్రాలు ఎక్కడెక్కడ పనిచేయడం లేదు? కారణాలేమిటి? అనే వివరాలు వెంటనే పంపడంతోపాటు అవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఎంహెచ్లను ఆదేశించారు. జమ్మికుంట ఆసుపత్రిలో అన్ని సదుపాయాలున్నాయంటూ స్థానిక వైద్యాధికారి బదులివ్వగా జిల్లా ప్రధాన ఆసుపత్రి తరువాత ఎక్కువమంది రోగులొచ్చే ఆసుపత్రి అది. ఇప్పటికి 10 సార్లు రివ్యూ చేసినా ఎందుకో సక్రమంగా నడవడం లేదు. చాలా బాధాకరం. ఫిబ్రవరి నాటికి జమ్మికుంట ఆసుపత్రి రూపురేఖలు మారాలి అని ఆదేశించారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే జమ్మికుంట ఆసుపత్రిని సందర్శించడంతోపాటు అవసరమైన సదుపాయాల కల్పనకు డబ్బులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. -
వికలాంగ సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు
సంగారెడ్డి అర్బన్: చెవిటి, మూగనైన తనకు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రి అధికారులు ధ్రువపత్రం ఇచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని తనకు పింఛన్ మంజూరు చేయాలని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన దండు కుమారస్వామి కోరారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు అర్జీలను అందజేశారు. వికలాంగురాలైన తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని గత 15 సంవత్సరాలుగా సొంత ఇంటి కొరకై పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇల్లు మంజూరు చేయాలని రామచంద్రాపురానికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జేసీ మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామం బామన్ల కుంట చెరువును చెరువును తప్పుడు సేల్‌డీడ్‌తో 32 మంది వ్యక్తులు తప్పుడు హద్దులు చూపించి అక్రమించుకున్నారని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని గొల్ల నిమ్మలయ్య జొన్నాడ క్రిష్టా యాదవ్, శివరాజ్ ఫిర్యాదు చేశారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన గౌటాన్ భూమిలో దళితులైన తమకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వాలని గ్రామానికి చెందిన నర్సమ్మ, ఎల్లమ్మ, యశోద, మంజుల తదితరులు కోరారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల అవగాహన వాహనానికి జేసీ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్ పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా ముందుకు..
కలెక్టర్ వాకాటి కరుణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తానని కలెక్టర్ కరుణ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆమె కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రజలకు అందేలా తన వంతు పాటుపడతానన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కరుణకు జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేంద్రకరణ్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ఉషారాణి, తహసీల్దార్ల సంఘం జిల్లా నాయకులు, డీఆర్డీఏ పీడీ రాము, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అధికారులను కలెక్టర్ కరుణ పేరుపేరునా పలకరించారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నవంటూ తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆమె తల్లి ప్రమీల. అక్కయ్యలు అప్రాచిత, శిరీష, తమ్ము డు ఛైతన్య ఉన్నారు. కాగా, ఐకేపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2015 క్యాలెండర్‌ను కలెక్టర్ కరుణ ఆవిష్కరించారు. నాయకులు అనిల్, రవి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆర్డీఓలు వెంకటమాధవరావు, మహేందర్‌జీ, వెంకట్‌రెడ్డి , భాస్కర్‌రావు, డీఈఓ చంద్రమోహన్, ఆర్వీఎం అధికారులు, వీఆర్వోల సంక్షేమ సంఘం నాయకులు విజయరామారావు, హేమానాయక్, సింగ్‌లాల్, జంపయ్య, రవీందర్, ట్రెస్సా నాయకులు సత్యనారాయణ, విశ్వనారాయణ, రాజ్‌కుమార్, శ్రీకాంత్ తదతరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కలెక్టరేట్లో బాద్యతలు స్వీకరించిన కరుణను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీపీఎం నాయకులు నాగయ్య, శ్రీనివాస్, దళిత రత్న బొమ్మల కట్టయ్య, ఎన్జీఓ నాయకులు, అధికారులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కలెక్టర్‌కు జెడ్పీ చైర్పర్సన్ శుభాకాంక్షలు హన్మకొండ : కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వాకాటి కరుణను జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు కలిశారు. కలెక్టరేట్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
* విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన * సర్పంచ్ అరెస్ట్‌కు డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : ఆహారభద్రత కార్డుల జాబితా విషయంలో భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడికి పాల్పడిన మండల పరిధిలోని నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా మెయిన్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రేస) జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భీమిని తహశీల్దార్ దేవానంద్‌పై దాడి చేసిన నాయినిపేట సర్పంచ్ అశోక్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని కలెక్టర్ జగన్మోహన్ చెప్పారని, కానీ ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్నారు. దీనికి నిరసనగా సోమవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టినట్లు తెలిపారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సరికాదన్నారు. తహశీల్దార్‌పై దాడిని అన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ను గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు రాజేశ్వర్, సుభాష్‌చందర్, చంద్రశేఖర్, అతికొద్దీన్, సంజయ్‌కుమార్, విలాస్, సదానందం, శ్రీకాంత్, షీల, సుజాత, జ్యోతి, ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘాలు, నాయకుల మద్దతు తహశీల్దార్‌పై దాడికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు వివిధ సంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా నాయకుడు పాయల శంకర్ మద్దతు తెలిపారు. వీరితో పాటు గజిటెడ్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, నాయకులు గుణవంత్‌రావు, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు రాజసమ్మయ్య, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నాయకుడు సుధాకర్‌రెడ్డి తదితరలు మద్దతు తెలిపారు. కాగా జైనథ్ తహశీల్దార్‌తో, రెవెన్యూ ఉద్యోగులంతా పెన్‌డౌన్ నిర్వహించారు. సర్పంచ్ అరెస్ట్ బెల్లంపల్లి : భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై దాడికి పాల్పడిన నాయకునిపేట సర్పంచ్ ఓడేటి అశోక్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న తహశీల్దార్‌ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
కదం తొక్కిన ఐకేపీ వీఓఏలు
కలెక్టరేట్ దద్దరిల్లింది.. మూడు గంటలపాటు అట్టుడికింది.. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం వీఓఏలు కలెక్టరేట్‌ను ముట్టడించారు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.. ధర్నాతో కలెక్టర్ కార్యాలయం ప్రధానగేటు, సుబేదారికి వచ్చే రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రహదారిని పోలీసులు మూసివేశారు. సుబేదారి : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) వీఓఎలు మం గళవారం కదం తొక్కారు. వీఓఏల సంఘం ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మూడు గంటల వరకు ప్రధాన గేట్లను దిగ్బంధించారు. మహిళలను విస్మరిస్తే.. మహిళలు, మహిళా సంఘాలను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఐకేపీ సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాకు హాజరైన వారిని ఉద్దేశించి తెలంగాణ ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షురా లు మారపల్లి మాధవి మాట్లాడుతూ 18నెలలుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లకు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఇప్పటికైనా వీఓఏల ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.5వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీలకు 12నెలల జీరో శాతం వడ్డీ ఇవ్వాలని, అభయ హస్తం పింఛన్లు కొనసాగించాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన అంగన్వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మహిళా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లేదా పీడీ రావాలి కలెక్టర్ లేదా ఐకేపీ పీడీ ఎవరో ఒకరు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వీఓఏల సంఘం బాధ్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై సుబేదారి పోలీసులు ప లుమార్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. అయితే, సమస్య తమ పరిధిలో లేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని జిల్లా అధికారులతో మాట్లాడిన పోలీసులు చెప్పడంతో చివరకు వీఓఏలు ధర్నా విరమించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, ఉపాధ్యక్షుడు రొయ్యల రాజు, నాయకులు టి.పులా, విద్యాసాగర్, డి.తిరుమల్‌రెడ్డి, ఎం.సాంబయ్య, పి.శంకర్, రమేష్, యాదానాయక్, శ్రీనివాస్, కుమార్, కె.మాధవి, రవీందర్, యువరాజు, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాతో దారుల మూసివేత ఐకేపీ వీఓఏల ధర్నాలో కలెక్టరేట్ ప్రధాన గేట్లతో పాటు సుబేదారికి వచ్చి రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గరి రోడ్లను పోలీసులు మూసివేయించారు. బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలను నియంత్రించారు. ఎక్సైజ్ కా లనీ రోడ్డు నుంచి కాజీపేటకు వెళ్లే వాహనాలు, ఫాతి మానగర్ క్రాస్ రోడ్డు నుంచి హన్మకొండకు వెళ్లే వాహనాలను మళ్లించారు. సుబేదారి ఎస్సైలు రాంప్రసాద్, సుబ్బారెడ్డి బందోబస్తు పర్యవేక్షంచారు. -
అవసరమైతే 20 గంటలు పనిచేస్తా
జేసీ సత్యనారాయణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ రాంనగర్ : బంగారు తెలంగాణ కోసం అవసరమైతే 20 గంటలు పనిచేసేందుకు కూడా వెనుకాడబోనని నూతన జాయింట్ కలెక్టర్‌గా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జేసీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వంద శాతం విజయవంతం అయ్యే విధంగా పని చేస్తానని తెలిపారు. ఉద్యోగులందరి సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లానుంచి కొన్ని కీలక పథకాలు మొదలు పెడుతుందని, వాటిని సజావుగా పూర్తి చేసేందుకు తన శక్తి మేరకు పని చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం డీఆర్ఓ నిరంజన్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, నల్లగొండ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు బోకేలు అందజేసి అభినందనలు తెలిపారు. -
అమ్మాయిల ధర్మాగ్రహం
ప్రగతినగర్: ‘‘అమ్మాయిలూ అధైర్య పడవద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’’ అని అదనపు జాయింట్ కలెక్టర్ పి.శేషాద్రి విద్యార్థినులకు సూచించారు. ఆధునిక సమాజంలోనూ మహిళలపై ఆరాచాకాలు కొనసాగడం దారుణమన్నారు. నగరంలోని యాదగిరిబాగ్‌లో శనివారం తెల్లవారుజామున భార్యను అతి కిరాతకంగా హత్యచేసి ఆనందంతో తాండవమాడిన కిరాతకుడిని ఉరి తీయాలంటూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. అంతకుముందు నగరంలోని కంఠేశ్వర్ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు సమీపంలోనే వీరిని పోలీసులు నిలువరించడంతో, కలెక్టర్ బయటకురావాలని నినాదాలు చేశారు. అదనపు జేసీ శేషాద్రి, డీఆర్ఓ మనోహర్, ఐసీడిఎస్ పీడీ రాములు బయటకు వచ్చి విద్యార్థినులను సముదాయించారు. యాదగిరిబాగ్‌లో జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించమని ఎస్పీని కో రామన్నారు. విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా శిక్షణ పొందాల న్నారు. మహిళలపై దాడులను నివారించేందుకు అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తామన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలలలో మహిళల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, లెక్చరర్లు వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల నిరసనలతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ సంఘాల కార్మికుల గర్జనతో కలెక్టరేట్ అట్టుడికిపోయింది. ప్రభుత్వ శాఖల్లో వివిధ స్కీమ్‌ల కింద విధులు నిర్వర్తిస్తున్న వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పలువుర్ని పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయి అరెస్టు చేయడంతో టూటౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదుట రోడ్డుపైనే బైఠాయించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. విద్యుత్ రంగంలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండ్లతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగిపోయింది. ఒంగోలు టౌన్: ప్రభుత్వ శాఖల్లో వివిధ స్కీమ్‌ల కింద విధులు నిర్వర్తిస్తున్న వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు రెండు గేట్ల ముందు బైఠాయించారు. కలెక్టరేట్ లోపలికి, బయటకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముట్టడికి దిగిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో పోలీసులు కొంతమేర సంయమనం పాటించారు. దాదాపు గంట సేపు ముట్టడి జరగడం, అదే సమయంలో ఉద్యోగస్తులు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భం గా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట కూడా చోటుచేసుకుంది. మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకునేటప్పుడు వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త బుల్లెమ్మాయి స్పృహ కోల్పోయింది. దాంతో పోలీసులు హుటాహుటిన ఆమెను రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు ల చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ నుంచి టూటౌన్ పోలీసు స్టేషన్ వరకు స్కీమ్ వర్కర్లు ప్రదర్శనగా బయలుదేరి అక్కడ రోడ్డుపైనే బైఠాయించారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో స్కీమ్ వర్కర్లు అక్కడ నుంచి వెనుదిరిగారు. ప్రభుత్వ తీరు దుర్మార్గం: అంతకు ముందు కలెక్టరేట్ ముట్టడిని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లపై తెలుగుదేశం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వేలాది మందిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నపలంగా వీధులపాలు చేశారన్నారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని కోరితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని, కేసులకు తాము భయపడేది లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగి ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేస్తామని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. స్కీమ్ వర్కర్ల కడుపు కొడుతున్నారు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 20 వేల మంది స్కీమ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు స్కీమ్ వర్కర్ల కడుపు కొడుతున్నారని విమర్శించారు. పర్చూరు శాసనసభ్యుడు ఎనిమిది మంది అంగన్వాడీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. ఐకేపీ యానిమేటర్లు సమ్మెకు దిగితే వెంటనే విధుల్లోకి చేరకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోజ, ఐకేపీ యానిమేటర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రశాంతి తదితరులు ప్రసంగించారు. -
70 ఏళ్లు దాటినా పింఛన్ ఇస్తలేరు!
