సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ, ఐటీ రంగాలకు హైదరాబాద్‌లో అనువైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ ఆధారిత టెక్నాలజీ కార్యకలాపాల విస్తరణకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ గురువారం జీహెచ్‌ఎక్స్ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందంతో భేటీ అయ్యారు.
తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్లోబల్ హెల్త్‌కేర్ ఎక్సే్ఛంజ్ (జీహెచ్‌ఎక్స్) ఈ సందర్భంగా ప్రకటించింది. హెల్త్‌కేర్ రంగం పురోగతికి అవసరమైన వాతావరణం, మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చేయూత అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేటీఆర్ తెలిపారు.
డిజిటల్ దిశగా హెల్త్‌కేర్
ఆరోగ్య సంరక్షణ రంగం పూర్తిగా డిజిటల్ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ఐటీ ఆధారిత సేవలపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని జీహెచ్‌ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ తెలిపారు.
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం ఏర్పాటు ద్వారా సంస్థ లక్ష్యాలను అందుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాలను 2025 నాటికి మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలను చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment