Healthcare
-
బయోఏషియా 2025: ఒకే వేదికపై 80 సంస్థలు
ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ సమావేశమైన 'బయోఏషియా 2025' (BioAsia 2025) ఫిబ్రవరి 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 80 స్టార్టప్ బృందాలు పాల్గొంటాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యం ఉన్న.. వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బయోఏషియా 2025 ఈవెంట్లో పరిశ్రమల దిగ్గజాలతో ప్రత్యేకమైన సంభాషణలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆసక్తిని ఆకర్శించింది. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. అంతేకాకుండా.. స్టార్టప్‌ల వృద్ధికి కావాల్సిన అవకాలు కూడా ఇక్కడ లభించే అవకాశం ఉంది.బయోఏషియా 2025లో పాల్గొనడానికి స్టార్టప్‌ల నుంచి వచ్చిన ప్రతిస్పందనకు చాలా సంతోషిస్తున్నాము. బయోఏషియా లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ రంగాలలో ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించే ప్రపంచ వేదిక సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణను ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబెట్టడానికి, స్టార్టప్‌లు ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని.. మంత్రి డీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఐటీ & పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ఆసక్తిని ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి బయోఏషియా 2025 ప్రారంభించినట్లు వెల్లడించారు.బయోఏషియా 2025లో పాల్గొనడానికి దేశీయ, అంతర్జాతీయ వెంచర్లు పోటీ పడ్డాయి. ఇందులో సుమారు 700 వినూత్న స్టార్టప్ వెంచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరిశ్రమలు, విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహించే అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ వేదికలో ప్రదర్శన కోసం సుమారు 80 స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో కూడా ఉత్తమ ఐదింటికి అపూర్వ గౌరవం లభించనున్నట్లు సమాచారం. -
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్‌కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్‌లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి పోర్ట్‌ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్‌లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్‌డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్‌ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్‌వర్డ్‌లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్‌లను అన్‌లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్‌ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్‌లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్‌లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్‌ల స్క్రీన్‌ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్‌ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్‌ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్‌లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్‌లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్ భాగస్వామ్యం
ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ, హెల్త్‌కేర్(Health care) విభాగంలో తన భాగస్వామ్యాన్ని ముగించిందని ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న సస్తాసుందర్ తెలిపింది. బ్రాండ్ మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) తిరిగి పొందినట్లు వెల్లడించింది. వాల్‌మార్ట్ ప్రమోట్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ 2021లో సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్‌లో 75 శాతం వాటాను రూ.750 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ యాప్‌ను ప్రారంభిస్తామని సస్తాసుందర్ గ్రూప్ చైర్మన్ బి.ఎల్.మిత్తల్ తెలిపారు.ఇదీ చదవండి: సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్‘హోల్డింగ్ కంపెనీ సస్తాసుందర్ వెంచర్స్ కొత్తగా ఏర్పడిన అనుబంధ సంస్థ సస్తాసుందర్ హెల్త్‌టెక్ ద్వారా బ్రాండ్ ఐపీఆర్‌లు, పోటీ రహిత హక్కులను ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ నుండి తిరిగి పొందింది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాం. చివరి త్రైమాసికంలో లావాదేవీ పూర్తయింది. దీని ఫలితంగా నిలుపుకున్న 25 శాతం వాటాను రైట్ ఆఫ్ చేయడం వల్ల దాదాపు రూ.188 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది కేవలం టెక్నికల్ అకౌంటింగ్ నష్టం. కంపెనీకి భౌతిక నష్టం కాదు. ఆరోగ్య వ్యాపారం నుండి నిష్క్రమించాలన్న అంతర్జాతీయ ప్రణాళికను అనుసరించి ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కంపెనీ వారితోనే ఉంటుంది. వారు ఆ కంపెనీని ఏం చేస్తారనేది వారి ఇష్టం’ అని మిత్తల్ వివరించారు. -
బీమాకు లభించేనా ధీమా..?
న్యూఢిల్లీ: పౌరులందరికీ బీమా రక్షణను చేరువ చేసే దిశగా 2025 బడ్జెట్లో కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఇన్సూరెన్స్‌కు పన్ను ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహకాలు కల్పించాని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బీమా సుగమ్’కు నియంత్రణ, నిధుల పరమైన మద్దతు అవసరమన్నారు. ఆర్థిక సేవలు తగినంత అందుబాటులో లేని ప్రాంతాల్లోని వారికి బీమా సేవలు చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సబ్సిడీలపైనా బడ్జెట్లో దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. → ఎన్పీఎస్ మాదిరి పన్ను ప్రయోజనాలను లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ఉత్పత్తులకు సైతం కల్పించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ కోరారు. కొత్త పన్ను విధానంలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ప్రయోజనాన్ని కల్పించాలని, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు తీసుకురావాలని డిమాండ్ చేశారు. → ఐఆర్డీఏఐ నివేదిక ఆధారంగా జీవిత బీమా విస్తరణ (జీడీపీలో) 2022–23లో ఉన్న 4 శాతం నుంచి 2023–24లో 3.7 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది. → బడ్జెట్లో పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు మద్దతు చర్యలు ఉండొచ్చని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. పెన్షనర్లకు ప్రోత్సాహకంగా యాన్యుటీ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని బన్సాల్ డిమాండ్ చేశారు. దీంతో యాన్యుటీలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. → బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, బీమా ఉత్పత్తుల స్వీకరణను ప్రోత్సహించే దిశగా సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ అవకాశం కల్పిస్తోందని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ పేర్కొన్నారు. మరింత మంది బీమా రక్షణను తీసుకునేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పిస్తారన్న అంచనాను ఆయన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్‌కు సైతం బడ్జెట్లో కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా అందుబాటులోకి వస్తుందన్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తొలగించడం ఎంతో అవసరమని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాధుర్ అభిప్రాయపడ్డారు. బీమా మరింత మందికి చేరేందుకు వీలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.సుంకాలు, లైసెన్సు ఫీజులు తగ్గించాలిఓటీటీలు కూడా యూఎస్‌వో ఫండ్‌కి నిధులివ్వాలి కేంద్రానికి టెల్కోల బడ్జెట్ వినతులు న్యూఢిల్లీ: 4జీ, 5జీ నెట్వర్క్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను, లైసెన్సు ఫీజులను తగ్గించాలని కేంద్రాన్ని టెలికం సంస్థలు కోరాయి. అలాగే భారీగా డేటా వినియోగానికి కారణమయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్ట్రీమింగ్ సేవల సంస్థలు (ఎల్‌టీజీ) కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్)/డిజిటల్ భారత్ నిధి ఫండ్‌కి తప్పనిసరిగా చందా ఇచ్చేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఈ మేరకు బడ్జెట్‌పై తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లైసెన్సు ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తే టెలికం సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని సీవోఏఐ తెలిపింది. ఇక తాము బోలెడంత ఖర్చు పెట్టి నెలకొల్పిన నెట్‌వర్క్‌ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ, లాభాలు గడిస్తున్నా ఎల్టీజీలు .. పైసా కూడా కట్టడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవి కూడా తమలాగే యూఎస్‌వో ఫండ్‌కి చందా కట్టేలా చూడాలని కోరింది. తమపై విధిస్తున్న యూఎస్‌వో లెవీని పూర్తిగా తొలగించవచ్చని లేదా ప్రస్తుతమున్న రూ. 86,000 కోట్ల కార్పస్ పూర్తిగా ఖర్చు చేసేంతవరకైనా చందాలను నిలిపివేయొచ్చని సీవోఏఐ పేర్కొంది. టెల్కోలపై సుంకాల భారాన్ని తగ్గించడం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తుపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని వివరించింది. -
డాక్టర్.. C/O గూగుల్
సాక్షి, అమరావతి: ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలు వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి మానసిక వైద్యులను సంప్రదించాలంటే భయం, బెరుకు ఉంటాయి. ఎవరైనా చూస్తే పిచ్చోళ్ల కింద లెక్క కడతారనే అపోహలతో చాలా మంది ఆ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలా భావించే వారిసంఖ్య తగ్గుతోంది. మానసిక సమస్యలపై నిర్భయంగా వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో మానసిక వైద్యుల సమాచారం కోసం ఇంటర్నెట్లో శోధించిన వారి సంఖ్య 41 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అక్షరాస్యులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–అక్టోబర్ నెలల మధ్య మానసిక వైద్యుల కోసం అన్వేషిoచిన వారి సంఖ్య కోల్‌కతాలో 43 శాతం, ముంబై 36, కోజికోడ్ (క్యాలికట్)లో 29 శాతం చొప్పున పెరిగింది. ఈ అంశం జస్ట్ డయల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హెల్త్ కేర్ సెర్చ్‌లలో మెట్రో నగరాల్లో మొత్తంగా 15 శాతం వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 20, హైదరాబాద్ 17, చెన్నై వంటి నగరాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఆరోగ్య సమస్యలపై 23 శాతం పెరిగిన అన్వేషణ ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇంటర్నెట్లో అన్వేషించిన వారి సంఖ్య ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 23 శాతం పెరిగినట్టు తేలింది. ఆధునిక జీవన శైలి నేపథ్యంలో మధ్య వయసు్కల్లోనూ ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఆర్థోపెడిక్ సెర్చ్‌లు 38 శాతం పెరిగినట్టు వెల్లడైంది. అత్యధికంగా లక్నోలో 37, ఢిల్లీలో 36 శాతం చొప్పున పెరిగినట్టు తేలింది. బెంగళూరు, పాట్నా నగరాల్లో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్‌ల కోసం శోధనలు 28 శాతం పెరిగాయి. ఈ తరహా వృద్ధి హైదరాబాద్‌లో 31 శాతం, పూణేలో 33, ముంబైలో 29 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం ఆయుర్వేద వైద్యుల కోసం శోధనలు పెరిగాయి. ఢిల్లీలో 29 శాతం, ముంబైలో 21 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. సంప్రదాయ వైద్య పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తిని ఈ పెరుగుదల సూచిస్తోంది. అవగాహన పెరిగిందిగతంలో ప్రజలు మానసిక సమస్యలపై వైద్యులను సంప్రదించాలంటేనే ఎంతో భయపడేవాళ్లు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో మాదిరిగా భూత వైద్యం, మంత్ర, తంత్రాలను నమ్మే పరిస్థితులు పోతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం పిచ్చే కాకుండా ఆందోళన, అసహనం, భావోద్వేగ సమస్యలన్నీ మానసిక అనారోగ్యం కిందకే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులున్న వారు బయటకు చెప్పుకుంటే ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు. తమ సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ -
అంబానీ చేతికి మరో కంపెనీ: రూ.375 కోట్ల డీల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ కార్కినోస్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.375 కోట్లు. కార్కినోస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ (RSBVL) దక్కించుకుంది.కార్కినోస్ 2020లో ప్రారంభం అయింది. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నిర్ధారణ చేయడం, వ్యాధి నిర్వహణ కోసం సాంకేతికతతో కూడిన వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.22 కోట్ల టర్నోవర్‌ను ఆర్జించింది.కంపెనీ 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనుబంధ కంపెనీ ద్వారా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. కార్కినోస్ దివాళా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. ఆర్ఎస్బీవీఎల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదించినట్టు డిసెంబర్ 10న రిలయన్స్ ప్రకటించింది. -
రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు
మనిషికి వృద్ధాప్యం అనేది గడ్డుకాలమని చాలామంది అంటుంటారు. అలాంటి కాలం త్వరలో రానుంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 25 ఏళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాల్ విసురుతున్న వృద్ధాప్య జనాభాప్రస్తుతం భారతదేశంలో వృద్ధుల సంఖ్య దాదాపు 10.40 కోట్లు (104 మిలియన్లు), ఇది 2050 నాటికి 31.90 కోట్లకు (319 మిలియన్లు) చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య దశలో శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వృద్ధులు దీర్ఘకాలం జీవించగలుగుతారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రెండున్నర దశాబ్దాల్లో వృద్ధుల సంఖ్య మూడు రెట్లుఅసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోఛామ్) నేషనల్ కౌన్సిల్ ఆన్ సీఎస్ఆర్, చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ వృద్ధులకు వారి స్వతంత్రతను కాపాడుకునేందుకు, చురుకుగా ఉండటానికి అనువైన విధానాలను అనుసరించడం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం అనేది 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక సవాళ్లలో ఒకటిగా మారింది. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వృద్ధాప్య సంరక్షణపై కార్పొరేట్ రంగం, సమాజం, ప్రభుత్వాలు క్రియాశీల సహకారం అందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.వృద్ధాప్య సమస్యలను నియంత్రించే యోగాన్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుభాష్ మంచాంద ఇదే అంశంపై మాట్లాడుతూ వృద్ధులకు వచ్చే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలను నియంత్రించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాభ్యాసం వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధులు క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సుభాష్ మంచాంద పేర్కొన్నారు.సమతుల ఆహారంతో ఆరోగ్యంఢిల్లీలోని ఎయిమ్స్‌లో గల వృద్ధాప్య క్లినిక్ మాజీ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యం కోసం, ప్రజలు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలని, తగినంతసేపు నిద్రించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
ఫార్మా పవర్‌హౌస్‌గా భారత్: 2030 నాటికి అదే టార్గెట్..
ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) బీసీజీ భాగస్వామ్యంతో 'విన్నింగ్ ఇన్ ఇండియన్ హెల్త్‌కేర్' పేరుతో కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఓపీపీఐ యాన్యువల్ సమ్మిట్ 2024: వికసిత్ భారత్ 2047థీమ్‌తో ప్రారంభించారు. భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఫార్మా పవర్‌హౌస్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలి.. అనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ప్రస్తుతం భారతదేశ ఔషధ మార్కెట్.. విలువ సుమారు 60 బిలియన్లు. ఈ విలువ 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారత ఆరోగ్య సంరక్షణ రంగం ఒక బలమైన ఔషధ పర్యావరణ వ్యవస్థ ద్వారా త్వరిత విస్తరణకు సిద్ధంగా ఉంది. దేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో.. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. దీనికోసం వినూత్న సాంకేతికతలను ప్రవేశపెట్టారు. రోగుల సహాయ కార్యక్రమాలను అమలు చేశారు. కమ్యూనిటీ అవసరాలను తీర్చడానికి స్థానిక సామర్థ్యాలలో గణనీయమైన పెట్టుబడులు పెట్టారు.సుమారు 70 శాతం గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు.. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 10 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సాధించగలవని అంచనా. ఇది వికసిత భారత్ లక్ష్యానికి కూడా ఉపయోగపడుతుంది.ఈ కార్యక్రమంలో ఓపీపీఐ డైరెక్టర్ జనరల్ అనిల్ మాతాయ్ మాట్లాడుతూ.. భారతదేశ బలమైన ఫార్మా పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టితో కూడిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫార్మా పవర్‌హౌస్‌గా నిలిపింది. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ 120 బిలియన్లకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ పార్టనర్ ప్రియాంక అగర్వాల్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారతీయ ఫార్మా మార్కెట్ రెట్టింపు అవుతుందని చెబుతూ.. ప్రపంచ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గణనీయమైన అవకాశాలను అందజేస్తుందని తెలిపారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఇప్పటికే గణనీయమైన వ్యాపారాలను నిర్మించాయి. దేశీయ మార్కెట్‌కు సేవ చేయడానికి మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బలమైన ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు. -
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!
చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.ఆరోగ్య రంగంలోనూ..మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్లలో అనుమతించనున్నారు.దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్జౌ, షెన్జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. -
సెనోరెస్ ఫార్మా ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 27 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రీఐపీవో ప్లేస్మెంట్లో భాగంగా రూ. 100 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. దీంతో ఐపీవో పరిమాణాన్ని కుదించే అవకాశముంది. అర్హతగల కంపెనీ ఉద్యోగులకు కొంతమేర షేర్లను రిజర్వ్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర అట్లాంటాలోని స్టెరైల్ ఇంజక్షన్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. ఈ బాటలో అనుబంధ సంస్థల వర్కింగ్ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు సైతం నిధులు వినియోగించనుంది. -
హైదరాబాద్ సంస్థకు ఎస్కీన్ వెంచర్స్ రూ.80 కోట్లు హామీ
ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) విస్తరణకు తనుశ్రీ ఫౌండేషన్, ఎస్కీన్ వెంచర్స్ వ్యవస్థాపకులు సుశాంత్‌కుమార్ 9.6 మిలియన్ డాలర్లు (రూ.80 కోట్లు) సమకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో భాగంగా సీఎఫ్హెచ్ఈ ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘సీఎఫ్హెచ్ఈ ఆవిష్కరణలు చాలా మంది రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేసేలా ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ కేంద్రం చేస్తున్న సేవలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఔత్సాహిక ఆరోగ్య సంరక్షణ వ్యాపారవేత్తలను పెంపొందించడంలోనూ సీఎఫ్హెచ్ఈ సహకారం అందిస్తుంది. హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేస్తున్న వారికి కావాల్సిన ప్రోత్సాహం, వనరులు అందించడం గొప్ప విషయం’ అని అన్నారు. సీఎఫ్హెచ్ఈ హెడ్ ప్రొఫెసర్ రేణు జాన్ మాట్లాడుతూ ‘హెల్త్‌కేర్ టెక్నాలజీలో సమీప భవిష్యత్తులో చాలాపురోగతి రాబోతుంది. అందులో సుశాంత్‌కుమార్ భాగమవ్వడం ఆహ్వానించదగ్గ విషయం. ఆరోగ్య సంరక్షణ విభాగంలో చాలా కంపెనీలు కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి సరైన వనరులు, ప్రోత్సాహం ఉంటే మరింత వృద్ధి సాధిస్తాయి’ అని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ‘సమాజంలో డయాగ్నస్టిక్స్ పరికారాల్లో సరైన ఆవిష్కరణలు లేక చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి ఐఐటీ హైదరాబాద్, సీఎఫ్హెచ్ఈ పనిచేస్తున్నాయి. అవసరాలకు తగిన వైద్య పరికరాల సరఫరా, శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను అందించడంలో ఈ కేంద్రం ముందుంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా దృక్పథంతో స్టార్ట్అప్లను ప్రోత్సహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే.. సీఎఫ్హెచ్ఈలోని కొన్ని ఆవిష్కరణలు.. ఆర్మబుల్ అనే న్యూరోరిహాబిలిటేషన్ డివైజ్‌ను కనుగొనేలా బీఏబుల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌కు ప్రోత్సాహం అందించింది. నిమోకేర్రక్ష అనే నవజాత శిశువులను రక్షించడానికి ధరించగలిగే చిన్న పరికారాన్ని తయారుచేసేందుకు కావాల్సిన వనరులను అందించింది. దీన్ని నిమోకేర్వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసింది. జీవికా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడేళ్లలో 2.5 మిలియన్ మందికి ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ ప్లాట్‌ఫారమ్ ద్వారా టీకాలు అందించే ప్రయత్నం చేశారు. -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్‌వర్క్‌లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్‌లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్‌్కలు, సర్జికల్ గ్లోవ్‌లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్‌పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్‌కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్‌లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్‌మెంట్‌కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్‌కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్‌కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్‌తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్‌లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్‌కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్‌లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్‌కేర్‌కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్‌లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్‌తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్‌తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్‌ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్‌ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్‌గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్‌గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్‌లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్‌పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్ -
డాక్టర్ల చేతికి ‘ఏఐ’స్కోప్!
సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది. వైద్యులు కేస్‌షీట్‌లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది. ♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది. ♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు. ♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. ♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు. ♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్‌రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు. ♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది. ♦ 2023లో యాక్స్డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్‌లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. ♦ యూఎస్‌కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్‌ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు. క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
హెల్త్‌కేర్ అక్రమాలపై ‘ఏఐ’ మంత్రం!
భారత్‌లో హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ)లో ఏటా జరుగుతున్న అవకతవకలు కనిష్టంగా రూ.800 కోట్లు. ఇది కేవలం బీమా కంపెనీలు, ట్రస్టులు, హైబ్రీడ్ విధానంలో ఆరోగ్య సేవలందిస్తున్న కంపెనీల్లో జరిగేది మాత్రమే. ఇక వ్యక్తిగతంగా సర్విసులు పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన కేటగిరీలో జరిగే అక్రమాలు ఇంతకు ఎన్నో రెట్లు ఉంటాయి. –ఆరోగ్య సంరక్షణలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అమలు నివేదికలో డబ్ల్యూహెచ్ఓ సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే హెల్త్‌కేర్ కేటగిరీలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పద్ధతుల వినియోగం ద్వారా చెక్ పెట్టొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యాక అందించే చికిత్స, శస్త్రచికిత్సలో వివిధ రకాల పరికరాలు, మందులను వినియోగిస్తారు. ఈ ఖర్చంతా రోగి ఖాతాలో జమచేసి బిల్లులు వసూలు వేస్తారు. ఈ క్రమంలో అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రోగి డిశ్చార్జ్ సమయంలో బిల్లును పూర్తిస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేకుండా మొత్తం బిల్లు వసూలు చేస్తారు. అయితే బీమా కంపెనీలు, ట్రస్టుల ద్వారా అమలయ్యే హెల్త్ కేర్ కార్యక్రమాల్లో ఈ బిల్లును కూలంకశంగా పరిశీలించి అవసరమైన మేరకు బిల్లును కుదించడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో అనవసర మందులు, వినియోగాన్ని గుర్తించి బిల్లు నుంచి తొలగించే సందర్భాలను ప్రస్తావిస్తూ డబ్ల్యూహెచ్ఓ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ అవకతవక లకు చెక్ పెట్టేందుకు ఏఐ, ఎంఎల్‌ను అందుబాటులోకి తీసుకొస్తే పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. తెలంగాణ విధానం భేష్ ఏఐ, ఎంఎల్ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రస్తావించింది. ‘రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లు, లబి్ధదారుల గుర్తింపు ప్ర క్రియలో ఏఐ, ఎంఎల్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. పెన్షన్ల పథకంలో ఏఐ విధానంలో భాగంగా బయోమెట్రిక్ ద్వారా లబి్ధదారు లైవ్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పలు పథకాల్లో ఆన్లైన్ పద్ధతిలో వెరిఫికేషన్ చేయడం ద్వారా పారదర్శకంగా ఎంపికప్రక్రియను నిర్వహిస్తోంది. ఇక్కడ 96 శాతం సక్సెస్ రేట్ ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకంలో కొంతవరకు ఏఐని తెచ్చారు. ఆరోగ్యశ్రీలో ఫొటో తీసుకుని డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే సర్జరీకి ముందే లబ్ధిదారు నిర్ధారణ చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ‘ఆయుష్మాన్’లో ప్రైవేటు ఆస్పత్రులు చేరట్లేదు ఆయుష్మాన్ భారత్ పథకానికి కేటాయించిన నిధుల్లో 60 శాతం మాత్రమే ఖర్చవుతోందని పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అలాగే, దేశంలోని 30 శాతం మందికి ఏ రకమైన ఆరోగ్య సంరక్షణ లేదని తెలిపింది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా సగానికిపైగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకంలో చేరలేదు. కృత్రిమ మేథను సమర్థవంతంగా వినియోగిస్తే ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసి సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వినర్ -
2023లో ఏఐ హవా.. టెక్నాలజీలో పెను సంచనలం..
Artificial Intelligence: 2023లో సంచనలం సృష్టించిన టెక్నాలజీ ఏదైనా ఉందంటే.. అది తప్పకుండా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) అనే చెప్పాలి. స్మార్ట్ఫోన్లే కుండా ఈ రోజుల్లో మనిషి ఎలా అయితే ఉండలేక పోతున్నాడో.. నేడు AI సహాయం లేకుండా కూడా ఉండలేడేమో అన్నట్టుగా అయిపోతోంది. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించిన ఈ టెక్నాలజీ ప్రభావం ఎంతగా ఉందనే విషయాన్ని ఈ కథనంలో పరిశీలిద్దాం.. ఆరోగ్య సంరక్షణలో ఏఐ హస్తం ఓ వైపు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మనిషి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. దీని కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. వర్కౌట్ ప్లాన్స్, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్లాన్స్, మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్, మెడికల్ సింప్టమ్ చెకర్, మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి విషయంలో ఎక్కువ మంది టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అటానమస్ సిస్టం (స్వయం ప్రతిపత్తి) టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో చాలామంది ఆటోమాటిక్ విధానానికి అలవాటు పడుతున్నారు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు నుంచి మానవరహిత వైమానిక వాహనాల వరకు టెక్నాలజీ వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ.. వినియోగించడానికి కొంత భయపడుతున్నట్లు సమాచారం. అటానమస్ సిస్టం మీద నమ్మకం పెంచడానికి, సమర్థవంతమైన రవాణాకు హామీ ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆటోమోటివ్ పరిశ్రమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో అటానమస్ సిస్టం రాజ్యమేలే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ లాంగ్వేజ్ మాదిరిగా ఏఐ కోసం ప్రత్యేకమైన లాంగ్వేజ్ అంటూ ఏది లేదు. ప్రారంభంలో కేవలం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అనేక భాషల్లో అందుబాటులోకి వస్తోంది. వివిధ భాషలను ఏఐ అర్థం చేసుకోవడం వల్ల వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ.. రోజు రోజుకి తనవైపు ఎంతోమంది ప్రజలను ఆకర్షిస్తోంది. -
ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్ హీరో
మారుతున్న జీవనశైలి కారణంగా లైంగిక ఆరోగ్యం, సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. అందుకోసం కొన్ని కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రానున్నరోజుల్లో ఆ సంస్థలకు ఆదరణ పెరుగుతుందని భావించి ప్రముఖులు సైతం అందులో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ‘బోల్డకేర్’ అనే సంస్థకు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ సహ యజమానిగా చేరారు. సమాజంలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో చాలా అవగాహన పెంపొందించాల్సి ఉందని, అందులో భాగంగా ఈ కంపెనీ ఎంతో కృషి చేస్తుందని రణ్వీర్ సింగ్ అన్నారు. ‘ఈ కంపెనీ లైంగిక ఆరోగ్య సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందిస్తోంది. బోల్డ్ కేర్ సహ యజమానిగా బోర్డులోకి రావడం సంతోషంగా ఉంది. లైంగిక ఆరోగ్యం, సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించడం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా పురుషులు లైంగిక సమస్యలు, సంరక్షణ అంశాలను పంచుకోవడానికి సిగ్గుపడతారు. ఈ కంపెనీ అలాంటి వారికి ఎంతో మేలు చేస్తోంది’ అని ఆయన తెలిపారు. ‘లైంగిక సమస్యలు ఉన్న వ్యక్తులు మానసికంగా చాలా బాధను అనుభవిస్తారు. వారికి ఓదార్పుతోపాటు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సమాజంలో ఇలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆలోచన వల్లే నా కెరీర్ ప్రారంభంలో కండోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశాను. సమస్యతో బాధపడుతున్న ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని రణ్వీర్ సింగ్ వివరించారు. ఇదీ చదవండి: సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం.. 2021లో ప్రారంభమైన బోల్డ్ కేర్ కంపెనీ ఈ ఏడాదికిగాను రూ.40 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సంస్థ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల యూనిట్లకు పైగా కండోమ్‌లను విక్రయించింది. కంపెనీ 15 లక్షలకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. -
సాధారణ బీమా మరింత విస్తరించాలి
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది. సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు. బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. -
Dhruvi Panchal: వన్స్‌మోర్ వంటలు
అహ్మదాబాద్‌లోని ఒక హెల్త్‌కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్‌కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
ఏషియా హెల్త్‌కేర్ గూటికి ఏఐఎన్‌యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ(ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్(ఏహెచ్‌హెచ్) తాజాగా పేర్కొంది. తదుపరి దశలో రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పెట్టుబడులను ప్రైమరీ, సెకండరీ ఈక్విటీ మార్గంలో చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా కొనుగోలు ద్వారా ఏహెచ్‌హెచ్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోకి ప్రవేశించనుంది. డాక్టర్లయిన సి. మల్లికార్జున్, పి.సి. రెడ్డిల నేతృత్వంలో ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్యూను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్, విశాఖపట్టణం, సిలిగురి, చెన్నైలలో 7 ఆసుపత్రులు ఉన్నాయి. రోబోటిక్ యూరాలజీ సర్జరీలో ప్రత్యేకతను కలిగి ఉంది. 500కుపైగా పడకలతో సేవలను అందిస్తోంది. 4 లక్షలకుపైగా రోగులకు సేవలు అందించడంతోపాటు యూరాలజీలో 1,000కి పైగా రోబోటిక్ సర్జరీలను పూర్తి చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌కు ఏఐఎన్‌యూ కొత్త స్పెషాలిటీలను జత చేయడమేకాకుండా సంస్థ విజన్ మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడనుందంటూ ఏహెచ్‌హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలి పేర్కొన్నారు. నగరాలలోనేకాకుండా టైర్–2 పట్టణాలలోనూ యూరాలజీ రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు ఏఐఎన్‌యూ ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున్ తెలియజేశారు. భవిష్యత్‌లో యూరోఆంకాలజీ, యూరోగైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ సేవలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఈడీ పి.సి. రెడ్డి వివరించారు. సంస్థ తదుపరి దశ వృద్ధికి ఏహెచ్‌హెచ్ దోహదపడగలదని పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఏహెచ్‌హెచ్ పోర్ట్‌ఫోలియోలో మదర్‌హుడ్ హాస్పిటల్స్, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు ఉన్నాయి. మదర్‌హుడ్ హాస్పిటల్స్‌కు 11 నగరాల్లో 23 మహిళా, శిశు ఆస్పత్రులు, నోవా ఐవీఎఫ్‌కు 44 నగరాల్లో 68 ఐవీఎస్ సెంటర్లు ఉన్నాయి. -
ఏఐఎన్‌యూలో ఏషియన్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ మెజారిటీ వాటా
హైదరాబాద్: సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) సంస్థ.. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు గాను దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను తీసుకుంది. ఏఐఎన్‌యూకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఆస్పత్రులు ఉండటంతో పాటు రోబోటిక్ యూరాలజీ సర్జరీలలో ముందంజలో ఉన్న ఘనత ఉంది. ప్రైమరీ, సెకండరీ ఇన్‌ప్యూజన్ల ద్వారా ఏహెచ్‌హెచ్ ఈ సంస్థలో రూ.600 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఏహెచ్‌హెచ్ ఇప్పుడు యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంలోకి ఈ పెట్టుబడి ద్వారా అడుగుపెట్టడంతో నాలుగో స్పెషాలిటీలోకి కూడా వచ్చినట్లయింది. తద్వారా, భారతదేశంతో పాటు ఆసియా ఉపఖండంలోనే ఏకైక అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అవుతుంది. ఏహెచ్‌హెచ్ 2017లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఆంకాలజీ (సీటీఎస్ఐ), మహిళలు, పిల్లలు (మదర్‌హుడ్ హాస్పిటల్స్), ఐవీఎఫ్, సంతాన సాఫల్యం (నోవా ఐవీఎఫ్) ఆస్పత్రులలో వాటాలు తీసుకుంది. ఇవన్నీ ఆయా రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నవే. డాక్టర్ సి.మల్లికార్జున, డాక్టర్ పి.సి. రెడ్డిల నేతృత్వంలోని ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్యూను స్థాపించారు. అప్పటినుంచి దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ క్లినికల్ స్పెషాలిటీలో ప్రముఖ ఆస్పత్రిగా ఎదిగింది. ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, సిలిగురి, చెన్నై నగరాల్లో ఏడు ఆస్పత్రులు నడుపుతోంది. వీటన్నింటిలో కలిపి 500కు పైగా పడకలున్నాయి, 4 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స చేసి, 50వేల ప్రొసీజర్లు పూర్తిచేసింది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలలో ఏఐఎన్‌యూ నాయకత్వస్థానం సంపాదించింది. ఇప్పటికి ఈ టెక్నాలజీతో వెయ్యికి పైగా ఆపరేషన్లు పూర్తిచేసింది. ఇక నెఫ్రాలజీ విభాగం విషయానికొస్తే, 2 లక్షలకు పైగా డయాలసిస్‌లు, 300 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు ఇక్కడ చేశారు. “యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఏఐఎన్‌యూ ఒక విభిన్నమైన సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్. ఆయా విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు.. క్లినికల్ నైపుణ్యం అనే పునాదిపై దీన్ని నిర్మించారు. ఏహెచ్‌హెచ్ ప్లాట్‌ఫాంలో ఏఐఎన్‌యూ కేవలం ఒక కొత్త స్పెషాలిటీని కలపడమే కాక, దేశంలో సింగిల్ స్పెషాలిటీ వైద్యవ్యవస్థను మరింత పెంచాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. యూరలాజికల్ సమస్యలు అత్యంత ఎక్కువగా ఉన్న టాప్-3 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక్కడ మధుమేహం, రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) కూడా ఎక్కువగా ఉంటోంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యసేవలకు ఉన్న డిమాండుకు, సరఫరాకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఏఐఎన్‌యూ మాతో కలవడం మాకెంతో సంతోషంగా ఉంది” అని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి తెలిపారు. ఏఐఎన్‌యూ తన ఆస్పత్రులన్నింటిలో యూరాలజీ సమస్యలకు అత్యాధునిక చికిత్సను అందిస్తుంది. దీని సమగ్ర సేవలలో మూత్రపిండాల్లో రాళ్లు, యూరాలజీ క్యాన్సర్లు, ప్రోస్టేట్ వ్యాధులు, పునర్నిర్మాణ యూరాలజీ శస్త్రచికిత్స, లాపరోస్కోపిక్ యూరాలజీ, ఆండ్రాలజీకి రోగనిర్ధారణ, చికిత్స ఉన్నాయి. నెఫ్రాలజీ విభాగంలో తీవ్రమైన, దీర్ఘకాలిక, తుది దశ మూత్రపిండ వ్యాధులకు (ఇఎస్ఆర్డీ) చికిత్సను అందిస్తారు. అలాగే మెరుగైన క్లినికల్ ఫలితాలను అందించడానికి హై-ఎండ్ హిమోడయాఫిల్టరేషన్ (హెచ్డీఎఫ్) యంత్రాలతో కూడిన అత్యాధునిక డయాలసిస్ యూనిట్ ఉంది. “భారతీయులకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు, కేన్సర్ రహిత ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ సమస్యలు ఎక్కువ. గత దశాబ్ద కాలంలో యూరలాజికల్ కేన్సర్లు కూడా ఎక్కువ కావడాన్ని మేం గమనించాం. ప్రోస్టేట్, బ్లాడర్ కేన్సర్లు ఎక్కువవుతున్నాయి. మా బృందం యూరలాజికల్ కేన్సర్లకే వెయ్యి రోబోటిక్ సర్జరీలు చేసింది. కేవలం భారతీయ నగరాల్లోనే కాక, 2టైర్ పట్టణాల్లోనూ రోబోటిక్ యూరాలజీ సర్జరీలను అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో యూరో-ఆంకాలజీ, యూరో-గైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. ఏహెచ్‌హెచ్ రాబోయే కాలంలో మా తదుపరి దశ వృద్ధికి సరైన భాగస్వామి అవుతుందని నమ్ముతున్నాం” అని ఏఐఎన్‌యూ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లికార్జున చెప్పారు. “భారతదేశ జనాభాలో సుమారు 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా మూత్రపిండాల వైఫల్యం కేసులు నమోదవుతున్నాయి. ఇది భారతదేశంలోని రోగులకు నెఫ్రాలజీ చికిత్సలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని పెంచుతోంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నందున, క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి, మెరుగైన రోగి సంరక్షణ కోసం డయాలసిస్, మూత్రపిండాల మార్పిడిలో సాంకేతిక పురోగతి చాలా అవసరం” అని ఏఐఎన్‌యూ సీనియర్ యూరాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి అన్నారు. 2022లో భారతదేశం సుమారు 1.89 కోట్ల నెఫ్రాలజీ, యూరాలజీ విధానాలను నమోదు చేసింది. వచ్చే ఐదేళ్లలో సిఎజిఆర్ 8-9% పెరుగుతుందని అంచనా. భారత్ లో 6,000 మంది యూరాలజిస్టులు, 3,500 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 350 మంది యూరాలజిస్టులు, 250 మంది నెఫ్రాలజిస్టులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. లాపరోస్కోపిక్, ఎండోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా ఎంపికల పెరుగుదల దేశంలోని మెట్రోలు, ద్వితీయ శ్రేణి నగరాలలో ఎఐఎన్యుకు బలమైన వృద్ధి అవకాశాన్ని ఇస్తుంది. ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ గురించి 2017లో ప్రారంభమైన ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) అనేది సింగపూర్‌కు చెందిన సావరిన్ హెల్త్ ఫండ్ అయిన టిపిజి గ్రోత్, జిఐసి నిధులతో ఏర్పడిన సింగిల్ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్, ఆపరేటింగ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం. భారతదేశంలోని 11 నగరాల్లో 23 చోట్ల మహిళలు, పిల్లల ఆసుపత్రుల సమగ్ర నెట్వర్క్ అయిన మదర్‌హుడ్ హాస్పిటల్స్ దీని పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు భారతదేశం, దక్షిణాసియాలోని 44 నగరాల్లో 68 ఐవిఎఫ్ సెంటర్లున్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీని కూడా ఏహెచ్‌హెచ్ కలిగి ఉంది. ఏహెచ్‌హెచ్ భారతదేశంలోని రెండో అతిపెద్ద ఆంకాలజీ ఆసుపత్రుల చైన్ అయిన సీటీఎస్ఐని ఏర్పాటుచేసి, 2019 లో కంపెనీ నుంచి నిష్క్రమించింది. ఏఐఎన్‌యూ గురించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు భారతదేశంలో అతి పెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి. దేశంలోని నాలుగు నగరాల్లో ఏడు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన బృందాలు ఉన్నాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో క్లినికల్ నైపుణ్యాలకు ఇది పెట్టింది పేరు. దాంతోపాటు యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలూ అందిస్తుంది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు దేశంలోనే ఇది ఆదర్శప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆస్పత్రి నెట్‌వర్క్‌లో 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికిపైగా రోగులకు చికిత్సలు చేసింది. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ, నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ)ల గుర్తింపు ఉంది. -
హైదరాబాద్‌లో జీహెచ్ఎక్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ, ఐటీ రంగాలకు హైదరాబాద్‌లో అనువైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ ఆధారిత టెక్నాలజీ కార్యకలాపాల విస్తరణకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ గురువారం జీహెచ్ఎక్స్ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందంతో భేటీ అయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్లోబల్ హెల్త్‌కేర్ ఎక్సే్ఛంజ్ (జీహెచ్ఎక్స్) ఈ సందర్భంగా ప్రకటించింది. హెల్త్‌కేర్ రంగం పురోగతికి అవసరమైన వాతావరణం, మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చేయూత అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేటీఆర్ తెలిపారు. డిజిటల్ దిశగా హెల్త్‌కేర్ ఆరోగ్య సంరక్షణ రంగం పూర్తిగా డిజిటల్ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ఐటీ ఆధారిత సేవలపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం ఏర్పాటు ద్వారా సంస్థ లక్ష్యాలను అందుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాలను 2025 నాటికి మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలను చేపడతామని చెప్పారు. -
వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాల ఉత్పత్తి, ఆరోగ్య రక్షణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ) కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెడ్‌ట్రానిక్‌కు అమెరికా అవతల ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానుంది. ఆరోగ్య రక్షణ సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణల రంగంలో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంస్థ నిర్ణయం ఊతమివ్వనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో మెడ్‌ట్రానిక్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయింది. ప్రస్తుత పెట్టుబడితో వచ్చే ఐదేళ్లలో 1,500కు పైగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తాము ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్ పెట్టుబడి నిదర్శనమని అన్నారు. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు మెడ్‌ట్రానిక్ విస్తరణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి నాయకత్వం వహించేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ట్ మైక్ మరీనా అన్నారు. మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, మెడ్‌ట్రానిక్ వైస్ ప్రెసిడెంట్ దివ్య ప్రకాష్ జోషి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ‘ఆక్యూజెన్ కేంద్రం’ అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తున్న బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆక్యూజెన్’ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీన్ థెరపీ, రీజనరేటివ్ సెల్ థెరపీ వ్యాక్సిన్ల తయారీకి సహకారం అందించడం వంటి ముఖ్యమైన కార్యకలాపాలను ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తుంది. ఆక్యూజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అరుణ్ ఉపాధ్యాయ తదితరులు గురువారం అమెరికాలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశోధన అభివృద్ధి కేంద్రం ద్వారా తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామని శంకర్ ముసునూరి తెలిపారు. దీని ద్వారా రీజనరేటివ్ జెనెటిక్ చికిత్సలకు అవసరమైన మందుల తయారీలో తమకు అవకాశం కలుగుతుందని అరుణ్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన బయోటెక్ పరిశ్రమలు, ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నందున దేశీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెద్ద ఎత్తున రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ బయోటెక్ పరిశ్రమ 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఆరోగ్యానికి వారధి
‘అనుభవాలే పాఠాలు అవుతాయి’ అనే మాటను అనేకసార్లు విని ఉన్నాం మనం.మరి అనుభవాలే అంకురాలు (స్టార్టప్) అవుతాయా?‘వై నాట్!’ అంటున్నారు మయాంక్ కాలే (27), అమృత్‌సింగ్ (27)మూడు పదుల వయసు దాటకుండానే హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’తో ఘన విజయం సాధించి సత్తా చాటారు.స్టార్టప్‌కు సామాజిక కోణం జత చేసి విజయవంతం అయ్యారు... యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్(యూఎస్)లో చదువుకునే రోజుల్లో చదువును మధ్యలోనే ఆపేయాలని మయాంక్, అమృత్‌లు నిర్ణయించుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు.‘ఇంతకీ ఏంచేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు.తమ భవిష్యత్ చిత్రపట్టాన్ని రంగుల్లో చూపారు మయాంక్, అమృత్‌లు.వారి వారి తల్లిదండ్రులకు నచ్చిందో లేదో తెలియదుగానీ ‘ముందు చదువు పూర్తి చేయండి. ఆతరువాత ఆలోచిద్దాం’ అన్నారు. ఇప్పుడు చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి మనం..మయాంక్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. దీంతో ఒక్కగానొక్క కొడుకైన మయాంక్ ఆఘమేఘాల మీద ఇండియాకు వచ్చాడు. తండ్రి సమస్య సర్జరీ వరకు వెళ్లింది.ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కు ప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడుగానీ చాలామంది హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. ఇది తన దృష్టిలో నిలిచిపోయింది. యూనివర్సిటీకి తిరిగి వెళ్లిన తరువాత అమృత్‌తో కలిసి పేషెంట్ల హెల్త్‌కేర్‌కు సంబంధించి డిజిటల్ హెల్త్‌కేర్ రికార్డ్లను క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. దీన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామీణ్రపాంతాలలో విజయవంతంగా ప్రయోగించారు.ఈ విజయం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.చదువులు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చారు మయాంక్, అమృత్. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో రకరకాల అప్లికేషన్లను డెవలప్ చేయడంప్రా రంభించారు.మన జనాభాలో అతి కొద్దిమందికి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా చాలామందిలో ‘మెడికల్ ఎడ్యుకేషన్’ ఉండడం లేదు. దీనివల్ల వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లి లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ ఇన్సూరెన్సులు పెరుగుతున్నాయి. అయితే వ్యక్తిగత (రిటైల్) ఇన్సూరెన్స్‌లు తగ్గాయి. దీనికి కారణం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి పాలసీలు తీసుకోవాలి... మొదలైన విషయాలపై అవగాహన లేకపోవడం... ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పుణె కేంద్రంగా హెల్త్‌కేర్ అండ్ ఇన్సూటెక్ స్టార్టప్ ‘లూప్’కు శ్రీకారం చుట్టారు మయాంక్, అమృత్‌సింగ్.‘లూప్’ ద్వారా వైద్య విషయాలపై అవగాహనతో పాటు, ప్రైమరీ కేర్ (్రపాథమిక ఆరోగ్య సంరక్షణ)కు సంబంధించి డాక్టర్‌తో యాక్సెస్, ఫ్రీ కన్సల్టెషన్లు, ఆన్లైన్ యోగా సెషన్స్... మొదలైన ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీలకు, ఇన్సూరెన్స్ప్రొవైడర్లకు మధ్య ‘లూప్’ సంధానకర్తగా వ్యవహరిస్తోంది.దిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె...మొదలైన పట్టణాలలో ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది లూప్.‘మయాంక్, అమృత్లకు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై మంచి అవగాహన ఉంది. అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో లూప్ భవిష్యత్‌లో ఎంతోమందికి సహాయంగా నిలవనుంది’ అంటున్నాడు గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ‘ఎలివేషన్ క్యాపిటల్’ భాగస్వామి ఖందూజ. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్–చెకప్‌కు ఉద్దేశించిన ఫిజికల్ ‘లూప్–క్లీనిక్’లపై ట్రయల్స్ చేస్తున్నారు.‘లూప్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది.మయాంక్ (కో–ఫౌండర్ అండ్ సీఈఓ, లూప్), అమృత్ (కో–ఫౌండర్, లూప్)ల లక్ష్యం ఫలించింది అని చెప్పడానికి ఇది చాలు కదా! ఇంటికి, హాస్పిటల్స్‌కు వెళ్లే క్రమంలో మయాంక్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో అతడికి గట్టిగా బోధపడిన సత్యం ఏమిటంటే ‘ప్రైమరీ కేర్’కుప్రా ధాన్యం ఇస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. -
5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్‌గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ విషయాలు చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్ టైమ్‌లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్ కన్సల్టేషన్లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్ చెప్పారు. అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు. -
టెక్‌యేతర ఉద్యోగాలకు డిమాండ్
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్‌లపై అంతర్జాతీయ జాబ్ సైట్ ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్‌కేర్ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి. ఫుడ్ సర్వీసెస్ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్ విభాగంలోనూ హైరింగ్ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది. బెంగళూరు టాప్.. జాబ్ పోస్టింగ్స్ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్‌లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది. ప్రయాణాలపై కోవిడ్–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్‌లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్ 14.34 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్‌లో హైరింగ్ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్‌డీడ్ ఇండియా హెడ్ (సేల్స్) శశి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్ మార్కెట్‌కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. -
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
60 ఏళ్లకు చేరువయ్యారా?.. అయితే రోజు ఎన్ని అడుగులు వేస్తే గుండెకు..
సాక్షి, అమరావతి: నడక నాలుగు విధాలుగా మేలు... అని తరచూ వైద్యులు చెబుతుంటారు. మంచి ఆరోగ్యం కోసం 18 ఏళ్లు పైబడిన వారు వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి కనీసం 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయాలని డబ్ల్యూహెచ్‌వో కూడా సూచిస్తోంది. ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. తాజాగా ఇదే విషయం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ పరిశోధకుల అధ్యయనంలోనూ వెల్లడైంది. 60 ఏళ్లు పైబడిన వారు రోజు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిదని నిర్ధారించింది. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా సహా 42 దేశాల్లో 18 ఏళ్లు పైబడిన 20,152 మంది డేటాను ఎనిమిది కోణాల్లో పరిశోధకులు విశ్లేషించారు. ఆరేళ్ల పాటు వీరు నడుస్తున్న దూరం, ఆయా వ్యక్తుల్లో కార్డియోవాసు్కలర్ డిసీజ్ (సీవీడీ), నాన్ ఫాటల్ కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలను బేరీజు వేశారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చని గుర్తించారు. రోజుకు రెండు వేల అడుగులు మాత్రమే నడిచే వారితో పోలిస్తే వీరిలో గుండెపోటుతోపాటు పక్షవాతం ముప్పు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. వృద్ధులకే కాదు అన్ని వయసులవారు నడక, వ్యాయామం, జాగింగ్, ఇతర శారీరకశ్రమ కార్యకలాపాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టంచేశారు. అయితే డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రమాణాల మేరకు 41.3 శాతం మంది దేశంలో శారీరకశ్రమ చేయడం లేదని 2021లో ఒక సర్వేలో ఐసీఎంఆర్ తెలిపింది. అన్ని వయసుల వారికి ఉత్తమం నడక చక్కటి, సహజమైన వ్యాయామం వంటిది. రోజు వారి దినచర్యలో అన్ని వయసులవారు నడకను అలవాటుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలో శారీరక శ్రమ చేయడం చాలా వరకూ తగ్గిపోయింది. దీనికితోడు ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, ఇతర జీవనశైలి జబ్బుల బారినపడుతున్నారు. వీటిని జయించి ఆరోగ్యంగా ఉండాలంటే నడక ఒక్కటే ఉత్తమ మార్గం. రోజు 30నిమిషాలు నడవడంవల్ల రక్తపోటు, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. 45ఏళ్లు పైబడినవారు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు కొత్తగా నడక, వ్యాయామం ప్రారంభిస్తున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. మధుమేహం సమస్య ఉన్నవారు ఇన్సులిన్ తీసుకుంటుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడక, వ్యాయామం కొనసాగించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూల్ జీజీహెచ్ రోజు నడకతో ప్రయోజనాలు... ►రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. ►శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతాయి. ►మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులను అదుపులో ఉంటాయి. ►మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ►మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. ►ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పుంజుకుంటాయి. -
ఎన్ఎస్ఈలో జిమ్ ల్యాబ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: జనరిక్ ప్రొడక్టుల హెల్త్‌కేర్ కంపెనీ జిమ్ ల్యాబొరేటరీస్ తాజాగా ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. శుక్రవారం రూ. 336 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 340 వద్ద గరిష్టం, రూ. 330 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 3 శాతం లాభంతో రూ. 332 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2018 జూన్‌లోనే లిస్టయిన స్మాల్ క్యాప్ కంపెనీ వారాంతాన ఎన్ఎస్ఈలోనూ లిస్టింగ్‌ను సాధించింది. విభిన్న, నూతన తరహా జనరిక్ ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, ఎండీ అన్వర్ డి. పేర్కొన్నారు. వీటిని ఈయూ మార్కెట్లలో ఫైలింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రధానంగా నూతనతరహా డ్రగ్ డెలివరీ సొల్యూషన్స్ అందిస్తోంది. -
నారాయణ హృదయాలయ విస్తరణ
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సేవల కంపెనీ నారాయణ హృదయాలయ బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఆసుపత్రిని కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వ్యాపార బదిలీకి వీలుగా శివ అండ్ శివ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా స్లంప్ సేల్ పద్ధతిలో ఆర్థోపెడిక్ ట్రౌమా ఆసుపత్రిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఆసుపత్రికి సంబంధించిన అన్నిరకాల ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, లైసెన్సులు, కాంట్రాక్టులు బదిలీకానున్నట్లు వివరించింది. స్పార్‡్ష గ్రూప్ హాస్పిటల్స్‌కు చెందిన సంస్థ 100 పడకల సామర్థ్యంతో దశాబ్దకాలానికిపైగా ఆర్థోపెడిక్ సర్వీసులను అందిస్తోంది. గతేడాది ఈ యూనిట్ రూ. 49 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వార్తల నేపథ్యంలో నారాయణ హృదయాలయ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. -
ఐపీవోకు బ్లూజెట్ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ కంపెనీ బ్లూ జెట్ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు అక్షయ్ భన్సారీలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా దాదాపు 2.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా రూ. రూ. 1,800– 2,100 కోట్ల మధ్య సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై కంపెనీ బ్లూ జెట్ ప్రధానంగా స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ సంబంధ ఇన్‌గ్రెడియంట్స్, ఇంటర్మీడియట్లను రూపొందిస్తోంది. ఇన్నోవేటర్ ఫార్మాస్యూటికల్, మల్టీనేషనల్ జనరిక్ కంపెనీలకు ప్రత్యేకతరహా ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. గతేడాది(2021–22) ఆదాయం 37 శాతం ఎగసి రూ. 683 కోట్లను అధిగమించింది. నికర లాభం 34 శాతం జంప్‌చేసి దాదాపు రూ. 182 కోట్లకు చేరింది. కంపెనీ రుణరహితంకాగా.. మహారాష్ట్రలోని షహద్, అంబర్నాథ్, మహద్లలో మూడు ప్లాంట్లను కలిగి ఉంది. -
డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరోటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయిసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు లభించింది. ప్రఖ్యాత బిజినెస్ మింట్.. నేషన్వైడ్ హెల్త్‌కేర్ అవార్డ్స్‌ను మంగళవారం ప్రకటించింది. వైద్య ఆరోగ్య రంగంలో చేసిన కృషికి లాస్యసింధును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన తీవ్ర అంతరాయాల మధ్య, అడ్డంకులను అధిగమించి, రోగుల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు తెచ్చిన ఆస్పత్రులు, క్లినిక్‌లు, డాక్టర్లకు అవార్డులు ప్రకటించారు. -
కొటక్ చేతికి డీఎల్ఎల్ రుణాలు
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ డచ్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ డీఎల్ఎల్ ఇండియాకు చెందిన ఆస్తుల (రుణాలు)ను సొంతం చేసుకుంది. రూ. 650 కోట్లకుపైగా విలువైన అగ్రి, హెల్త్‌కేర్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు కొటక్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. వీటిలో రూ. 582 కోట్ల రుణాలను క్లాసిఫైడ్, స్టాండర్డ్‌గా వర్గీకరించగా.. మరో రూ. 69 కోట్లు మొండి బకాయిలు (ఎన్పీఏలు)గా తెలియజేసింది. తమ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకోవడం ద్వారా కొటక్ బ్యాంక్ 25,000 అత్యంత నాణ్యమైన కస్టమర్లను పొందనున్నట్లు రాబోబ్యాంక్కు అనుబంధ సంస్థ అయిన డీఎల్ఎల్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. -
నష్టాల్లోకి సన్ ఫార్మా
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,277 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 894 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అనుకోని నష్టం ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,464 కోట్ల నుంచి రూ. 9,386 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3,273 కోట్ల లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 2,904 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. క్యూ4లో మొత్తం రూ. 3,936 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు సన్ ఫార్మా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 888 వద్ద ముగిసింది. -
నాట్కో ఫార్మాకు నష్టాలు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ నాట్కో ఫార్మా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 50.5 కోట్ల నికర నష్ట్రం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 331 కోట్ల నుంచి రూ. 597 కోట్లకు జంప్ చేసింది. అయితే నిల్వల విలువలో రైటాఫ్తోపాటు.. క్రెడిట్ నష్టాల అంచనాలకు అనుగుణంగా కేటాయింపులు చేపట్టడం ప్రధానంగా క్యూ4లో నష్టాలకు కారణమైనట్లు కంపెనీ వివరించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నాట్కో ఫార్మా నికర లాభం దాదాపు 62 శాతం క్షీణించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 442 కోట్లకుపైగా ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు 3.2 శాతం పతనమై రూ. 658 వద్ద ముగిసింది. -
ఏషియా కుబేరుడు గౌతమ్ అదానీ నెక్ట్స్ టార్గెట్ ఇదే?
న్యూఢిల్లీ: పోర్టులు, విమానాశ్రయాల నుంచి సిమెంటు, ఇంధనం వరకూ వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్ తాజాగా హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ) విభాగంపైనా దృష్టి పెట్టింది. భారీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ చెయిన్స్, ఆఫ్‌లైన్..డిజిటల్ ఫార్మసీల కొనుగోళ్ల ద్వారా భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉంది. ఇందులో భాగంగా మే 17న అదానీ హెల్త్ వెంచర్స్ (ఏహెచ్‌వీఎల్) పేరిట పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, రీసెర్చ్ కేంద్రాలు ఏర్పాటు సహా హెల్త్‌కేర్ సంబంధ వ్యాపార కార్యకలాపాలను ఏవీహెచ్ఎల్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. హెల్త్‌కేర్ విభాగంలో ఎంట్రీకి సంబంధించి గ్రూప్ ఇప్పటికే పలు పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు, దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే స్విస్ దిగ్గజం హోల్సిమ్ ఇండియా వ్యాపారాన్ని 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సిమెంటు రంగంలోకి కూడా ప్రవేశించింది. హెచ్ఎల్ఎల్ కొనుగోలుకు పోటీ.. ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ (హెచ్ఎల్ఎల్)ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, పిరమాల్ హెల్త్‌కేర్ పోటీ పడుతున్నట్లు సమాచారం. హెచ్ఎల్ఎల్లో 100 శాతం వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని 2021 డిసెంబర్లో ప్రభుత్వం నిర్ణయించుకుంది. కంపెనీ కొనుగోలుకు ప్రాథమికంగా ఏడు బిడ్లు వచ్చాయి. దేశీయంగా హెల్త్‌కేర్ మార్కెట్లో స్థానిక, ప్రాంతీయ సంస్థలదే హవా ఉంటోంది. ఇటీవలి ఆన్లైన్ ఫార్మసీ విభాగంలో పెద్ద స్థాయిలో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ నమోదయ్యాయి. ఆన్లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 620 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ కూడా 1ఎంజీ కొనుగోలు ద్వారా ఆన్లైన్ ఫార్మా వ్యాపారంలోకి ప్రవేశించింది. హెల్త్‌కేర్ రంగంలోకి ఎంట్రీతో గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్ చీఫ్), ముకేశ్ అంబానీల (రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్) మధ్య పోరు మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం నెలకొంది. అయితే, హెల్త్‌కేర్ ఇన్ఫ్రాపై అదానీ, రిటైల్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై అంబానీ .. వేర్వేరు విభాగాలపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నాయి. చదవండి: అదిరిందయ్యా అదానీ.. ‘పవర్’ఫుల్ లాభాలు! -
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోసు!
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. -
పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఈటీఎఫ్‌లు
హెల్త్‌కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే. ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్‌లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్‌లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్‌ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం. ► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది. ► హెల్త్‌కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్‌కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్‌కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది. ► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది. ► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు. ► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుంది. ఈటీఎఫ్‌లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగానే ఉంటాయి. – అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ -
15–18 ఏళ్ల వారికీ కోవిడ్ టీకా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్‌పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. లోతైన అధ్యయనం తర్వాతే.. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం. – మోదీ -
లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
సాక్షి, హైదరాబాద్: అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. ► అన్ని రకాల ఔట్ పేషెంట్ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది. చదవండి: అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు ► ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్) తప్పనిసరి. ► ఆయుష్మాన్ భారత్ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. ►ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. ►దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. ► ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్డీఆర్ వివరాలను అందించింది. ► ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్డీఆర్ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ► ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ భావిస్తోంది. -
పలకరింపే పదివేలు
గచ్చిబౌలి(హైదరాబాద్): రోగులను ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పిస్తే 90 శాతం రోగం నయం అవుతుందని, మందులతో పదిశాతం మాత్రమే తగ్గుతుందని శాంతాబయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డు–2021 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జబ్బు కన్నా ముందు రోగిని అర్థం చేసుకోవాలని డాక్టర్లకు సూచించారు. బీపీ తదితర వ్యాధులకు దీర్ఘకాలికంగావాడే మందులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో ప్రముఖ డాక్టర్లు, వైద్య సంస్థలకు అవార్డులను అందజేశారు. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం బెస్ట్ ఆర్థోపెడీషియన్‌గా సన్‌షైన్ ఆస్పత్రి డాక్టర్ గురువారెడ్డి, బెస్ట్ కమ్యూనికేటివ్ కోవిడ్ సర్వీస్ అవార్డును మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌రెడ్డి, బెస్ట్ కోవిడ్ సర్వీస్ ఆస్పత్రి విభాగంలో గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అవార్డులను అందుకున్నారు. అలాగే కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి బెస్ట్ బ్లాక్ ఫంగస్ సర్వీస్ అవార్డు, మా ఈఎన్టీ ఆస్పత్రికి బెస్ట్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, సన్‌షైన్ ఆస్పత్రి డాక్టర్ శ్రీధర్‌కస్తూరి, జేబీమీడియా ఎండీ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్‌కేర్ టీఆర్ఐ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్‌కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
-
హెల్త్‌కేర్...యాప్ హుషార్
ఒకప్పుడు అరచేయి చూస్తే చాలు ఆరోగ్యం గురించి చెప్పేసేవారట. ఇప్పుడు అరచేయిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్ చూసి ఆరోగ్య చరిత్ర చెప్పేస్తున్నారు. వ్యక్తికి సంబంధించిన శారీరక, మానసిక ఆరోగ్య విశేషాలు, వ్యాధులు, చికిత్సల చరిత్ర, వ్యాక్సినేషన్, చేయించుకున్న శస్త్రచికిత్సలు,వాడిన/వాడుతున్న మందులు.. వంటివన్నీ ఒకే చోట అందించే యాప్స్‌కు ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. కరోనా తర్వాత వ్యక్తిగత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ హెల్త్‌కేర్ యాప్స్ వెల్లువకు కారణమైంది. చదవండి: పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ ప్రతి వ్యక్తి తనకు తానే ఆరోగ్య వ్యవస్థను నిర్వహించుకునే అవకాశాన్ని ఈ యాప్స్ ఇస్తున్నాయి. ఉన్న చోట నుంచి కదలకుండా అందించే టెలి మెడిసిన్ ఆరోగ్య సంరక్షణ విషయంలో చికిత్స మాత్రమే కాకుండా వ్యాధులు రాకుండా నివారణకు కూడా వీలు కల్పిస్తాయి. సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా డాక్టర్లు / రోగుల నడుమ వారధిగా హెల్త్‌కేర్ యాప్ నిలుస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, వెబ్ పోర్టల్, ఐఓఎస్‌ల ద్వారా లభ్యమవుతుంది. ‘‘ప్రస్తుతం, ఆరోగ్యరంగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. హెల్త్‌కేర్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు పుంజుకుంటున్నాయి. . మారిన వాతావరణంలో రోగులు, డాక్టర్ల నడుమ అంతరాలను పూరించే ఉపకరణాల అవసరం బాగా పెరిగింది. వ్యాధులకు చికిత్సలను అందుకోవడంలో రోగుల వెతలను తగ్గించాలనే లక్ష్యంతో విడుదలవుతున్న నూతన యాప్స్ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడతాయి. ఒకే యాప్‌తో మొత్తం కుటుం ఆరోగ్యాన్ని కూడా నిర్వహించవచ్చు’’అని ఇటీవలే ఈ తరహా యాప్‌ను విడుదల చేసిన డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ హీల్ఫా సిఇఒ రాజ్ జనపరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘ఈ యాప్ పై రోగికి సంబంధించిన ఆరోగ్య రికార్డులన్నీ ఒక్క క్లిక్‌లో డాక్టర్‌తో పాటుగా రోగికి సైతం లభ్యమవుతాయి. అంతేకాదు డిజిటల్ చెల్లింపులకు సైతం సహకరిస్తుంది. టెలి కన్సల్టేషన్తో రోగులు ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డాక్టర్లను సంప్రదించవచ్చు’’నని చెప్పారాయన. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: దేశంలో వైద్య సదుపాయాల విస్తరణ కోసం తీసుకొచ్చిన ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’ లక్ష్యాలను సాధించాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య సదుపాయాల విస్తరణ కీలకమైనది. వైద్య సదుపాయాలు మెరుగుపడడం అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడుతుంది. ఈ పథకం లక్ష్యాల మేరకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలి. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న చోటు దీన్ని మరింతగా చురుగ్గా అమలు చేయాలి. పరిశ్రమ భాగస్వాములు, బ్యాంకులు, ఆర్థిక సేవల విభాగం కలసికట్టుగా దీన్ని సాధించాలి’’ అంటూ మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో భాగంగా మంత్రి కోరారు. ఐటీలో టెక్నాలజీ వినియోగంపై సూచనలు ఆదాయపన్ను శాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తృతం చేసే విషయమై ఆలోచనలు పంచుకోవాలని ఆ శాఖ యువ అధికారులను మంత్రి కోరారు. అధికారులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. యవ అధికారులకు సీనియర్ అధికారులు మార్గదర్శనం చేయాలని సూచించారు. -
విజయా డయాగ్నొస్టిక్ ఐపీవో @ రూ. 522–531
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 1న ప్రారంభమై 3న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ఒక్కింటి ధర శ్రేణిని రూ. 522–531గా సంస్థ నిర్ణయించింది. కనీస బిడ్ లాట్ 28 షేర్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్ దాదాపు రూ. 1,895 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండే ఈ ఐపీవోలో ప్రమోటరు ఎస్ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లయిన కారకోరం లిమిటెడ్, కేదార క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–కేదార క్యాపిటల్ ఏఐఎఫ్ 1 దాదాపు 3.56 కోట్ల దాకా షేర్లను విక్రయించనున్నాయి. సురేంద్రనాథ్ రెడ్డి 50.98 లక్షల షేర్లు, కారకోరం 2.95 కోట్లు, కేదార క్యాపిటల్ 11.02 లక్షల షేర్లు విక్రయిస్తాయి. దీంతో ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటా 35 శాతం మేర తగ్గనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.78 శాతం, కారకోరం లిమిటెడ్‌కు 38.56 శాతం, కేదారకు 1.44 శాతం వాటాలు ఉన్నాయి. విస్తరణ ప్రణాళికలు .. ప్రస్తుతం తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు కోల్‌కతా, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో మొత్తం 80 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరించనున్నట్లు వివరించారు. దక్షిణాదిన హైదరాబాద్‌కి 4–5 గంటల ప్రయాణ దూరంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూర్పున కోల్‌కతా తదితర ప్రాంతాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. -
గ్రాన్యూల్స్ ఇండియా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 111 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 16 శాతం పుంజుకుని రూ. 850 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 736 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 0.25 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. -
ప్రజారోగ్యంపై పట్టింపు ఏది?
భారతదేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోవడానికి ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా కారణమే. పైగా కేంద్రం, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభు త్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను, మనకు ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. మరోవైపున కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవడమా? మన పొరుగున ఉన్న చైనా, మనకన్నా అధిక జనాభా ఉన్న దేశం.. మలేరియా రహితదేశంగా మారిపోయింది. బుధవారం అంటే నిన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన 40 దేశాల్లో చైనా చేరిపోయింది. అంతేకాకుండా, మనకన్నా చిన్నదేశం, అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న శ్రీలంక కూడా మలేరియా రహిత దేశమైపోయింది. సెప్టెంబర్ 5, 2016న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇట్లా 40 దేశాలు తమ గడ్డమీదినుంచి మలేరియాను తరిమి కొట్టాయి. ఇవేకాక అల్జీ రియా, మారిషస్, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్బేనియా నుంచి బ్రిటన్ దాకా యూరప్ దేశాల్లో చాలా మలేరియా నుంచి విముక్తి అయ్యాయి. అంతేకాకుండా, దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, జమైకా, క్యూబా, ఉరుగ్వే లాంటి దేశాలు ఈ జాబితాలో చేరి పోయాయి. కానీ మనదేశంలో మాత్రం ఇంకా మలేరియా విలయ తాండవం చేస్తూనే ఉంది. మారుమూల ప్రాంతాలైన అడవుల్లో నివసించే ఆదివాసులు ప్రతి సంవత్సరం లెక్కలకు అందనంత మంది మలేరియా ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే పది సంవత్సరాలలో భారత్‌ని మలేరియా రహితదేశంగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేసి నట్టు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసుల జీవన పరిస్థితులు, స్థితిగతులను పరిశీలిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం రాక మానదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొనసాగుతున్న వ్యత్యాసాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. మలేరియాతోపాటు, మరొక ముఖ్యమైన సమస్య క్షయ వ్యాధి. ఇది కూడా ప్రజలలో చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇండియా క్షయ వ్యాధి నివేదిక–2020 ప్రకారం 26.9 లక్షల కేసులు నమోదు కాగా, 79,144 మంది మరణించారు. 2019లో 24.04 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే 2019 కన్నా 2020లో 14 శాతం అధి కంగా కేసులు నమోదయ్యాయి. అయితే అనధికార లెక్కలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే 2025 నాటికి టి.బి. రహిత దేశంగా భారతదేశాన్ని తయారుచేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రతి సంవత్సరం సరాసరి 4,36,000 మంది టి.బి. వల్ల మరణి స్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో పదిలక్షల 40వేల మంది క్షయవల్ల మరణిస్తే, మొత్తంగా 20 లక్షల 64 వేలమంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో మహిళలు 34శాతం కాగా, 59శాతం పురుషులు, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో అధిక సంఖ్యలో క్షయవ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధిలో ఇండియా, మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనితోపాటు పోషకాహార లోపం మరొక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రజలు అనారోగ్యం పాలు కావడానికి 50 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణమనే విషయాన్ని న్యూట్రిషన్ వరల్డ్–2020 నివేదిక బయటపెట్టింది. పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉంటోందనీ, దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఎముకల ఎదుగుదల లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆదివాసీ, దళితుల శాతం అధికం. పోషకాహార లోపంతోపాటు, రక్తహీనత కూడా వీరిలో అధికం. ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దళితుల్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48 శాతం దళితుల్లోని బాల, బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, కరోనాలాంటి వ్యాధి ప్రబలితే ఎటు వంటి పరిస్థితులను మనం చవిచూశామో తెలుసు. ఇంకా కరోనా ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని మిగిల్చిందో, మిగులుస్తుందో లెక్కలు తేలాల్సి ఉంది. అంతేకాకుండా, జీవనశైలి మీద ఆధారపడిన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కరోనా బారిన పడిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి లెక్కలు లేవు. ఇవన్నీపోనూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆరోగ్య సమస్యను ప్రాధాన్యత లేని సమస్యగా చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలచివేసే సమస్య. మనం రోజురోజుకూ ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎటువంటి దూరదృష్టి లేదు. ప్రజల ప్రాణాలు, భద్రత, ఇతర సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని ఆలో చించడం మానేశాం. మన ఆరోగ్య సూచికలన్నీ ప్రపంచ దేశాలన్నింటిలో తిరోగామి స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం మనకు ఒక కచ్చితమైన ఆరోగ్య విధానం లేదు. పేరుకు హెల్త్ పాలసీలు తయారు చేసుకుంటాం. కానీ అది కూడా ఎక్కడో పాత కాలమైతే అల్మారాలో, ఇప్పుడైతే కంప్యూటర్ సర్వర్‌లో దాగి ఉంటుంది. అటువంటిదే 2017 జాతీయ హెల్త్ పాలసీ, అంతకుముందు రెండుసార్లు హెల్త్ పాలసీలు తయారు చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. 2017లో రూపొందించిన పాలసీ కూడా అటువంటిదే. అందులో అన్ని సాంకేతికపరమైన సమస్యలే తప్ప, ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. పైగా ఆ నివేదికలోనే చెప్పిన విషయం విస్మయం కలిగించక మానదు. ‘కొంతమంది ఆరోగ్య విషయాన్ని, ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని అంటున్నారు. కానీ, మన దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపా యాలు అటువంటి స్థితిలో లేవు’ అని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయోత్పత్తిలో 1.26 శాతంగా ఉందని, అది 2.5 శాతం పెరిగితే తప్ప ఎటువంటి నూతన సౌకర్యాలు సాధ్యంకావని తేల్చిచెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు మనకన్నా అదనంగా ఆరోగ్యంమీద ఖర్చు పెడుతున్నాయి. అమెరికా 17 శాతం, బ్రెజిల్ 9.2 శాతం, డెన్మార్క్ 10.1 శాతం, కెనడా 10.7 శాతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి. కాబట్టే ఆ దేశాలు ఆరోగ్య రంగంలో వచ్చే ఎటు వంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. భారత్ కరోనా దెబ్బకు విలవిలలాడి పోవడానికి ఈ బడ్జెట్ లేమి కూడా కారణం. కేంద్ర, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభుత్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవ స్థను, మన మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. అంతేకాకుండా, హెల్త్ పాలసీ–2017 స్థానంలో మరొక సమ గ్రమైన, నూతనమైన ఆరోగ్య విధానం రూపకల్పన చేసుకోవాలి. అందులో చాలా స్పష్టంగా కేంద్ర, రాష్ట్రాల విధులను, బాధ్యతలను ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని, ఇకపై ప్రజల మీద భారం వేయకుండా ప్రభు త్వమే ఆరోగ్య బాధ్యతను వహించాలి. సార్వజనీన ఆరోగ్య రక్షణకు అంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించే విధానాన్ని తయారు చేసుకోవాలి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవ డమా? మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్లు, టూరిస్ట్ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది. ► 11 వేల మంది టూరిస్ట్ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు.. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు. ► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది. ► హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (ఎన్సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది. ► ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది. ► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. ► మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు. ► డీఏపీపై అదనపు సబ్సిడీ... డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది. నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ► ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ► ఇతరత్రా 8 సహాయక చర్యలు ♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు.. ♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ ♦ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి. ♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు. ♦ పంచాయతీలకు నెట్ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు. ♦ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) 2025–26 వరకు పొడిగింపు. ♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది. ♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్ ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘ – నరేంద్ర మోదీ, ప్రధాని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘ – ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వృద్ధికి ఊతం.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది. -
