న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ కార్కినోస్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.375 కోట్లు. కార్కినోస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ (RSBVL) దక్కించుకుంది.
కార్కినోస్ 2020లో ప్రారంభం అయింది. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నిర్ధారణ చేయడం, వ్యాధి నిర్వహణ కోసం సాంకేతికతతో కూడిన వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.22 కోట్ల టర్నోవర్‌ను ఆర్జించింది.
కంపెనీ 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనుబంధ కంపెనీ ద్వారా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. కార్కినోస్ దివాళా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. ఆర్‌ఎస్‌బీవీఎల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదించినట్టు డిసెంబర్ 10న రిలయన్స్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment