కొత్త దారి
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.
వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.
పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.
‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.
‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.
హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్‌లైన్ సెషన్‌లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.
‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్‌బుక్ పేజీ ్రపారంభించింది.
వాలంటీర్‌లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్‌లు ఉన్నారు.
ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్‌విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్‌విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్‌విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.
డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్‌విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది.
విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment