వరంగల్: అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రతీవారం ఉన్నతాధికారులు ఆయా విభాగాల అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అర్జీలు వెల్లువెత్తుతున్నా.. ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌పై ‘సాక్షి’ పరిశీలన – కరీమాబాద్
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వివిధ కారణాలతో స్థానికంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కొందరైతే.. పలుమార్లు గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూములకు సంబంఽధించిన అర్జీలు వస్తున్నాయి. తర్వాత పింఛన్ల కోసం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపు స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
అర్జీలు ఇలా..
వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 97 ఆర్జీలు వచ్చాయి. వాటిలో జీడబ్ల్యూఎంసీ 4, బీసీ డెవలప్‌మెంట్ 3, వ్యవసాయశాఖ 9, రెవెన్యూ 36, మైనార్టీ వెల్ఫేర్ 3, ఏసీపీ ఖిలా వరంగల్ 1, వెటర్నరీ 1, లీడ్ బ్యాంక్ 5, పంచాయతీ అధికారి 6, డీఆర్డీఓ 11, ఉపాధి శాఖ 1, ఎస్సీ డెవలప్‌మెంట్ 1, జిల్లా సంక్షేమ శాఖ 5, సివిల్ సప్లయ్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2, యుజవన క్రీడలు 1, ‘కుడా’ 2, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ 1, ఎంజీఎం 1, ఎన్‌పీడీసీఎల్ 1, ఈఈ ఇరిగేషన్ 1, విద్యాశాఖ అధికారికి సంబంఽధించిన అర్జీ 1 వచ్చాయి.
కాగా.. ప్రజావాణి కార్యక్రమానికి 35 శాఖలకు చెందిన అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులు రాలేని పరిస్థితిలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు. ఈక్రమంలో సోమవారం పలువురు హాజరు కాలేదు. కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ ఫోటోలో ఉన్న బాలుడు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు మణిదీప్. ఇతడికి మానసిక దివ్యాంగుల పెన్షన్ కోసం మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. సదరం క్యాంపులో 75 శాతం చూపుతున్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు వచ్చామని బాలుడి తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికై నా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment