GCC
-
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
‘డిజిటల్ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’
డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు. -
ఐటీ ఎగుమతులు, ఆర్థికవృద్ధిలో జీసీసీ కీలకం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: రాష్ట్ర ఐటీ ఎగుమతులు, ఆర్థికవృద్ధిని నడపడానికి మిడ్ మార్కెట్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) కీలకమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో జీసీసీ ఇన్నోవేషన్ సమ్మిట్–2024ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో హైదరాబాద్‌కు ఉన్న అసాధారణ ప్రతిభతోపాటు, సహాయక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో మేము ఈ కీలక ప్లేయర్స్‌ను ఆకర్శించడానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు.టీహబ్ తాత్కాలిక సీఈఓ సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ జీసీసీలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయే‹Ùరంజన్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీకాంత్లంక, ఏఎన్ఎస్ఆర్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆహూజా ప్రసంగించారు. టీహబ్ ఐఈఈఈ –టోరంటో, బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్– కెనడా, మెడ్ట్రానిక్తో సహా కీలకమైన ఎనిమిది వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను చేసుకున్నట్టు ప్రకటించింది. టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీజీటీఎస్) తన పరిధిని మరింత పెంచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. టీజీటీఎస్ పనితీరును సైఫాబాద్ హాకా భవన్‌లోని కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ విభాగాలన్నీ సంస్థ ద్వారా కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సేకరించుకునేలా సమన్వయం చేసుకోవాలన్నారు. దీనిపై జయేశ్ రంజన్‌తో చర్చించాలన్నారు. ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రికి వివరించారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కొద్ది మొత్తంలో కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని ఆయా శాఖాధిపతులకు వివరించాలన్నారు. -
దేశంలో ఆఫీస్ స్పేస్ విస్తరణ.. కారణం..
దేశీయంగా మూడో త్రైమాసికంలో ప్రధానం నగరాల్లోని కంపెనీలు 19 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023లో ఇదే సమయంలో అద్దెకు తీసుకున్న 16.1 మిలియన్ చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఈసారి 18 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొంది. 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో 53.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024 క్యూ3లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. జీసీసీల వృద్ధి అందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో 2024 క్యూ3లో బెంగళూరు నగరం 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెతో మొదటిస్థానంలో నిలిచింది. ఎన్సీఆర్ ఢిల్లీ 3.2, ముంబయి 2.6, పుణె 2.6, చెన్నై 2.6, హైదరాబాద్‌లో 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్‌ను లీస్‌కు తీసుకున్నారు. కొత్తగా హైదరాబాద్ నగరం 4.2, పుణె 2.7, బెంగళూరు 2.5, ఎన్సీఆర్ ఢిల్లీ 0.9, ముంబయి 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నిర్మించాయి.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుదేశంలోని ఐటీ కంపెనీలు, ఇతర టెక్ సర్వీస్‌లు అందించే సంస్థలు కొంతకాలంగా అనుసరిస్తున్న వర్క్‌ఫ్రంహోం, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు స్వస్తి పలుకుతున్నాయి. క్రమంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్ నుంచే పని చేయాలని మెయిళ్లు పంపుతున్నాయి. దాంతో కరోనా సమయం నుంచి ఇంటి వద్ద పనిచేస్తున్నవారు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. నిత్యం సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దాంతో గడిచిన 3-4 ఏళ్ల నుంచి కంపెనీల్లోని మానవ వనరులు పెరిగాయి. తిరిగి అందరూ ఆఫీస్‌కు వస్తుండడంతో అందుకు సరిపడా స్పేస్‌ను లీజ్‌కు తీసుకుంటున్నాయి. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ప్రధాన నగరాల్లో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వాటిలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరుతుండడంతో అద్దె స్థలం పెరుగుతోంది. -
ఏడాదిలో 61,600 మంది ఉద్యోగులు రాక! కారణం..
తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీదేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. -
హైదరాబాద్‌లో జీసీసీను ప్రారంభించిన యూఎస్ కంపెనీ
జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో సేవలందిస్తున్న జోయిటిస్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తోంది. ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. దాంతో స్థానికంగా యువతకు ఉపాధి లభిస్తోంది. జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కంపెనీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాల కోసం స్థానిక యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అన్నారు.జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్‌కు అనువైన ప్రదేశమని భావిస్తున్నాం. భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు హైదరాబాద్ కీలకంగా మారనుంది. కాబట్టి కంపెనీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరించాలని నిర్ణయించాం. సాంకేతిక ఆవిష్కరణలతో జంతు ఆరోగ్య సంరక్షణ అందించడం కంపెనీ ముఖ్య ఉద్దేశం. జంతువులకు డయాగ్నోసిస్, వైద్యం వంటి ప్రాథమిక సేవలందిస్తున్నాం. ఈ సౌకర్యాన్ని పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షకులు వినియోగించుకోవాలి. అంతర్జాతీయంగా ఈ వ్యాపారం ఏటా 4-6 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఈ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. జంతు ఆరోగ్య సంరక్షణలో కొత్త టెక్నాలజీల ఆవిష్కరణల రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ) కోసం పెట్టుబడిని పెంచుతున్నాం. 2023లో ఇది 613 మిలియన్లకు(రూ.5,100 కోట్లు) చేరుకుంది’ అని చెప్పారు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ సాయంతో పరిశోధనలు చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని జోయిటిస్ ఇండియా కెపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా జంతువుల ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ రూ.7,824.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతంమేర వృద్ధి చెందింది. 2029 వరకు ఈ మార్కెట్ విలువ 1.89 బిలియన్ డాలర్ల(రూ.15,871 కోట్లు)కు చేరనుందని అంచనా. -
వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!
విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో టెక్ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్–ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్మెంట్–ఎనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్’లేపుతున్నాయి. మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్స్ జాబ్స్నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్ లెవెల్ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్ జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డే టా ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. ‘జీసీసీలు ప్రధానంగా జెన్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్–ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్ స్కిల్స్‌కు ఎంత డిమాండ్ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. విస్తరణ జోరు.. 2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ), మెషిన్ లెరి్నంగ్/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్ చెబుతోంది. గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్‌లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
జీసీసీల్లో హైరింగ్ జోరు
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్‌లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. 70వేల పైచిలుకు నియామకాలు..పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ . ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్‌బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అరకు కాఫీ రుచి చూసిన జి 20 సమ్మిట్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించడం గమనార్హం. ఈ గ్లోబల్ ఈవెంట్లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శన ద్వారా ప్రీమియం కాఫీ బ్రాండ్‌గా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సాక్షికి తెలిపారు. జి20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. జీసీసీకి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శోభా స్వాతిరాణి, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో అరకు కాఫీని సైతం అందజేయడం విశేషం. -
నర్సీపట్నంలో జీసీసీ కాఫీ యూనిట్!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజలు సేకరిస్తున్నా.. క్యూరింగ్, ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగానే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేదిశగా జీసీసీ అడుగులు వేస్తోంది. నర్సీపట్నంలో ఈ యూనిట్ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఈ ఎస్టేట్స్‌లోని కాఫీ గింజల్ని క్యూరింగ్ చేసిన తర్వాతే జీసీసీకి సంబంధించిన క్యూరింగ్ పనులు ప్రారంభిస్తారు. క్యూరింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియల్ని ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వల్ల మార్కెటింగ్‌కు తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని జీసీసీ నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు నర్సీపట్నంలో ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న 0.73 ఎకరాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం జీసీసీకి సంబంధించిన మూడు ఖాళీ గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాము 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. దీంతోపాటు డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. మొత్తం రూ.3.50 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని ప్రాధమికంగా ఏర్పాటు చేయవచ్చనే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఈ యూనిట్‌కు అవసరమైన యంత్రాలకు సంబంధించి మంగుళూరుకు చెందిన అంతర్జాతీయ కాఫీ ప్రాసెసింగ్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అధికారులు దేశంలో ఉన్న యూనిట్స్‌లో దీన్ని కూడా నాణ్యమైన ప్రాసెసింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోదాముల్ని యూనిట్‌కు అనుగుణంగా మార్పులు చేస్తే వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని జీసీసీ భావిస్తోంది. గిరిజనులకు మేలు జరుగుతుంది.. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మెషినరీకి దాదాపు రూ.3 కోట్లు అవుతుందని అంచనా వేశాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరగా యూనిట్ పనులు ప్రారంభిస్తాం. ఇది పూర్తయితే వీలైనంత త్వరగా కాఫీ రైతులకు పేమెంట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. ప్రాసెసింగ్ చేసిన కాఫీని త్వరితగతిన మార్కెట్‌కు పంపించేందుకు మార్గం సుగమమవుతుంది. – సురేష్‌కుమార్, ఎండీ, జీసీసీ -
శ్రీనివాసుని అభిషేకానికి మన్యం మకరందం
సాక్షి, విశాఖపట్నం: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి మన్యం తేనె సిద్ధమైంది. శ్రీనివాసుని అభిషేకానికి గిరిజన తేనె కొనుగోలు చేయాలంటూ ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్పర్సన్ శోభా స్వాతి రాణి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీటీడీ బోర్డు తిరుమల ప్రధాన ఆలయంలో స్వామివారి అభిషేకంతో పాటు ఇతర దేవాలయాల్లో అభిషేకానికి గిరిజన తేనె పంపించాలంటూ ఆర్డరు పెట్టారు. 1,800 కిలోల తేనె సిద్ధం చేయాలన్న టీటీడీ ఆదేశాలతో జీసీసీ ఏర్పాట్లు చేసింది. తొలుత రూ.2.69 లక్షల విలువైన 900 కిలోల మన్యం తేనెతో జీసీసీ వాహనం గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకుంది. మరో 15 రోజుల్లో మిగిలిన తేనెను పంపేందుకు ప్రాసెసింగ్ చేపడుతున్నట్లు జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి తెలిపారు. గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన తేనెను కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు సమకూర్చే అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజన రైతుల సంక్షేమమే జీసీసీ లక్ష్యం
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) గిరిజనులకు అండగా నిలుస్తున్నదని, గతేడాది కంటే ఎక్కువ వ్యాపారాన్ని చేసి గిరిజనులకు ఆర్థిక చేయూతను అందించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. జీసీసీ ద్వారా 2020–21 ఏడాదిలో సాగించిన ఆర్థిక కార్యకలాపాల ప్రగతికి సంబంధించిన వివరాలను ఆమె శనివారం మీడియాకు ఓ ప్రకటనలో వివరించారు. గతేడాది గిరిజన ఉత్పత్తుల ద్వారా రూ.368 కోట్ల వ్యాపారాన్ని చేసిన జీసీసీ.. ఈ ఏడాది రూ.450 కోట్లు ఆర్జించిందని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించేలా జీసీసీ చూస్తుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోల్ పంపులను, సూపర్ బజార్లను నిర్వహించడంతో పాటు పౌర సరఫరాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా జీసీసీ నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు గిరిజన రైతులకు అవసరమైన రుణాలను సైతం జీసీసీ అందిస్తుందని పేర్కొన్నారు. 2019–2020లో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించగా, 2020–21లో రూ.76.37 కోట్లు వెచ్చించామని తెలిపారు. 2019–20లో జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.24.22 కోట్ల మేర జరిగితే 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. మెరుగైన ఫలితాలను సాధించిన జీసీసీ అధికార, సిబ్బందిని పుష్ప శ్రీవాణి అభినందించారు. -
వెయ్యి కోట్లతో ‘మాస్’... జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ నగరంలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా ఈ పెట్టుబడులను మాస్ మ్యూచువల్ సంస్థ పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో మాస్ మ్యూచువల్ ఇండియా అధిపతి రవి తంగిరాల, సంస్థ కోర్ టెక్నాలజీ విభాగాధిపతి ఆర్థర్ రీల్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌లతో మాట్లాడారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ కోసం మాస్ మ్యూచువల్ సంస్థ ఇప్పటికే నియామకాలను చేపట్టిందని, 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించనుందన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకున్నాయని, ఈ రోజు 170 సంవత్సరాల చరిత్ర కలిగి, ‘ఫార్చూన్ 500’కంపెనీల్లో ఒకటిగా ఉన్న మాస్ మ్యూచువల్ అమెరికా వెలుపల తమ మొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మరోసారి రుజువైందన్నారు. రానున్న కాలంలో నగరంలో కంపెనీ పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో ప్రపంచస్థాయి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంలో రవి తంగిరాల చూపిన చొరవను కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ ది బెస్ట్: రవి తంగిరాల మాస్ మ్యూచువల్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని, హైదరాబాద్‌లో చక్కటి నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ సానుకూల విధానాలకు ఆకర్షితులై ఈ నగరాన్ని ఎంపిక చేశామని మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల పేర్కొన్నారు. 1851లో ఏర్పాటైన తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక, ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా తమ లక్ష్యాలు, అవసరాలను ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్ సహకారంతో అందిపుచ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజనీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున తమ కంపెనీ నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలోని నిపుణులైన ఉద్యోగుల ద్వారా తమ ఇన్నోవేషన్ లక్ష్యాలను కచి్చతంగా అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆర్థర్ రీల్ వ్యక్తం చేశారు. జీసీసీలు ఏం చేస్తాయి? గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి. బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి. అలాగే ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్‌ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇ్రన్ఫాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్‌లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. ఈ ఏకీకృత సేవల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయి. కొన్ని పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఈ జీసీసీలను నూతన అవిష్కరణల కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటాయి. ఈ సామర్థ్య కేంద్రాల మూలంగా మాతృసంస్థలకు మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో నిర్వహణ వ్యయంలో సగటున దాదాపు 45 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా. -
గల్ఫ్ దేశాలపై ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం!
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచ దేశాలన్నిటా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. గ్లోబల్ ఈవీ 2020 ఔట్లుక్ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2.1 మిలియన్లకు చేరాయి. వెరసి వీటి మొత్తం సంఖ్య 7.2 మిలియన్లను తాకాయి. దీంతో 2019లో యూరోప్ దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలపై 60 బిలియన్ యూరోలను ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. చైనాలో అత్యధికంగా 45 శాతం అంటే 2.3 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నట్లు అంచనా. తదుపరి యూఎస్ 12 శాతం, యూరప్ 11 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. 2030కల్లా మొత్తం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 14 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇవి ప్రపంచ వాహనాల సంఖ్యలో 7 శాతం వాటాకు సమానమని ఆటోరంగ నిపుణులు పేర్కొన్నారు. జీసీసీ.. గల్ఫ్ ప్రాంతంలోని 6 అరబ్ దేశాలు 1981లో గల్ఫ్ దేశాల సహకార సమితి(జీసీసీ)ని ఏర్పాటు చేసుకున్నాయి. గల్ఫ్ దేశాలుగా పిలిచే జీసీసీలో బెహ్రయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల జీడీపీ 2018 అంచనాల ప్రకారం 3.655 ట్రిలియన్ డాలర్లు. ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం ఆరు దేశాల గల్ఫ్ దేశాల సహకార కూటమి(జీసీసీ) ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదో వంతు వాటాను కలిగి ఉంది. ప్రపంచ చమురు ఎగుమతుల్లో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనాల ప్రకారం 2035 కల్లా చమురు డిమాండ్ గరిష్టానికి చేరుతుందని ఐపీవో ప్రణాళికల్లో భాగంగా గతంలో సౌదీ అరామ్కో పేర్కొంది. కాగా.. గ్లోబల్ ఆయిల్ డిమాండ్ 2041కల్లా గరిష్టానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. 1.15 కోట్ల బ్యారళ్లకు చేరవచ్చని పేర్కొంది. ఆపై డిమాండ్ క్షీణ పథం పట్టవచ్చని పరిశ్రమ నిపుణుల ద్వారా అంచనా వేసినట్లు తెలియజేసింది. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ ప్రధాన చమురు ఉత్పత్తిదారులుగా నిలుస్తున్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో జీసీసీ వాటా 30 శాతంకాగా.. సౌదీ అరేబియా 15.7 శాతం, కువైట్ 6 శాతం, యూఏఈ 5.8 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ప్రభావం తక్కువే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో చమురుపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రస్తుతం వేగం ఆధారంగా రానున్నదశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా వీటి వాటా 7 శాతానికి చేరవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. దీంతో ముడిచమురు, గ్యాస్ విక్రయాలపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాలకు సమీప భవిష్యత్‌లో భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా చమురు ధరలు సగటున 40-60 డాలర్ల మధ్య కదులుతున్నట్లు తెలియజేశాయి. దీంతో కొంతకాలంగా పలు చమురు ఉత్పాదక దేశాలు రియల్టీ, టూరిజం తదితర చమురేతర ఆదాయాలపై దృష్టి పెడుతున్నట్లు తెలియజేశాయి. -
ఓ మంచి ఆర్గానిక్ కాఫీ..!
సాక్షి, విశాఖపట్నం: ఫిల్టర్ కాఫీ... కోల్డ్ కాఫీ... గ్రీన్ కాఫీ... ఇలా పేరు ఏదైనా భిన్నమైన రుచుల్లో ఒక మంచి ఆర్గానిక్ కాఫీని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) రుచి చూపించనుంది. ఇప్పటివరకూ ఆర్గానిక్ కాఫీ పొడిని మాత్రమే వినియోగదారులకు అందించిన జీసీసీ... ఇప్పుడు చక్కని ఆర్గానిక్ కాఫీని అందించనుంది. ఇందుకోసం బీచ్రోడ్డులోనున్న కేంద్ర కార్యాలయం పక్కనే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం షాప్ మాత్రమే కాదు ట్రైనింగ్ సెంటర్గానూ, భిన్నమైన కాఫీ రుచులకు డెమో కేంద్రంగానూ పనిచేయనుంది. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ జీసీసీ ఏర్పాటు చేయనున్న కాఫీ షాపులను నిర్వహించడానికి అవసరమైన శిక్షణనూ యువతకు ఇక్కడ ఇవ్వనున్నారు. ఇక్కడికొచ్చే కాఫీ ప్రియుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇంకెలాంటి రుచులు కావాలి? ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? తదితర విషయాలన్నీ ఇక్కడ సిబ్బంది అడిగి తెలుసుకుంటున్నారు. ఇది క్వాలిటీ కంట్రోల్ సెంటర్గానూ పనిచేయనుంది. ఈ కాఫీ షాప్ ఏర్పాటు, నిర్వహణలో టెనేగర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తోంది. అరకు వ్యాలీలోనూ మరొకటి... జీసీసీ కేంద్ర కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన కాఫీ షాప్ ఒక బ్రాండింగ్ మోడల్‌గా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మాదిరిగా పర్యాటక కేంద్రమైన అరకువ్యాలీలోనూ మరో షాప్ ఏర్పాటు చేయనున్నాం. ఈ కాఫీని అందించే అరబికా మొక్క పేరునే ఈ షాప్‌కు పెట్టాం. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా హట్ పేరును, రాష్ట్ర పర్యాటక రంగానికే తలమానికంగానే గాక కాఫీ సాగుకు కేంద్రంగా ఉన్న అరకువ్యాలీ పేరును జోడించాం. జీసీసీ ప్రతిష్టను పెంచడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ షాప్‌ను నిర్వహించనున్నాం. – టి.బాబూరావునాయుడు, జీసీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ -
తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 25 యూనిట్ల ఏర్పాటు.. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ బహిరంగ మార్కెట్లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్‌ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు. పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
జీసీసీ బ్రాండ్ బాజా
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) హెర్బల్ ఉత్పత్తులతో మార్కెట్లోకి అడుగు పెడుతోంది. హెర్బల్ సబ్బులు, గ్లిజరిన్ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం యంత్రాలను సిద్ధం చేసుకున్న జీసీసీ.. యూనిట్ల ఏర్పాటులో నిమగ్నమైంది. ఉత్పత్తుల తయారీలో ఆయూష్ శాఖ సహకారాన్ని తీసుకోవా లని నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖతో అవగాహ న కుదుర్చుకోనుంది. హెర్బల్ ఉత్పత్తులకు సంబంధించి ముడి సరుకులో మూలికల వాడకంపై ఆయూష్ యంత్రాంగం సూచనలు చేయనుంది. ఏయే ఉత్పత్తిలో ఎంత మోతాదులో మూలికలు వినియోగించాలో అందుకు సంబంధించి ఆయూష్ అధికారులు ఫార్ములా ఖరారు చేస్తారు. ప్రస్తుతం జీసీసీ ద్వారా విక్రయించే తేనెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో హెర్బల్ ఉత్పత్తులను కూడా అదే స్థాయిలో తీసుకొచ్చేందుకు, దేశీయ మార్కెట్లో తన బ్రాండును విస్తృతం చేసేందుకు సరికొత్త పంథాతో జీసీసీ ముందుకెళ్తోంది. గిరి నేచర్.. గిరి గోల్డ్.. జీసీసీ సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలకు సహజసిద్ధమైన పేర్లను అధికారులు సూచిస్తున్నారు. గిరి నేచర్ పేరుతో సౌందర్య సబ్బులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అలోవెరా, బొప్పాయి, నీమ్ పేర్లతో మూడు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గిరి గోల్డ్ పేరుతో గ్లిజరిన్ సబ్బులు రానున్నాయి. వీటితో పాటు గిరి డిటర్జెంట్, గిరి నేచర్ షాంపూలూ మార్కెట్లోకి తెచ్చేందుకు జీసీసీ సిద్ధమవుతోంది. జీసీసీ ఉత్పత్తులకు క్షేత్రస్థాయిలో డిమాండ్ ఉంది. ప్రస్తుతం తయారు చేస్తున్న ఉత్పత్తులను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గురుకులాల్లో రూ.250 కోట్ల టర్నోవర్‌కు అవకాశం ఉందని జీసీసీ భావిస్తోంది. గిరిజన యువతకు ప్రాధాన్యం తయారీ కేంద్రాల్లో స్థానిక గిరిజన యువతకు అవకాశం కల్పించనున్నారు. మార్కెటింగ్ రంగంలోనూ గిరిజన యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే నెలలో ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జీసీసీ జనరల్ మేనేజర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
మార్కెట్లోకి త్వరలో జీసీసీ ఉత్పత్తులు: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా వ్యవసాయ, అటవీ ఉత్పత్తు లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. సోమవారం సచివాలయంలో జీసీసీ వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. అనంతరం జీసీసీ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ద్వారా తేనె అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. గిరిజన ప్రాంతాలు ఇచ్చోడ, బేల, నార్నూరు, ఇల్లెందులలో పప్పు శుద్ధి కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తామన్నారు. నిర్మ ల్, ఏటూరు నాగారం, భద్రాచలంలో సబ్బు పరి శ్రమ ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. -
డిటర్జెంట్ల తయారీలోకి జీసీసీ!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డిటర్జెంట్ సబ్బుల తయారీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే జీసీసీ వివిధ రకాల స్నానపు సబ్బులను తయారు చేస్తోంది. తాజాగా గిరిజనుల కోసమే డిటర్జెంట్ (బట్టలు ఉతికే) సబ్బులను ఉత్పత్తి చేసి విక్రయించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. విజయనగరంలో ఉన్న జీసీసీ సబ్బుల తయారీ యూనిట్ ప్రాంగణంలోనే ఈ డిటర్జెంట్లను కూడా తయారు చేయనున్నారు. మార్కెట్లో గిరిజనులు ఇతర రకాల డిటర్జెంట్ సబ్బులను రూ.15–20కు (100 గ్రాములు) కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని వివిధ సంతల్లో 70 శాతానికి పైగా అసలును పోలిన నకిలీ డిటర్జెంట్ సబ్బులనే విక్రయిస్తుంటారు. మార్కెట్లో పేరున్న బ్రాండ్ల సబ్బుల్లా కనిపించేలా రేపర్లను (పై కవర్ల) ముద్రించి విక్రయిస్తున్నారు. వీటిలో నాణ్యత లేకున్నా గత్యంతరం లేక గిరిజనులు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన డిటర్జెంట్ సబ్బులను తయారు చేసి, గిరిజనులకు తక్కువ ధరకు విక్రయించాలని జీసీసీ ఉన్నతాధికారులు యోచించారు. దీంతో విజయనగరంలో ఉన్న సబ్బుల తయారీ యూనిట్లో వీటిని ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేశారు. వాటి నాణ్యతను నిర్ధారించుకున్నాక ఇప్పుడు తయారీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకు సగటున రెండు లక్షల డిటర్జెంట్ సబ్బుల వినియోగం జరుగుతున్నట్టు జీసీసీ అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో ఆ మేరకు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. వీటిని జీసీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఆర్ (డొమెస్టిక్ రిక్వైర్మెంట్) డిపోల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. వంద గ్రాముల సబ్బు రూ.5 ధరకే విక్రయిస్తారు. దీనివల్ల గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. గిరిజనుల కోసమే..: ఈ సబ్బులను బయట మార్కెట్లో కాకుండా గిరిజన ప్రాంతాల్లోని డీఆర్ డిపోల్లోనే విక్రయిస్తాం. బయటి సబ్బుల కన్నా నాణ్యంగా, తక్కువ ధరకే అందిస్తాం. విజయనగరం యూనిట్‌కి నెలకు 6లక్షల సబ్బుల తయారీ సామర్థ్యం ఉంది. ఇప్పటికే వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేశాం. త్వరలో అమ్మకాలు చేపడతాం. – ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్, ఎండీ, జీసీసీ -
గిరిజన ఉపాధికి జీసీసీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల ఆర్థికాభివృద్ధికి జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. ఐటీడీఏలకే పరిమితమైన జీసీసీ మైదాన ప్రాంతాలకూ విస్తరిస్తోంది. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలను అమలు చేయనుంది. ఐటీడీఏల్లోని గిరిజన ఉత్పత్తుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను జీసీసీ చూసుకునేది. తాజాగా ఆయా ఉత్పత్తులను నగరాలు, పట్టణాలకు పంపేలా చర్యలు చేపడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మైదాన ప్రాంతాల్లో జీసీసీ నూనె, తేనె శుద్ధి, సహజ సబ్బుల తయారీ పరిశ్రమలు, న్యాప్కిన్స్ తయారీ, సోయా, చింతపండు శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే ఉత్పత్తులు పెరిగి అక్కడ వృద్ధి రేటు పెరగనుంది. నైపుణ్యాభివృద్ధి వైపు.. ఐటీడీఏ ప్రాంతాల్లోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటోంది. పెద్దగా మార్పుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేయనుంది. శిక్షణతో కూడిన ఉపాధికి చర్యలు తీసుకోనుంది. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2018–24 ప్రణాళికలో భాగంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఆరేళ్ల ప్రణాళిక కొలిక్కి రానుంది. అనంతరం క్షేత్రస్థాయిలో చర్యలు వేగిరం చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
టెట్రా ప్యాక్‌లో నన్నారి, బిల్వ షర్బత్
⇔ సేంద్రియ బెల్లంతో త్రిఫల షర్బత్ ⇔ గిరిజన సహకార సంస్థ సరికొత్త ప్రయోగం సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. కొన్నాళ్లుగా ఔషధ గుణాలున్న నన్నారి, బిల్వల(మారేడు)తో తయారు చేసి బాటిళ్ల రూపంలో విక్రయిస్తున్న షర్బత్‌లను నీటిలో కలుపుకుని తాగాల్సి వస్తోంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా టెట్రా ప్యాక్‌ల్లో తయారుచేస్తోంది. 100 మిల్లీలీటర్ల ఈ టెట్రా ప్యాకెట్‌కు రూ. 12 ధరను నిర్ణయించింది. మరో పక్షం రోజుల్లో మార్కెట్లోకి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నన్నారి, బిల్వ షర్బత్‌లను బాటిళ్లలో నింపే ప్రక్రియ చిత్తూరు, రాజమండ్రిల్లోని తమ సొంత యూనిట్లలో జీసీసీ చేపడుతోంది. సరికొత్త షర్బత్ టెట్రా ప్యాక్‌లను చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో తయారు చేయించనుంది. వీటిని విమాన, రైలు ప్రయాణికులకు, సరఫరా చేయడానికి వీలుగా ఎయిర్ ఇండియా, రైల్వే శాఖలతో ఒప్పందం చేసుకోవాలని జీసీసీ ప్రయత్నిస్తోంది. మార్కెట్లో నన్నారి, బిల్వ షర్బత్‌లకు డిమాండ్ ఉంది. గత సంవత్సరం మూడు లక్షల బాటిళ్ల నన్నారి, లక్ష బాటిళ్ల బిల్వ షర్బత్‌లను జీసీసీ విక్రయించింది. కొత్తగా త్రిఫల షర్బత్ నన్నారి, బిల్వలతో పాటు కొత్తగా త్రిఫల షర్బత్‌ను కూడా రానున్న మూడునెలల్లో మార్కెట్లోకి తెచ్చే యోచనలో జీసీసీ ఉంది. ఇప్పటివరకు జీసీసీ త్రిఫల చూర్ణం, రసం తయారు చేస్తోంది. త్రిఫల షర్బత్‌లో పంచదారకు బదులు సేంద్రియ(ఆర్గానిక్) బెల్లాన్ని వాడనున్నారు. దీంతో ఇది ఆర్గానిక్ ఉత్పత్తిగా గుర్తింపు పొందనుంది. మా షర్బత్‌లకు భారీ డిమాండ్ ‘ఔషధ, మూలికా గుణాలున్న షర్బత్‌లను జీసీసీ మాత్రమే తయారు చేస్తోంది. వీటి రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మేం ఉత్పత్తి చేస్తున్న నన్నారి, బిల్వ షర్బత్‌లకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా జీసీసీ నుంచి రెడీ టూ ఈట్/డ్రింక్ ఉత్పత్తులు లేవు. తొలిసారిగా నన్నారి, బిల్వ షర్బత్‌లను టెట్రా ప్యాక్‌ల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. అలాగే త్వరలో త్రిఫల షర్బత్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం. – రవిప్రకాష్, జీసీసీ ఎండీ -
గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ
జీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఎండీ రవిప్రకాష్ కాకినాడ సిటీ : గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ ఎక్కువగా ఉందని జీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్లోని జీసీసీ అవుట్‌లెట్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అర్బన్ ప్రాంతాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవుట్లెట్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం గిరిజన ఉత్పతుల విక్రయాలకు కలెక్టరేట్ తోపాటు రాజమహేంద్రవరం, అమలాపురం, గోకవరం, ఏలేశ్వరంలలో దుకాణాలు ఉన్నాయని, అలాగే మూడు మొబైల్ వ్యాన్లు తిరుగుతున్నాయన్నారు. త్వరలో మరో నాలుగు దుకాణాలను రావులపాలెం, మండపేట, అన్నవరం, కాకినాడ ఏపీఎస్పీ ఆవరణలోనూ ప్రారంబించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీసీసీ డివిజనల్ మేనేజర్ కె.జోగేశ్వరరావు, అవుట్లెట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
జీసీసీ ఉత్పత్తులను వినియోగించుకోవాలి
కాకినాడ సిటీ : ఏజెన్సీ గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన జీసీసీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో అటవీ ఉత్పత్తులు, వనమూలికలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఆయుర్వేద గుణాలున్న జ్యూస్‌లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. తేనె, అలోవిర సబ్బులు, షాంపూలు, శీకాయ, అరకులో ఉత్పత్తి అవుతున్న ఎంతో రుచికరమైన కాఫీపొడి, అరకు దంపుడు బియ్యం తదితర ఉత్పత్తులు ప్రజలకు అందుబాటు ధరల్లో దొరుకుతాయని వివరించారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం కె.జోగేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, అడ్డతీగల జీసీసీ మేనేజరు బి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
కొత్తగా అరకు ఇన్స్టెంట్ కాఫీ
♦ రూ.5 ప్యాక్‌లో అందుబాటులోకి ♦ బ్లెండెడ్ కాఫీ కూడా.. ♦ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో జీసీసీ సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ మరో అడుగు ముందుకేస్తోంది. ఇకపై ఇన్స్టెంట్ కాఫీగానూ మార్కెట్లోకి రాబోతోంది. తొలిదశలో రూ.5 సాచెట్లలో అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరులో ఉన్న ఓ తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా ఈ ఏడాది కనీసం మూడు టన్నుల కాఫీ గింజలను పొడి చేసి ఇన్స్టెంట్ కాఫీ సాచెట్లుగా తయారు చేయించాలని చూస్తోంది. ఇప్పటిదాకా బ్రూ, నెస్లే, సీసీఎల్ వంటి సంస్థలే ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇకపై అరకు ఇన్స్టెంట్ కాఫీ కూడా రంగప్రవేశం చేయనుంది. జీసీసీ ఈ ఏడాది ఆఖరుకల్లా ఈ అరకు ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ‘ఇప్పటికే అరకు కాఫీకి ఆదరణ బాగుండడంతో వినియోగదార్లు ఇన్స్టెంట్ కాఫీని కూడా అడుగుతున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాం. ఇది కూడా మాకు లాభదాయకంగా ఉంటుంది.. ఆదరణ బాగుంటుందని భావిస్తున్నాం’ అని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వైశాఖి బ్లెండెడ్ కాఫీ: జీసీసీ వైశాఖి బ్లెండెడ్ కాఫీ పేరిట మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత కాఫీ ఎక్స్పర్ట్ సోనాలినీ మీనన్ సహకారం తీసుకుంటోంది. ఈ బ్లెండెడ్ కాఫీకి ఓ ప్రత్యేకత ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏడు మండలాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఒక్కో ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి కాఫీ రుచి మారుతుంది. దీన్ని గుర్తించిన జీసీసీ ఇకపై ఆయా ప్రాంతాల పేరిట వివిధ రుచుల (ఫ్లేవర్స్)తో వేర్వేరుగా కాఫీ ప్రియులకు పరిచయం చేయనుంది. ఉదాహరణకు చింతపల్లి, పాడేరు మండలాల్లో పండిన కాఫీని వైశాఖి బ్లెండెడ్ కాఫీగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దేశంలో మరే సంస్థ ఇప్పటిదాకా స్థానిక రుచులు (లోకల్ ఫ్లేవర్స్)తో మార్కెట్లోకి తీసుకురాలేదని జీసీసీ ఎండీ రవిప్రకాష్ చెప్పారు.