రైతుకు రిక్తహస్తం
- రైతుల్ని పట్టించుకోని బాబు ప్రభుత్వం
- ఘోరంగా విఫలమైన సర్కార్
- వైఎస్సార్‌సీపీ మహా ధర్నాలో ధ్వజమెత్తిన నాయకులు
- కలెక్టరేట్ వద్ద పోలీసుల ఓవర్‌యాక్షన్
- హాఎమ్మెల్యే ఈశ్వరి పట్ల ఏసీపీ దురుసు వైఖరి
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా జరిగింది. ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతోపాటు రైతులు, డ్వాక్రామహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం
పది గంటల నుంచి ప్రారంభ మైన ధర్నా మధ్యాహ్నం ఒం టిగంట వరకు జరిగింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ ధర్నాకు తరలివచ్చిన కార్యకర్తలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా తమ ప్రసంగాల్లో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా రైతులకు రుణాలు..విత్తనాలు, ఎరువులు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఇప్పటివరకూ జరగకపోవడం చరిత్రలో ముందెన్నడూలేదన్నారు.
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అనంతపురంలోనే 100మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సర్కార్‌కు కనీస స్పందనలేదన్నారు. మరోపక్క ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొం దుపర్చిన కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న వాటాను రాబట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఓ టుకునోటుకేసులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయలేదని.. పైగా టేపుల్లో ఆ వా యిస్ నీది అవునా కాదా అని అడిగితే డొంకతిరుగుడు స మాధానాలతో తప్పించుకుంటున్నారని ధ్వజ మెత్తారు.గవర్నర్‌ను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ సెక్షన్-8 పేరిట సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ధర్నాలో రాష్ర్ట కార్యదర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్, పీలా ఉమారాణి, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మాజీ ఎమెల్యే తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రి సీతారాం, మిలటరీ నాయుడు, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, అదీప్‌రాజు, కోలా గురువులు, పార్టీ మహిళా, యువజన, ఎస్సీ, సేవాదళ్ సాంస్కృతిక విభాగాల జిల్లా అధ్యక్షులు ఉషాకిరణ్, వల్లూరి భాస్కర్, బోని శివరామకృష్ణ, వాసు, రాధ, రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, సీఈసీ సభ్యులు వీసం రామకృష్ణ, శ్రీకాంత్‌రాజు,రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల రవిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ జిల్లా అధికార ప్రతినిధి ఉరుకూటి అప్పారావు, చిక్కాల రామారావు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్, సత్తిరామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్ నగర పరిధిలోని డివిజన్ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
గిడ్డి ఈశ్వరిపై ఏసీపీ జులం
ధర్నా అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా కలెక్టర్‌తో సహా అధికారులెవరూ లేకపోవడంతో ఛాంబర్ వద్ద బైటాయించారు. ఛాంబర్ కు వినతిపత్రం అంటించే ప్రయత్నం చేస్తుండగా ఏసీపీ రమణ అడ్డుకుని ప్రతులను లాక్కొని నలిపేశారు. ఎమ్మెల్యే ఈశ్వరి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి పీలా ఉమారాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషారాణి తదితరులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌లను గెంటేసే ప్రయత్నం చేశారు.
ఏసీపీ వెనక్కి నెట్టేయడంతో యలమంచిలి పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు కింద పడిపోయారు. డీఆర్‌ఒ నాగేశ్వరరావు ఆహ్వానించగా లోనికి వెళ్లనీయకుండా ఏసీపీ మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఆర్వో వారిస్తున్నా వినకుండా ఈశ్వరి పట్ల ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారు. మళ్లీ ధర్నా ఎలా చేస్తారో చూస్త్తానంటూ ఏకవచనంతో ఏసీపీ రెచ్చిపోయారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ ఎస్టీ మహిళా ఎమ్మెల్యేనైన తన పట్ల ఏసీపీ రమణ ప్రవర్తించిన తీరు కలిచి వేసిందన్నారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరించాలనుకుంటే పచ్చ చొక్కాలు వేసుకోవాలని సూచించారు. ఏసీపీపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేస్తానని, స్పీకర్‌కు, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీమహిళల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ రమణపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని అమర్నాథ్ చెప్పారు.