భద్రాచలం : గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన రాష్ట్రస్థాయి కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు జీసీసీ మేనేజర్‌లను బదిలీ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం డీఎంగా పనిచేస్తున్న రామస్వామిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఇదే కార్యాలయంలో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వీరభద్రస్వామిని ఇన్‌చార్జి డీఎంగా నియమించారు. ఏటూరునాగారం, ఉట్నూరు డీఎంలుగా పనిచేస్తున్న కె.జోగశ్వరరావు, డి. కైలాసగిరిని బదిలీ చేస్తూ వారి స్థానంలో అక్కడనే రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న వి. సీతారామ్‌కు బాధ్యతలు అప్పగించారు.