సంగారెడ్డి అర్బన్: తనకు 70 సంవత్సరాలు దాటినా పెన్షన్ మంజూరు కావడం లేదని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా పెన్షన్ మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన మునగాల మల్లయ్య ఏజేసీ మూర్తికి ఫిర్యాదు చేశారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులను అందజేశారు. తన డబ్బుల సంచీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని రామచంద్రపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన సుందర్రాజు విజ్ఞప్తి చేశారు. 8 నెలలుగా తనకు రేషన్ సరుకులు అందడం లేదని, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన అంతమ్మ విజ్ఞప్తి చేసింది. తనకు రెండు నెలలుగా పెన్షన్ అందడం లేదని, కొత్త జాబితాలో కూడా పేరు లేదని అధికారులు చెబుతున్నారని దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు కాలేదని,పెన్షన్‌తో పాటు కొత్త రేషన్ కార్డు ఇప్పించాలని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్ కోరారు. తాను కళాకారుడినని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్‌కు చెందిన టేకుమట్ల బసవయ్య విజ్ఞప్తి చేశారు. తనకు రెండు నెలలుగా పింఛను అందడం లేదని అదే గ్రామానికి చెందిన టేకుమట్ల సాయిలు పేర్కొన్నారు. ఈ - పంచాయతీ కంప్యూటర్ అపరేటర్‌గా 8 నెలల క్రితం హైదరాబాద్‌లోని కార్వీ సంస్థలో శిక్షణ పూర్తిచేసినా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ విషయమై అధికారులను కలిస్తే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, నిరుద్యోగులమైన తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాలని ఆపరేటర్లు రవీందర్, రామస్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్ , వెంకటేష్, దామోదర్ కోరారు. కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్.. నో రెస్పాన్స్...!
మచిలీపట్నం : ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ప్రహసనంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణికి వచ్చే అర్జీదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రజావాణికి వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజావాణికి కలెక్టర్ హాజరైతేనే జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. లేకుంటే కిందిస్థాయి అధికారులను పంపుతున్నారు. దీర్ఘకాల సమస్యలు వెనక్కే... దీర్ఘకాల సమస్యలపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చేందుకు వచ్చేవారిని ముందుగానే గుర్తించి లోపలకు రాకుండా వెనక్కి పంపే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 12వ తేదీల మధ్య ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని జన్మభూమి, హుద్‌హుద్ తుపాను తదితర కారణాలను చూపి వాయిదా వేశారు. కిందిస్థాయికి బదిలీ... గత ఆరునెలల్లో ప్రజావాణికి 5,385 అర్జీలు రాగా వాటిలో 2,228 పరిష్కరించినట్లు చూపారు. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించడంలేదని అర్జీదారులు వచ్చి ఇక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యలను కిందిస్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మండలస్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించినట్లు ప్రజావాణి ఆన్లైన్లో చూపుతున్నారు. మళ్లీ ఇదే సమస్యపై అర్జీ ఇస్తే తిరిగి అదేసమాధానం ఆన్లైన్లో ఉంచడం గమనార్హం. ఇది చక్రంలా తిరుగుతూనే ఉంది. సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. 5,385 దరఖాస్తులో పరిష్కరించినవిపోను 30 అర్జీలకు మధ్యంతర సమాచారం ఇచ్చామని, 64 తిరస్కరించామని 2,979 పరిశీలనలో ఉన్నాయని చూపారు. -
బాబు అబద్దపు హామీలను ఎండగడదాం
- ప్రజలకు అండగా నిలబడదాం - నేడు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ మహాధర్నా - తరలిరానున్న పార్టీశ్రేణులు,రైతులు, మహిళలు సాక్షి, చిత్తూరు: పింఛన్లు.. రేషన్ కార్డులు తొలగించారు... రైతు, డ్వాక్రా రుణమాఫీలు లేవు... బాబు వస్తే.. జాబు అనే నినాదం గంగలో కలిసింది... నిరుద్యోగ భృతిలేదు.. ఆరు నెలల కాలంలో అన్ని వర్గాలవారిని వంచించిన చంద్రబాబు అబద్దపు హామీలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సన్నద్ధమయింది. అధికారం కోసం ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు గుప్పించిన బాబు ఆ తరువాత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించక, ప్రజలను వంచించారు. ఈ నేపథ్యంలో బాబు వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మద్దతుగా శుక్రవారం ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు అబద్దపు హామీలను ఎండగడదాం-ప్రజలకు అండగా నిలబడదాం అనే నినాదంతో పార్టీ శ్రేణులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యూయి. వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, అమరనాథరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు సామాన్య కిరణ్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చంద్రమౌళితోపాటు జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున తరలిరావడానికి సిద్ధమయ్యూరు. -
హామీలు అమలు చేయండి
తెలుగుదేశం పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. చిత్తూరు(సెంట్రల్): రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు, డ్వాక్రా, అంగన్వాడీ, సహకార, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు. ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత, చేతి వృత్తులు, ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడానికి నిబంధనలతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఆ హామీలు అమలు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కుమారరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భయంకరమైన కరవు పరిస్థితులు ఉంటే కేవలం 48 మండలాలను మాత్రమే కరవు ప్రాంతంగా ప్రకటించడం దారుణం అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేవలం ఏడు మండలాలకు పరిమితం చేయడానికి యత్నించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఉపాధికి గండి పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలనే ఆలోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పింఛన్లలో కోత విధించడానికే వయోపరిమితిని తగ్గించిందన్నారు. కరువు పరిస్థితుల్లో నీటి కోసం అలమటిస్తుంటే హంద్రీ-నీవాతో సమస్య పరిష్కారం చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సహకార రంగం, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించాలన్నారు. ఆ పార్టీ చిత్తూరు డివిజన్ కార్యదర్శి చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య, నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత, జయచంద్ర తదితరులు ప్రసంగించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మహాధర్నాను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు యర్రగొండపాలెం: టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు కోరారు. ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాగ్దానం చేశారని..ఆ మోసపు మాటలు నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి ఆయన్ను గద్దెనెక్కించారన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి పూటకో మాట చెప్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా సంక్షేమ పథకాలను నీరుగార్చుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా గ్రామాల్లోని రోడ్లపై ఒక తట్ట మట్టి కూడా చల్లలేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేయకపోగా పింఛన్లు రద్దు చేయడం, రేషన్‌షాపు డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. డిసెంబర్ 5న కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాలో రాజకీయాలకు అతీతంగా రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎంపీపీలు చేదూరి విజయభాస్కర్, మాకం సుందరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బాబు మోసాలపై ప్రజాపక్షాన పోరు
- కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం - చంద్రబాబు తీరును దుయ్యబట్టేందుకే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు - వైఎస్ఆర్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి విజయనగరం మున్సిపాల్టీ/కంటోన్మెంట్: ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. జరుగుతున్న మోసాన్ని తెలియజేసేందుకు, ప్రజల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 5న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయనగరం సమీపంలోని ఆర్కే టౌన్‌పిష్‌లో గురువారం జరిగిన జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో 2.48 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. ఇందుకోసం రూ. 853 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. అలాగే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు. రాజీవ్ క్రీడా మైదానం, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించారని, 15వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేసి, 4,04,972 ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని చెప్పారు. అలాగే 20,033 ఎకరాలను నిరుపేదలకు పంచిపెట్టారన్నారు. వైఎస్ అధికారంలోకి రాకముందు 59 వేల పింఛన్లుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మొత్తాలను పెంచారన్నారు. అదనంగా 2.81లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారన్నారు. ఇన్ని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికీ, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో వైఎస్ హయాంలో ఒకే ఒక జీఓతో రుణమాఫీ వర్తింపజేస్తే, చంద్రబాబు 3.20 లక్షల మందికి 1,157 కోట్ల రుణ మాఫీకి ఎన్నో వంకలు పెడుతున్నారని ఆరోపించారు. సాధికారత సంస్థకు చంద్రబాబు రూ. 5వేల కోట్లు జమ చేశారని, ఆ సొమ్ము వడ్డీకి కూడా చాలదన్న విషయం గుర్తెరగాలన్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో 45వేల మందిని తొలగించారన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఫెర్రో అల్లాయీస్, జూట్ పరిశ్రమలు మూతపడడంతో దాదాపు 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. రెండు రూపాయలకు ఎన్టీఆర్ ఇచ్చిన బియ్యం ధరను చంద్రబాబు రెండు సార్లు పెంచితే, వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి కోటా బియ్యాన్ని కిలో రూపాయికి ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కనిపించిన వారందరికీ రుణమాఫీ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసమే తప్పుడు హామీలిచ్చారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్రంలో మోదీ ఉన్నారు, నిధులు తెచ్చి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎందుకు నిధులు అడగడం లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం విడిపోతే ప్రత్యేక ప్రతిపత్తిని ఐదేళ్ల పాటు కల్పిస్తామని కేంద్రం చెప్పినప్పుడు బీజేపీతో కలిసి ఐదు కాదు పదిలేదా పదిహేనేళ్లు కావాలని కోరిన బాబు ఇప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి గూర్చి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు 87,612 కోట్ల రూపాయలు, డ్వాక్రా మహిళలకు రూ.14వేల కోట్లు మాఫీ చేస్తానన్న చంద్రబాబు అర్హత లేదని చాలా మంది రైతుల పేర్లను జాబితాల్లోంచి తొలగించారన్నారు. జపాన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు ..తుపానులు రాకుండా నివారించేందుకు అక్కడ స్టడీ చేస్తుండడాన్ని ప్రజలు హాస్యాస్పందంగా తీసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, లేకుంటే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయ న్నారు. బ్యాంకులతో నిత్యం చక్కని లావాదేవీలు నడుపుతున్న మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలతో బ్యాంకులు, మహిళల మధ్య సత్సంబంధాలు పోయాయన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ‘తప్పెట' హోరు
అనంతపురం అర్బన్: ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ హక్కుల తప్పెట కళాకారులు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి తప్పెట్ల మోతతో హోరెత్తించి నిరసన తెలిపారు. మాదిగలకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చీకటి చంద్రుడయ్యారని నాయకులు ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరు శ్రీరాములు మాట్లాడారు. మాదిగలను అన్ని విధాలుగా అదుకుంటామని, తప్పెట కళాకారుల శ్రేయస్సు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించి వారి జీవితాల్లో వెలుగునింపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, గ్రామానికి వారధులుగా పనిచేసే తప్పెట కళాకారుల అభివృద్ధిని ప్రభుత్వాలన్నీ విస్మరిస్తున్నాయన్నారు. జిల్లాలో అందరు కళాకారులకరూ ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందన్నారు. కానీ తప్పెట కళాకారులను విస్మరించిందని విచారం వ్యక్తం చేశారు. పింఛన్లు అందజేస్తామని తప్పెట కళాకారులకు హామీ ఇచ్చిన బాబు ఇప్పటి వరకూ అమలు చేయాలేదన్నారు. ప్రతి తప్పెట కళాకారునికి నెలకు రూ. 2 వేల పింఛను, 3 ఎకరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఖాజా మొహిద్దీన్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పర్వతప్ప, ఉపాధ్యక్షుడు ఎవి.రమణ, ఆంజినేయ్య, శెట్టూరు హనుమప్ప, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(రెవెన్యూ): చెరువు లోతట్టు ప్రాంతంలో పంటల సాగుకు అనుమతివ్వాలని నెల్లూరురూరల్ మండలం సౌత్‌మోపూరునకు చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా కనుపూరు కాలువ నీటితో 150 మంది పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం సాగుకు అనుమతి ఇవ్వలేదన్నారు. రైతులు జీవనోపాధి కోల్పోయామన్నారు. అధికారులు స్పందించి పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు భూములకు పట్టాలివ్వండి పదేళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మం జూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొడవలూరు మండలం పెయ్యలపాళెం సీపీఐ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుల మా ట్లాడుతూ పంటల సాగుకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. టైలర్స్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేయాలి టైలర్స్ వర్కర్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం టైలర్లను గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.కోటి ఫండ్ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు. ఫెడరేషన్‌ను పునర్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించాలి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులను ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎస్కె.రెహనాబేగం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఇస్కాన్ సిటీకి మధ్యాహ్న భోజన కాంట్రాక్టు ముగుస్తున్నందున ఆ జీఓను రద్దు చేసి పొదుపు మహిళలకే పథకం అప్పగించాలన్నారు. యూనియన్ నాయకులు విజయమ్మ, విమలమ్మ, రాములమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. హమాలీల సమస్యలు పరిష్కరించాలి ఎంఎల్ఎస్ పాయింట్లలో పని చేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ హమాలీలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెం టనే ఇవ్వాలన్నారు. ఉదయగిరి, కావలి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద హమాలీలు పని చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు. -
అరణ్య రోదన
సాక్షి ప్రతినిధి, కడప : పసి హృదయాలు గాయపడ్డాయి. అండగా నిలవాల్సిన యంత్రాంగం నిద్రమత్తు వదలడం లేదు. అన్నపానీయాలు మానేసి 8 కిలోమీటర్లు మేర రెండు పర్యాయాలు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట బైటాయింపు చేపట్టారు. చలించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పెపైచ్చు హుంకరింపులకు పాల్పడుతోంది. నాయుడు బ్రదర్స్ తెరవెనుక కనుసైగలతో ప్రత్యక్ష ఆందోళన సైతం నిష్ర్పయోజనమే అవుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో నెలకొల్పిన స్పోర్ట్స్ స్కూల్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ మెరుగైన ఆటలతోపాటు విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు బహిర్గతమయ్యాయి. వెనువెంటనే ఆందోళనలు సైతం ఉత్పన్నమయ్యాయి. దీంతో పరిశ్రమల జీఎం గోపాల్, డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు నేతృత్వంలో ద్విసభ్య కమిటీని విచారణకు ఆదేశించారు. ఆ క మిటీ ఆరోపణలు మినహా ఆధారాలు లేవని తేల్చింది. సూపర్వైజర్లపై ఆగ్రహం కాస్మోటిక్ ఛార్జీలు అందించకుండా నెలకు సుమారు రూ.60వేలు భోంచేస్తున్నారని ఇరువురు సూపర్వైజర్ల మీద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ట్రాక్షూ ఇవ్వకుండా వేధిస్తుండటం, విద్యార్థులకు వచ్చిన పథకాలను స్వాహా చేస్తుడటంలాంటి చర్యలతో విద్యార్థులు విసిగిపోయినట్లు సమాచారం. ప్రభుత్వమే విద్యార్థులకు ఇన్సూరెన్సు చేయాల్సి ఉంది. అలా చేయకపోగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.1200 వసూలు చేసి ఆ మొత్తంతో కూడా ఇన్సూరెన్సు చేయకుండా నొక్కేసిన ఘనపాటిలుగా ఆ ఇరువురు సూపర్వైజర్లు నిలుస్తున్నారు. ఇన్సూరెన్సు వ్యవహారం ఁసాక్షి* బహిర్గతం చేయడంతో విద్యార్థుల నుంచి రాబట్టిన సొమ్ము రూ.1.84 లక్షలు సూపర్వైజర్ల నుంచి రికవరీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని నియంత్రించాల్సిన యంత్రాంగం ఉపేక్షిస్తోంది. ఇందుకు తెరవెనుక జిల్లాలోని నాయుడు బ్రదర్స్ కారణంగా తెలుస్తోంది. విద్యార్థులపై ఎదురుదాడి సబబేనా? స్పోర్ట్సు స్కూల్ విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపాల్సిన యంత్రాంగం వారిపైనే ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. డీఆర్వో సులోచన, జాయింట్ కలెక్టర్ రామారావు విద్యార్థులకు హామీ ఇచ్చి, ఆచరణలో చర్యలకు వెనుకంజ వేశారు. దీంతో మరోమారు విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రత్యక్ష ఆందోళన చేశారు. ఇవేవీ గ్ర హించకుండా విద్యార్థులచే ఎవరు చేయిస్తున్నారో తెలుసు అనడం ఎంతవరకూ సమంజసమని పలువురు నిలదీస్తున్నారు. వాస్తవానికి విద్యార్థుల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన టీఎన్ఎస్ఎఫ్ కూడా మద్దతు పలికింది. బాధ్యతల నుంచి తప్పుకుంటున్న స్పెషల్ ఆఫీసర్ స్పోర్ట్సు స్కూల్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు తన రాజీనామాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ధ్రువీకరించేందుకు డిప్యూటీ డీఈఓ ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారు. కాగా స్పెషల్ ఆఫీసర్‌గా డీఎస్డీఓ బాషామోహిద్ధీన్ను నియమించనున్నట్లు సమాచారం. అయితే స్పోర్ట్సుస్కూల్లో ఇద్దరు టీచర్లును తప్పించే లా చర్యలు తీసుకుంటేనే బాధ్యతలు అప్పగిస్తామనే మెలిక పెట్టినట్లు సమాచారం. ఆ మేరకు బాధ్యతలు తీసుకునేందుకు డీఎస్డీఓ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. -
కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట
వీవోఏల మహాధర్నాలో భాగంగా శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోతున్న మహిళా ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఒక మహిళ గాయపడింది. ఈ సందర్భంగా 287 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇందిరా కాంతి పథంలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఓఏ లు-సీఎఫ్(గ్రామ ఆర్గనైజేషన్ సహాయకులు) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. రెండు రోజులుగా చేపట్టిన మహాధర్నా ముగింపు కార్యక్రమంగా ఈ ముట్టడి చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలు రెండు రోజులుగా అక్కడ వంటావార్పు నిర్వహించారు. శుక్రవారం ఉదయంనే వారు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అధికారులు, సిబ్బంది, ప్రజలు రాకపోకలు సాగించకుండా అడ్డంగా బైఠాయించారు. డీఆర్డీఏ పీడీ తనూజారాణి వచ్చి వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో మహిళలు ఒక్కసారిగా లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. బకాయి పడిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు వద్దకు తోసుకుంటూ వెళ్లడంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఎచ్చెర్ల మండలానికి చెందిన దానేటి పార్వతికి చేయి విరిగింది. కాగా నరసన్నపేటకు చెందిన రమణమ్మది బంగారం రింగుపోయింది. తోపులాట జరిగిన కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద పగిలిన గాజలు, తెగిన చెప్పులు భారీగా పడి ఉన్నాయి. ఉద్యమం ఉధృతం కావడంతో పోలీసులు మహిళలను ఆదుపులోకి తీసుకుని ఆరెస్టులు చేశారు. శ్రీకాకుళం, రూరల్, ఎచ్చెర్ల, ట్రాఫిక్ తదితర స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి సుమారు 287 మంది వీఓఎలను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషనుకు తరలించారు. అక్కడ వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచి పెట్టారు. హామీలు మరిచారు... తొలుత ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అమ్మా ఆదుకుంటానని హామీ ఇచ్చి, గెలిచిన అనంతరం మీరు పోండి, మీ సేవలు మాకు వద్దు’ అని మొండికేస్తున్నారని ఆరోపించారు. అన్నారు. వీఓఏలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగకుండా డ్వాక్రా మహిళలంతా అడ్డుకుంటారన్నారు. వీఓఏల సంఘం అధ్యక్షురాలు ఈ సుశీల మాట్లాడుతూ వీఓఎలతో వెట్టిచాకిరీ కూడా చేయించుకుని జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. వెంటనే బకాయి వేతనాలు చె ల్లించాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ెహల్త్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పీఎఫ్ వంటి ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం తిరుపతిరావు, నాగమణి, అమ్మాజీరావు, డి గణేష్, తేజేశ్వరరావు, ఎన్వీ రమణ, 38 మండలాల నుంచి వచ్చిన మహిళలు , వై.చలపతిరావు, కె.సూరయ్య, వీవోఏల సంఘం నాయకులు జి.అసిరినాయుడు, జి.ఎర్రయ్య, దుర్గ, రమణమ్మ, పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు న్యాయమైనవే...: పీడీ వీఏల డిమాండ్లు న్యాయమైనవేనని ఈ సందర్భంగా డీఆర్డీఓ పీడీ ఎస్ తనూజారాణి విలేకరులతో అన్నారు. బకాయి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్టు చెప్పారు. వీఓఏలు సెల్ఫోన్లు, రికార్డులు అప్పజెప్పనవసరం లేదని, అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. -
వీవోఏలపై పోలీసుల లాఠీచార్జి
చిలకలపూడి (మచిలీపట్నం) : కలెక్టరేట్ రణరంగమైంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ)పై పోలీ సులు లాఠీ ఝళిపించారు. 48 గంటలుగా దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ గేటు దాటి లోపలకు వెళ్లిన వారిని విచక్షణారహితంగా తోసివేశారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే వీవోఏల్లోకి జొరబడి తోసివేసి, లాఠీచార్జ్ చేయడం గమనార్హం. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఓవైపు వీవోఏల అరుపులు, మరో వైపు పోలీసుల బూతుపురాణంతో కలెక్టరేట్ మారుమోగింది. మహిలళపై లాఠీచార్జి చేసి వారిని బయటకు నెట్టివేసిన పోలీసులు దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను సైతం కూల్చివేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లనివ్వాలని కోరిన వీవోఏలను పోలీసులు రోప్ పార్టీతో అడ్డుకున్నారు. రోప్‌పార్టీ, పోలీసులను నెట్టివేసిన వీవోఏలు కలెక్టరేట్‌లోకి వెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆగ్రహించిన వీవోఏలు ‘మీ అక్కచెల్లెళ్లు, భార్యలను ఇలాగే కొడతారా? మహిళా పోలీసులను తీసుకురాకుండా మగ పోలీసులే దాడికి పాల్పడతారా?’ అంటూ వీవోఏలు ఎదురు తిరి గారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సీహెచ్.శ్రీనివాస్‌ను పోలీసులు కాళ్లు, చేతులు పట్టుకుని వంద గజాల దూరం మేర తీసుకువెళ్లి అక్కడి నుంచి గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్ష చేస్తున్న వీవోఏలను చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో వీవోఏలు ఎదురుతిరగటంతో తీవ్ర తోపులాట జరి గింది. ఈ తోపులాటలో మహిళలను కూడా చూడకుండా నెట్టివేయటంతో బొల్లి వెంకటలక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. మరో వీవోఏ అలేఖ్య కాలు గ్రిల్లో ఇరుక్కుపోవటంతో ఆమె విలవిల్లాడింది. వీవోఏలు రజని, అన్నపూర్ణ గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో ఓఎస్డీ వృషి కేశవరెడ్డి, బందరు డీఎస్పీ కె.శ్రీనివాసరావుతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, రిజర్వు పోలీసులు భాష్పావాయువు గోళాలు ప్రయోగించే పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వీవోఏలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మైక్‌లో పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పని, పాటా లేదా అంటూ వారిపై విరుచుకపడి మైక్ లాగి దూరంగా విసిరేశారు. అయినప్పటికీ దీక్ష విరమించేది లేదని వీవోఏలు భీష్మించారు. వీవోఏలపై దాడి విషయం తెలుసుకున్న సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సీఐటీయూ అధ్యక్షుడు రమణ, పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం వీవోఏలు, పోలీసులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నంచేశారు. డీఎస్పీ కలెక్టరేట్ బీ-సెక్షన్ సూపరింటెండెంట్ డి.కోటేశ్వరరావుకు వద్ద కొంత మంది వీవోఏలను తీసుకువచ్చి వారి సమస్యలను వివరించారు. అనంతరం గేటు బయట దీక్ష చేస్తున్న వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వటంతో వారు దీక్ష విరమించారు. ధర్నాలో జిల్లా శ్రామిక మహిళా జిల్లా కన్వీనరు ఎన్.సీహెచ్.శ్రీనివాస్, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిలక్ష్మి, 39 మండలాల వీవోఏలు పాల్గొన్నారు. -
బదిలీలు నిలుపుదల చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వం నిర్వహించే బదిలీ ల్లో సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానికంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల వల్ల పదో తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై దీని ప్రభావం పడుతుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వారు వివరించారు. అలాగే గ్రేడ్-1 వసతి గృహం అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఎస్ ఆనందరావు, కే వెంకట్రావు, గురువి నాయుడు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఈ గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మాద్ హసన్ షరీఫ్, జిల్లా రెవెన్యూ ఆధికారి నూరు భాషా కాశీం తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా... * ఎచ్చెర్ల మండలం కొంగరాం వద్దగల స్మార్టుకాం(వీబీసీ)కర్మాగారం వ్యర్థాలను పొలాల్లోకి విడిచిపెడుతోందని, దీంతో తాగు, సాగునీరు కలుషితం అవుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పరిశ్రమను నిలిపివేయాలని కొంగరాం, ఏజీఎన్పేట గ్రామాలకు చెందిన అనపాల అప్పలస్వామి, డీ సన్యాసిరావు, సీహెచ్ గురువులు, గురివినాయుడు, సీతారాములు, లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు. * వజ్రపు కొత్తురు మండలం నగరం పల్లి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులు రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లు తొలగించారని, రీసర్వే చేయాలని ఆ గ్రామానికి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, వీ జయరాం చౌదరి, బమ్మిడి మోహనరావు, సనపల భాస్కరరావు, నందికేశ్వరరావు ఫిర్యాదు చేశారు. * వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరిలో ఫ్యామిలీ కౌన్సిలర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని, అయితే ఇంతరవరకూ పోస్టింగు ఇవ్వలేదని ఎంపికైన అభ్యర్థి విజయలత తదితరులు ఫిర్యాదు చేశారు. * మెలియాపుట్టి మండలం చాపరలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులపై ఆ పాఠశాల హెచ్ఎం దొంగతనం అంటగట్టి విధుల నుంచి తొలగించారని ఫిర్యాదు అందింది. న్యాయం చేయాలని బాధితులు వరలక్ష్మి, దమయంతి, లక్ష్మి, సుందరమ్మ తదితరులు కోరారు. ఇంకా లావేరు మండలం గుర్రాల పాలెం గ్రామస్తులు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని, శ్రీకాకుళం మండలం నైర గ్రామానికి చెందిన అరటి, జీడిమామిడి తోటల రైతులు తుపాను సాయం అందించాలని గ్రీవెన్స్‌లో విజ్ఞఫ్తి చేశారు. -
‘ఫీజు’ కోసం పోరు
- ఏఐఎస్ఎఫ్, టీజీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన - అరెస్టు చేసిన పోలీసులు ప్రగతినగర్ : పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ఏఐఎస్ఎఫ్ నాయకులు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అప్పటికే పోలీసులు కలెక్టరేట్ ఎదుట ముళ్లకంచె వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చి అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముళ్ల కంచె దాటి లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయినా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ స్పష్టత ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. అరెస్టయిన వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దశరత్, చెలిమెల భాను ప్రసాద్, ముదాం నవీన్, అభిషేక్, అరుణ్, సుధీర్, పృథ్వీరాజ్, రమేష్, నాగరాజు, సాగర్, అఖిల ,ఆమని, వైష్టవి, గోదావరి తదితరులు ఉన్నారు. టీజీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన.. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ తీశారు. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు లాల్‌సింగ్ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలన్నారు. లేని ఎడల ప్రభుత్వంపై విద్యార్థి ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు శేఖర్, జైత్రాం, నరేష్, నవీన్, గణేష్, లింగం, జీవన్ తదితరులు ఉన్నారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. -
గణేష్ ఉత్సవాలుప్రశాంతంగా జరగాలి
ఉత్సవ కమిటీ సభ్యులతోకలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జడ్పీసెంటర్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగేలా సహకరించాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి కోరారు. వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీసభ్యులతో కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 29న వినాయక చవితిని పురష్కరించుకుని నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జన వేడుకలకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఆయా ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో అనుమతి పొందాలన్నా రు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ నిర్దేశించిన సమయంలోనే లౌడ్ స్పీకర్లు వినియోగించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు. ఆ దిశగా కమిటీ సభ్యులు ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో నిర్దేశించిన రుసుం చెల్లించి ప్రత్యేక కనెక్షన్ పొందాలన్నారు. గణేష్ నిమజ్జనానికి ఖమ్మంలోని మున్నేరు వద్ద అధికార యంత్రాంగం ప్రతి ఏటా మాదిరిగా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. క్రేన్ల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్స్య శాఖ సహాయ సంచాలకులకు సూచిం చారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఓఎస్డీ వై.వి.రమణకుమార్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు చ ర్యలు చేపట్టాలన్నారు. సబ్‌డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఉత్స వ కమిటీలు పోలీసులకు సహకరించి ఉత్సవాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని, మండపాల వద్ద రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వొద్దని సూచించారు. విగ్రహ మండపాల వద్ద ప్రతి రోజూ కమిటీ సభ్యులలో ఎవరైన ఒకరు తప్పని సరిగా ఉండాలన్నారు. నిమజ్జనం రోజున గుర్తిం చిన మార్గాల ద్వారానే విగ్రహాలను తరలించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్, డీఆర్వో శివశ్రీనివాస్, సీపీఓ రత్నబాబు, డీపీఓ రవీందర్, జేడీఏ భాస్కర్‌రావు, స్తంబాద్రి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జయచంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంపటి లక్ష్మీ్ష్మ నారాయణ, ఉపాధ్యక్షుడు గంటెల విద్యాసాగర్, కార్యదర్శి అశోక్‌లాహోటి, కన్వీనర్ విజయ్‌కుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒక్క ఇల్లూ వదలొద్దు
- సర్వే రోజు వచ్చే కుటుంబమూ నమోదు - 100 శాతం లక్ష్యంగా సర్వే చేయండి - ప్రత్యేకాధికారి పార్థసారథి ముకరంపుర : ఒక్క ఇల్లు కూడా వదలకుండా 100 శాతం సర్వే పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్, సర్వే జిల్లా ప్రత్యేకాధికారి పార్థసారధి అన్నారు. మండల ప్రత్యేకాధికారులు సంబంధిత మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్వేపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకాధికారులు తమ మండలాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. నోషనల్ నంబర్లు వేసినప్పుడు తాళం వేసి ఉండి సర్వే రోజున కుటుంబసభ్యులు ఉన్నట్లయితే ఆ ఇంటికి నంబర్ వేసి సర్వేలో కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గస్థాయి అధికారులు, మండల ప్రత్యేకాధికారులు 17 నుంచి నియోజకవర్గాల్లో ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేకాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 18న రిపోర్టు చేయాల్సిందే : కలెక్టర్ ఎన్యుమరేట్లు 18న మధ్యాహ్నం 2 గంటల వరకు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరుకు రిపోర్టు చేయాలని కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య ఆదేశించారు. గ్రామంలో పర్యటించి అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. 19న ఉదయం 7 గంటలకు మొదటి ఇంటిలో సర్వే మొదలు పెట్టాలని చెప్పారు. సర్వే పూర్తయ్యాక అదే రోజు ఫారాలను సంబంధిత పర్యవేక్షకులకు అందజేయాలని ఆదేశించారు. 17న డీఆర్డీఏ పీడీ నుంచి సర్వే ఫారాలను ఆర్డీవోలు తీసుకుని తహశీల్దార్లకు అందజేయాలన్నారు. ఎన్యుమరేటర్లు తక్కువగా ఉంటే ప్రైవేట్ టీచర్లను, విద్యార్థులను సర్వే కోసం నియమించుకోవాలని సూచించారు. నోషనల్ నంబర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే సర్వే తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకాధికారి పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కుటుంబ సర్వే ఎన్యుమరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. వాస్తవ సమాచారం సేకరించాలన్నారు. సంక్షేమ పథకాల ప్రారంభానికి ప్రణాళికల కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సంచార జాతులు, అనాథల వివరాలు, భిక్షాటన చేసే వారి వివరాలు తప్పకుండా సేకరించాలన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సర్వే రోజున ఇళ్లలో ఉన్న వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకోవాలని, లేని వారి పేర్లు నమోదు చేయవద్దని చెప్పారు. 19న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల్లో 30 కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లాట్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ జయచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,74,319 ఇళ్లు ఉండగా సర్వే కోసం నోషనల్ నంబర్ల ప్రకారం 11,80,254 ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 43,276 మంది ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయిందని 1356 గ్రామ పంచాయతీ సమన్వయ అధికారులను నియమించామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు రాంనగర్ : సమగ్ర సర్వే కోసం 18, 19 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య తెలిపారు. ఉపాధ్యాయులు ఈ నెల 18న వారివారి మండల కేంద్రాల్లో తహశీల్దార్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన అన్ని బస్సులను వారి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సర్వేకు సహకరించాలి : ట్రస్మా జిల్లాలో జరిగే సమగ్ర సర్వేకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సహకరించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. పాఠశాలల బస్సులను మండల తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
పచ్చి మోసం
అనంతపురం అగ్రికల్చర్ : అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పూటకోమాట చెబుతూ నయవంచనకు గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రుణమాఫీని తక్షణం అమలు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా టవర్‌క్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. పోలీసులు అడ్డగించడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రైతులు ‘అసమర్థ సీఎం డౌన్ డౌన్, రుణమాఫీని వెంటనే అమలు చేయాలి’ అంటూ నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ఆవరణం దద్దరిల్లింది. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులకు ప్రజావాణిలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో వారు వెళ్లి.. కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాలను 90 శాతం రాయితీతో ఇవ్వాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ఆర్బీఐ పరిగణించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సరైన సమయంలో ప్రభుత్వం, అధికారులు నివేదిక పంపక పోవడం వల్ల నేడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోందని, ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి, అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ఆర్బీఐ గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్వామినాథన్, జయతీ ఘోష్ సిఫారసులు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టు అనంత పనులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను బ్యాంకర్లు వేలం వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తరుణాలు ఇవ్వకపోవడంతో పంట సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరువు జిల్లాగా ఆర్బీఐ గుర్తించక పోవడంపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు. మరికొద్ది రోజుల పాటు వేలం వేయకూడదని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కరువు జిల్లా రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి తనవంతు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగేష్, హరి, సుబ్బిరెడ్డి, చంద్రశేఖరెడ్డి, అనిల్‌రెడ్డి, రామాంజనేయులు, కదిరప్ప, మాదన్న, రామస్వామి, నారాయణస్వామి, చెన్నారెడ్డి, దస్తగిరి, రాజశేఖర్, వెంకటరెడ్డి, రామన్న, యర్రపరెడ్డి, క్రిష్ణ, నారాయణ, అంజినరెడ్డి, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కదం
- మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ - కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా పాతగుంటూరు: టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రుణ మాఫీ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయకపోతే పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను కూడా పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బాబు వచ్చాక జాబు పోయింది: కాసు మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ప్రచారం చేశారని, బాబు అధికారంలోకి రాగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు పరచాలని, లేని పక్షంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ నుండి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, పార్టీ నాయకులు వహీద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, పక్కాల సూరిబాబు, రాంబాబు, రామకృష్ణారెడ్డి, ఎస్కె.సుభాని, పి.ఎ.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2013-14 సంవత్సరానికి గాను జిల్లాకు కేటాయించిన దీపం కనెక్షన్లను నెలలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం కన్పించడం లేదని అన్నారు.మొత్తం 23వేల కనెక్షన్లు నెలలోగా మంజూరు చేసి ప్రతిపాదనలు తనకు పంపించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని త్వరలో గ్రౌండింగ్ చేస్తామని అధికారులు తెలిపారు. వచ్చేవారం సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బ్యాంకుమేళాలు నిర్వహించాలని ఆదేశించినా కొన్నిచోట్ల నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో బ్యాంకు మేళా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తం గా 8 లక్షల ఖాతాలు తెరవడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు మండలాల్లో 53 వేల ఖాతాలు, పట్టణాల్లో 53 వేలు, ఐటీడీఏ పరిధిలో 59,781 బ్యాంక్ ఖాతాలు తెరిచారని అన్నారు. మొత్తంగా లక్షా 65వేల ఖాతాలు తెరిచారని, లక్ష్యాన్ని నెలలో సాధించాలని తెలిపారు. 17, 18వ తేదీల్లో కొన్ని మండలాల్లో మేళా నిర్వహించలేదని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా తెరవడంలో అధికారులు విఫలమవుతున్నారని కలెక్టర్ అన్నారు. ఆర్డీవోలందరూ బ్యాంక్మేళాలు, మండలాల వారీగా ప్రతి రోజు సాయంత్రం ఖాతాలు తెరిచిన వివరాలు సేకరించాలని, మేళా నిర్వహించకపోతే తనకు గానీ, సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి గానీ సమాచారం అం దించాలని ఫోన్లో ఆర్డీవోలను ఆదేశించారు. శని వారం ఎన్ని ఖాతాలు తెరిచారో అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రలు ఉన్న వారి ఖాతాలు తెరవడం లేదని, సంతకం చేసిన వారి ఖాతాలే తెరుస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సీరియస్‌గా తీసుకోవాలని అందరికీ ఖాతాలు తెరిచేట్లు చూడాలని కలెక్టర్ తెలిపారు. 3,36,310 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇప్పటివరకు 2,53,752 కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎంహెచ్‌వో స్వామి పాల్గొన్నారు. -
‘ఆడ’.. బిడ్డే
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :‘ఆడపిల్ల పుడితే చింతించాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల అంటే మీ ఇంట బంగారుతల్లి పుట్టిం దని భావించాలి.’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్కూమర్ రెడ్డి అదర గొట్టిన విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం జిల్లా లో అభాసుపాలవుతోంది. ఈ ఏడాది మే 1వ తేదీ మొదలు మొదటి, రెండవ సంతానంలో పుట్టిన ఆడ శిశువులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి శీతకన్ను వేస్తోంది. పథకం ప్రారంభమై ఆరు నెలలవుతోన్నా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు. మే 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,053 మంది ఆడ శిశువులు జన్మించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నా.. లబ్ధిదారుల గుర్తింపులో మాత్రం రాష్ట్రంలోనే వెనుకబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారుతల్లి సర్వేను ఇందిరాక్రాంతి పథం, అర్బన్ ప్రాంతాల్లో మెప్మాలకు ప్రభుత్వం అప్పగించింది. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3,021 మంది ఆడశిశువులను గుర్తించగా అందులో 2,705మందిని అర్హులుగా తేల్చారు. అయితే వీరిలో 776 మంది ఖాతాల్లో మాత్రమే రూ.19,40,000 జమ అయ్యాయి. ఇక జిల్లాలోని అర్బన్ ప్రాంతాలైన నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లలో బంగారు తల్లి పథకాన్ని ఒక్కరికి కూడా వర్తింప చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లో 283 మంది ఆడపిల్లలను ఇప్పటి వరకు గుర్తిస్తే అందులో 184 మందిని అర్హులుగా తేల్చారు. ఆర్మూర్‌లో 28 మంది, బోధన్‌లో ఒకరిని, కామారెడ్డిలో 28 మందిని, నిజామాబాద్ 127 మందిని అర్హులుగా పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఒకరికి డబ్బు లు మంజూరు చేసినప్పటికీ అధికారుల తప్పిదంతో బ్యాంకు ఖాతా నంబర్లో తేడా రావ డం వల్ల ఆ డబ్బులు కాస్త వెనక్కి వెళ్లాయి. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా బంగారు తల్లి పథకం జిల్లాలో మసకబారుతోంది. అమ్మో.. ని‘బంధనా’లు.. బంగారుతల్లి పథకానికి విధించిన నిబంధనలు లబ్ధిపొందే కుటుంబాలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగాలి. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆన్లైన్లో 24 గంటల్లో పేరునమోదు చేయిం చాలి. కాగా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. సాఫ్ట్వేర్ అప్లోడింగ్ చేసి సమస్య పరిష్కరించేపనిలో ఉన్నమని అధికారులు ఓవైపు చెప్పుకొస్తున్నారు. గ్రామాల్లోఅయితే గ్రామ కార్యదర్శి గుర్తించిన జనన ధ్రువీకరణ పత్రం, అంగన్వాడి కార్యకర్త, సంబంధిత పీహెచ్సీ డాక్టర్ ధ్రువీకరణ, మహిళ సభ్యురాలు ధ్రువీకరణ, రేషన్ కార్డు లో తల్లిదండ్రుల పేర్లు, ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలు ఉండాలి. ఈ బాధ్యతలను డీఆర్డీఏ మండల ఏపీఎం లేదా సీఎల కు అప్పగించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఈ సర్వే బాధ్యతలు చేపడుతుంది. అయితే ఆశించిన స్థాయిలో సర్వే జరగడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం బం గారు తల్లులకు శాపం గా మారింది. బంగారు తల్లంటే... ఈ ఏడాది మే1 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ వయస్సు, చదువును బట్టి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి ఏడాది ఇచ్చే పారితోషికం కాకుండా 21 సంవత్సరాలు నిండితే ఇంటర్, డిగ్రీ రెగ్యులర్‌గా పాసైన వారికి రూ.55,500తో పాటు ప్రోత్సాహకంగా రూ. 1,55,500 అందిస్తారు. -
అప్రమత్తత అవసరం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లీన్ తుపాను ప్రభావం జిల్లాపైనా ఉండవచ్చని.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఏజేసీ రామస్వామి, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ అధికారుల సమాచారం మే రకు జిల్లాపైనా తుపాను ప్రభావం చూ పవచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు అప్రమత్తం కావాలన్నారు. తుపాను తీరం దాటవచ్చని భావిస్తున్న శనివారం రోజున జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.