
ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ సమావేశమైన 'బయోఏషియా 2025' (BioAsia 2025) ఫిబ్రవరి 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 80 స్టార్టప్ బృందాలు పాల్గొంటాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యం ఉన్న.. వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బయోఏషియా 2025 ఈవెంట్‌లో పరిశ్రమల దిగ్గజాలతో ప్రత్యేకమైన సంభాషణలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆసక్తిని ఆకర్శించింది. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. అంతేకాకుండా.. స్టార్టప్‌ల వృద్ధికి కావాల్సిన అవకాలు కూడా ఇక్కడ లభించే అవకాశం ఉంది.
బయోఏషియా 2025లో పాల్గొనడానికి స్టార్టప్‌ల నుంచి వచ్చిన ప్రతిస్పందనకు చాలా సంతోషిస్తున్నాము. బయోఏషియా లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ రంగాలలో ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించే ప్రపంచ వేదిక సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణను ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబెట్టడానికి, స్టార్టప్‌లు ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని.. మంత్రి డీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఐటీ & పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ఆసక్తిని ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి బయోఏషియా 2025 ప్రారంభించినట్లు వెల్లడించారు.
బయోఏషియా 2025లో పాల్గొనడానికి దేశీయ, అంతర్జాతీయ వెంచర్లు పోటీ పడ్డాయి. ఇందులో సుమారు 700 వినూత్న స్టార్టప్ వెంచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరిశ్రమలు, విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహించే అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ వేదికలో ప్రదర్శన కోసం సుమారు 80 స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో కూడా ఉత్తమ ఐదింటికి అపూర్వ గౌరవం లభించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment