
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్, భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి, ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైతన్య, జనగామ ఏఎస్పీగా పందిరే చైతన్య రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నగ్రాలే శుభం ప్రకాశ్, నిర్మల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా, దేవరకొండ ఏఎస్పీగా పీ మౌనిక బదిలీ అయ్యారు.