ప్రజాసమస్యలపై మరోపోరు | Collecterate concern today before the YSR CP | Sakshi

ప్రజాసమస్యలపై మరోపోరు

Published Thu, Jun 25 2015 3:14 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Collecterate concern today before the YSR CP

శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రజా సమస్యల్ని మరింత జఠిలం చేస్తుండడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం చేసిన కృషి వల్ల రైతుల్లో ధీమా ఏర్పడింది. అటు తరువాత ప్రభుత్వాలు సంక్షేమ బాటను వీడి పదవుల కోసమే పనిచేయడంతో అన్ని వర్గాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా రైతులు పెట్టుబడులు లేక ఆందోళన చెందుతున్నారు. గతంలో పంట బీమాతో రైతన్న ధీమాగా ఉండేవాడు.
 
 ఇప్పుడలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా బీమా వల్ల రైతు నష్టపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులను దగా చేసి బీమాకు సైతం నోచుకోకుండా చేశారు. రుణాల మాఫీ అంటూ రైతులను మాయ మాటలతో మోసగించడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేకుండా చేసింది. పెట్టుబడులు కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. ఇటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఓటుకు నోటులో పీకల్లోతు కూరుకుపోయి దానినుంచి బయటపడేందుకే సమయాన్నంతా కేటాయిస్తోంది.
 
 నీరు-చెట్టు వంటి గొప్ప పేర్లతో ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులను పార్టీ కార్యకర్తలకు తినిపిస్తోందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.  ఇటువంటి తరుణంలో రైతుల పక్షాన పోరాడటానికి, రైతు సమస్యలను ప్రభుత్వ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సాఆర్‌సీపీ శ్రేణులు నడుం బిగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement