Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

BPSC Protest in Patna: Police Use Water Cannons on Students Demanding Re-Exam1
BPSC ప్రశ్నపత్రాల లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ, ఉద్రిక్తత

పాట్నా : బీహార్‌ (bihar) లో ఉద్రిక్తత నెలకొంది.డిసెంబర్‌ 13న నిర్వహించిన 70వ బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (bpsc) ప్రిలిమనరీ పరీక్ష పేపర్‌ లీకైందని, పరీక్ష వాయిదా వేయాలని రోజుల తరబడి అభ్యర్థుల చేస్తున్న ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం నితీష్‌ కుమార్‌తో భేటీ అయ్యేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీ మైదాన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు.సీఎం నితీష్‌ కుమార్‌ను కలిసిందేకు పీబీఎస్‌ (Bihar Public Service Commission) అభ్యర్థులు జేపీ గోలంబార్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన రెండు బారికేడ్లను ఛేదించారు. అక్కడి నుంచి పాట్నా గాంధీ మైదాన్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు, బీపీఎస్‌ఈ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులు ఫ్రేజర్ రోడ్డు మీదుగా ప్రభుత్వ అధికారులు నివాస ప్రాంతమైన డాక్ బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. నిరసనకారులను అదుపు చేసేందుకు హోటల్ మౌర్య సమీపంలో బారికేడ్లతో సహా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.#WATCH | Bihar | BPSC aspirants continue their protest in Patna's Gandhi Maidan, demanding a re-exam to be held for the 70th BPSC prelimsJan Suraaj Chief Prashant Kishor also present at the protest pic.twitter.com/q9qUrv6wTd— ANI (@ANI) December 29, 2024 ఈ సందర్భంగా బీపీఎస్సీ పరీక్షలపై పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఎపీఎస్సీ పరీక్షలు అక్రమాలు, పేపర్ లీకేజీలు ఆనవాయితీగా మారాయి. ఇలా సాగడం కుదరదు. పరిష్కారం వెతకాలి.. అందుకే ‘ఛత్ర సంసద్‌’ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. .అభ్యర్థుల చత్ర సంసద్‌పై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (DM) చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, గాంధీ మైదాన్ నిషేధిత ప్రాంతం కాబట్టి జిల్లా యంత్రాంగం విద్యార్థులను గుమికూడనివ్వదు. కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం నిరసనల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గాంధీ మైదాన్‌లో, పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా సిబ్బందిని నియమించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ’ అని హెచ్చరించారు.

Tollywood Director Kiran Tirumala Shetty Beated By Un known People In Guntur2
టాలీవుడ్ డైరెక్టర్‌కు షాక్.. మాట్లాడుతుండగా మూకుమ్మడి దాడి!

ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం డ్రింకర్ సాయి. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి జరిగింది. సక్సెస్‌ టూర్‌లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్‌ వద్ద మాట్లాడుతుండగా ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం.కాగా.. డ్రింకర్ సాయి చిత్రాన్ని కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్‌ 27న థియేటర్లలో విడుదలైంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ— Suresh PRO (@SureshPRO_) December 29, 2024

Haryana Steelers lift maiden PKL title3
ప్రొ కబడ్డీ లీగ్‌-2024 ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)–11వ సీజన్‌ ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్‌ నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఫైనల్‌లో పాట్నా పైరేట్స్‌ను 32-23 తేడాతో చిత్తు చేసిన హరియాణా.. తొలిసారి పీకేఎల్‌ ట్రోఫీని ముద్దాడింది.హరియాణా విజేతగా నిలవడంలో శివం పటారే కీలక పాత్ర పోషించాడు. శివం పటారే ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. 21 ఏళ్ల పటారే నాలుగు టాకిల్స్‌ పాయింట్స్‌, ఐదు టచ్‌ పాయింట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మొహమ్మద్రెజా షాడ్లోయ్ 5 టాకిల్స్‌తో ప్రత్యర్ధి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్‌లో రైడర్‌ దేవాంక్‌(5 టచ్‌ పాయింట్లు), గురుదీప్‌​ సింగ్‌(6 టాకిల్‌ పాయంట్లు) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఇక​ టోర్నీ అసాంతం హరియాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 16 విజయాలు సాధించగా.. ఆరింట ఓటమి చవిచూసింది. ప్రొ కబడ్డీ లీగ్‌-2024 సీజన్‌ ఆరంభం నుంచి ఆఖరి వరకు టేబుల్‌ టాపర్‌గానే హరియాణా(84 పాయింట్లు) కొనసాగింది. Presenting to you the 🌟 #𝐏𝐊𝐋𝟏𝟏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🌟@HaryanaSteelers win their maiden #ProKabaddi title 🏆💙#ProKabaddiOnStar #LetsKabaddi #PKLFinal #HaryanaSteelers #PatnaPirates pic.twitter.com/m5xDX2QJlW— ProKabaddi (@ProKabaddi) December 29, 2024

Russia Apologizes for Azerbaijan Airlines Plane Crash incident,Says Ilham Aliyev4
‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం

బాకో: ల్యాండింగ్‌ సమయంలో అజర్‌ బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్‌ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్‌ 29) అజర్‌ బైజాన్‌ ప్రెసిడెంట్‌ ఇల్హామ్‌ అలీయేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్‌ బైజాన్‌ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.‘అజర్‌ బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ ‌బైజాన్‌కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్‌ అలీయేవ్‌ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్‌ బైజాన్‌ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్‌ బైజాన్‌ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అజర్‌బైజాన్ ప్రెసిడెంట్‌ ఇల్హామ్‌ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.

Consequences of loss Financial discipline5
తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు

సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు... ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు... అది సద్వినియోగం అయితేనే సార్ధకత. గత ఆర్టికల్ లో ఆర్ధిక క్రమశిక్షణ (Financial discipline) పాటించే వ్యక్తి జీవితం పూలపానుపు గా ఎలా మారుతుందో విశ్లేషించుకున్నాం..గాడి తప్పితే ఏమవుతుందో ఇప్పుడు సోదాహరణంగా చూద్దాం.శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు. కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా.. కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే. మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) ... జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం 'ఖరీదైన' స్కూల్లోనే చేర్పించాడు.మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా... ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు. ఇంతలో ఊహించని సంఘటన...ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు. మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా... మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది. మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు. ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా... కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు. తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా... ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే...* ముందుచూపుతో వ్యవహరించకపోవడం * సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం * తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం* పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం* ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం * జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం * పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం * చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం * ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం* క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం* అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం... లోన్ ల కోసం ఎగబడటం * భవిష్యత్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం * స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం...కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా... పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగితే రాహుల్ మాదిరిగా చీకూ చింతా లేని జీవితం గడపగలుగుతాడు. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాడు.రాహుల్ లాంటి సుఖమయ జీవితం కావాలా.. శివకుమార్ లాంటి కష్టాల ప్రవాహం కావాలా... అన్నది మన చేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావుపర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు

AP Farmer Nagendra and His Family Take Their Lives Due to Debt6
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్‌ అవహేళన

వైఎస్సార్‌ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.

IT CEO Salary Rise By 160 pc In 5 Years Freshers only 4 pc7
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?

సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), విప్రో (Wipro), టెక్‌ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్‌లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్‌ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్‌ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు.

Delhi Transport Department Responds to Arvind Kejriwal and Atishi Arrest Comments8
అరెస్ట్‌ ఖాయమంటూ కేజ్రీవాల్‌ కామెంట్స్‌ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్‌ కానున్నారంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఆ ట్వీట్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్‌ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్‌ కూడా చేశారు.महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया हैउसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్‌ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్‌ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

What is the highest successful chase at MCG in Test cricket?9
మెల్‌బోర్న్‌ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు!

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టు ఫలితం సోమవారం తేలిపోనుంది. నాలుగో రోజు ఆట‌లో తొలి రెండు సెష‌న్స్‌లో భార‌త్ పై చేయి సాధించిన‌ప్ప‌టికి.. ఆఖ‌రి సెష‌న్‌లో మాత్రం కంగారులు అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచారు.ముఖ్యంగా టెయిలాండ‌ర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. వీరిద్దరూ ప‌దో వికెట్‌కు 55 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. మొత్తంగా ఈ వెట‌ర‌న్ జోడీ 110 బంతులు ఎదుర్కొని త‌మ జ‌ట్టుకు అడ్డుగోడ‌గా నిలిచారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజ్‌లో నాథన్ లైయన్ (41 నాటౌట్‌), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్‌) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్ర‌స్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. దీంతో ఆసీస్ భార‌త్ ముందు 333 నుంచి 350 ప‌రుగుల మ‌ధ్య టార్గెట్‌ను నిర్దేశించే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో భార‌త్ ఈ టార్గెట్‌ను చేధిస్తే 96 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బ‌ద్ద‌లు కానుంది.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్టుల్లో అత్య‌ధిక రన్ ఛేజింగ్ 322 పరుగులగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టులో ఇంగ్లండ్ 322 ల‌క్ష్యాన్ని చేధించింది. ఆ త‌ర్వాత ఈ వేదిక‌గా 300పైగా టార్గెట్‌ను ఏ జ‌ట్టు కూడా చేధించలేక‌పోయింది. ఇప్పుడు భార‌త్‌కు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే అవ‌కాశం ల‌భించింది.మెల్‌బోర్న్‌లో అత్య‌ధిక ర‌న్ ఛేజ్‌లు ఇవే..322- ఇంగ్లండ్‌- ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1928297-ఇంగ్లండ్‌- ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1895295-ద‌క్షిణాఫ్రికా-ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1953286-ఆస్ట్రేలియా-ప్ర‌త్య‌ర్ధి(ఇంగ్లండ్‌)-1929282-ఇంగ్లండ్‌-ప్ర‌త్య‌ర్ధి(ఇంగ్లండ్‌)-1908ఎంసీజీలో భారత్ రికార్డు ఎలా ఉందంటే?కాగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భార‌త్ కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ల‌క్ష్యాన్ని చేధించిగ‌ల్గింది. 2020 డిసెంబర్‌లో ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 70 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. అంతక‌మించి ల‌క్ష్యాన్ని భార‌త్ ఛేజ్ చేయ‌లేక‌పోయింది. అయితే 2018/19 ఆసీస్ పర్యటనలో భాగంగా ఇదే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్బుతవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా పేస్‌​ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టి కంగారులను దెబ్బ తీశాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక టెస్టు ఛేజింగ్ 329గా ఉంది. 2021లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ ఫీట్ సాధించింది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్‌ దేవ్‌ అల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

YSRCP Buggana Rajendranath Serious Comments On CBN Govt10
చంద్రబాబూ.. విజన్‌ అంటే అప్పులేనా?: బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్‌ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్‌-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్‌. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో​ ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్‌ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్‌..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్‌ డ్యాకుమెంట్‌ రిలీజ్‌ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్‌లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం

అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్..

title
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్‌

దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్‌మెన్‌ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.

title
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు

లారా లూమర్..

title
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!

విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు.

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం

లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల  క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ

Advertisement

వీడియోలు

Advertisement