అయినా మారలే! | Irregularities Loyalist! | Sakshi
Sakshi News home page

అయినా మారలే!

Published Thu, Jul 23 2015 1:21 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

అయినా మారలే! - Sakshi

అయినా మారలే!

అక్రమాలకు  విధేయుడు !
 
కలెక్టరేట్‌లో వసూల్ రాజా
కలెక్టర్, జేసీ పేరు చెప్పి బెదిరింపులు
అధికారులకు బాధితుల ఫిర్యాదు

 
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యో గి ఏసీబీకి పట్టుబడి  20 రోజులు కాలే దు. ‘మ్యాటర్ సెటిల్ చేస్తా’నని సదరు ఉద్యోగి తన పంథాలోనే సాగుతున్నాడు.  రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. అవినీతి, అక్రమ వసూళ్ల విషయంలో ఉన్నతాధికారులు ఎన్ని హితబోధలు చేసినా సిబ్బంది మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లా పాలనా కేంద్రం కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడి సరిగ్గా 20రోజులు కాకముందే అదే కలెక్టరేట్‌లోని ఒక ఉద్యోగిపై ఉన్నతాధికారులకు బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. జేసీ కోర్టులో ఉన్న కేసుల వ్యవహారంలో తాను అడగినంత ఇస్తే తీర్పు అనుకూలంగా ఇప్పిస్తానని, లేదంటే ఇబ్బందులు తప్పవని తమను వేధిస్తున్నాడని సదరు ఉద్యోగిపై బాధితులు ఫిర్యాదు చేశారు. గతం నుంచి వృత్తిపరమైన విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి అక్రమ వసూళ్ల వ్యవహారం ప్రస్తుతం కలెక్టరేట్‌లో చర్చనీయాంశగా మారింది.

 కలెక్టర్, జేసీల పేరు చెప్పి...
 ఫిర్యాదు దారులు అధికారులు ఇచ్చిన సమాచా రం ప్రకారం కలెక్టరేట్‌లో ఒక విభాగంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ తన సెక్షన్‌కు సంబంధించి పనులపై వచ్చే వారి నుంచి కలెక్టర్, జేసీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. తన వద్ద ఉన్న భూములకు సంబంధించి ఫైళ్ల విషయంలో భూముల ధరను బట్టి బాధితులను లంచం డిమాండ్  చేస్తున్నారు. ఇతని వసూళ్ల లెక్క ఒక్కోక్కరి వద్ద అరలక్షకు తక్కువ కాకుండా ఉంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు ఇచ్చే దాంట్లో సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి ఉన్నతాధికారులందరికీ ఇస్తానని వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలుకుతున్నాడు. జేసీ కోర్టులు పెండింగ్‌లో ఉన్న భూముల సంబంధించిన కేసుల ఇరు పక్షాల వారికి ఫోన్‌చేసి ‘మ్యాటర్ సెటిల్‌చేస్తా’ నంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
 
అధికారులను తప్పుదోవ...
 భూ వివాదాల పరిష్కారం విషయంలో సహజంగా ఉన్నతాధికారులు సంబంధిత అధికారి వివరాలు తెలుసుకుంటాడు. ఈ సమయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చీ మరి తన పని తాను చేసుకున్న సందర్భాలూ ఉన్నారుు. సదరు ఉద్యోగిపై గతంలో చేర్యాలకు సంబంధించి ఒక భూమి విషయంలో బాధితులను వేధించినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇతని ఆగడాలు శృతి మించడంలో బాధితులు తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై అధికారులు సీరియస్‌గా తీసుకుని సదరు ఉద్యోగిని సంజాయిషీ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా పదోన్నతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉద్యోగి ప్రస్తుతం పదోన్నతులు పొందుతున్న రెవెన్యూ ఉద్యోగుల జాబితాలో పేరున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జారీ చేసిన క్రమ సంజాయిషీ నోటీసును పక్కన పెట్టిన అధికారులు సదరు ఉద్యోగికి పదోన్నతి పత్రం అందజేయడం ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement