Atirudra Maha Yagnam
-
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవము సందర్భముగా నిర్వహించిన అతిరుద్ర మహాయాగము అత్యంత ఘనంగా జరిగింది. ఈ యాగం మార్గశిర కృష్ణ షష్ఠి డిసెంబర్21, 2024 నుంచి కృష్ణ ఏకాదశి డిసెంబర్ వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో26, 2024 వరకు నిర్వహించారు. గత 5 రోజుల నుంచి అత్యంత విశేష ముగా యాగాలు నిర్వహించగా, కృష్ణ ఏకాదశి డిసెంబర్ 26, 2024 రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం మొదటిది, సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ సందర్భముగా కార్యక్రమములో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేశారు. సుమారు 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ..ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేశారు. మహా పూర్ణాహుతి అయిన ఆరవ రోజు 1331 రుద్రమల పారాయణంతో 16,896 రుద్రములు నిర్వహించారు. ఇది ఒక అతిరుద్రం ప్లస్ ఒక మహారుద్రం ప్లస్ ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరము ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలసములతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం అవధారయాలు జరిగాయి.అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్‌డీబీబీఎస్ నిర్వహణ కమిటీలో - L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్ మరియు వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనగా, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుంచి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము అతిరుద్రం తొలి రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పిజిపి హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించబడింది. తిరుచ్చి నుంచి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్‌కు అందజేశారు.సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), ఋత్విక్లకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది అని నిర్వాహకులు తెలియజేశారు, పరమశివుడు చాలా సంతోషించాడు, అందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది అని నిర్వహకులు ఆనందం వ్యక్తంజేశారు.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
‘లోక కల్యాణార్థం కోసమే యాగాలు’
సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్ చేసిన యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువులు వాగులు నిండాయని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో ఆదివారం ప్రారంభమైన అతిరుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటిన్నర ఎకరాల మాగానికి సాగునీళ్లు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కల్యాణానికి దోహదపడతాయన్నారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. రెండు జాతరలు నిర్వహించిన స్ఫూర్తితో ఈ సారి కూడా మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. -
అమెరికాలో అతిరుద్రమహాయజ్ఞం, శతచండీహోమం
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయంలో మార్చి 1 నుంచి 11 వరకు అతిరుద్ర మహాయజ్ఞం, శతచండీహోమం జరుగనుంది. పదకొండు రోజుల పాటు సాగే ఈ మహాక్రతువులకు పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు లివర్ మోర్ శివ-విష్ణుదేవాలయ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఇంత భారీ స్థాయిలో లివర్ మోర్ లో యజ్ఞాలు తలపెట్టడం ఇదే ప్రథమం. ఈ క్రతువుల్లో 121 మంది పురోహితులు, ఋత్విక్కులు పాల్గొననున్నారు. వీరిలో చాలా మంది భారతదేశం నుంచి వస్తున్నారు. ఋగ్,యజుర్,సామ,అధర్వణవేదాలు సనాతన ధర్మానికి మూలకందాలుగా ఉన్నాయి. వీటిలోని కృష్ణ యజుర్వేదంలో రుద్రాధ్యాయం, చమకం ఉన్నాయి. పరమ శివారాధనలో రుద్రం అన్నది అత్యంత ప్రధానమైంది, ఎంతో పవిత్రమైంది. పదకొండుసార్లు నమకం ఆపై ఒకసారి చమకం జపిస్తే అది ఒక ఆవృతి. దానిని ఏకాదశరుద్రం అని వ్యవహరిస్తారు. ఇలాంటి ఏకాదశరుద్రాల జపం ఒక లఘురుద్రం అవుతుంది. ఇలాంటి పదకొండు లఘురుద్రాల జపం ఒక మహారుద్రంగా పిలుస్తారు.ఇలాంటి పదకొండు మహారుద్రాల జపం అతిరుద్రమవుతుంది. అంటే ఇందులో మొత్తం 14,641 నమకాలు, 1331 చమకాల పారాయణం లేదా జపం జరుగుంతుదన్నమాట. ఇందులో భాగంగా 11 హోమకుండాల్లో 121 మంది ఋత్విక్కులతో 1331 రుద్రహోమాలు జరుగుతాయి.దీనికి పదకొండు రోజుల సమయం పడుతుంది. ఇదంతా వేదోక్తంగా జరుగుతుంది. పురాణ ఇతిహాసాల్లో అతిరుద్రానికి విశేష మహత్యం ఉంటుందని చెప్తారు. లంకపై దండయాత్ర చేసే సమయంలో అవరోధాలు ఏర్పడినప్పుడు శ్రీరాముడు అగస్త్య మహామునిని తరణోపాయం చెప్పమని కోరాడట. అందుకు అతిరుద్రజపం చేయమని అగస్త్యులవారు ఉపదేశించారట. ఆ విధంగానే శ్రీరాముడు సేతుబంధనానికి ముందు రామేశ్వరంలో అతిరుద్రం ఆచరించాడని చెబుతారు. అతిరుద్రం అన్ని దుఖాఃలనూ, క్లేశాలనూ ఉపశమింపజేస్తుందని వేదం ఉపదేశిస్తుంది. అతిరుద్రంతో విశ్వశాంతి కలుగుతుందని కూడా వేదపండితులు ప్రవచిస్తారు. ఇక శక్తిపూజలో అత్యంత శక్తిమంతమైంది శతచండీ యజ్ఞం. దేవీమాహాత్మ్యాన్ని పారాయణం చేస్తూ చండీహోమం చేయడం ఇందులోని విధి. దేవీమాహాత్మ్యం మార్కండేయ పురాణంలో అంతర్భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉండటాయి, దీనిని దుర్గాసప్తశతిగానూ వ్యవహరిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చటంలో సప్తశతి అత్యంత ప్రభావపూర్ణమైందని వైదిక శాస్త్రగ్రంథాలు చెబుతాయి. వంద పర్యాయాలు చండీసప్తశతి పారాయణం చేస్తూ ఆహుతులిస్తే అది శతచండీ హోమం అవుతుంది. శివ-విష్ణు ఆలయంలో ఇప్పుడు రోజుకు వందసార్లు చొప్పున దుర్గా సప్తశతిని పారాయణం చేస్తూ ఒకసారి చండీహోమం చేయనున్నారు. ఇలా 11 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. శత చండీహోమాన్ని అతిరుద్ర మహాయజ్ఞంతో కలిపి చేస్తే దాని ప్రభావం ద్విగుణీకృతమవుతుంది. శివశక్తుల ప్రసన్నత భక్తుల ఈప్సితాలను తీర్చడమే కాదు, అది లోకకళ్యాణానికీ ఉపయుక్తమవుతుంది. హిందూ కమ్యునిటీ అండ్ కల్చరల్ సెంటర్ జయేంద్ర సరస్వతి, స్వామి చిన్మయానంద ఆశీస్సులతో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని లివర్ మోర్ లో ఔత్తరాహిక దాక్షిణాత్య సంప్రదాయాల మేళవింపుతో భవ్యమైన శివ-విష్ణు ఆలయాన్ని నిర్మించింది. 1986లో కుంభాభిషేకాన్నీ, 1998, 2010 సంవత్సరాల్లో మహాకుంభాభిషేకాలను నిర్వహించింది. ఇలా ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంలో ఈ దేవాలయం హైందవ సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం ఇప్పుడు మరో మహాక్రతువు తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ పదకొండు రోజులూ రోజుకొక విశేష పూజాకార్యక్రమం జరుగుతుంది. పరశురామ ప్రోక్తమైన మనో వినాయక వ్రతం, అష్టోత్తర శతలింగ బిల్వదళార్చన, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యస్వామి వ్రతపూజ, అష్టాదశశక్తిపీఠ సహిత దుర్గాదీపపూజ, త్రిశక్తీకుంకుమార్చన, శివపార్వతీకళ్యాణం, నందివాహన సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రదైవకార్యంలో పాలుపంచుకోవాలని సనాతన సంప్రదాయం పట్ల అసక్తి కలిగిన భక్తులకు హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ విజ్ఞప్తి చేస్తోంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారానికి http://livermoretemple.org/hints/atirudram/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.