బాబు అబద్దపు హామీలను ఎండగడదాం
- ప్రజలకు అండగా నిలబడదాం
- నేడు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ మహాధర్నా
- తరలిరానున్న పార్టీశ్రేణులు,రైతులు, మహిళలు
సాక్షి, చిత్తూరు: పింఛన్లు.. రేషన్ కార్డులు తొలగించారు... రైతు, డ్వాక్రా రుణమాఫీలు లేవు... బాబు వస్తే.. జాబు అనే నినాదం గంగలో కలిసింది... నిరుద్యోగ భృతిలేదు.. ఆరు నెలల కాలంలో అన్ని వర్గాలవారిని వంచించిన చంద్రబాబు అబద్దపు హామీలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సన్నద్ధమయింది. అధికారం కోసం ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు గుప్పించిన బాబు ఆ తరువాత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించక, ప్రజలను వంచించారు.
ఈ నేపథ్యంలో బాబు వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మద్దతుగా శుక్రవారం ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు అబద్దపు హామీలను ఎండగడదాం-ప్రజలకు అండగా నిలబడదాం అనే నినాదంతో పార్టీ శ్రేణులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యూయి.
వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, అమరనాథరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు సామాన్య కిరణ్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చంద్రమౌళితోపాటు జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున తరలిరావడానికి సిద్ధమయ్యూరు.