కోవిడ్‌పై పోరులో యువ వైద్యులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి తోడుగా మరింత మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు అవసరమైన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి మోదీ సోమవారం ఓకే చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నీట్–పీజీ పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్లను కోవిడ్ విధుల్లోకి తీసుకొనేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. నిర్ణయాలను పేర్కొంటూ ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదలచేసింది. పీజీ రాయబోయే వారిని కోవిడ్ విధుల్లో వినియోగించుకునేందుకు నీట్ పీజీ–2021 పరీక్షను కనీసం నాలుగు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ 31లోపు నీట్–పీజీ ఉండదని, పరీక్ష తేదీ ప్రకటించాక వారు ప్రిపేర్కావడానికి కనీసం నెలరోజుల సమయం ఇస్తారని ప్రకటన తెలిపింది. దీంతో కోవిడ్ విధులకు పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులోకి రాగలరని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విశిష్ట కోవిడ్ జాతీయ సర్వీస్ సమ్మాన్.. కోవిడ్ మేనేజ్మెంట్లో సేవలను అందించే వ్యక్తులు కనీసం 100 రోజులపాటు కోవిడ్ డ్యూటీని పూర్తి చేసిన తర్వాత రాబోయే సాధారణ ప్రభుత్వ నియామకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం 100 రోజుల కోవిడ్ డ్యూటీ పూర్తిచేసిన వారికి కేంద్రప్రభుత్వం తరపున ‘ప్రధానమంత్రి విశిష్ట కోవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మన్’ ఇవ్వాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్ మేనేజ్మెంట్ విధుల్లోకి తీసుకొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు. వీరితో పాటు ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల సేవలను టెలి కన్సల్టేషన్స్‌తో పాటు కోవిడ్ వ్యాధి తీవ్రత ఉన్న రోగుల పర్యవేక్షణ బాధ్యతలను వీరికి ఫ్యాకల్టీ పర్యవేక్షణలో అప్పగించనున్నారు. దీంతో కోవిడ్ డ్యూటీలో ఉన్న సీనియర్ వైద్యులపై పనిభారం తగ్గుతుంది. పీజీలో కొత్త బ్యాచ్ విద్యార్థులు చేరే వరకు ఫైనల్ ఇయర్ పీజీ విద్యార్థుల సేవలనూ వాడుకుంటారు. బీఎస్సీ లేదా జీఎన్ఎం అర్హత ఉన్న నర్సులను సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో పూర్తి సమయం కోవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవచ్చు. -
ఆ మూడు రంగాలకూ రుణాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ రంగం, ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మేనేజింగ్ డైరెక్టర్ జి.రాజ్‌కిరణ్‌రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధనాస్పత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య రంగానికి రూ.2 వేల కోట్ల రుణ సదుపాయం అవసరమని, ఇందుకు సహకరించాలని బ్యాంక్ ఎండీని కోరారు. 2023 నాటికి రాష్ట్రంలో మూడు పంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కూడా రుణ సదుపాయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ మాట్లాడుతూ ఈ విషయాల్లో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక–ఇంధన) డి.కృష్ణ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఐఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
'కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు'
ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది. ► నైటింగేల్ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు. అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్ఎమ్గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు. ► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్ లో వేశాడు. అక్కడే టెంత్ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్ ట్రెయినింగ్ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్‌నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది. అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని యుహెచ్పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్ తర్వాత ఎఎన్‌ఎమ్‌గా శిక్షణ తీసుకున్నాను. ► కోవిడ్–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు.. శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన. అరుణ: కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్ ఎక్కించి, హోమ్ క్వారంటైన్లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్ చెక్ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్ తర్వాత కూడా అందరం ఆన్‌డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం. ► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు.. శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్హెచ్ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ. అరుణ: ఇప్పటివరకు బెస్ట్ ఏఎన్ఎమ్గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్ డ్యూటీ చేసినందుకు కేటీఆర్ సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్ ఇస్తూనే ఉంది. ► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు. అరుణ: ట్రెయినింగ్ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నిలదొక్కుకున్నాను. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో నర్సింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా. – నిర్మలారెడ్డి -
టీకాపై అపోహలు తొలగిద్దాం
లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ నాయకులు అక్కడా, ఇక్కడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, కానీ శాస్త్రవేత్తల నిర్ణయం మేరకే తాను ముందుకి అడుగులు వేశానని అన్నారు. సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘‘కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు క్లీన్ చిట్ ఇస్తే ప్రజల్లో గట్టి సందేశం వెళుతుంది’’అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘వ్యాక్సిన్ అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను’’అని ఆమె వెల్లడించారు. డీడీయూ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ వి శుక్లాతో మాట్లాడిన ప్రధాని కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. డాక్టర్ శుక్లా కూడా వ్యాక్సిన్‌తో మేలే జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సైడ్ అఫెక్ట్‌లు వచ్చినా దానికి వారి అనారోగ్య సమస్యలే కారణమని చెప్పారు. టీకా ఇవ్వడంలో ఆస్పత్రుల మధ్య పోటీ ఉంటే రెండో విడతని త్వరగా ప్రారంభించవచ్చునని ప్రధాని సూచించారు. శాస్త్రవేత్తలు చెప్పిందే చేశాం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.‘‘వ్యాక్సిన్‌కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను. ఇది రాజకీయ నాయకుల పని కాదు’’అని అన్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు. మోదీకి హసీనా ధన్యవాదాలు కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 20 లక్షల డోసుల్ని భారత్ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
కోవిడ్ కష్టాలు విని బైడెన్ భావోద్వేగం
న్యూయార్క్: కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాన్ని వింటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కరోనాపై యుద్ధంలో ముందువరుసలో నిలబడి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. కోవిడ్‌పై వివిధ వర్గాల వారి అనుభవాలను తెలుసుకునేందుకు ఒక ఐసీయూలో పనిచేసే నర్సు, ఒక ఇంటిపని కార్మికురాలు, ఒక టీచర్, అగ్నిమాపక సిబ్బందితో బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఫిబ్రవరి నుంచి కోవిడ్ ఆసుపత్రిలోని ఐసీయూలో సేవలందిస్తోన్న నేషనల్ నర్సెస్ యునైటెడ్, మిన్నెసోటా చాప్టర్ అధ్యక్షురాలు మేరీ టర్నర్ తన అనుభవాలను వివరిస్తూ కంటతడి పెట్టారు. సరైన రక్షణ సదుపాయాలు లేకపోవడం వలన తమ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు ఎన్–95 మాస్కులను తిరిగి తిరిగి ఉపయోగించాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు. ‘‘తాము చూడలేని తమ కుటుంబ సభ్యులకోసం అంతిమగడియల్లో విలపించిన ఎందరో కరోనా బాధితులను తన కరస్పర్శతో ఓదార్చాను’’అని ఆమె కన్నీటి పర్యంతమౌతూ జో బైడెన్‌కి వివరించారు. మాస్క్‌ల కొరత, నర్సులు విరామం లేకుండా పనిచేయాల్సి రావడం, కనీస రక్షణ పరికరాలు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరతలతో సహా. దేశవ్యాప్తంగా మార్చి నెలనుంచి వృత్తిపరంగా తామెదుర్కొంటోన్న అనేక సమస్యలను ఆమె జోబైడెన్ ముందుంచారు. సౌకర్యాల లేమి కారణంగా ఆరోగ్య కార్యకర్తలకు గత యేడాది కాలంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించలేదని ఆమె వెల్లడించారు. భావోద్వేగంతో మాట్లాడుతోన్న టర్నర్ అనుభవాలను విన్నతరువాత, అందుకు సమాధానంగా బైడెన్ మాట్లాడుతున్నప్పుడు జో బైడెన్ కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది. తాను వైస్‌ప్రసిడెంట్‌గా ఉండగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్లో ఐసీయూలో, నైట్ షిఫ్టుల్లో పనిచేస్తోన్న నర్సులకు తాను రాత్రి భోజనాన్ని అందించేందుకు వెళ్ళేవాడినని బైడెన్ తెలిపారు. బైడెన్ కుమారుడు బ్యౌ 2015లో బ్రెయిన్ కాన్సర్‌తో మరణించడానికి ముందు చివరి పది రోజులు వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్లోనే గడిపారు. ‘‘మీరు నన్ను భావోద్వేగానికి గురిచేశారు. నాలాగే ఎవరైనా నెలల కొద్దీ సమయం ఐసీయూలో గడిపినట్లయితే, ఐసీయూలో పనిచేసే నర్సులపై ఉండే మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోగలుగుతారు’’అని బైడెన్ వివరించారు. ‘‘మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మీ శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించాలి’’అని బైడెన్ ఆరోగ్యసిబ్బంది సేవలను కొనియాడారు. గవర్నర్లతో భేటీకానున్న బైడెన్ ట్రంప్ అధికార మార్పిడికి అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన కొందరు గవర్నర్లతో బైడెన్ భేటీకానున్నారు. ఐదుగురు రిపబ్లికన్, నలుగురు డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన గవర్నర్లతో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ వర్చువల్‌గా భేటీ కానున్నారు. -
నిరంతరం రైతన్నకు మేలు
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలానుగుణంగా ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉందని మోదీ అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవడానికి అవకాశం కల్పించడం, వేలాది రైతు ఉత్పాదక సంస్థలను సృష్టించడం, మధ్యలోనే ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, పంటల బీమా పథకాన్ని మెరుగుపర్చడం, 100 శాతం వేప పూత యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, సాయిల్ హెల్త్ కార్డులు.. వీటన్నింటి లక్ష్యం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడమేనని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇలాంటి చర్యలతో రైతాంగానికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. మన రైతన్నలకు మేలు చేసే చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పిస్తే.. గుజరాత్ ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్ సూర్యోదయ యోజన(కేఎస్‌వై)ను ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తారు. గిర్నార్ కొండపై ఏర్పాటు చేసిన రోప్‌వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల ఈ రోప్‌వే రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అధికారులు చెప్పారు. ఇది ఆసియాలోనే పొడవైన రోప్‌వే. పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని చెప్పారు. ప్రపంచానికి దారి చూపుతున్న భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరిందన్నారు. గత ఆరేళ్లలోనే ఈ ఘనత∙సాధ్యమైందన్నారు. ‘ఒక సూర్యుడు.. ఒక ప్రపంచం.. ఒక గ్రిడ్’ విషయంలో ప్రపంచానికి భారత్ దారి చూపుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. కిసాన్ సూర్యోదయ యోజన కింద వ్యవసాయానికి సూర్యోదయం నుంచి ఉదయం 9.30 గంటలకు వరకు కరెంటు సరఫరా చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది రైతుల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పగటి పూటే కరెంటు సరఫరా ఉంటుంది కాబట్టి సూక్ష్మ సేద్యం ప్రారంభిస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయని రైతులకు సూచించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్‌ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
అందరికీ మెరుగైన వైద్యసేవలు
పులివెందుల రూరల్: అందరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లకాళీ కృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని వివరించారు. సోమవారం ముద్దనూరు రోడ్డులోని జెఎన్టీయూ కళాశాల సమీపంలో వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి స్థలాన్ని మ్యాప్‌లను, నమూనాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులలో నిర్మించే మెడికల్ కళాశాలకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. అలాగే ప్రతి గ్రామానికి 104, 108 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 25 పార్లమెంట్ సెగ్మెంట్లలోని 11 స్థానాల్లో మెడికల్ కళాశాలలు ఉన్నాయని... కొత్తగా 15 కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం అనుమతి ఇచ్చారన్నారు. ఏడాదిలో 15 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రూ.345 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆగస్ట్ నెలలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. కరోనాకు సంబంధించి పరీక్షలు చేసేందుకు అనుగుణంగా ల్యాబ్‌లు, మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాని మంత్రి ఆళ్ల నాని వివరించారు. కుటుంబ నియంత్రణ ఆసుపత్రి ఏర్పాటు చేయండి.. పులివెందుల ప్రాంతంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చారు. వైద్యులను నియమించాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీర్ సత్యప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ నాగన్న, మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, ఆసుపత్రి సూపరింటెండెంట్ దివిజ, వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
10 రోజులు పని, 10 రోజులు సెలవు
తిరువనంతపురం: కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. దీన్ని నివారించేందుకుగానూ కోవిడ్ కేర్ వర్కర్ల కోసం కేరళ ప్రభుత్వం త్రీ టైర్ పూల్ విధానాన్ని తీసుకురానుంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం సిబ్బందిని కోవిడ్ పూల్, ఆఫ్ డ్యూటీ పూల్, రొటీన్ పూల్ అని మూడు రకాలుగా విభజిస్తారు. కోవిడ్ పూల్‌లో పని చేసిన వారు తర్వాత ఆఫ్ డ్యూటీ పూల్ కింద పని చేస్తారు. అనంతరం రొటీన్ పూల్‌లోకి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి కోవిడ్ పూల్‌లో పని చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ కొత్త విధానం పరిధిలోకి వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అసిస్టెంట్లు, ఆసుపత్రి అటెండెంట్లు, డ్రైవర్లు ఇతరులు వస్తారు. (కోవిడ్ వ్యర్థాలివే...) కోవిడ్ కేర్ విభాగం కింద వచ్చేవారు పది రోజులు పని చేస్తే ఆ తర్వాతి 10 రోజులు సెలవు తీసుకోవాలి. వీరు రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎనిమిది గంటల షిఫ్టులో నాలుగు గంటలు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ కిట్) ధరించి, మరో 4 గంటలు పీపీఈ కిట్ లేకుండా పని చేయాలి. వీరి ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం "ఎమర్జెన్సీ రిలీవర్స్ టీమ్" కూడా ఉంటుంది. ఇందులో 15 మంది సిబ్బంది ఉంటారు. డ్యూటీ ముగిసిన తర్వాత హెల్త్‌కేర్ వర్కర్లు ఆసుపత్రిలోనే స్నానం చేయాలి. (కేరళ ఆయుర్వేదం గెలిచింది!) -
మ్యాక్స్‌క్యూర్.. ఇక మెడికవర్ హాస్పిటల్స్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ పేరు మారింది. ఇక నుంచి మెడికవర్ హాస్పిటల్స్‌గా పిలుస్తారు. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రమోట్ చేస్తున్న సహృదయ హెల్త్‌కేర్‌లో స్వీడన్‌కు చెందిన మెడికవర్‌కు ఇప్పటి వరకు 46.5 శాతం వాటా ఉంది. నవంబరు నాటికి ఇది 51 శాతానికి చేరనుంది. హెల్త్‌కేర్, డయాగ్నోస్టిక్స్ సేవలతో అంతర్జాతీయంగా విస్తరించిన మెడికవర్.. తాజా డీల్‌తో భారత ఆరోగ్య సేవల రంగంలో ప్రవేశించినట్టయింది. సహృదయలో మెడికవర్ ఇప్పటికే రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టింది. మిగిలిన 4.5 శాతం వాటా కోసం మరో రూ.50 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తోంది. సహృదయ హెల్త్‌కేర్ బోర్డులోకి మెడికవర్ చేరినప్పటికీ, రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి జోక్యం ఉండబోదని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న ఈ యూరప్ సంస్థ రానున్న రోజుల్లో సహృదయ హెల్త్‌కేర్‌లో వ్యూహాత్మక భాగస్వామిగా మరింత వాటా పెంచుకోనుంది. కొత్తగా ఆసుపత్రులు.. మ్యాక్స్‌క్యూర్‌ను ప్రముఖ వైద్యుడు అనిల్ కృష్ణ స్థాపించారు. హైదరాబాద్‌లో మూడు, వైజాగ్‌లో రెండు, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, నెల్లూరు, కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక్కో ఆసుపత్రి ఉంది. వీటన్నిటి పడకల సామర్థ్యం 2,000 దాకా ఉంది. కొత్తగా భాగ్యనగరిలో రెండు, ముంబైలో ఒక హాస్పిటల్ ఈ ఏడాది నవంబరుకల్లా సిద్ధమవుతున్నాయి. వీటి రాకతో 700 పడకలు జతకూడనున్నాయని మెడికవర్ ఇండియా ఎండీ అనిల్ కృష్ణ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ‘సంస్థలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పటికే 6,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి ఆసుపత్రి ద్వారా 600 నుంచి 1.000 మందికి ఉపాధి లభించనుంది’ అని వివరించారు. డీల్ తదనంతరం అనిల్ కృష్ణ వాటా 33 శాతం, వైద్యులైన ఇతర ఇన్వెస్టర్ల వాటా 16%గా ఉంటుంది. మెడికవర్ ఇండియా ఎండీ అనిల్ కృష్ణ -
వేగంగా విస్తరిస్తున్న ఎంఫైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆసరాగా చేసుకుని ఆన్ డిమాండ్ హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్న ఎంఫైన్ వేగంగా తన సర్వీసులను విస్తరిస్తోంది. 80 ఆసుప్రతులకు చెందిన 18 విభాగాల్లో పనిచేస్తున్న 300కు పైగా డాక్టర్లతో కంపెనీ చేతులు కలిపింది. నిముషంలో వీడియో కాల్ ద్వారా ఈ వైద్యులను సంప్రతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 50,000 పైగా కస్టమర్లు తమ సేవలను అందుకున్నారని ఎంఫైన్ సీఈవో ప్రసాద్ కొంపల్లి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో 22 ఆసుపత్రులతో ఎంఫైన్కు భాగస్వామ్యం ఉంది. 100 మంది వైద్యుల ద్వారా 5,000 పైచిలుకు కస్టమర్లు వైద్య సేవలు పొందారు. -
మ్యాక్స్ హెల్త్‌కేర్... రేడియంట్ లైఫ్ కేర్ చేతికి
న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ వాటాదారుగా మారుతుంది. రేడియంట్ లైఫ్ కేర్ ప్రమోటరు అభయ్ సోయ్... విలీన సంస్థకు చైర్మన్‌గా ఉంటారు. మ్యాక్స్ హెల్త్‌కేర్ ప్రమోటర్లయిన అనల్జిత్ సింగ్ తదితరులు వైదొలుగుతారు. ‘రేడియంట్, మ్యాక్స్ హెల్త్‌కేర్ కలయికతో ఉత్తర భారతంలో అతి పెద్ద ఆస్పత్రుల నెట్వర్క్ ఏర్పాటవుతుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆస్పత్రుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా, బెడ్స్ పరంగా నాలుగో స్థానంలోనూ ఉంటుంది‘ అని రేడియంట్ తెలియజేసింది. విలీన సంస్థకు దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 పైచిలుకు బెడ్స్ (పడకలు) ఉం టాయి. వేల్యుయేషన్ నివేదిక ప్రకారం షేర్ల మార్పిడి నిష్పత్తిని పరిశీలిస్తే... విలీన సంస్థలో కేకేఆర్‌కు 51.9%, అభయ్ సోయ్‌కి 23.2%, మ్యాక్స్ ప్రమోటర్లకు 7% వాటాలుంటాయి. మిగతావి పబ్లిక్, ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. విలీన సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్ బ్రాండ్‌తోనే.. లోగోలో స్వల్ప మార్పులతో కొనసాగుతుందని రేడియంట్ పేర్కొంది. ఒప్పందం ఇలా.. డీల్ కింద మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లైఫ్ హెల్త్‌కేర్‌కు ఉన్న 49.7 శాతం వాటాలను నగదు లావాదేవీ ద్వారా రేడియంట్ కొనుగోలు చేస్తుంది. అలాగే, మ్యాక్స్ ఇండియా తమ నాన్–హెల్త్‌కేర్ వ్యాపార విభాగాన్ని (మ్యాక్స్ బూపా, అంతర సీనియర్ లివింగ్) విడగొట్టి ప్రత్యేక కంపెనీగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తుంది. ప్రస్తుత మ్యాక్స్ ఇండియా షేర్ హోల్డర్లకు కొత్త కంపెనీ షేర్లు కూడా దక్కుతాయి. రూ. 2 ముఖ విలువ గల ప్రతి 5 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖ విలువ ఉండే కొత్త కంపెనీ షేరు ఒకటి కేటాయిస్తారు. మరోవైపు, డీమెర్జర్ అనంతరం రేడియంట్కి చెందిన హెల్త్‌కేర్ అసెట్స్‌ను మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు బదలాయిస్తారు. అటుపైన దీన్ని మళ్లీ మ్యాక్స్ ఇండియాలో విలీనం చేసి (రివర్స్ మెర్జర్) కొత్త సంస్థను మ్యాక్స్ హెల్త్‌కేర్‌గా కొనసాగిస్తారు. రివర్స్ మెర్జర్ కారణంగా రూ. 2 ముఖవిలువ గల ప్రతి 100 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖవిలువ గల విలీన సంస్థ షేర్లు 99 కేటాయిస్తారు. కొనుగోలు వార్తలతో సోమవారం మ్యాక్స్ ఇండియా షేర్లు బీఎస్ఈలో 4.32 శాతం క్షీణించి రూ.80.80 వద్ద క్లోజయ్యాయి. -
నిమిషంలో డాక్టర్ కన్సల్టేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ ఎంఫైన్ వినూత్న సేవలను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే నిమిషంలోపే వీడియో కాల్లో ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులను సంప్రతించవచ్చు. ఇప్పటి వరకు ఈ సంస్థ బెంగళూరులో 30 ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుని వైద్య సేవలను అందించింది. తాజాగా హైదరాబాద్‌లో కిమ్స్, సన్‌షైన్, కిమ్స్ బీబీ, మ్యాక్స్‌క్యూర్ సుయోష, ఏస్టర్ ప్రైమ్ ఆసుపత్రులతో చేతులు కలిపి ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఇలా పనిచేస్తుంది.. ఎంఫైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక కన్సల్టేషన్‌కు రూ.500 ఆన్లైన్లోనే చెల్లించాలి. సమస్య టైప్ చేయగానే అందుబాటులో ఉన్న స్పెషలిస్టులు స్క్రీన్‌పై కనపడతారు. వైద్యుడితో చాట్ చేయవచ్చు. వీడియో కాల్ ద్వారా సంప్రదించవచ్చు. సమస్య ఆధారంగా వైద్యులు మందులను సిఫారసు చేస్తారు. ప్రిస్క్రిప్షన్ యాప్‌లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 15 స్పెషాలిటీలకుగాను 100 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. పరిచయ ఆఫర్లో భాగంగా రూ.1,999లకు ఆరు నెలల వాలిడిటీతో అపరిమిత కన్సల్టేషన్‌ను అందిస్తోంది. రెండేళ్లలో 200 ఆసుపత్రులు.. ఈ–కామర్స్ కంపెనీ మింత్రా సహ వ్యవస్థాపకుడు అశుతోష్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రసాద్ కొంపల్లి ఎంఫైన్‌ను ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బందిలో 20 మంది వైద్యులే. భారత్‌లో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్ ఉందని ఎంఫైన్ సహ వ్యవస్థాపకులు ప్రసాద్ గురువారమిక్కడ మీడి యాకు తెలిపారు. ‘ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసే వైద్య నిపుణుడిని నిమిషాల్లో సంప్రదించేందుకు ఈ యాప్ దోహదం చేస్తుంది. రెండేళ్లలో 200 ఆసుపత్రులతో భాగస్వామ్యం చేసుకోవాలన్నది లక్ష్యం. తద్వారా 25 స్పెషాలిటీలు, 1,500 మంది వైద్యుల స్థాయికి చేరతాం. 10 నగరాలకు విస్తరించడం ద్వారా 5 లక్షల మందికి సేవలు అందించాలన్నది ఆశయం’ అని వివరించారు. -
ఫోర్టిస్ చేతికి ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ సంస్థ ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్‌కు (ఆర్‌హెచ్‌టీ) చెందిన వ్యాపార విభాగాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ రూ. 4,650 కోట్లుగా ఉంటుం దని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆర్హెచ్టీకి చెందిన భారత అనుబంధ సంస్థలను పూర్తిగా ఫోర్టిస్ కొనుగోలు చేయనుంది. దీంతో పాటు ఫోర్టిస్ హాస్పిటల్లో ఆ సంస్థకున్న 49 శాతం వాటాలు, భారత్‌లో ఆ సంస్థకి ఉన్న క్లినిక్‌లు.. ఆస్పత్రుల అసెట్ పోర్ట్‌ఫోలియోను కూడా ఫోర్టిస్ కొనుగోలు చేస్తుంది. ఆర్హెచ్టీలో ఫోర్టిస్‌కి ప్రస్తుతం పరోక్షంగా 29.76 శాతం మేర వాటాలు ఉన్నాయి. ఆర్‌హెచ్‌టీ అసెట్స్‌ని పునర్వ్యవస్థీకరించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. -
69 రోజులు.. 10 లక్షల కండోమ్స్
సాక్షి, బెంగళూరు : దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. -
గ్లోబల్ లక్ష్యాల్ని అందుకోలేపోయాం
హైదరాబాద్: భారతదేశంలో వైద్యరంగం అభివృద్ధిగణనీయంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవడంలో ఇంకా వెనకబడే ఉన్నట్టు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. భారతీయుల సగటు ఆయు ప్రమాణం పెరిగినా.. మిలీనియం అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని తెలిపారు. దేశీయ హెల్త్కేర సెక్టార్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి మరింత సుదీర్ఘ కాలం పట్టే అవకాశంఉందన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బయో ఆసియా 2017 సదస్సులో బుధవారం మాట్లాడిన ఆయన ప్రపంచ బ్యాంక్ రిపోర్టును ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ, "మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు" అందుకోలేకపోయిందని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణపై ఎక్కువగా పెట్టుబడులుపెట్టిన చైనా, బ్రెజిల్ తో పోలిస్తే ఇండియా వెనుకబడి ఉందన్నారు. చికున్ గున్యా, డెంగ్యూకేసుల నమోదు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ రాష్ట్రాల్లో కొన్నిదక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల భారీ వ్యత్యాసాలను ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లాంటి చిన్న పొరుగు దేశాలకంటే కూడా తీసిపోయినట్టు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1995- 2015కాలంలో మోర్టాలిటీ రేటు 25 పాయింట్ల మేర క్షీణించిందని మూర్తి పేర్కొన్నారు. -
హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్
బెంగళూరు: తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లౌడ్ సర్వీసులను ఉపయోగిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు వాటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొంది. టెక్నాలజీ స్టార్టప్స్ కొత్త సేవల ఆవిష్కరణకు క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్నాయని తెలిపింది. బీఎస్ఈలో లిస్టైన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బీఓబీ, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, స్నాప్‌డీల్ కంపెనీలు ఉన్నాయి. -
విప్రో: లాభం 8% అప్
బెంగళూరు: హెల్త్‌కేర్, ఇన్ఫ్రా సేవల విభాగాల ఊతంతో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం మూడో త్రైమాసికంలో 8 శాతం ఎగిసింది. శుక్రవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల ప్రకారం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,193 కోట్లకు పెరిగింది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 12,085 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఆదాయం రూ. 11,327 కోట్లు కాగా, లాభం రూ. 2,015 కోట్లు. దేశీయంగా మూడో అతి పెద్ద ఐటీ సంస్థ అయిన విప్రో.. తాజాగా క్యూ3లో డాలర్ మారకంలో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు 1.8-1.84 బిలియన్ల మేర ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ.. 1.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 1.81-1.85 బిలియన్ డాలర్ల మేర ఆదాయాలు ఉండొచ్చని విప్రో తాజాగా గెడైన్స్ ఇచ్చింది. రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. కరెన్సీ ప్రభావం పడింది: అంతర్జాతీయంగా కరెన్సీ, కమోడిటీ మార్కెట్ల పరిణామాలు ప్రధాన ఎకానమీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఐటీ సేవల విభాగం ఆదాయాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 3.7 శాతం మేర పెరిగాయని విప్రో సీఈవో టీకే కురియన్ తెలిపారు. ఉత్తర అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో ఐటీ సేవలకు డిమాండు స్థిరంగా ఉన్నట్లు తెలియజేశారు. యూరప్, భారత్‌లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులకు డిమాండు యథాతథంగా కొనసాగవచ్చని.. రిటైల్, తయారీ రంగాల్లో మళ్లీ డిమాండు పుంజుకోగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తగ్గిన అట్రిషన్: డిసెంబర్ ఆఖరుకు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,56,866గా ఉంది. అట్రిషన్ రేటు 16.9 శాతం నుంచి 16.4 శాతానికి తగ్గింది. సురేష్ సేనాపతి రిటైర్మెంట్: చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సురేష్ సేనాపతి ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఫైనాన్స్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ దలాల్ బాధ్యతలు చేపడతారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు శుక్రవారం బీఎస్ఈలో 0.79 శాతం క్షీణించి రూ.555.25 వద్ద ముగిసింది. -
హెల్త్‌కేర్, ఐటీ హవా
స్వల్ప లాభాలతో సరి రెండు రోజుల నష్టాలకు చెక్ హెల్త్‌కేర్, ఐటీ రంగాలు 2.5% చొప్పున పుంజుకోవడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెబుతూ సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 25,100 వద్ద ముగిసింది. తొలుత గరిష్టంగా 25,210కు చేరినప్పటికీ, ఒక దశలో అమ్మకాలు పెరిగి కనిష్టంగా 25,033ను సైతం చవిచూసింది. చివరికి స్వల్ప లాభాలను కూడగట్టుకుంది. ఇక నిఫ్టీ కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడి, చివరికి 16 పాయింట్లు అధికంగా 7,509 వద్ద స్థిరపడింది. ప్రధానంగా హెల్త్‌కేర్ దిగ్గజాలు దివీస్ ల్యాబ్, ర్యాన్‌బాక్సీ, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, క్యాడిలా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ 6-2% మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఐటీ కమిన్స్, ఒరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ 4-1% మధ్య పురోగమించాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు రానున్న బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయ ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను బలహీనపరచాయని చెప్పారు. కాగా, గురువారం రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా రూ. 182 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 172 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో ట్రేడైన షేర్లలో 1,715 లాభపడితే, 1,281 నష్టపోయాయి. -
దేశంలో ప్రభుత్వ వైద్యం 30 శాతమే!!
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన పదేళ్ల పాలనాకాలంలో ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా అటకెక్కించింది. భారతదేశంలో 70 శాతం వైద్యం అంతా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. కేవలం 30 శాతం వైద్యసేవలు మాత్రమే ప్రభుత్వరంగంలో అందుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్యురాలు ఎంవీ పద్మా శ్రీవాత్సవ తెలిపారు. నిరుపేదలకు వైద్యం అందని మావిగా మారిందని, వైద్యఖర్చులు చాలా ఎక్కువ అయిపోయాయని ఆమె అన్నారు. ఈ విషయంలో మన విధానాలు సంపూర్ణంగా మారాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఆరోగ్యం అనేది విలాసం కాదని, ప్రతి ఒక్కరికీ అవసరమని, అందువల్ల అది ప్రభుత్వ బాధ్యత అని ఆమె తెలిపారు. భారతదేశం కంటే తక్కువగా ఆరోగ్యరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉన్న దేశాలు ప్రపంచంలో కేవలం 11 మాత్రమేనని ఎయిమ్స్ సీనియర్ పాథాలజిస్టు మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అలాగే, ప్రైవేటు రంగంలో వైద్యంపై ఎక్కువగా ఖర్చుపెడుతున్న దేశాలు భారత్ కంటే 12 మాత్రమే ఎక్కువని కూడా ఆయన తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం వైద్యసేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. -
టాప్-10 కెరీర్స్... బెస్ట్ ఆపర్చునిటీస్
డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగాలపరంగా ఎన్నో అవకాశాలున్నాయి. అయితే రానున్న ఐదారేళ్లలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగా.. ఏవియేషన్, హెల్త్‌కేర్, రిటైల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్/రూరల్ డవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, టెలికం మేనేజ్మెంట్, మర్చెంట్ నేవీ నిలుస్తాయని ఆయా రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు తగిన విధంగా అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌టెన్ కెరీర్స్‌పై ప్రత్యేక ఫోకస్.. ఏవియేషన్.. ఎమర్జింగ్ ఏవియేషన్ రంగంలో.. ప్రతి ఏటా 121 మిలియన్ దేశీయ, 41 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులతో తొమ్మిదో పెద్ద దేశంగా నిలుస్తున్న భారత్.. 2020 నాటికి మూడో పెద్ద దేశంగా ఎదుగుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పైలట్ లెసైన్సింగ్ కోర్సులతోపాటు గ్రౌండ్ డ్యూటీ, క్యాబిన్ క్రూ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ.. ఈ రంగానికి చెందిన టెక్నికల్ కోర్సులను అందిస్తోంది. ‘ఏవియేషన్ రంగం కేవలం ప్రయాణికుల విభాగంలోనే కాకుండా కార్గో విభాగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఈ మేరకు నిపుణుల అవసరం పెరుగుతోంది. దీన్ని గమనించి విద్యార్థులు ఈ రంగంలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తును అందుకోవచ్చు.’ అంటున్నారు ఏపీ ఏవియేషన్ అకాడమీ డెరైక్టర్ కెప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి. హెల్త్ కేర్.. కెరీర్ హెవెన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, సీఐఐ అంచనాల ప్రకారం హెల్త్‌కేర్ రంగంలో 2020 నాటికి.. పారా మెడికల్ సిబ్బంది నుంచి సీఈవో స్థాయి వరకు 40 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు తక్కువగా ఉండ టం, మెడికల్ టూరిజంకు ప్రాధాన్యం పెరగడమే. కేవలం క్లినికల్ సర్వీసులే కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కొరత కూడా అధికంగానే ఉంది. ఔత్సాహికులు వీటిని దృష్టిలో పెట్టుకుంటే పదో తరగతి మొదలు.. పీజీ వరకు తమ అర్హతకు తగిన ఉద్యోగ వేదికగా హెల్త్‌కేర్ విభాగం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో కనీసం నెలకు రూ. పదిహేను వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి అమెరికా, యూరప్ దేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. రిటైల్.. ఫర్ ఫ్యూచర్ వెల్ సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, మల్టీ బ్రాండ్ విభాగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైల్ రంగంలో ఐదో పెద్ద దేశంగా నిలిచిన భారత్.. 2020 నాటికి ఈ రంగంలో 1.3 ట్రిలియన్ డాలర్ల వృద్ధి నమోదు చేయనుంది. అంటే ఆ స్థాయిలో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. అందుకు తగిన విధంగా స్టోర్ కీపర్ నుంచి స్టోర్ సీఈవో వరకు వేలల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గుర్తించిన పలు ఇన్స్టిట్యూట్లు ఇప్పటికే రిటైల్ మేనేజ్మెంట్లో పలు డిప్లొమా, సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ‘రిటైల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు పలు కోర్సులు, ఇన్స్టిట్యూట్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వాటికి గల గుర్తింపు, ఇతర ప్రామాణికాల ఆధారంగానే వాటిని ఎంచుకోవాలి’ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్-హైదరాబాద్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు కోఆర్డినేటర్ శ్రీకాంత్ సూచన. సోషల్ సర్వీస్ / ఎన్జీఓ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం, ప్రతి కంపెనీ తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట సామాజిక సేవకు కేటాయించాలనే నిబంధన విధించడంతో సోషల్ వర్క్, రూరల్ డవలప్మెంట్ వంటి కోర్సులు చేసినవారికి అవకాశాలు పెరిగాయి. దేశంలో చాలా యూనివర్సిటీలు ఎంఏలో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విభాగాల్లో రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల వైపు అడుగులు వేస్తే మంచి అవకాశాలు అందుకోవచ్చు అంటున్నారు ఎన్ఐఆర్డీ సీపీజీఎస్ డెరైక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్వయం ఉపాధి దిశగా కెరీర్ కోరుకునే వారికి సరైన వేదిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే సొంతంగా ఏదైనా వ్యాపార, ఉత్పత్తి సంస్థను నెలకొల్పి ఆదాయార్జన పొందడం. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులు చేసిన వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ మేరకు ఐఎస్బీ, ఐఐటీ-కాన్పూర్, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ తదితర సంస్థలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్లో పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మంచి ఐడియాలతో వచ్చే వారికి ఆర్థికంగా చేయూత కూడా అందిస్తూ సొంత వ్యాపారాభివృద్ధి దిశగా ఊతమిస్తున్నాయి. ఫార్మా కెరీర్ సగటున 12 శాతం వార్షిక వృద్ధితో పయనిస్తూ.. అంతే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న రంగం ఫార్మాస్యూటికల్. నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం 2015 నాటికి లక్ష నుంచి లక్షన్నర మంది నిపుణుల అవసరం ఉంది. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ అర్హతతో బీఫార్మసీలో ప్రవేశించొచ్చు. ఆ తర్వాత పీజీ, పీహెచ్డీ చేయొచ్చు. దేశీయ ఫార్మా కంపెనీల్లోనూ, విదేశాల్లోనూ, విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో ఫార్మకాలజీ, ఫార్మాస్యూటిక్స్, టాక్సికాలజీ వంటి డిమాండ్ గల స్పెషలైజేషన్లు పూర్తి చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు అంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)-హైదరాబాద్ క్యాంపస్ రిజిస్ట్రార్ ఎన్.సత్యనారాయణ. కెరీర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఒక దేశ ప్రగతికి మూలం.. మౌలిక సదుపాయాలు. అందుకే.. ప్రభుత్వం ఇటీవలి కాలంలో రోడ్లు, రైల్వేస్, ఏవియేషన్, షిప్పింగ్, ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ తదితర విభాగాల్లో వృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. వచ్చే పదేళ్లలో ఈ రంగం 7 నుంచి 10 శాతం సగటు వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లోని నిర్దేశిత విభాగాల్లో అడుగుపెట్టాలంటే ప్రధానంగా సివిల్, మెకానికల్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులతోనూ ఈ విభాగంలో అడుగుపెట్టొచ్చు అంటున్నారు జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్‌భాస్కర్. ఆతిథ్య రంగం.. ఆదాయ మార్గం నేటి యువతకు మరో చక్కటి ఆదాయ మార్గం ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ). సగటున పది శాతం వృద్ధి రేటుతో సాగుతున్న రంగం. హోటల్స్, టూరిజం ఏజెన్సీలు ఈ రంగంలోని ప్రధాన విభాగాలు. టూరిజం శాఖ అంచనాల ప్రకారం.. ఆతిథ్య రంగంలో 2020 బనాటికి దాదాపు 9 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఎన్నో విద్యా సంస్థలు హోటల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. విభాగం ఆధారంగా నెలకు కనీసం రూ. పది వేల జీతం ఉంటుంది. టూర్ ఆపరేటర్లు, గైడ్లుగా నెలకు రూ. 25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. టూరిజం విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సంబంధిత రంగ నిపుణులు. టెలికం మేనేజ్మెంట్ ప్రభుత్వ నూతన విధానంతో విభిన్న అవకాశాలకు మార్గం వేస్తున్న మరో రంగం టెలికమ్యూనికేషన్స్. సాధారణ టెలిఫోన్స్ సంఖ్య క్రమేణా తగ్గుతూ స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో టెలికం మేనేజ్మెంట్ కచ్చితంగా కొలువు ఖాయం చేసే విభాగమని నిపుణుల అభిప్రాయం. పల్లెపల్లెలో బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరిస్తుండటం కూడా ఈ రంగంలో ఉపాధికి ఊతమిచ్చేవే. ఈ సేవలు సమర్థంగా సాగాలంటే టెలికం రంగంలో నిపుణుల ఆవశ్యకత ఎంతో. 2020 నాటికి.. దాదాపు పది లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా టెలికం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ వంటి ప్రత్యేక శిక్షణ సంస్థలను నెలకొల్పింది. సింబయాసిస్ ఇన్స్టిట్యూట్, వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు టెలికం మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఈసీఈ అభ్యర్థులు కూడా ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు సీఎంసీ సంస్థ హెచ్.ఆర్.మేనేజర్ టి. ఓంప్రకాశ్. మర్చంట్ నేవీ దేశదేశాలను చూడాలనే ఆకాంక్ష.. సముద్రపు అలలను ఆస్వాదించాలనుకునే వారికి చక్కటి అవకాశం కల్పించే కెరీర్ మర్చంట్ నేవీ. ఏడాదిలో సగభాగం సముద్రంలో.. ఓడల్లో గడిపే ఈ కెరీర్‌కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా మర్చంట్ నేవీలో కెరీర్ ప్రారంభించొచ్చు. మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ వంటి పలు కోర్సులు బీఎస్సీ, బీటెక్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం మర్చంట్ నేవీలో వేల సంఖ్యలో అవకాశాలు రెడీగా ఉన్నాయి. ఇతర దేశాలతో పెరుగుతున్న వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా.. భవిష్యత్తులో కార్గో షిప్పింగ్ వ్యవహారాలు రెట్టింపై అంతే స్థాయిలో అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రారంభంలో కనీసం నెలకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు అందుకోవచ్చు. -
అపోలో హాస్పిటల్స్ లాభం 83 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఆదాయంలో 16%, నికరలాభంలో 3.5% వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.81 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.83 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.993 కోట్లకు పెరిగింది. ఫార్మా ఆదాయం 23% వృద్ధితో రూ.291 కోట్ల నుంచి రూ.357 కోట్లకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 8 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ 8 హాస్పిటల్స్ ద్వారా అదనంగా 1,000 పడకలు జత కానున్నాయి. నెల్లూరు(200 పడకలు), నాసిక్ (125 పడకలు), ఇండోర్(120 పడకలు) వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. గత 12 నెలల్లో 540 ప డకల సామర్థ్యంతో 3 హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసిన ట్లు అపోలో ఒక ప్రకటనలో పేర్కొంది. 1983లో ప్రారంభమైన అపోలో హస్పిటల్స్ ప్రస్తుతం భారత్‌తో పా టు శ్రీలంక, బంగ్లాదేశ్, ఘనా, నైజీరియా, మారిషస్, ఖతర్, ఒమన్లలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అపోలో షేరు నామమాత్ర నష్టంతో రూ. 945 వద్ద ముగిసింది. -
రెయిన్బోలో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలు, చిన్న పిల్లలకు చికిత్సను అందించే రెయిన్బో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్ళలో రూ. 215 కోట్ల పెట్టుబడితో కొత్తగా నాలుగు హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో 450 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఈ విస్తరణ తర్వాత 2017 నాటికి కొత్తగా 775 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్నూలు, చెన్నై, పుణే, బెంగళూరు, విశాఖల్లో ఈ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఇక్కడ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విస్తరణ కావల్సిన నిధులను వ్యూహాత్మక భాగస్వాములు, రుణాలు, అంతర్గత నిధుల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన సీడీసీ, అబ్రాజ్లు సంయుక్తంగా పెట్టుబడి పెట్టిన రూ.100 కోట్లకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. ఈ పెట్టుబడికి సంబంధించి ఎంత వాటాను విక్రయించిందీ చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. ఏటా 25 శాతం వృద్ధితో రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నట్లు రమేష్ వెల్లడించారు. ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి ఉపాధికి అధిక అవకాశం ఉండే వైద్యం, వ్యవసాయం, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సీడీసీ రీజనల్ డెరైక్టర్ (దక్షిణాసియా) ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. ఇప్పటికే ఇండియాలో ఫండ్ ఆఫ్ ఫండ్ రూపంలో బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టామని, నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రధమం అన్నారు. వచ్చే ఐదేళ్ళలో మరో బిలియన్ డాలర్లు పెట్టుబడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా అబ్రాజ్ ప్రతినిధి రిషి మహేశ్వరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 200 కంపెనీల్లో 7.5 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.