హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌’ జోష్‌ | Global capability centers growing in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌’ జోష్‌

Mar 1 2025 3:14 PM | Updated on Mar 1 2025 3:21 PM

Global capability centers growing in hyderabad

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

రెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్‌ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో  48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి.

జీసీసీ అంటే? 
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్‌ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.

మూడో స్థానంలో హైదరాబాద్‌
దేశంలోని బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్..  ఢిల్లీ ఎన్‌సీఆర్‌ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement