సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం | The Singapore Dakshina Bharatha Brahmana Sabha Athirudra Mahayagam | Sakshi
Sakshi News home page

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం

Published Sat, Dec 28 2024 10:13 AM | Last Updated on Sat, Dec 28 2024 10:13 AM

The Singapore Dakshina Bharatha Brahmana Sabha  Athirudra Mahayagam

లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల  క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక  (1924 -2024 ) వార్షికోత్సవము సందర్భముగా నిర్వహించిన అతిరుద్ర మహాయాగము అత్యంత ఘనంగా జరిగింది. ఈ యాగం  మార్గశిర కృష్ణ షష్ఠి డిసెంబర్‌21, 2024 నుంచి కృష్ణ ఏకాదశి డిసెంబర్‌  వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో26, 2024 వరకు నిర్వహించారు. గత 5 రోజుల నుంచి అత్యంత విశేష ముగా యాగాలు నిర్వహించగా, కృష్ణ ఏకాదశి డిసెంబర్‌ 26, 2024 రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. 

సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం మొదటిది, సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ సందర్భముగా కార్యక్రమములో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121  ఋత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేశారు. సుమారు 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ..ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేశారు. 

మహా పూర్ణాహుతి అయిన ఆరవ రోజు 1331 రుద్రమల పారాయణంతో 16,896 రుద్రములు నిర్వహించారు. ఇది ఒక అతిరుద్రం ప్లస్ ఒక మహారుద్రం ప్లస్ ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరము ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలసములతో  శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో  అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం అవధారయాలు జరిగాయి.

అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్‌డీబీబీఎస్‌ నిర్వహణ కమిటీలో - L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్ మరియు వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం  ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనగా, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుంచి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము  అతిరుద్రం తొలి రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పిజిపి హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించబడింది. తిరుచ్చి నుంచి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్‌కు అందజేశారు.

సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి  వాద్యార్లకు   (పురోహితులు), ఋత్విక్‌లకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది అని నిర్వాహకులు తెలియజేశారు, పరమశివుడు చాలా సంతోషించాడు,  అందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది అని నిర్వహకులు ఆనందం వ్యక్తంజేశారు.

(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement