
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ సైన్సెస్ కమర్షియలైజేషన్ కంపెనీ ఇండిజీన్ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించింది.
నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్‌లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment